Wednesday, 30 March 2011

Afridi gone, we are through to the finals

                                                        గెల్చదు గెల్చదు గెల్చదు 



                  నా మేనకోడలు పోద్దుననుంచి అక్షింతలు చల్లిన పుణ్యమా అని గెలుస్తున్నాము.  
                                                                  థాంక్స్ వర్షూ!!!!

12 mts away, one dictation to go

one patient report to be dictated

one drinks break to be finished

is it possible?

గలనా?

దేవుడా దేవుడా దేవుడా

నాకు తెలుసు నువ్వు చాలా మంచి వాడివని

నాకు తెలుసు అక్కడ అల్లాతో కూర్చుని మా బదులు మంతనాలు జరుపుతున్నావని

పాపం సచిన్ రిటర్డ్ అయిపోతాడు వాడికి ఏంటో మంచి గిఫ్ట్ ఇవ్వాలి మనం అని చెప్పి మీరిద్దరూ ఒప్పందం చేసుకుంటారు ....నాకు తెలుసు మీరు ఇద్దరూ ఆ ఒప్పందానికి రాగలరు....ఆ ఒప్పందానికి బదులుగా అల్లాకు ఇష్టమయిన ప్రజలకు వాళ్ళ దగ్గర ఉన్న కాశ్మీర్ మీదే అని చెప్పే గుండె ధైర్యం మన మనమోహనుడికి ఇవ్వమని అల్లాను నువ్వు ప్రేరేపిస్తావు. నాకు తెలుసు నువ్వు ఈ పని చెయ్యగలవు అని.

When Dhoni was made captain

నాడు
ఏంటీ ధోనీని కాప్టెన్ చేసారా నా కొడుకులు. నిజంగా బంచ్ ఆఫ్ జోకర్సే. అమర్నాథ్ నిజంగా నిజమే చెప్పాడు. లేకుంటే కుంబ్లే, సచిన్, దాదా, ద్రావిడ్ ఇంతమందిని పెట్టుకుని ఈ బచ్చాగాడికి ఇస్తారా నాయకత్వం. నిజంగా మతులు తప్పాయి వీళ్ళకు.


నేడు
నేహ్రాను తీసుకుని వీర తప్పు చేసాడు అన్న వాళ్ళు ఎక్కడ? ఈ స్కోర్ కార్డ్ చూపెడదాము అంటే కనపడరు?

Bowler
O
M
R
W
Z Khan5.00271
Nehra7.00220
Patel6.21271
Harbhajan Singh7.00310
Yuvraj Singh7.01352
Fall of wicket
 
44K Akmal
70Mohammad Hafeez
103Shafiq
106Younus Khan

Two shoiabs & Two sachins in the same team!!!

SMS  
Simon, in Manchester: "My girlfriend is a primary-school teacher in Oldham, Lancs. In her class, she has four boys named Sachin, and two named Shoaib. Guess what they're doing today!"

Excerpts from BBC

WC2011-----Gang warfare in GeordieLand

excerpt from BBC cricket live

Ben in Newcastle: "Gang warfare has broken out in my year 2 class room. The Indian and Pakistani children are all trying to whip up support for their country from bemused six and seven-year-old Geordies."

:-) :-)

రామభద్రుండనై శబరుల జాడ వెదక


ఖడ్గ సృష్టి తెచ్చుకుని రెండు వత్సరాలు అయిందేమో దుమ్ము దులపలా. కూడలిలో "ఏవీ తల్లీ నిరుడు కురిసిన" శీర్షిక తోక పుచ్చుకుని గూగులాంబుధిన వెదుకులాడి పట్టుకున్న ఆణిముత్యం నా బీరువాలో భద్రంగా "దాచి" ఉంచినదే అని తెలిసరికి సిగ్గు పడక నన్ను రఘురామునిగా, ఇలా మంచి ఫలాలను అందించే వారిని శబరులుగా వర్ణించేసుకు తృప్తి పడుతున్న మనసు స్వోత్కర్ష చూసి నవ్వొచ్చింది. అలా అందిస్తే తప్ప, ఎంగిలివి అయినా పర్లేదట కాని, స్వవ్యవసాయానికి సమయం లేదంటున్న మనసును చూసి నవ్వుకోక ఏం చెయ్యమంటారు?

కాకపొతే ఇలాటి వాటిని ఏదో విధంగా పునశ్చరణ చేస్తూ ఆ శారదాంబకు అనన్య సేవ చేస్తున్న ఉమాశంకర్ గారి లాంటి వారందరూ శబరులంత అదృష్టవంతులే అనటంలో లేశమంత కూడా అనుమానం లేదు.
నెనర్లు ఉమాశంకర్ గారు. 


మీ అందరి కోసం ఆ ఆణిముత్యం, ఆనందించండి.....ఆంగ్లములో ఈ పాఠప్రతిని సమకూర్చిన భావన/తెలుసా/డొక్కా శ్రీనివాస్ గార్లకు నెనర్లు. ఆ చర్చ ఇక్కడ భావన/తెలుసా లో చూడవచ్చు .
                                                           శ్రీ శ్రీ గారి ఖడ్గసృష్టి నుండి "ఏవి తల్లీ" 




     
   The snows of yester year by F.Willon ki అనుకరణ అట ఇది

    చక్రవర్తి అశోకుడెక్కడ ?
    జగద్గురు శంకరుడు యెక్కడ ??
    ఏవి తల్లీ !
    నిరుడు కురిసిన హిమ సమూహములు ??

    కాళిదాస మహా కవీంద్రుని
    కవన వాహినిలో కరంగిన
    ఉజ్జయిని నేడెక్కడమ్మా ?
    ఉంది ? చూపించు !

    షాజహాన్ అంత:పురములో
    షట్పదీ సింజానమెక్కడ ?
    ఝాన్సీ లక్ష్మీ దేవి ఎక్కిన
    సైంధవం నేడేది తల్లీ ?

