Wednesday, 24 August 2016

పిల్లలకో ఉత్తరం -2

మీరూహకొచ్చేసరికి "ఉత్తరాలంటే?" అనే పరిస్థితి, తెలుసు.
ఆణిముత్యాలని దాచుకున్నా, చాదస్తమని పారేసుకున్నా...మీ ఇష్టం.
మీరో వరమర్రా. పెద్దాళ్ళమనుకునే మాకు మా పిల్లతనాన్ని నేర్పించేస్తారు. ఏం పెరగలా అని ఎంతగా అనేస్తారో.
లేకుంటే, ఎందుకింత ఆనందమర్రా?
"నాన్నాచూడు ముసలమ్మా ఎలా డాన్స్ చేస్తోందో" అని చిన్ని ఎమోటికాన్లకు సంబరపడిపోతుంటే ఎవరెస్టు నువ్వు కాదు తల్లీ ...ఎక్కేది నేను. ఆ ఆనందపు శిఖరి నీకింకో ఇరవై ముప్పై ఏళ్లకు కానీ తెలీదు,
అదేదో ప్రపంచ వింతను మొదటి సారి చూస్తున్నంత ఆశ్చర్యమూ ఏకాగ్రతా.....బుజ్జోడా, నీ కళ్ళల్లో కనిపిస్తే............ఆ సంభ్రమాశ్చర్యాలు నేననుభవిస్తే .......చివరికి నిన్నంతగా ఆకట్టుకున్నది -ఓ చిన్ని ఫోన్లో ఎవరో అపరిచితుడు ఎన్నో వేల మైళ్ళావల నుంచి- అని అనిపించేసరికి ...........ఆ ఇవి ఇబ్బడి ముబ్బడి అవటం మరి నాకొక్కడికేగా అర్థమయ్యేది.

Saturday, 6 August 2016

The Religion of an Atheist -10 Guru గురువు


Dispeller of Ignorance / Darkness is apparently one of the etimologies of Guru. I always used to talk about the 24 Gurus of Dattatreya. Today, I understood that till now I only "knew" but did not "understood" what he meant by 24 animate and inanimates being his gurus.
More understanding of Patanjali's Yoga Sutras being imparted by Guru Nithyanandaji.
And my intellect questions me, Are you respecting him with the same respect that you think you will give a "Real Guru"? Knowing his escapades? Does he deserve respect for the dispelling of my knowledge and if yes, how should that respect diminish because of his personal life?
If I am a "real student" I should be focussed only on my "Understanding and Progress" and nothing else, I will respect whoever helps me with the Understanding and Progress. If I am not a "real student" then other things come into my mind.
So, it is not a real guru / unreal guru who determines the amount of respect he commands.......it is me, a Non Real / Real student who determines the bhava/gravity/degree of Respect that I accord to the dispellers of my ignorance/darkness. Or even more truthfully, it is my Ignorance /Darkness.
Thank you Nithyanandaji
.
.
.
.
.
.
.
.
.
.
. The religion of an Atheist – 9
* తపస్సు *
https://www.facebook.com/raghavendra.bethamcharla/posts/10153704971204250
7. 
The Religion of an Atheist - 7 మంత్రము
https://www.facebook.com/raghavendra.bethamcharla/posts/10152910233549250?pnref=story
6. 
The Religion of an Atheist - 6 Evidence Base or Proof in Practice
https://www.facebook.com/raghavendra.bethamcharla/posts/10152781787764250
5. 
The Religion of an Atheist – 5 Narcisstic, Masochistic, Dissocial & Perfectionistic Sadhakas
https://www.facebook.com/raghavendra.bethamcharla/posts/10152739256734250?pnref=story
4. ??? :(
3.
The Religion of an Atheist -3
Empirical religion and Blind Faith Science.
https://www.facebook.com/raghavendra.bethamcharla/posts/10152654937704250?pnref=story
2.
Religion of an Atheist -2
Truth & Evidence – Is it just this in “science”?
https://www.facebook.com/raghavendra.bethamcharla/posts/10152636776189250?pnref=story
1.
????? :(

Wednesday, 27 July 2016

అజ్ఞాత జంటకో అశ్రు నివాళి!!!

