"కొత్తగా ఏం చెపుతావు నా గురించి?" అంటూ నన్ను చాలెంజ్ చేసిన తొలి కాశీనాథుని స్త్రీ సుజాతయితే "నేను సహేతుకంగా లేను అని కదా నీ ఆలోచన మరి నా గురించిప్పుడే రాయటమెందుకు" అంటూ నన్ను ఆక్షేపించింది తన చెల్లెలు లక్ష్మి. రాయటానికి ఆలోచించటం అంటే "సరుకులేకపోవటమే" అన్నది స్ఫురించే నా మనసును చూసి నేనే నవ్వేసుకున్నా. భావోద్వేగంతో ఉరకలెత్తించని మనిషిని పరికించి చూడటం నాకు కొంచం కష్టమయిన పనే. "కసిమీద రాసేయటం తెలుసు కాని ఇలా ఎంతో జాగ్రత్తగా గులాబి మొక్కకు అంటుకట్టినట్టు రాయటం......." ఎక్కువైపోతోంది కదా?
"ఎప్పుడో ఇరవయ్ ఎనిమిదేళ్ళ ముందటి మనిషిని ఇలా ఇపుడు ఎందుకు తలచుకోవటం అది కూడా out of context" అనిపించింది ఇది రాయాలనుకున్నప్పుడు. It is not about the content of the person's life that I am after, it is patterns of systems that play out in these contents. The problems may change but there will be problems. So, it is interesting to watch the fascinating play of the systems అని ఇంకా ఏదో రాయబోయాను కాదు మనసు కట్ చేసింది "గాడిద గుడ్డేం కాదు? విశ్వనాద్గారి హీరోయిన్లు అందరూ నీకు Ideal woman ప్రతిరూపాలు. పైగా వారి జీవితాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమపై, ఇంకా మిగితా విషయాలపై నీ చెత్త ఫిలాసఫీ చెప్పటానికి అవకాశం" అంటూ.
"మరుగేలరా రాఘవా. అన్ని నీవనుచు అంతరంగమున, తిన్నగా వెతికి తెలిసికొంటినయ్యా...నిన్నె గాని మదిని ఎన్న జాలనొరుల" అంటూ సుజాత త్యాగరాజ కీర్తన అందుకున్నప్పుడు సప్తపదిలోని హేమకు ప్రతిరూపమా అంటూ నిరుత్సాహపడింది మనసు. తండ్రి పునరుక్తి దోషమే కాని హేమకు సుజాతకు అసలేమాత్రం పోలిక లేదు అన్నది తనను పరికిస్తే అర్థమయింది.
ఒక సాంఘిక దురాచారాన్ని పోరాడిన ఎందఱో అనామక స్త్రీలకు సాక్షాత్కార రూపం సుజాత అన్నది తన జీవిత సారాంశం. కాని ఒక వ్యక్తి అందం, వైశిష్ట్యత వారు ఎక్కడ నుంచి ఎక్కడికెళ్ళారొ చెప్పే పాయింట్ ఏ, బీ ల పరిచయంలో ఉండదు. ఆ మాదుర్యమంతా ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వారు చేసిన పయనంలోనే. The beauty of life is in the journey, not in the milestones. ఈ అర్థాన్ని ఆ ప్రతిఘటనలోనే కాదు ప్రేమలో కూడా మనకు పరిచయం చేస్తుంది సుజాత.
"తిన్నగా వెతికి తెలిసికొంటినయ్యా...నిన్నె గాని మదినెన్న జాలనొరుల" అంటూ భక్తిపూర్వకంగా ప్రేమను నిర్వచించిన త్యాగరాజస్వాముల వారిని తప్పుపట్టేంత వాడిని కాదు కాని నిజంగా అలా "తెలుసుకోన్నప్పుడా" మనం "ప్రేమలో పడేది" లేకుంటే "ప్రేమించేది?" కాదనే అంటుంది సుజాత.