    రుద్రమాంబా, భద్ర కాళీ,
    రోషణోజ్జ్వల రోచులేవీ ?
    ఖడ్గ తిక్కన కదన కాహళ
    కహ కహ ధ్వనులెక్కడమ్మా !!

    ఎక్కడమ్మా కృష్ణ రాయని
    బాహు జాగ్రద్బాడ బాగ్నులు
    బాల చంద్రుని బ్రహ్మ నాయుని
    ప్రాణ వాయువు లేవి తల్లీ !!

    జగద్గురువులు, చక్రవర్తులు,
    సత్కవీశులు, సైన్య నాధులు,
    మహా వనితలు, మహా రాగ్జులు,
    కాన రారేమీ ??

    పసిడి రెక్కలు విసిరి కాలం,
    పారి పోయిన జాడలేవీ ?
    ఏవి తల్లీ ?
    నిరుడు కురిసిన హిమ సమూహములు ??

    (శింజానము = వింటి నారి ధ్వని, సైంధవము = అశ్వము,
     రోచిస్సు, రోచులు = వెలుగు, కిరణములు )

Francois Villon's original French poem and its various english transaltions are available here
http://lachlan.bluehaze.com.au/snows_of_yesteryear.html        (http://lachlan.bluehaze.com.au/snows_of_yesteryear.html).................................hope you all enjoy them as much as I anticipate enjoying them soon.

Have to run now...... living beckons, life has to wait.






Images from
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh1RdIGmuMCpoFQ0ttKbEAHl0_i-IBspGTNntPuhd8O8KSEvNTM4dtf2Bw0V6iTSS-FLhfCdqFzgjmIm3pk0JfVlEq_mfIpm5LoFISDFrLpQusH8PJ77uwWapnJw49ILEQsxxfD7TZ-bTca/s400/sabari-gets-darsan-from-sri-ram.jpg

http://www.avkf.org/BookLink/images8500/8951_front_cover.jpg

Tuesday, 29 March 2011

సీతారామ సంవాదం-2


రామా

క్షమించు స్వామీ. నీ సరసన పీఠమలంకరించినది కాంచన కాంతయే కాని వేరొండు కాదను వార్త చేరువరకు మనసు వికలమయిన మాట నిజం. ఈనాటి మీ ఈ ఏకపత్నీవ్రతపు సాక్షం అగ్నిపరీక్ష నాటి నా అప్రకటిత సందేహ నివృత్తియూ గావించెను. రఘుకులతిలకుడు ధర్మనిరతికీ, అపక్షపాత వైఖరికీ నేడు కస్తూరితిలకము దిద్ది మరీ శోభాయమానం గావించిన సంగతి ఎందరికి గమనికో? నీ ఎకపత్నీవ్రతమునకీ విధము సాక్షము చూపుట యే స్వాహాపతీ బాహుబంధనమునకు కడిమి స్వామీ? ధర్మమూ పాటించుటే కాదు అది పాటించినటు కనపడుటయూ ఆవశ్యకమే యను రాజధర్మము ప్రతి గృహస్తుడై యజమానుడైన ప్రతి సామంతూ గ్రహించవలసినదని ఆచరణైక్యముగ నీవు వేసిన ఆజ్ఞాదండోరా భర్త, తండ్రియగు ప్రతి పురుషుని హృదయమందూ  శాశ్వతముగా మ్రోగవలె స్వామి. యజమానిగ అధికారమోకటే కాదు అవసరమున్న ప్రతి క్షణమందు తానూ అగ్నిప్రవేశ పరీక్షకు తలవగ్గవలసిందే, తానూ తన సహచారికి శీలసాక్షము చూపవలసిందేనను నీ ఈ శిలాసాసనము నస్వరము స్వామీ.     

నాథా. తమ ఈ చర్య నమ్మికపై నాకిప్పటికి ఉన్న నమ్మికను ప్రశ్నించింది. మీతో పదునాలుగేళ్ళ అరణ్యవాసమునూ, పరపురుష దుష్కర చరాన్ధమూ, తద్పూర్వ తదనంతర రాజ్య సౌఖ్యమూ సమపాళ్ళలో అనుభవించిన నేను ఇప్పటికీ సాక్షము లేనిదే మీపై పూర్తి నమ్మిక గల దానను కాననుటకు సాక్షము మమాధరోదయ సుస్మిత రశ్మీ పటల ప్రభవ పఠలీకృత మానస జలధర వృష్టియగు ఈ నాయనాభిశేక ధారలే.

"ఇదేనా నీ జీవన సహచారునిపై నమ్మకమనుచు" వల్మీక మునిపుంగవుల దరహాసము నన్నపహాసము చేయునట్టు తోచుచున్నది స్వామీ . సజ్జనుల ప్రహరణంబులన్నీ శిరోధార్యములేగా రామా. లేకున్న నమ్మిక పై నేడిట్టి జ్ఞానోదయము వేరే  రీతి కలుగ సాధ్యము?

నమ్మిక.....ఇంతకు మునుపు దీనిపై పూర్తి విశ్వాసముండెను. ఒక మనిషి కాని, ఒకరి నడవడిక కాని, ఒకరి వ్యక్తిత్వము కాని పూర్తిగా మనకు అవగతమవగా ఆ జ్ఞానసమాగఫలమే నమ్మికయని పూర్తిగా నమ్మి యుంటిని కొదండేశా. కాని సంపూర్ణముగా తెలిసికొనిన విషయముపై నమ్మికదేమి పాత్ర? ఆచటనున్నది జ్ఞానమే కదా.

నమ్మిక అనునది ఒక భవంతి అయితే దాని పునాది ఖచ్చితముగా అటునిటునూగు అనిశ్చితే. నమ్మిక శతపత్ర సువర్ణ సరోజభర సరోవరమైతే ఆ రవిప్రియ సరోజముల లాలసను మనోరంజకముగా మనకవగతము చేయు భానురేఖలు తప్పనిసరిగా సంశయాత్మకములౌ సంఘటనల సమూహములు మాత్రమె.