స్వేచ్చగా ఎగురుతున్న పక్షుల బ్యాక్గ్రవుండ్ ..........ముచ్చటైన పేరు ఆర్చివ్ కు......ఇక యూ ఆర్ ఎల్ లోనే పరమావధి ..................రాస్తున్నది మేమిద్దరం అంటూ తమ పరిచయం. చక్కనైన పేర్లు. అవి కలం పేర్లో అసలు పేర్లో తెలీవు. భిన్నాలకు దర్పణంగా. వారి పేర్లకు తగ్గట్టే రచనలూ, భావుకతా, ఉద్రేకమూ, శోకమూ ....ఇంకా అన్నీను.
పరిచయమైన కొన్ని రోజుల్లోనే చెంప దెబ్బ తిన్నాను. నా రచనలు అభిప్రాయాలూ నావి, అవి చర్చలకు తావు లేనివి. అంటూ నిక్కచ్చిగా చెపుతూ.
ఆకర్షించినది మాత్రం వారిద్దరినీ నేను ఊహించుకున్న ఊహలే. Not without any basis, though. కానీ నా ఊహల్లో వారిని చూస్తె ఎంత ముచ్చట వేసేదో. ముఖ్యంగా పుస్తక పఠనం ఎలా అంటూనో అలాంటిదేదో ఒక టపా. నిజంగా ఇద్దరినీ ముద్దు పెట్టుకోవాలనిపించెంత నచ్చేసారు.
కాలగమనంలో గాయాలు కనపడుతుంటే ......... భావుకులకు సహజమేగా అనుకుంటూ గమించటం మాత్రమె మిగిలిపోయింది
హటాత్తుగా ఒక రోజేదో టపా ......Prayed for somebody’s togetherness, for the first time.
అల్మారాలోంచి ఒక సగం ఖాళీ.......ఇంకో రోజు
అర్ధనారీశ్వరుల్లో ఒకరు మాయం ఇంకొంత కాలానికి
రాస్తున్నది మేమన్న పరిచయమూను .....కాలగమనం చేసి
కలలు కంటూ బోసిగా అనిపిస్తూ .....అసలు కనిపించకుండా పోయి కొంత కాలమూ
మళ్ళీ ...........లేదు నేనొక్కడినే ........నేనొక్కడినే ............నేనొక్కడినే
అంటూ ఎన్నో ఏళ్లకు దర్శనం ఈవేళ
నిజంగా ఏడుపొచ్చింది
కాలసర్పమే ....నిజ్జంగా

Tuesday, 21 June 2016

Letters to my children -Son -1

1.
Why I like you, now.

U r yet uncomprehending. By the time you start to, probably this feeling will go away. Or may be I will get used to it (hope not). May be the tides of time, as usual, wash it afar. Or simply, life may happen.

But this moment is precious to me.

You know, basically I am very selfish. I like the fact that you don't demand, in return. In return, being the keystone. Oh ya, boss, you do demand, a lot. But, for the moment I am safe from your demands. But, I promise, even those labours will be of love. But coming back to the main point, you don't demand IN RETURN. I can live you when I want to,  I can love you as I want to and I can stop loving you tooooo...oh man you stay there unmoved. Equanimity? My ass!!! I know you just are not "you", yet. And I love that ego centric yet "selfless" you.
Ya ya, I know I have to attend to your nappy RIGHT NOW ,buddy.

I can cuddle you, hold you on my tummy, hold you high hold you low..........love it that you just need your milk and your sleep. Loved it that you did not mind a stranger from 7000 miles afar being so intimate. Loved it that, ya, that I could just play with you. Like..... you were a lifed doll, created for just my pleasure. Yes liked the fact that it was possible for me to "just enjoy" you because of your mom. Liked it that I have, for now, the easier part.

