తొలి సందెన భుజాల బరువై
మా క్షణాల పరువులెత్తించి
మలి సందెన మా బరువులు మోసే
చిరుబోయీ సమయమెపుడో?
తొలి సంజెల ఉషస్సు తానై
మా చీకట్ల తరిమేసి
వెన్నెల పావడ తను వేసే
పున్నమి తల్లీ ఘడియెపుడో?
ఎదురుచూపుల మూల్యం
బహు బాగా చెల్లించాం
ఇంకెపుడర్రా మీ రాకా
కళ్ళు కాయలు కాసినాకా ?
ప్రతి పదంలోన దాగున్న వ్యధ కని నా మనసు ఆర్థ్రమైపోయింది. ఇంతకన్నా ఏమీ అనలేను.
ReplyDelete