ఎవరితోనో మాట్లాడుతూ "ఆలోచనలను రాకుండా ఆపలేను కదా" అని చెప్పటానికి సిరివెన్నెలకు చాతకాన్నవ్వాలని
స్వర్ణకమలంలోని ఒక డైలాగ్ గుర్తు చేసుకోబోతే రాలేదు. వెదుకుతూ పొతే శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వనంటూ ఒక పుష్పం గర్వంగా స్వాగతించింది. నువ్వు నాకు సుపరిచయమేలే అనుకుంటూనే మళ్ళీ స్నేహం చేశా. సరి కొత్త కోణంలో ఎంతటి మంత్రోపదేశం చేసిందో చూడండి.
నాకు చాలా ఇష్టం తను. అయినా తన పిలుపు నాకింతవరకూ చెవికెక్కలేదన్న నిజం ఇవాళ తనను నింపాదిగా పరికిస్తే కాని అర్థమవలేదు. కదిలిన మరుక్షణం ఉధృత కెరటమయ్యే భావుకతతో వచ్చిన బాధే ఇది అని అర్థమయ్యింది. ఎంతో అర్థమయినట్టనిపించింది తన ఆత్మ ఘోష. ఆ అవగతం నిజంగానే ఆనందపు గాలివాలై నడిపిస్తూ తన దగ్గరకు చేర్చుకుంది. కాని మళ్ళీ అదే తప్పిదనం.
తన రూపం, ముగ్ధం, గళం, గాత్రం, చలనం, అన్నీ చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తే మళ్ళీ ఆత్మావలోకం హుళుక్కే.
ఆత్మావలోకాన్ని కోరుకున్న తను బాహ్య సౌందర్యారాధనకే పరిమితమైపోతున్న నన్ను చూసి చెమరిస్తే రాలినవిగా అనిపించాయి తన ఆత్మప్రకాశ మంత్రాలు...........తెల్లటి పుటపై నల్లటి అక్షరాల రూపంలో. ఆ శోకం నుంచి శ్లోకమైతే పుట్టలేదు కాని "సత్వ సాధనకు, సత్య శోధనకు సంగీతమే ప్రాణమూ......" అంటూ పలికింది మాయా రూపమే కాని వాగ్దేవి కాదని తెలిసింది.
ఇంతకాలం "సత్యాన్వేషణలో వాగ్గేయకారులూ వాగర్ధాలను తోడు తీసుకునే నడిచారు కదా" నన్ను నేను అని సమర్ధించుకునే వాడిని. నా స్నేహితుడు మోక్షానికి (వాడి ప్రకారం మోక్షమంటే నిర్మలమైన ఆనందం...The ultimate truth is that unblemished bliss అంటాడు) వెళ్ళే దారుల గురించి చర్చిస్తూ "సాధకుడు ఇంకా తన భావానురక్తిని విడువలేకపోతున్నాడు కాబట్టి భక్తియోగం మిగితా అన్నిటితో సమానమే కాని కొంచం తక్కువ సమానం..." అన్నప్పుడు చిన్నబుచ్చుకున్నా, అలా ఎందుకన్నాడో ఇవాళ అర్థమయింది.
తను బోధిస్తున్న ఈ జ్ఞానం మీకేమయినా ఎరుకవుతోందా?
ప్రయతించండి.
శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా........ సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా
నాలాగే మీరూ ఎక్కడో ఆగిపోతున్నారా?
స్వధర్మానికీ, పరధర్మానికీ నేను చెప్పుకున్న అన్వాయాన్ని దిద్దుకోటానికి అవకాశమిచ్చిన శంఖారావానికి కృతఙ్ఞతలు.

మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా... సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా
యతి రాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా
నటనాంజలితో బ్రతుకును తరించానివ్వా....
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవా
పడమర పడగలపై మెరిసే తారలకై
రేయిని వారించకే సంధ్యా సుందరీ
పడమర పడగలపై మెరిసే తారలకై
రేయిని వరించకే సంధ్యా సుందరీ
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే క్రాంతిని చిమ్మనీ
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే క్రాంతిని చిమ్మనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
ఎదురించిన హృదయ రవళి ఓంకారం కానీ........
శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా........ సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా... సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా
యతి రాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా
నటనాంజలితో బ్రతుకును తరించానివ్వా....
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా
తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆ..ఆ.ఆ.ఆ...ఆ..ఆ...
ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా
ఆ...ఆ...ఆ..అ...అ...ఆ
అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆ..ఆ.ఆ.ఆ...ఆ..ఆ...
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ఆ..ఆ.ఆ.ఆ...ఆ..ఆ...
ప్రతిరోజోక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరా గానం నీకు తోడుగా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవా
చలిత చరన జలితం నీ సహజ విలాసం
చ్వలిత కిరణ కలితం నీ సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం...తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం...తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో....వికసిత శతదళ శోభల సువర్ణ కమలం.
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవా
నాలాగే మీరూ ఎక్కడో ఆగిపోతున్నారా?
స్వధర్మానికీ, పరధర్మానికీ నేను చెప్పుకున్న అన్వాయాన్ని దిద్దుకోటానికి అవకాశమిచ్చిన శంఖారావానికి కృతఙ్ఞతలు.
No comments:
Post a Comment