Na, don't feel guilty at all. Why should I?

Learning to be a dad.
Another studentship.
For life, they say.
But, the first 50 days till yesterday were awesome ra gundugaa.

Congrats on your first 50 buddy.
May you have many many many more.

గుండుగా
పుత్రోత్సాహము.......అలవాటు చేస్తున్నావురా.
వేల మైళ్ళావలనున్నా .....

అమ్మ పిచ్చిదిరా. మొన్న "నిన్ను మిస్ అవుతాను," అని చెపుతుంటే అసూయ పడిన సంగతి తెలిసి పెద్దయ్యాక మనసులో ఉంచుకోకు. నీకు ఏమన్నా అవుతుందని మందులు కూడా వేసుకోక నొప్పి భరించే తిక్కదది. మూఢ నమ్మకం అని కాక ఎంత ప్రేమో అని అనుకోగలిగేలా
పెంచితే
పెరగ్గలిగితే
పైవాడు/ఫేట్/హాపెన్స్టన్స్ పెరగనిస్తే.........

Letters to my children

Tuesday, 7 June 2016

తోమ్మిండుగురు అప్పచెల్లెళ్ళు.......

తోమ్మిండుగురు అప్పచెల్లెళ్ళు.......
లోకంపెట్టె అనవసరపు ఆరళ్ళను ఎంత ఓపిగ్గా సాహిస్తారమ్మా మీరు. మా జీవితం మీవలన వ్యర్థమట. మీరడ్దట తల్లీ ఆవలి తీరానికి.

తొమ్మిండుగురినీ మేము ఒకటిగా........లేదంటే కనీసం సరి సమానంగా చూడగలిగితే............పోనీ దానంత కష్టం లేదు, ఒప్పుకుంటా........మీ తొమ్మిదిమందినీ మేము స్ఫష్టంగా అన్నా చూడగలిగితే.................అద్వైతము కనిపించదా తల్లీ.

తొమ్మిది మాసాలు కనిపెంచుతుంది తల్లి. తొమ్మిది రసాలూ పరిణితిని పంచుతున్నాయని గమనించం తల్లీ. మానస వనచరవరము పెద్దదానికి దాస్యమైపోయింది తల్లీ, దాస్యమైపోయింది.

అమ్మా భారతీ........ఎలా సాహిస్తున్నావమ్మా మా సవతితనము.

Saturday, 4 June 2016

వద్దొద్దు

వద్దొద్దు
పసిడి వెలుగులూ 
సొంపైన స్వనాలూ
వద్దోద్దూ
శోధనాపలేను
ఒక కోన నుంచి ఇంకో కొనకూ పోకనూ మాననూ
ఎందుకీ పితుకాలాటకం?
ఇపుడింపుగానే ఉంటుంది....
ఆవలి వైపు ఇష్టముండదు
ఈవలి అస్థిత్వము ఆవలి ఉంటేనే...........
ఈవలి ఆవలి ............ఆవలి ఈవలి
ఈవలి ఆవలి ............ఆవలి ఈవలి
ఎందుకీ పితుకులాటము!!!!!

Monday, 4 April 2016

నాన్నా

భూ నభః అంతరాలయి చూసుకున్న నీకు
చివరాఖరు పయనపు వీడ్కోలు
ఇంటి గడపావల!!! 
అలవాటు ఆస్వతంత్రత ముసుగేసుకుని.

తీర్చిన బొమ్మరిల్లు
వరండాలో, దిష్టిబొమ్మలా.
అవే నయం
అశుభమనిపించుకోవు.

కొండంతయి పెంచి
చివరికి కుండలో ఒదిగి........







.

Wednesday, 16 March 2016

It 's always a zero sum game

త్రాసు గిన్నెలు అటూ ఇటు....
తెలుసు ఎవ్వరికీ జోలె "నిండదని"
తెలుసు వెలితి మిగిలిపోతూనే ఉందని
కానేం చేయను
ఈ దండం పట్టుకున్నాక
ఈ పీఠంపై కూర్చున్నాక
ఎవరికీ "పూర్తి" ఆనందమివ్వలేను.
The cake is always finite
The game is always a zero sum.

