"ఇదేంటండీ వాడిలా అంటున్నాడు" మాయ నన్ను హత్తుకుని ఏడ్చేస్తోంది
"ఎందుకురా అంత ఏడుపు?"
"లేకపోతె ఏవిటండీ, మన బాబు, మన చేతుల మీద పెరిగిన మన కొడుకు, ఈనాడు అంత మాటనేసాడు"
"ఏమన్నాడని అంతగా కుమిలిపోతున్నావురా?" తల నిమురుతూ అడిగాను
పెదవుల మీదికి చిరునవ్వు రానీకుండా విశ్వప్రయత్నం చేస్తునాను
గంటపాటు మౌనానికి మకుటధారణ చేసి కూర్చుండిపోయింది, తన వెక్కిళ్ళు పక్కగదిలో వాడికి వినపడకుండా
తేరుకుందేమో "మనకంటే వాడికి ఆ పిల్ల ఎక్కువవటం ఏమిటండీ" చెంపను పట్టుకు తన వైపు తిప్పుకుని కళ్ళల్లో చూస్తూ అడిగింది. నేను తన కళ్ళల్లో చూస్తూ ఉంటె తను అనుకున్నదే ఒప్పని ఒప్పుకునేస్తానని ముప్పయ్యేళ్ళ తరవాత కూడా ఎంత నమ్మకమో. అసలు స్త్రీ అంటేనే అంతేమో. తమ శక్తి తమకు తెలీదు అస్సలు. ఎప్పుడంచనా వేసినా పైకో కిందికొనే కాని ముల్లు సరిగ్గా మధ్యలో మాత్రం ఎప్పుడూ ఉండదు.
"తను ప్రేమించిన పిల్లే వాడికిప్పుడు లోకం అవటం నీకు బాధ కలిగించిందా లేక అది పైకి నీకు చెప్పటమా?"
"వాడి ప్రేమను ఎవరు కాదన్నారండీ తననే చేసుకోమన్నాం కదా అయినా అలా అంటాడెం?"
అయ్యో మాయా ఎలా చెప్పనే నీ తల్లి మనసుకు?
ఎలా అడగను మన మొదటి పెళ్ళి రోజు నువ్వు చేసిన మంకుతనం గుర్తులేదా అని?
"సాయంత్రం ఒక్కపూటే కదరా అదీ మీ వాళ్ళేగా పార్టీ ఏర్పాటు చేద్దామంటున్నది. ఎందుకు వద్దంటావు" అనడిగిన నన్ను జడేసుకుంటున్న నువ్వు అలాగే ఆ సగం జడతోనే, ఆ మొహం కడగని జిడ్డు మొహంతోనే వచ్చి నా పక్కన కూర్చుని ఆ నూనె రాసిన చేతులతోనే నా మొహాన్ని నీ వైపుకు తిప్పుకుని కళ్ళల్లో సూటిగా చూస్తూ "ఇది మన ఫర్స్ట్ ఆనివర్సరీ........ఎప్పుడని నువ్వు బుక్ చేసావు భాగ్మతిని? ఎప్పటి కోరిక నీది శరద్వెన్నెలలో ఆ పడవ మీద నీ ముందు కూర్చుని నేను కనకాంబరాలు.......మల్లెలు కాదురా..కనకాంబరాలు మాత్రమె, అదీ బాసింపట్టు వేసుకుని కాదు, కాళ్ళు వెనక్కు మడుచుకుని కూర్చుంటారే అలా కూర్చుని......." అంటూ చెప్పావు గుర్తుందా? నీ ముందు కూర్చుకుని నేను మౌనంగా పూలదండ అల్లుతుంటే, అల్లిన దండను నీకిస్తే, నువ్వు ఆ దండను నా పొట్టి పిలక జడలోనే అయినా సరే ఏదో పె........ద్దవాలు జడ ని ఫీల్ అయిపోతూ దానిలో ఆ దండ నువ్వు తురిమిన తరవాతా....ఆ నీ కళ్ళల్లో ప్రతిఫలించే ఆనందం....ఓహ్ అది నేను చూడాలి. ఇది ఎవేల నేను నీకిస్తున్న కానుక. ఇవాళ నువ్వు నాకు నా తల్లితండ్రులకంటే, మొత్తం ప్రపంచానికంటే కూడా నువ్వే ముఖ్యం ఇవాళ. ఇంకేం మాట్లాడకు" అని చెప్పి నా ముక్కు మీద నువ్వు ముద్దు పెట్టి వెళ్ళిపోయినప్పటి నీ స్వరంలోని స్థిరత నీకసలు గుర్తులేదా అని ఎలా అడగను?
"అలా నిట్టూరుస్తూ ఉండిపోతే ఎలా అండీ? మొదటి పిల్లేమో వీడిని ప్రేమలేమితో మోసం చేసేసి పోయింది. ఈ రెండో పిల్ల ప్రేమతో వీడి కళ్ళు కప్పేసి మనకు మిగలకుండా చేస్తుందేమో .........వీడసలే అమాయకుడు..........."
