ఎందుకు నవ్వుతున్నావు?
ఏం లేదు ఇప్పటి నీ ఈ రచన ప్రేరణ తలచుకుంటే నవ్వొచ్చింది
తప్పేముంది? నా భౌతికతను తాత్వికతగా మలచుకుంటే తప్పేముంది?
అసలు తాత్వికత పుట్టిందే భౌతికత నుంచి కదా? విక్టోరియన్ మొరాలిటీ అంటే నీకు మండుకొస్తుంది కాని నిజంగా నీ ఈ ఆక్షేపణ ఆక్షేపణీయమే కదా. తోలిసంధ్యన చెలి కౌగిట బిగియాలనుకోవటం తప్పు ఎందుకయింది?
చెలి ఇంకొకరి ఆలి అయినందుకే ఈ ఆక్షేపణ.
కాని తనను చెరచటం లేదు కదా.
మగనాలిని చేరకూడటం ధర్మ విరుద్ధం.
ధర్మం సమాజ న్యాయం.
వ్యక్తిగత న్యాయం.... సమాజ న్యాయాన్ని, సమతౌల్యాన్ని అతిక్రమించనంత వరకూ... వైయుక్తిక నైర్దేసిక పథిక అవటంలో తప్పు లేదు.
అదే నేను తొలి సంధ్యారుణ రాగ రంజిత భౌతికానురక్తి నా సతి నుదుట ముక్కన్నుగా అద్దదలిస్తే నీకీ ఆక్షేపణ ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పగలను. నాకు నా చెలి నా మానసరాజన్యుడు జనక మహారాజై "ఇయం సీతా మమ పుత్రీ......." అంటూ నాచే పాణిగ్రహణము చేయించిన నా సతియే అని నమ్మబలికితే ఈ రాఘవునే సీతగా మారుస్తూ "అయితే శీలపరీక్షా గుండమిదిగో...బహ్మచార్యమొక వత్సరము పాటించి, ఆ మహానల మసికూడా తాకక నిర్మల నిర్వాణమొందిననే నీవు పునీతవు" అని ఆజ్ఞాపించే నీకు ఈ కలియుగ సీతారామ అంశానుగతార్ధనారీశ్వర పిపీలక ప్రశ్నలకు జవాబివ్వు
ఇవ్వధంబున నా శీలపరీక్ష కోరే నీ అర్హత ఏమి?
వివాహమనగానేమి?
నా మానసిక బంధము నీ సామాజికామోదము పొందిన వైవాహికానుగత సంసార సహచార్యమునకు తేలికైన విషయమేమి?
నేను నీ అంతఃకరణాన్ని. నీ జీవక్షేత్రమున నీ వ్యక్తిత్వ సింహాసనమున ఆసీనురాలిని చేసి నీ ప్రతి చర్యనూ నా సామంత రాజుగా నాకు మకుటధారణ చేసినది నీ సంకల్ప ముహూర్త బలమే, నీవే ఆ సుముహూర్తాధ్యక్షత వహించిన విప్రవర్యుడవు. స్వశపధమాత్ర మదాజ్ఞాబద్ధుడవు. ఇక ఆపేయి నీ ధిక్కారణా ప్రగల్భ చిత్త చాంచల్యము.
వివాహమనగానేమా?
నీవనుకొనునట్లుయది మాంగళ్య చిహ్నబద్ధ చరణ చలనము కాదు
అదియొక ఆన.
ఒడిదుడుకుల తుఫానులోను సుఖసంతోష డోలికలోనూ చేయి వదలని ఆన
నీవనుమానపడునట్లది దేహవాంచలను మాత్రమె శమింపజేయు మార్గము కాదు వానికి వేరెండులు కలవు
దేహవాంచలామోదయోగ్యములైన విధముగా శమింపజేయుట దాని యొక పార్శ్వము మాత్రమె.
సంతానోత్పత్యమున మాతాపితురుల ఋణ విముక్తి సాధనము
గృహస్త్యోభవమున మిగులు అన్ని యాశ్రమములకూ ఆవలంబనావలభ్యము అయి ఉన్నది వైవాహిక వ్యవస్థ
మనసున ఒక మూర్తిని సతిగా ప్రతిష్టించుకొని మరియా సామాజిక భాధ్యతలను తలకెత్తుకొనుటలో అభ్యంతరమేమున్నది?
సైద్ధాంతికంగా ఏమీ లేదు. కాని పగ, మంకుపట్టు, చల్ల్లారని కామోద్రేకము వంటి వేరొండులు ఈ మానసిక పరిణయ ముసుగున భాధ్యతల దూరమవకుండునట్లు చూచుకొను భాద్యత నాది అందుకే ఈ శీలపరీక్షలు.
నువ్వు చెప్పినది ఆలోచించవలసిందే.
తప్పదు.
అందరూ నడవని దారిన పయనమయి మార్గము రాలూ రప్పల ప్రయాసభారితముయనుట హాస్యాస్ఫదము. మార్గముబట్టి తపము.