Sunday, 13 March 2016

నాన్న.

మిమ్మల్ని మీరు కొంచం బాధ పెట్టుకోండి...పర్లేదు, నా కోసం.
అందుకు ప్రతిగా నిద్రలో నా ఆఖరు అడుగు పడకూడదని నే కోరుకుంతా.
సరైన మూల్యమేగా మీ బాధకు.

పర్లేదు...నన్నింటికి తీసుకొచ్చేయండి.
ఆ తెల్ల గౌన్లూ, ముఖాలకు మాస్కులూ.....
వీటిని చూస్తూ కాదు నా ఆఖరు అడుగు పడాల్సినది.
బాబూ...అక్కను జాగర్తగా చూసుకో ఆడపిల్లది లాంటివేవీ సొల్లు కబుర్లు చెప్పను.

నా కాలి గోర్లు శుభ్రంగా నువ్వు కత్తిరించు.
నాకు చివరి సారి గడ్డం నువ్వు గీయి. పర్లేదు కొన్ని గాట్లు పడ్డా.
నా గడ్డంపై వణికే నీ చేయి చాలదూ?
ఒరేయ్, కన్నీరు ఆపుకోకు. కారనీ.

నాకు గోరుముద్దలు తినిపించు తల్లీ.
తమ్ముడు మగాడు కదా, ఆ లాలిత్యం ఉండదు.
మళ్ళీ ఓసారమ్మను గుర్తు చెయ్యి.

మనసారా అందరూ గట్టిగా కౌగిలించుకోండి.
కళ్ళు నొప్పులు పుడుతున్నా మా రూంలో నా మంచం మీదే ఉండండి.
అమ్మనొక్కదాన్నీ నాన్నతో ఉండనీ అని రాత్రి ఒంటరిని చేయొద్దు.
ఇంకెవరినీ పిలవొద్దు. అత్తయ్యలను కూడా.
నిన్న చూసాగా చాలు.

రాత్రంతా....ఆ నిశ్వాసమయ్యే దాకా.....పక్కనే కూర్చొండేం?
నచ్చనివి ఎన్నో చేసుంటాను.
అవి మాట్లాడుకోటానికి మీ పయనిమింకా ఎంతో ఉంది.
నచ్చినవి ఎంతో కొంత చేసే ఉంటాను.
అవి కొంచం బయటకు లాగండి.
వెచ్చగా కప్పండేం ఆ శాలువలు?
తరవాతి పూలమాలలెవడికి కావాలోయ్?

తెలుసు, మీక్కష్టమే.....
కానీ
ఆ చివరి పాదాభివందనానికీ
ఆ చివరి కౌగిలింతకూ
నోచుకొకుండా అవకండేం?
అనుభవపూర్వకంగా చెపుతున్నా!!!

బుజ్జోడా
అభిమన్యునిలా నేర్చుకో ఇది.
బుజ్జమ్మా
నీ సందూకలో ఈ నా లేఖ.

Saturday, 12 March 2016

రాళ్ళెందుకో

రాళ్ళెందుకో
ఈవేళ మెరవటంలేదు
జలబారిన కళ్ళే
మెరవనియ్యటంలేదేమో
వాటికోసం పరుగు
ఏంత దూరం తెచ్చిందంటే
చేయి పట్టటం నేర్పినవారూ
చేయి పట్టుకున్నవారూ
కనపడననంత

Saturday, 27 February 2016

ఈశ్ వరా... శం భో... శం కరా...