మాయా మాయా మాయా.........
నీ కొడుకు అమాయకుడూ కాదు, మోహంలో కళ్ళు కోల్పోయిన కబోదీ కాదు, ప్రేమనే ధారలో కొట్టుకుపోతున్న దుర్బలుడూ కాదు. ఎలా చెప్పను వాడి పరిణితి ఏమిటో నీకు?
"ఏమిటిది, వాడి డైరీ మీ దగ్గర ఎందుకుందీ?" ఇచ్చిన డైరీ కొడుకుదని గుర్తుపట్టి అడిగింది. "అంతఃకరణీకుల డైరీలు వారి అసలు రూపాలను కొంచం కూడా పక్షపాతం లేకుండా ప్రతిఫలించే చక్కటి చూపుడుముక్కలు (అవే అద్దాలు). మన వారి మనసులు మనకు కాకుండా దైరీలకు నివేదిస్తున్నారంటే మనం మనవారితో సరిగ్గా మనలేదన్నమాటే మాయా. మన పెంపకంలో మాత్రం ఆ తప్పు జరగలేదు అన్న దానికి సాక్షమే ఈ రోజు నువ్వు నీ కొడుకు నోటిలో విన్న మాటలు."
ఎప్పటిలా పైకే చదవటం మొదలెట్టింది
"నాకెంటో పిచ్చి పిచ్చిగా ఉంది. తను లేనిదే ఏదీ రుచించక పోవటం, తనుంటే ఏదైనా రసభరితంగా కనిపించటం నాకు కొత్తే అయినా ఆ స్థితిని నేను అర్థం చేసుకోగలను. కాని ఇదేంటి? నన్ను నిలబెట్టిన ప్రమాణాలన్నీ కూడా తారుమారు అయిపోతున్నాయి? "నీ జీవితంలో నా స్థాననమేంటి"? అని అడిగిన స్త్రీకి ఒకనాడు సగర్వంగా "ముందు అమ్మా నాన్నా, తరవాత నువ్వూ, తరవాత తమ్ముళ్ళూ" ఇది నా జీవితంలో నా ఆప్తుల లిస్ట్ అని చెప్పిన నేను నేడేంటి "ముందు తను. తరవాతే అమ్మా నాన్నా కూడా" అనుకునే స్థితికి వచ్చాను. అమ్మా నాన్నలను ఒకవైపు, తననొక వైపు ఉంచి ఎవరో ఒకరే నీ జీవితంలో ఉంటారు ఎవరో నిశ్చయించుకో అని దేవుడంటే అమ్మా నాన్నలనే కోరుకుంటానేమో. కాని అది నా ప్రవర్తన మాత్రమె. నేను కాదు. నేను నేనుగా ప్రవర్తించాలంటే తననే కోరుకోవాలి అని నాకు తెలుస్తూనే ఉంది.
తన వ్యామోహంలో పడో, స్త్రీలోలుడనయ్యో, మొహావేశంలో కొట్టుకుపోతూనే ఇదంతా చేస్తున్నానా అని అనుకుంటే మనసు ఖచ్చితంగా కాదు అనే చెపుతోంది. కాని నిజంగా ఆ పాశాలలో కొట్టుకుపోతున్నవారికి కూడా ఇలాగే అనిపిస్తుంది, మరి వారికీ నీకూ ఉన్న తేడా నీకెలా తెలుస్తుంది? యే ఆధారం మీద ఆ నమ్మకం పెంచుకున్నావు అని బుద్ది పొడుస్తోంది.
నా ఇప్పటి స్థితి ఆ భావోద్వేగం మాత్రమె కాదని నేనెలా నాకయినా సరే నిరూపించుకోగలను?
మరో చరిత్రలోలా ఒక సంవత్సరం తనను చూడకుండా ఉంటె అప్పుడూ ఆ భావోద్వేగం ఉంటె అదే "నిజమైన ప్రేమ" అనుకోవాలా? అసలు ఇలా నిజమైన ప్రేమ ఉత్తుత్తి ప్రేమా లాటివి ఉంటాయా? పోనీ అలా ఒక సంవత్సరం పాటు విడిగా ఉంటూనే మాసికంగా తనతో సంసారం, సహచర్యం చేసి పరీక్షలో "నెగ్గితే" ఇప్పటి నా స్థితికి అది నిజమైన పరీక్షేనా? అదసలు "నెగ్గటమే"నా? అంటే ఉట్టి శారీరికాలయిన నయనం, శ్రవణం, స్పర్శ మొదలయిన పంచేంద్రియాలను ఒక సంవత్సరం పాటు అదుపులో పెట్టుకోగలిగితే...................అదీ తనను మానసికంగా సకల విధాలుగా తోడు తీసుకుని................ ఉట్టి బయట కనిపించే ప్రవర్తన మాత్రమె నియంత్రించుకోగలిగితే అది "నిజమైన ప్రేమ" అయిపోతుందా? ఆవేశంలో ఒక సంవత్సరం ఎంత? అసలు జీవిత కాలం కూడా తూచేగా తను నాదే అన్న నమ్మకం ఏర్పడిన తరవాత, నిరీక్షణ తాత్కాలికం మాత్రమె అని తెలిసిన తరవాత. మరి నిజమైన ప్రేమ నై నిరూపించుకోవాలంటే నేనుస్ శాశ్వతంగా తనకు దూరమై అప్పుడూ తనను మనసులో నిలుపుకుంటే మాత్రమె నాది "నిజమైన ప్రేమ" అవుతుందా?