మూర్తిగారిని పిలవమని తనంటే "ఎవరు ఆ సర్వర్ మూర్తినేనా" కొలీగ్ అంటే బాధపడిన క్షణానికే ప్రేమించాను కదా అంటుంది సుజాత. అసలింకా చెప్పాలంటే "అయితే నా మీద మీకెవరికీ నమ్మకం లేదా?" అంటూ అమ్మా నాన్నల దగ్గర చిన్నపోయి ఇంటినుంచి బయట అడుగుపెట్టినప్పుడు గుమ్మం దగ్గరున్న మూర్తి చేతికి తన సూట్కేస్ ఎప్పుడైతే ఇచ్చిందో అపుడూ ప్రేమిస్తూనే ఉన్నాను కదా అంటుంది సుజాత.
"నాకు తను ఫిబ్రవరి పదహారున ఐ లవ్యూ చెప్పింది,నన్ను మగాడిని చేసింది...." లాటి డైలాగులు చెప్పుకుంటూ ఒక క్షణానికి అపాత్రమైన కిరీటధారణ చేసి అంతముందు ప్రేమలో ఎంతో దగ్గరయిన కోటానుకోట్ల క్షణాలను చిన్న చేసే మీకు, నిజంగా ప్రేమ విశ్వరూపం మొత్తం చూసే యోగ్యత, మీ మనుషులకు, ఎప్పుడొస్తుందో అంటుంది సుజాత తన నడతతో.పురూరవుని వెక్కిరించే ఊర్వశి నవ్వే ప్రతిద్వనిస్తుంది చెవుల్లో.
నిన్ను ప్రేమించానని మూర్తికి సుజాత సూటిగా ఏనాడు చెప్పలేదు. అది తండ్రిగా తనకు విశ్వనాథ్గారు అంటించిన చాందసం, పిరికితనం, బూజుపట్టిన ఆడతనపు నిర్వచనం అని ఒక్క క్షణం అనిపించింది. కాని "స్త్రీ ప్రురుషుల మధ్య ప్రేమ పెళ్ళీ రెండూ విడాకులు పుచ్చుకుంటున్న కాలానికి ప్రతీకగా నీకలా అనిపించటంలో ఆశ్చర్యమేముంది?" అని ప్రశ్నించింది సుజాత. నన్ను కించపరుస్తోందన్న ఉక్రోషంతో "నిజంగా అది పిరికితనమే. నిన్ను ప్రేమిస్తున్నాను అని మనసుకు నచ్చిన మనిషికి చెప్పలేకపోవటం నిజంగా పిరికితనమే" అంటూ వితండవాదానికి దిగిన నన్ను చూసి జాలిగా నవ్వేసేదేమొ నా ఎదురుగా ఉంటె. "నిజంగా మీ పురుషులు ఆడది ముందుకు అడుగు వేస్తె సహించగలరా? సాంఘికంగా మీకు ధారాదత్తం చేయబడిన ఆ చొరవతనాన్ని కూడా మేము తీసేసుకుంటే మీరు నిజంగా ఓర్వగలరా? మగాడిగా నా మనసు తెలుసుకోవటం తన భాద్యత. లేదా తెలుసుకున్న మనసు కోర్కెను బయటపెట్టడం తన విద్యుక్తం. రెంటిలోనూ నా అనుకున్న వాడు గెలవాలనే నా కోర్కె కూడా అందుకనే అతనికా అవకాశం ఇచ్చాను." అంటుంది సుజాత. నిజమే కదా? "నాకేం తెలుసో మీకు తెలుసా" అని ప్రశ్నిస్తూ ఆ అవకాశం ఇచ్చాను అని అతనికి సూచనప్రాయంగా తెలిపింది కూడా కదా. "ఓ మీకేం కావాలో నాకెందుకు తెలీదండి ఇన్నేళ్ళు కలిసున్నాక కూడా మీకేం కావాలో నాకు తెలీదా" అంటూ మిటాయి పట్టుకొచ్చిన మూర్తి ఆ క్షణం నిజంగా సుజాతకంటే "చిన్న"వాడే అయ్యాడు.