తరచిన ఈ విశ్వాసమనునది ఎంత చిత్రమైనది స్వామీ. దీనికి జన్మ నక్షత్రము లేదు ఎన్నడు జనించునొ మనకు తెలియజాలదు. తల్లిదండ్రుల ఎరుక లేదు కారణభూతములైన సాక్షీ సంఘటనలను ప్రాపంచికములున్న నమ్మిక పుట్టుకే జరుగదని ఇంతకు మునుపే తెలిసికొంటి  కదా. చెలికాండ్రు అనుమానము, అనిశ్చితీ. నివాసము అశాంత మానసము. ప్రియుడు మానసమునకు బహుదూరపు బాటసారి. గేయమునకు పరపురుషాగమనము నిత్యము-అవును మరి సహచరునికి అనుమానములన్నవి నిజముగా పరపురుషసమానములే కదా. అయిననూ విశ్వాసమను విహ్వలితకీ పంకిలములే ఆధారభూతములగుటనే న్యాయము. వాటిలోనే దాని సార్ధకత, ఆవశ్యకత, విభవము. గతి తప్పని రవిచలనములు దానికి త్యజములు.


కౌసలేయా, ఈ విధముగా నమ్మిక అనునది సంశయమును సగాభాగముగా చేసికొనిన కైలాసపతియే అని నేడు ఎరిగితి. సగభాగము స్త్రీత్వమైనందున నారీశ్వరుని మగటిమే విభవము పొందేనో అదే విధమున అనుమానమనునది విశ్వాసమను పంకజాక్షికి శోభాయమానమైన కాటుక నలుపే కాని రవికిరణమాపి ప్రాణాంతకమైన నిశి వర్ణము ఎన్నటికీ కాదు, కాజాలదు అన్నది ఎరింగితి. ఈ ఎరుకన నేడు మరింత పరిపూర్ణురాలనయితి. మమోదర శిశువులీనాడు మరింత జవము పొందియే ఉండవలయు. 

రావణారీ. ఈ నీ చర్యోత్పన్నమగు నా జ్ఞానోదయము నా మానసమందే సమాధి అవజాలదు. దీని లబ్ది ప్రతి ఒక్కరికీ చేరవలె. స్త్రీత్వముండుట గర్వకారణమని నమ్మి యే పురుషుడు మానసమున అర్ధనారీశ్వరుడౌనో, యే సామాన్య మానవుడు  ప్రేమతత్వ సాక్షాత్కారముకై సంపూర్ణాంగీకారముతో వియోగ తపమును చేబూనునో అట్టి మదనుంగు సుతుడొకడు జనించును. అట్టి వానికి ఈ జ్ఞానమను భారము గురుతరమగు భాధ్యతగా ప్రసాదమౌగాక. మనవలె ప్రియబంధుజనవియోగానలకీలలయుండీ ఈ కార్యము సేయ కృషియాతను సలుప నీ మన సంవాద సాంగత్యమాతనికి మలయమారుత విశేషణ చర్చితమై శమమునొసగవలె.

అస్తు అస్తు అస్తు.   


చిత్రము ఇక్కడిది.

Thursday, 24 March 2011

సీతారామ సంవాదం - 1


సీతా.

సతీ సమేతముగానే పూనవలసిన ఈ యాగదీక్ష నిర్వహణము నిన్నుదావానలంలా దహించి వేయునని మాకెరుకే. పెన్ప్రజావాహిని సాక్షిగ ఈ యాగదీక్ష జరపపూనుటకు కారణంబూ అదియే. అనంత లాహిరీ సాదృశ్యకముగా నా ఆతిధేయులై, ఈ ధరణీజనులు నా వామభాగప్రతిష్ఠితమైనది నిర్జీవ కాంచనప్రతిమేనన్న అసత్య వార్తాహారులై, నీ కడకు దూతము సేయ, నా మానసముననున్నది నీ సజీవమూర్తియేనన్నది ఎరుకపరచి నీ మ్రోవిపై చిరునగవునద్దిన మానసయోగము తన కన్నుకుట్ట "నీకు ఆతనిపై గల నమ్మికనీవిధమా సత్కరించుటా"యని నీ బుద్ది నీ కడ మందరయౌనేమో జాగ్రత్త సుమీ. ఎదబాటెంతైననూ నీ బింబాననామవశి నా మానసమునూ కబళించునను సత్యము నీకవగతమే కదా. ఈ యాగ దీక్షా సమయమున, అందునా ఈ సంవాద సారసాగర మధనమునకు ధృడ చిత్తమే కూర్మము. నీవు క్షణలేసమాత్రమైననూ స్త్రీ సహజ సంపదయగునా యలకాభరణమును ధరింపజాలదుననునదే నా యాజ్ఞ. యాజ్ఞవల్క్యములనున్న చిత్రకూట సౌఖ్యము నీకింకనూ జ్ఞప్తియేనన్న నా నమ్మకమును వమ్ము చేయవలదన్నదీ దాసాభ్యర్థన.

ఈదినముల మన సంవాదము అజరామరమై నిలుచవలెనను నా అభిమతము నా అభిజాత్యమెంతయూ కాదు ప్రజాశ్రేయోభిలాషులకావశ్యకమగు కార్యామేయని నా మానసము చామరము వీచుచున్నది. అందువలననేనీ సంవాదమంతయూ గ్రంథస్థము, మంత్రస్థమూ చేసి మనస్థాపితము కావించుచుంటిని. మద్వంశనామాంకుడై, మదీయమౌ నీ ప్రస్తుత  వియోగానల చందన సౌఖ్యాఖ్యానుభవ ప్రాప్తియందూ ధర్మచింతన వీడని జ్ఞానపిపాసి  అనురాగరసరాజ్యమకుటధారియూయై సవ్యసాచ్యము చేయునొకానొక సామాన్య మానవమాత్రునికి మానసమాత్రముగనే సాలభ్యమౌ రీతిన నేను ప్రయోగించిన నీ మంత్రశరము అమోఘమౌగాక.

