రెండున్నరేళ్ళ కిందట అష్టపదుల టీకా కోసం వెతుకుతున్న నాకు దొరికిన వెలలేని నిధిని మళ్ళీ ఒకసారి ఈవేళ చూసుకుంటే పిల్లలు పెట్టిందని సంబరపడిపోతూ ఆ నిధిదాతకు కృతఙ్ఞతలు చెప్పుకుందామని వెళితే ఆయన శాశ్వతంగా దూరమయ్యారని తెలిసింది.
అందరికీ ఆయనను ఎరుకపరిచటం కంటే నేనింకేమీ చెయ్యలేకపోతున్నా.
హనుమంతురావుగారూ
పాదాభివందనాలు.
రామాయణము,
కుమారసంభవమూ
హరివంశమూ
రఘు వంశమూ
ఋతు సంహారమూ
భరత సావిత్రీ
శ్రీ కృష్ణ కర్ణామృతమూ
శ్రీ సీతా పరిణయ శ్లోక వ్యాఖ్య
ముఖ్యంగా నాకెంతో ఇష్టమయిన
గీతా గోవిందమూ
పదచ్చేద, టీకా, తాత్పర్య, గుణ విశేష వివరణ మొదలైన ఎన్నెన్నో విశేషాలతో అందించిన దేశిరాజు హనుమంతురావు గారికి నా మనస్సుమాంజలి.
http://www.giirvaani.net/

No comments:
Post a Comment