పోనీ నిజమైన ప్రేమ అని రుజువు నాకు నేను రుజువు చేసుకున్నా ఆ ప్రేమలో తల్దండ్రుల ప్రేమ కిందికి వెళ్ళిపోవాలా? అసలు నిజంగా ఇప్పుడు తను నాకు అందరికంటే ఎక్కువ అనిపించటం, తన కోసం తల్లితండ్రులను తాత్కాలికంగానే అయినా సరే వదులుకోగలను అనిపించటం (ఇది మాత్రం నిజం. అమ్మా వాళ్ళు వప్పుకోకపోతే మాత్రం నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటాను. కాని వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోను. నా ఆ విధమైన ప్రవర్తన వలనా, వాళ్ళ స్వాభావికమైన ప్రేమ వలన ఆ తరవాత వాళ్ళూ ఎక్కువ కాలం నన్ను విడిచి ఉండలేరని నాకు తెలుసనిపిస్తోంది.) ఇది నిజంగానే తల్దండ్రుల ప్రేమను కిందికి తోయ్యటమేనా?
కాదు అనిపిస్తోంది నాకు.
నా అనుకున్న స్త్రీపై ఆ ఆవేశం లేకపోవటమే తప్పు అనిపిస్తోంది.
అమ్మా వాళ్ళను నేను బయటకెళ్ళిపోయినా మళ్ళీ ఒప్పించుకోగలగటం వాళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకోవటం కాదు నా కార్యదక్షతపై నాకున్న నమ్మకం అనిపిస్తోంది.
ఇంతగా ఆలోచించే మనిషి పొందే భావోద్వేగం విషయలాలసుడైపోవటం కాదు అని నామీద నాకే ఎందుకో నమ్మకం కలుగుతోంది,
నా ఇతర పార్శ్వాలలో యే మాత్రం దిగజారుడుతనం రానీక తనతో పరిచయానికి కొంత కాలం సశేషాన్ని భరించగలనూ అన్నది నాకు తెలుసు. అది నిజంగా నిరూపించాల్సోస్తే నా చేయి పట్టుకు నడిచే మనిషికి నిరూపించాలి కాని తల్లితండ్రులకైనా సరే మిగితా ఎవ్వరికీ అలా నేను నిరూపించాల్సిన అవసరం లేదు అని అనిపిస్తోంది.
ఈ నా నమ్మకాలు సరైనవో కావో నాకు తెలీదు.
కాని నాకు తెలిసినంతవరకు అవి నూరుపాళ్ళ నిజాలు
నేను నా నిజాల నీడనే నా వెంట తీసుకెళ్ళగలను
నేను నమ్మిన ఈ నిజాల వెంటే నేను నడవాలి. పర్యవసానం ఏమైనా కాని. రేపు అమ్మా నాన్నలకు చెప్పాలి "
అంటూ వాడి నిన్నటి ఎంట్రీ చదవటం ముగించింది.
"దొంగవెధవ మరి ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు నా లిస్టులో మీరు రెండో స్థానంలో మాత్రమె అమ్మా అంటూ ఎందుకు చెప్పాలి" బుంగమూతితో మాయ. "వాడికి అవన్నీ చెప్పే అవకాశం ఎక్కడ ఇచ్చావ్ ఆ మాట వినగానే ఎక్కిళ్ళు పెట్టుకుంటూ వచ్చిన అలకాగృహం తమరు విడిచి వస్తేగా వాడు నీకు నచ్చచేప్పేది..............." అంటుంటే "సరేలే కాని నువ్వెప్పుడూ అంటూ ఉంటావే సూత్రదారుల్లో సుజాత ముద్దుకు ప్రేరణ అనీ. అదంటే ఏమిటో మాత్రం ఇప్పుడు బాగా అర్థమయ్యింది" గుసగుసలాడుతున్న మాయ ఎకవచనంలోకి దిగిపోయింది.

మంచి పోస్ట్ అండి..
ReplyDeleteవిశ్లేషణ, వివరణ బాగుందండి.