తాను ఈ భవమందు క్షణభంగురమను సత్యమునెరింగియూ, సకల చరాచర చలనము మదీయ మాయాజాలా చిత్రణమేయనియూ బుద్ది ప్రతీ క్షణమూ చెవినిల్లుగట్టిననూ మానసము భౌతిక పాణిగ్రహణ ధర్మమను నిత్యాగ్నిహోత్రమును నిత్యము సేయ, భావోద్వేగ ఝంఝామారుతాభ్రగమనము సేయబూను యా సాహసి తానా పయనమున నిస్సహాయ పిపీలకమేయను గ్రాహ్యవరము పొందిన దినమే ముహూర్తము. పాహి పాహి స్వామీ పాహీయను నాతని ఘోషలే మంత్రాక్షతలు. ఆ సందర్భమున నాతనికి తోచునీ సారమంతయూ దేవీ కటాక్షమేయగుటనాతడెన్నడూ మరువకుండుట మద్వాహకమౌవ్వాతనికి మన వరమను నా ఈ వాక్యమునకు సాక్షియగు యప్రతిహత ప్రవాహియౌ ఈ కాలచక్రము నగమై, చామరమై, మావటియై, వందిమాగధమై, బంధుమిత్రజనమై యుండుగాక. తద్వాహకోత్పన్న కారకులాయిరువురూ మదీయ చరణ కింకిణులైయుందురుగాక. యూ మంథన భవత్కార్య ప్రేరకంబౌ రమణి మణిపూసయై నీ నాసికాభరణమందు కుదిరి నిత్య శోభాయమానమౌ నీ దరస్మిత ధగధగన మెరియిగాక. తద్మంథన మందరమౌ మెలుగునతివ మధురస్వన మజీరమౌగాక.  

అస్తు అస్తు అస్తు.  

(సశేషం)

Picture taken from here




Dhoni inviting Sachin to take the world cup!

Yeah it would be such a nice gesture కదా!

అప్పుడే కలలు కనేస్తున్నా


hi raghu...we made it! on the way to mohali.

message in skype from my sister.

been on phone to mum listening to the final 13 mts commentary whilst driving back to home

I LOVE GIZMOS.


JAI HO
ఇంటికొచ్చేసా...
నీలిరంగు మగాళ్ళు మగాల్లనిపించుకున్నారు 
చ....బాలేదు
men in blue came of age!

నిజంగా జట్టు విజయమే ఇవాళ
రెండు వికెట్లను మించి ఎవరూ తీయలేదు 
యాభయ్ ఎనిమిదిని మించి ఎవరూ పరుగులు తీయలేదు 
టాస్ కూడా ఓడిపోయాము 

అయినా గెలిచాము 
అదీ సమిష్టి కృషి అంటే ఇది.


41 of 54 pl dont choke at the end

god tuse great ho.......itna great ho ki cricket ke results bhi phix kar sakte ho.........itne grea ho ki is desh ke bachchon ko harakiri karne se bachaa sakte ho.....itne great ho ki mere man me phoot rahe laddoon ko sach kar sakte ho.....god tum sachchee me great ho

123 in 25 overs

damn it sachin .......u should havehad the honor of leading the winning team back to pavilion..never mind ....take a bow little master....ur job is done  NOW OTHERS HAVE TO TAKE OVER........THEY MUST......HERES WISHING THEY WOULD.........oH BY THE WAY OFFICE WEB SURFER JUST KICKED IN...POSTING FROM MOBILE ....CANT POST IN TELUGU.....DAMN IT

50 in 63 balls


వంద వందలు
ఒక్క యాభై పరుగుల దూరంలో

సచిన్ మన జట్టుని గెలిపించి ఆ మెయిలు రాయిని చేరితే, అదీ ఆస్ట్రేలియాపై!!! ఓహ్


రికీ పాంటింగ్ అంటే ఇష్టపడే అమ్మాయిలూ పక్కకు జరగండి


గో సచిన్ గో







చిత్రము ఇక్కడ  నుంచి తస్కరించబడినది :-)

44 for 1 in 8.1 overs

run rate at 5.38
with each partnership of about 44 runs
looking good looking good

GO INDIA GO

చిన్నప్పుడు స్కూలు నుంచి అజారుద్దీన్ బాటింగ్ చూడటానికి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చిన రోజుల్లోని ఉత్సాహం మళ్ళీ తెచ్చుకుందామని ఇలా అన మాట :-) :-)

రామరాజభూషనునికి క్షమాపణలతో

260 in 50!!!

ఇపుడు చూపగా తరమా
తరమారగ జవంబు పోయెనటనుచు ననకా
అనకాపలియ మొదలుగా
ఒడలుగాగేంద్రకిలయద్రివలె భరతీయా


మళ్ళీ ఆఫీస్ నెట్వర్క్ you have exceeded browisng time అనకముందే రాద్దామన్న తొందరలో ఇంతకంటే వ్యాకరణ  ఫిడేలిటీ కుదరలేదు మరి.

Tuesday, 22 March 2011

మోడీయం

                            My obsession with this one continues :-)

                                   Image from rediff

"నేను చెప్పానుగా" అని చంకలు గుద్దుకోసాగింది మనసు ""He reigns more by fear and intimidation than by inclusiveness and consensus, and is rude, condescending and often derogatory to even high level party officials. He hoards power and often leaves his ministers in the cold when making decisions that affect their portfolios," the cable added." అన్నది చదివి .

కాని  బుద్ది మాత్రం పరిహసిస్తూనే ఉంది "ఎప్పుడో ఏదో చేసాడని ఇప్పుడు జరుగుతున్న అవినీతిని హద్దుల్లో పెట్టలేని వాడిని ఖండించడానికి మనసు ఒప్పదు (మన్మోహన్) అదే ఎప్పుడో ఏదో చేసాడని ఇప్పుడు మంచి చేస్తున్న వాడిని మేచ్చుకోవు" అంటూ.
చూడాలి నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను Past behaviour is the best indicator of one's personality...nothing else indicates it better including what one says/aspires to be అని. It would take time to know if the spots are really gone but till them I should be happy for the people who progress under him.