పున్నమి రేయిలో
నీటిలో
నేను.
పిల్లతెమ్మెరొక్కటి
సుతారంగా నిమిరినపుడు
భావోద్వేగ తరంగాల
ముడతలు....
ఝంఝమా మారుతం
లాగి పెట్టి కొడితే
కిందడుగంటిన మకిలి...
ఎదురునున్న నేను నేనా
నీటిలోని నేను నేనా
నీటిలోని నేను లేపోతే
నాకో అస్థిత్వముందా?
పిల్లతెమ్మెరలూ, ఝంఝమా మారుతాలు
నన్ను నిర్వచిస్తాయా?
మరి పున్నమి రేయో?
దాని స్థానమేమిటి
నాలో?
పున్నమున్నందుకు నేనున్నానా?
కోనేటి నీటి వలన నేనా?
ఎదురుగ నిలుచున్నది నేనా?
నేనేమిటో నాకు తెలిపే పున్నమి నా అస్థిత్వాని రూపుమాపే కెరటాలకూ తల్లి. నన్ను మాయం చేసే అమావశి నన్ను మాయం చేసే తరంగారిహనతకి. ఎవరు నా నెచ్చెలి? ఎవరిని నే మెచ్చాలి?
తెలియటం లేదు నాది పురోగతో లేద శ్లేష్మంలో పడిన ఈగ గతో. సందిగ్ధత అర్థమవుతున్నది. సంఘర్షణా ఎఱుకే. సంస్కారాలవశేషాలేమోననొకవైపు, సోమరినై సాధనాలేమియోనన్న సందేహమోవైపు. లాంతరు పట్టి సరయూ నది ప్రవేశ రహదారి చూపే గురువేడీ? మనసూ,భూమీ వ్రక్కలవుతేకానీ, దశసహర్ష,దశశతాణీయంటూ పరులకొరకు చెరననుభవిస్తేగానీ శాప విమోచనానికీ యొగనిద్రకూ అవకాశం రాదు కదా?
ఈశ్ వరా...
శం భో...
శం కరా...
ఆ ది యోగీ!!!

I am a Kettle


hissing and steaming
scalding if not careful
sustaining when treated well
Yes, I owe you my innards, yes you ignited my back passage, yes, yes, you made me for your wishes, yes, you turn me on, yes, you turn me off.......మాటలు వేయవేల.....I am your wish slave.
Unfortunately, I am an evolved one.............ya, those of that Internet of Things kind of thingies but yet.....A bit more evolved one. So I feel.............पिछवाड़े की आग, सारे बदन की तपन, ढकती हुयी ताकत की मजबूरी, ग़रज़ उठता हूँ चीकने के बजाय..........................................

Friday, 19 February 2016

కాశీలో వదిలేసా

ఏమయ్యింది
ఏమో
:) అపుడే అలుపంటే ఎలా
....
నవ్వటమిపుడే అవసరం
......
నవ్వొచ్చినప్పటి నవ్వులో ఏముంది గొప్పతనం
నాకొద్దీ గొప్పతనాలు...పో నువ్వు
ఎక్కడపోయిందీ ఆ మనసు? డ్రీం వర్క్స్ లోగోలో కురాద్డికి లిటిల్ మిస్ సన్షైన్ని కోరినా మనసు
ఎందుకా మనసు .....
నీ అస్థిత్వము కదా
దాన్నే కదా స్వాహాదేవికి అర్పిస్తున్నా
యాజివవగలవా
తెలీదు కాని కాశీలో వదిలేసా అనే వారి మీద గౌరవం మాత్రం పెరుగుతోంది

ఇంకెప్పుడు విద్యుక్త విరామాలో

కష్టపడి వ్రేళ్ళూనితే
జడత్వమన్నారు
సరేనని సంకెలలు తెంచుకుంటే
గాలివాటుతనమన్నారు
గొడవెందుకని
రాగధ్వేషాలొదిలేయబోతే
మనుషులంటే నిర్లక్ష్యమంటున్నారు
ఇంకేమి చేస్తానో
ఇంకెన్ని నిర్వచనాలో
తోలు తిత్తినిండు
అస్థి రక్త మాంసాలతో
కంటికగుపడని
మనొ బుధ్ధి చితాహంకారాలతొనూ
ఇంకెన్ని విశ్వద్దర్శనాలో