Saturday, 20 June 2009

క్షణికావేశాలయితేనేం?

మిణుక్కుమనే మిణుగురులై
తళుక్కుమనే తారకలై
చమక్కుమనే తటిల్లతలై
క్షణం మెరిసి మాయమౌతాయి

తిరిగి చూద్దామంటే
ఛాయా రూపామే తప్ప
కంటికి కనపడని హొయలవి
తళుక్కు మిణుక్కు చమక్కులవి

పొనీ....మరిచిపొదామంటే
మిణుక్కుల మధ్యనంతా చీకటి
తళుక్కులొనే జీవితం
చమక్కులొనే సార్ధకం
అవగతమవుతుంది నాకు

ఈ చిరు వెలుగుల చీకటిలొనె
జీవితమంతా చదువుతున్నాను
ఈ మసక వెలుతురులన్నీ
ఙ్ఞానోదయం చేస్తున్నాయి

అందుకే గురుదక్షిణగా
వాటినమరం చేస్తున్నా
పదిలపరుస్తున్న ఆ భావమాలికే
నా ఈ సాహితీ యానమంతా

కవిత కవితనొక్కటిగా చూస్తే
క్షణ భావావేశమే గోచరం
భావ విస్తృతి లోపస్ఫష్ఠం
అంతర్లీనమైన సూత్రంతో చూసావో
అసంఖ్యాక భావోత్పల సమాహారం
ఆద్యంత రహితానంత భావసారం.

3 comments:

  1. హను మిత్రమా
    మెచ్చినందుకు థాంక్స్

    ReplyDelete
  2. పదిలపరుస్తున్న ఆ భావమాలికే
    నా ఈ సాహితీ యానమంతా

    మీ సాహితీయానం బావుందండీ..

    ReplyDelete
  3. నచ్చినందుకు థాంక్స్ జ్యోతిర్మయి గారు.

    ReplyDelete