Monday, 21 March 2011

పుత్రోత్సాహము తండ్రికి......

"ఇదేంటండీ వాడిలా అంటున్నాడు" మాయ నన్ను హత్తుకుని ఏడ్చేస్తోంది
"ఎందుకురా అంత ఏడుపు?"
"లేకపోతె ఏవిటండీ, మన బాబు, మన చేతుల మీద పెరిగిన మన కొడుకు, ఈనాడు అంత మాటనేసాడు"
"ఏమన్నాడని అంతగా కుమిలిపోతున్నావురా?" తల నిమురుతూ అడిగాను
పెదవుల మీదికి చిరునవ్వు రానీకుండా విశ్వప్రయత్నం చేస్తునాను
గంటపాటు మౌనానికి మకుటధారణ చేసి కూర్చుండిపోయింది, తన వెక్కిళ్ళు పక్కగదిలో వాడికి వినపడకుండా 


తేరుకుందేమో "మనకంటే వాడికి ఆ పిల్ల ఎక్కువవటం ఏమిటండీ" చెంపను పట్టుకు తన వైపు తిప్పుకుని కళ్ళల్లో చూస్తూ అడిగింది. నేను తన కళ్ళల్లో చూస్తూ ఉంటె తను అనుకున్నదే ఒప్పని ఒప్పుకునేస్తానని ముప్పయ్యేళ్ళ తరవాత కూడా ఎంత నమ్మకమో. అసలు స్త్రీ అంటేనే అంతేమో. తమ శక్తి తమకు తెలీదు అస్సలు. ఎప్పుడంచనా వేసినా పైకో కిందికొనే కాని ముల్లు సరిగ్గా మధ్యలో మాత్రం ఎప్పుడూ ఉండదు.

"తను ప్రేమించిన పిల్లే వాడికిప్పుడు లోకం అవటం నీకు బాధ కలిగించిందా లేక అది పైకి నీకు చెప్పటమా?"
"వాడి ప్రేమను ఎవరు కాదన్నారండీ తననే చేసుకోమన్నాం కదా అయినా అలా అంటాడెం?"

అయ్యో మాయా ఎలా చెప్పనే నీ తల్లి మనసుకు?
ఎలా అడగను మన మొదటి పెళ్ళి రోజు నువ్వు చేసిన మంకుతనం గుర్తులేదా అని?
"సాయంత్రం ఒక్కపూటే కదరా అదీ మీ వాళ్ళేగా  పార్టీ ఏర్పాటు చేద్దామంటున్నది. ఎందుకు వద్దంటావు" అనడిగిన నన్ను జడేసుకుంటున్న నువ్వు అలాగే ఆ సగం జడతోనే, ఆ మొహం కడగని జిడ్డు మొహంతోనే వచ్చి నా పక్కన కూర్చుని ఆ నూనె రాసిన చేతులతోనే నా మొహాన్ని నీ వైపుకు తిప్పుకుని కళ్ళల్లో సూటిగా చూస్తూ  "ఇది మన ఫర్స్ట్ ఆనివర్సరీ........ఎప్పుడని నువ్వు బుక్ చేసావు భాగ్మతిని? ఎప్పటి కోరిక నీది శరద్వెన్నెలలో  ఆ పడవ మీద నీ ముందు కూర్చుని నేను కనకాంబరాలు.......మల్లెలు కాదురా..కనకాంబరాలు మాత్రమె, అదీ బాసింపట్టు వేసుకుని కాదు, కాళ్ళు వెనక్కు మడుచుకుని కూర్చుంటారే అలా కూర్చుని......." అంటూ చెప్పావు గుర్తుందా? నీ ముందు కూర్చుకుని నేను మౌనంగా పూలదండ అల్లుతుంటే, అల్లిన దండను నీకిస్తే, నువ్వు ఆ దండను నా పొట్టి పిలక జడలోనే అయినా సరే ఏదో పె........ద్దవాలు జడ ని ఫీల్ అయిపోతూ దానిలో ఆ దండ నువ్వు తురిమిన తరవాతా....ఆ నీ కళ్ళల్లో ప్రతిఫలించే ఆనందం....ఓహ్ అది నేను చూడాలి.  ఇది ఎవేల నేను నీకిస్తున్న కానుక. ఇవాళ నువ్వు నాకు నా తల్లితండ్రులకంటే, మొత్తం ప్రపంచానికంటే కూడా నువ్వే ముఖ్యం ఇవాళ. ఇంకేం మాట్లాడకు" అని చెప్పి నా ముక్కు మీద నువ్వు ముద్దు పెట్టి వెళ్ళిపోయినప్పటి నీ స్వరంలోని స్థిరత నీకసలు గుర్తులేదా అని ఎలా అడగను?


"అలా నిట్టూరుస్తూ ఉండిపోతే ఎలా అండీ? మొదటి పిల్లేమో వీడిని ప్రేమలేమితో మోసం చేసేసి పోయింది. ఈ రెండో పిల్ల  ప్రేమతో వీడి కళ్ళు కప్పేసి మనకు మిగలకుండా చేస్తుందేమో .........వీడసలే అమాయకుడు..........."


మాయా మాయా మాయా.........
నీ కొడుకు అమాయకుడూ కాదు, మోహంలో కళ్ళు కోల్పోయిన కబోదీ కాదు, ప్రేమనే ధారలో కొట్టుకుపోతున్న దుర్బలుడూ కాదు. ఎలా చెప్పను వాడి పరిణితి ఏమిటో నీకు?