"నా అనుకున్న వాడు నాకు ఇంకొకడితో సంబంధం ముడేయ్యాలని చూస్తుంటే నేనేగా మా సంబంధాన్ని గట్టిపరిచింది" అని కూడా అనే సుజాతను నిజంగా పిరికిది, చాందసురాలు అనుకోగలమా? అలాటి బిరుదులు ఏమయినా ఉంటె బూటకపు సప్తపదిలేసిన హేమకు ఇవ్వాలి కాని సుజాతకు కాదు.
ఎందుకు పిరికిది కాదు? అమ్మయ్యలను తన ఎదురుగానే నుంచోబెట్టి మరీ దోచేయ్యటానికి చూస్తున్న ఆదిశేషయ్యను అపుడైతే ఎదిరించగలిగింది కాని తరవాత "తను చేస్తున్నది తప్పో ఒప్పు కూడా తెలీయటం లేదు" అని మూర్తి దగ్గర ఏడుస్తూ తన బేలతనం ప్రదర్శించిందిగా అనేసుకున్నా మొండిగా. "A wise man is always in doubt and a fool is always sure" నవ్వుతూ వచ్చిన సమాదానికి "Being in doubt is not always a sign of wisdom. It can also be a sign of weakness, of running away from decisions and its consequences" రిటార్ట్ ఇచ్చాను అనుకున్నాను. "Sure it is. The wisdom lies in knowing which one you are and that shows in one's behaviour" అంటూ సుజాత వ్యక్తిత్వం. నిజమే కదా.
ఒక విలక్షణమైన వ్యక్తిత్వం, ఆ మనిషికి వ్యక్తిగతంగా, చాలా సార్లు శాపమే. తను చేస్తున్నది ఒప్పే అని ఎంత తెలిసినా ఆ ఒప్పు చేయటంలో తన అనుకున్న వారిని బాధపెడుతున్నామే అని బాధపడటం సహజమే. That hurt questions the very core of a person's being. But that does not mean that the person is in doubt about his/her being అన్న సమాధానం తట్టింది. నిజమే.
సమస్యకు మూడు పరిష్కారాలలో ఒకటిగా నిర్వచింపబడిన సుజాతలాటి వారి జీవితం ఈనాడు out of context అయిపోయిందేమో అని అనిపించటానికి (నేను out of touch అయ్యానేమో తెలీదు...ఈ మధ్య వరకట్న చావుల గురించి పెద్దగా వినపడటం లేదు.) కారణం తన జీవితంలో ఒక పార్స్వమే అన్నది మాత్రం ఖచ్చితం. Long term benefits of an employed wife overriding the short term benefits of dowry being the reason for this change అన్నది నిజంగా సమాజానికి తలవంపే. కాకపొతే if one can set aside the moral puritanism and be practical, ఏదో విధంగా సమస్య తగ్గినందుకు సంతోషించాల్సిందే కదా.
"ఎప్పుడో ఇరవయ్ ఎనిమిదేళ్ళ ముందటి మనిషిని ఇలా ఇపుడు ఎందుకు తలచుకోవటం అది కూడా out of context" అనిపించింది ఇది రాయాలనుకున్నప్పుడు. It is not about the content of the person's life that I am after, it is patterns of systems that play out in these contents. The problems may change but there will be problems. So, it is interesting to watch the fascinating play of the systems అని ఇంకా ఏదో రాయబోయాను కాదు మనసు కట్ చేసింది "గాడిద గుడ్డేం కాదు? విశ్వనాద్గారి హీరోయిన్లు అందరూ నీకు Ideal woman ప్రతిరూపాలు. పైగా వారి జీవితాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమపై, ఇంకా మిగితా విషయాలపై నీ చెత్త ఫిలాసఫీ చెప్పటానికి అవకాశం" అంటూ.
Well, I believe its just not beauty that is in the eyes of the beholder.
And any art's excellence lies in the varying shades of pennies that arise in beholder's mind.

No comments:
Post a Comment