"ఏమిటిది, వాడి డైరీ మీ దగ్గర ఎందుకుందీ?" ఇచ్చిన డైరీ కొడుకుదని గుర్తుపట్టి అడిగింది. "అంతఃకరణీకుల డైరీలు వారి అసలు రూపాలను కొంచం కూడా పక్షపాతం లేకుండా ప్రతిఫలించే చక్కటి చూపుడుముక్కలు (అవే అద్దాలు). మన వారి మనసులు మనకు కాకుండా దైరీలకు నివేదిస్తున్నారంటే మనం మనవారితో సరిగ్గా మనలేదన్నమాటే మాయా. మన పెంపకంలో మాత్రం ఆ తప్పు జరగలేదు అన్న దానికి సాక్షమే ఈ రోజు నువ్వు నీ కొడుకు నోటిలో విన్న మాటలు."

ఎప్పటిలా పైకే చదవటం మొదలెట్టింది

"నాకెంటో పిచ్చి పిచ్చిగా ఉంది. తను లేనిదే ఏదీ రుచించక పోవటం, తనుంటే ఏదైనా రసభరితంగా కనిపించటం నాకు కొత్తే అయినా ఆ స్థితిని నేను అర్థం చేసుకోగలను. కాని ఇదేంటి? నన్ను నిలబెట్టిన ప్రమాణాలన్నీ కూడా తారుమారు అయిపోతున్నాయి? "నీ జీవితంలో నా స్థాననమేంటి"? అని అడిగిన స్త్రీకి ఒకనాడు సగర్వంగా "ముందు అమ్మా నాన్నా, తరవాత నువ్వూ, తరవాత తమ్ముళ్ళూ" ఇది నా జీవితంలో నా ఆప్తుల లిస్ట్ అని  చెప్పిన నేను నేడేంటి "ముందు తను. తరవాతే అమ్మా నాన్నా కూడా" అనుకునే స్థితికి వచ్చాను. అమ్మా నాన్నలను ఒకవైపు, తననొక వైపు ఉంచి ఎవరో ఒకరే నీ జీవితంలో ఉంటారు ఎవరో నిశ్చయించుకో అని దేవుడంటే అమ్మా నాన్నలనే కోరుకుంటానేమో. కాని అది నా ప్రవర్తన  మాత్రమె. నేను కాదు. నేను నేనుగా ప్రవర్తించాలంటే తననే కోరుకోవాలి అని నాకు తెలుస్తూనే ఉంది.


తన వ్యామోహంలో పడో, స్త్రీలోలుడనయ్యో, మొహావేశంలో కొట్టుకుపోతూనే ఇదంతా చేస్తున్నానా అని అనుకుంటే మనసు ఖచ్చితంగా కాదు అనే చెపుతోంది. కాని నిజంగా ఆ పాశాలలో కొట్టుకుపోతున్నవారికి కూడా ఇలాగే అనిపిస్తుంది, మరి వారికీ నీకూ ఉన్న తేడా నీకెలా తెలుస్తుంది? యే ఆధారం మీద ఆ నమ్మకం పెంచుకున్నావు  అని బుద్ది పొడుస్తోంది.

నా ఇప్పటి స్థితి ఆ భావోద్వేగం మాత్రమె కాదని నేనెలా నాకయినా సరే నిరూపించుకోగలను?
మరో చరిత్రలోలా ఒక సంవత్సరం తనను చూడకుండా ఉంటె అప్పుడూ ఆ భావోద్వేగం ఉంటె అదే "నిజమైన ప్రేమ" అనుకోవాలా? అసలు ఇలా నిజమైన ప్రేమ ఉత్తుత్తి ప్రేమా లాటివి ఉంటాయా? పోనీ అలా ఒక సంవత్సరం పాటు విడిగా ఉంటూనే మాసికంగా తనతో సంసారం, సహచర్యం చేసి పరీక్షలో "నెగ్గితే" ఇప్పటి నా స్థితికి అది నిజమైన పరీక్షేనా? అదసలు "నెగ్గటమే"నా? అంటే ఉట్టి శారీరికాలయిన నయనం, శ్రవణం, స్పర్శ మొదలయిన పంచేంద్రియాలను ఒక సంవత్సరం పాటు అదుపులో పెట్టుకోగలిగితే...................అదీ తనను మానసికంగా సకల విధాలుగా తోడు తీసుకుని................ ఉట్టి బయట కనిపించే  ప్రవర్తన మాత్రమె  నియంత్రించుకోగలిగితే అది "నిజమైన ప్రేమ" అయిపోతుందా? ఆవేశంలో ఒక సంవత్సరం ఎంత? అసలు జీవిత కాలం కూడా తూచేగా తను నాదే అన్న నమ్మకం ఏర్పడిన తరవాత, నిరీక్షణ తాత్కాలికం మాత్రమె అని తెలిసిన తరవాత. మరి నిజమైన ప్రేమ నై నిరూపించుకోవాలంటే నేనుస్ శాశ్వతంగా తనకు దూరమై అప్పుడూ తనను మనసులో నిలుపుకుంటే మాత్రమె నాది "నిజమైన ప్రేమ" అవుతుందా?

పోనీ నిజమైన ప్రేమ అని రుజువు నాకు నేను రుజువు చేసుకున్నా ఆ ప్రేమలో తల్దండ్రుల ప్రేమ కిందికి వెళ్ళిపోవాలా? అసలు నిజంగా ఇప్పుడు తను నాకు అందరికంటే ఎక్కువ అనిపించటం, తన కోసం తల్లితండ్రులను తాత్కాలికంగానే అయినా సరే వదులుకోగలను అనిపించటం (ఇది మాత్రం నిజం. అమ్మా వాళ్ళు వప్పుకోకపోతే మాత్రం నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటాను. కాని వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోను. నా ఆ విధమైన ప్రవర్తన వలనా, వాళ్ళ స్వాభావికమైన ప్రేమ వలన ఆ తరవాత వాళ్ళూ ఎక్కువ కాలం నన్ను విడిచి ఉండలేరని నాకు తెలుసనిపిస్తోంది.)  ఇది నిజంగానే తల్దండ్రుల ప్రేమను కిందికి తోయ్యటమేనా?

కాదు అనిపిస్తోంది నాకు.
నా అనుకున్న స్త్రీపై ఆ ఆవేశం లేకపోవటమే తప్పు అనిపిస్తోంది.
అమ్మా వాళ్ళను నేను బయటకెళ్ళిపోయినా మళ్ళీ ఒప్పించుకోగలగటం వాళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకోవటం కాదు నా కార్యదక్షతపై నాకున్న నమ్మకం అనిపిస్తోంది.
ఇంతగా ఆలోచించే మనిషి పొందే భావోద్వేగం విషయలాలసుడైపోవటం కాదు అని నామీద నాకే ఎందుకో నమ్మకం కలుగుతోంది,
నా ఇతర పార్శ్వాలలో యే మాత్రం దిగజారుడుతనం రానీక తనతో పరిచయానికి కొంత కాలం సశేషాన్ని భరించగలనూ అన్నది నాకు తెలుసు. అది నిజంగా నిరూపించాల్సోస్తే నా చేయి పట్టుకు నడిచే మనిషికి నిరూపించాలి కాని తల్లితండ్రులకైనా సరే మిగితా ఎవ్వరికీ అలా నేను నిరూపించాల్సిన అవసరం లేదు అని అనిపిస్తోంది.

ఈ నా నమ్మకాలు సరైనవో కావో నాకు తెలీదు.
కాని నాకు తెలిసినంతవరకు అవి నూరుపాళ్ళ నిజాలు
నేను నా నిజాల నీడనే నా వెంట తీసుకెళ్ళగలను

నేను నమ్మిన ఈ నిజాల వెంటే నేను నడవాలి. పర్యవసానం ఏమైనా కాని. రేపు అమ్మా నాన్నలకు చెప్పాలి "
అంటూ వాడి నిన్నటి ఎంట్రీ చదవటం ముగించింది. 


"దొంగవెధవ మరి ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు నా లిస్టులో మీరు రెండో స్థానంలో మాత్రమె అమ్మా అంటూ ఎందుకు చెప్పాలి" బుంగమూతితో మాయ. "వాడికి అవన్నీ చెప్పే అవకాశం ఎక్కడ ఇచ్చావ్ ఆ మాట వినగానే ఎక్కిళ్ళు పెట్టుకుంటూ వచ్చిన అలకాగృహం తమరు విడిచి వస్తేగా వాడు నీకు నచ్చచేప్పేది..............." అంటుంటే "సరేలే కాని  నువ్వెప్పుడూ అంటూ ఉంటావే సూత్రదారుల్లో సుజాత ముద్దుకు ప్రేరణ అనీ. అదంటే ఏమిటో మాత్రం ఇప్పుడు బాగా అర్థమయ్యింది" గుసగుసలాడుతున్న మాయ ఎకవచనంలోకి దిగిపోయింది.


Thursday, 17 March 2011

Joys of Discovery.....ఇవి ఏ రాగమో చెప్పగలరా? అసలు నిర్దుష్ట రాగమేనా ఇది?

రహ్మానుద్దిన్ షేక్ గారి సత్యాన్వేషణ బ్లాగు మొదటి సారి చూస్తూ "ఫరవాలేదు, ఫరవాలేదు" అన్న సాహిత్యం చూసి అక్కడే ఆగిపోయా. అబ్బా ఎంత బావుందో కవిత. ముఖ్యంగా లయ రావాలంటే ఇలా రాయాలి కాబోలు, అయ్యో ఇన్ని రోజులూ ఈ బ్లాగ్ ని, ఈ కవినీ మిస్ అయిపోయ్యానే అని బాధపడుతూ ముందుకెళితే పరదాలే ఎన్నాళ్ళిలా... అని నిన్నే అడగమని, సరదాగా తరిమింది... మది నీపై మనసు పడి, మురిపించే ఊహలతో ముఖచిత్రం గీసుకుని, అది నువ్వో కాదో అని సందేహం ప్రతిసారి........దగ్గరకు వచ్చేసరికి మాత్రం I was blown off my feet. 


"వావ్.....అంత్య ప్రాసలు లేకుండా ఎంత బాగా లయ కుదిరిందో చాలా ప్రొఫెషనల్ లెవెల్లో ఉంది కవిత" అనీ అనుకోవటంతోనే మనసు భూమి మీదకు దబ్బున పడింది. కింద చూస్తె "ఏదో" పిక్చర్లోని పాట అని అర్థమయిపోయింది.

కొంచం నిరాశ కలిగిన మాట నిజం. భాస్కరభట్ల గారిదట సాహిత్యం.

ఎంతైనా రోజూ అదే వ్యాపకంగా పెట్టుకున్న నలభీముల వారి మృష్టాన్న భోజనంలో ఆనందానికి కాకా హోటల్లో అయ్యర్ చలవతో అకస్మాత్తుగా ప్రాప్తమయ్యే ఈలాటి ఆనందానికీ ఉన్న క్వాలిటీ డిఫరెన్స్ అనుభవించిన వారికి బానే తెలిసుంటుంది.
There is such an ecstasy in the unexpected discovery of a kohinoor by a serendipitous prospector.
Anticipation reduces the joy of gifts అన్నట్టు అనిపించింది ఈ అనుభవాన్ని తరచి చూస్తె. I know, I know Thomas Hardy's Eustacia would not agree with that. But let me not digress.....

సరే పాట ఎలా ఉంటుందో చూద్దామని వెతికితే పదినిమిషాలు పట్టింది "మనసారా" పిక్చర్లోదని తెలీటానికి :-) యూ ట్యూబ్లో వెళ్ళి చూస్తె మళ్ళీ రెండోసారి డంగైపోయాను. నేను చూసిన సినిమానే అది. అదీ కాక ఈ పాట నాకెంతో నచ్చినట్టు కూడా గుర్తు. కాని అసలు సాహిత్యమే గుర్తులేదు, ఇక అందులో ఉన్న విలువలేమి గుర్తుంటాయి? కేరళ అందాలూ, హీరోయిన్ లాస్యం, హీరో చుంచుమోఖంలా ఉన్నా మంచి నటన నన్ను అసలు వేరే ఏవీ గుర్తు పెట్టుకునేలా చెయ్యలేదు అని అర్థమయింది. Bloody hell. How can I do justice to all when all my senses are so overwhelmed by one? It was such a visual delight to watch the movie.

సరే పాట విందాము అని కళ్ళు మూసుకుని మళ్ళీ యూ ట్యూబ్ని రివైండ్ చేసి పెట్టుకుంటే గిటార్/వయోలిన్ ఎంట్రీ. (0.00-0.12) Again swept off my feet. నాకెంతో ఇష్టమైపోయింది ఈ రాగం (రాగామేనా ఇది?). 


ఆ పాట ఏదీ అని త్రిష, చిరు అని ఎంత వెతికినా పాట దోరక్కపోతే నాలిక్కరుచుకుని శ్రియ, చిరు అని వెతికితే దొరికింది. టాగూర్లో పాట "చిన్నగా చిన్న చిన్నగా............" అన్నది.
సరే మరి త్రిష, ఇంకో అమ్మాయి ఉన్న పాట అదేంటబ్బా అని బుర్ర గోక్కుని, జుట్టు పీక్కుని   నాగ్గుర్తున్న చంద్రుడు కుందేలు త్రిష అని గూగులమ్మనడిగితే వెంటనే చూపెట్టింది నువ్వొస్తానంటే  నే వద్దంటానా లో "చంద్రుడిలో ఉండే కుందేలూ......." పాట.


మొత్తానికి పొద్దునే పఠనానందం,శ్రవణానందం,నయనాందం మూడూ ఏకకాలంలో కుదిరిపోయాయి. ధాంక్స్ రహ్మాన్ గారు. 


అసలు విషయానికి ఇదంతా ఉపోద్ఘాతమే. అడగాలనుకున్న విషయమేమిటంటే


1. మనసారాలోని పర్వాలేదు పర్వాలేదు పాట మొదట వచ్చే గిటార్/వయోలిన్/ఏదో ఒక స్ట్రింగ్ ఇంస్త్రుమెంట్ ఎంట్రీ 
2. టాగూర్లోని మెల్లగా మెల్లగ మెల్లగా అన్న పాట  
3.  నువ్వొస్తానంటే నే వద్దంటానా లో చంద్రుడిలో ఉండే కుందేలూ పాట


ఈ మూడు ఒకే రాగానికి సంబంధించినవా? అవును అయితే ఆ రాగం పేరు చెప్పగలరా? 



తెలుసుకుందామనే  ఉత్సాహమే, మిమ్మల్ని పరీక్షించాలని కాదు :-)

Tuesday, 15 March 2011

తప్పుకోమంటావ్?

నన్నా?
నిన్నా?
  
కప్పేది నిన్నేగా?
ఓ! నాలో ఉన్నా వేరేనంటావ్...... 
ద్వైతమా? సరేలే ఒప్పుకున్నా!
మరికనేం, భయమెందుకు?

ఏమిటీ?
పంచ పాశాలున్నాయా?
ఓ.........ఇంకా ఆ బొడ్లు కోయలేదా?

చ ఊరికో, నవ్విపోతారు 
నీ అస్తిత్వానికవేగా పంచప్రాణాలు 
పంచభూతాలు లేని బ్రహ్మాండమెక్కడిదీ? 

లోనున్నదీ 
బహిర్గతమూ
నువ్వు,  
లోపలుంచేది 
బయల్పరిచేది 
వేరు?
మారవు!

వాహకాన్నంటావు!
వాసనలు నాకంటావు!!
దాన్నుంచి దీనికి 
పరకయాం నీదే. 
వాసనలు నావంటావెం?

పయనాంతానికేగా  
పోన్లే అని ఏర్లు దాటిస్తే
అన్ని నావల మసిని
ఏవగిస్తావేం?

మసిలేనిదే
మారేడుపతిగా 
మారేదెలా?

How I wish to unsheath self.But then, would I be I?
Will I not flow off?
Would I not fly away? 
Why would I stay?

Actually why only 3 states?
Why not nothingness?
Would I bear that?
I am sure I rather not!

So,  plod on, must I
looking here, looking there
till I stop in tracks,
till I disappear.

इतनी ख्वाहिश तो  है
आख़री मुट्टी भर जो छिडके
नवी नवेली याद कराये हथेली 

चीर अपने से जिसे,
फ़ेंक जो हम चल पड़े    
उस छिलके की ही सही
आखिर जान है, ओ, साकी.

Friday, 11 March 2011

The joke's on me


Saw a cuddly toy, a big one actually, lying on one of my ward's corridor, arriving for a ward round, which I was covering for a colleague on leave. This was quite unusual since we do have children on the ward but not the 4 legged or 2 legged varieties. Ours are all the 3 legged types.

When I walked in to the nursing office and saw a qualifed nurse and an unqualified nurse sitting.

"So, did we have any family visit one of our patients today Marian?" saying to myself "well done Watson"

"no doctor why do you ask?" asks Marian, the qualified nurse

"well I saw a cuddly toy in the corridor....do any of them play with cuddly toys?" I explained deflated
(well there was no joy of being clever if nobody noticed that I was clever, is there?)

"oh, yes, they all do doctor" says Marian seriously

"They all do........." I stare blankly at them
(I start mentally ticking off the criteria for Huntington's disease and Dementia to see if I missed anything!)


"oh yes doctor" chimes in the anonymous guy "the qualifieds do that all the time"

Ouch! That hurt.
First blood to the unqualified and that too two scarves!








Image for representational purposes only and is not the ward depicted in the incident
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhp3dKvE_lnrGTyE4oTkONXKu9ldaFDEoQfqThGiDncZ2CqfhzBQnb3jZ5tWWYC2Nf8MMfaOEM9a2NG9sVY2Mq5jexQ4Fs5jFediqCRxAFyyMUbwy5F1n1j1aZPYsK01zhrTN7LXaOzV9I/s320/Ward+corridor.jpg