Wednesday, 29 December 2010

కాశీనాథుని స్త్రీ-3 శుభప్రదమైన ఇందు.




ఈ కాలం పెళ్లికూతురు చీని చీనాంబరాల బరువేసుకుని రైలుబండిలో ప్రయాణం చేసి మెట్టినింటికి వస్తుందా?ఈ కాలపు స్త్రీ ఎంత సంగీతాభిమాని అయినా  వీధిలో తంబుర పట్టుక్కూర్చున్న వ్యక్తిని "అపర త్యాగబ్రహ్మలా లేరు?" అని ప్రమాణాలు చేస్తుందా? మైకులో వచ్చే పాటకూ వ్యక్తి ప్రత్యక్షంగా పాడితే వచ్చే పాటకూ తేడా తెలీదా? లేకివాడు, భాధ్యతలేని వాడు, దాబ్బు విలువ తెలీని వాడు, పెద్దల పట్ల గౌరవం లేనివాడు, అది ఉన్న వాళ్ళు అస్వతంత్రులు అనుకునే వాడు", అబద్దాలాడే వాడు మొదలయిన సకలగుణాభిరాముడైన భర్తను దారిలో పెట్టటానికి అష్ట కష్టాలనూ ఓర్చే వ్యక్తి, సంగీతాభిమానంలో అంతస్తుల తారతమ్యం చూడని వ్యక్తిత్వం - ప్రేమలో ఇంత గుడ్డిదైపోతుందా? లేక పెళ్ళయిన తరవాత మార్చుకుంటానులే అన్న ధీమానో, ఆహామోనో, నమ్మకమోనోనా?

ఈ ప్రశ్నలన్నీ ఇందు వ్యక్తిత్వాన్ని, జీవితపు మలుపలనూ చూస్తె నాకు తలెత్తిన ప్రశ్నలు. ఎనిమిది దశకాలు దాటిన సూత్రధారి వృద్ధ  మస్తిష్కం శరీరం సమానంగా మందగతి పట్టిందా, మందబుద్ది అయ్యిందా అన్నది వీటిని సమూలీకరించే ప్రశ్న. 

ఈ ప్రశ్న వేసుకున్న మరుక్షణం నాకు నా మిత్రుడితో ఎప్పుడో జరిగిన చిన్న సంవాదం జ్ఞప్తికి వచ్చింది. "ఈ సాయిలనీ, బాబాలనీ, అమ్మలనీ, ఆనందమయిలనీ...ఇలా ప్రజలను మోసగిస్తూ బహుపట్టంగా పబ్బం గట్టుకుంటున్న వీరి వలన ఏం ప్రయోజనం వీరూ" అంటే "ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది రఘూ. నీవు ఆలోచించే "అసలైన భక్తి, అసలయిన గురువు, అసలైన ప్రవచనం" అనేటివి అవసరమే కాదనను కాని వీరి వల్ల ప్రజలకు మంచి జరగట్లేదనుకోవటం పొరబాటు. ప్రజలకు, ఎవరి స్థాయిలో వారికి, ఈ బాబాలు మొదలగు వారి వల్ల ఆలంబన దొరుకుతుంది. నువ్వు తపనపడేలా ఉండాల్సిన గురువులు అంతగా ఆ విషయ సాధనకై ప్రయత్నించే శిష్యులకు ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు తారస పడుతూనే ఉంటారు. కాని సామాన్య జనానీకానికీ ఒక ఆలంబన అవసరం కదా దైనందిన జీవితంలో. ఆ అవసరాన్ని తీర్చే వారే ఈ గురువులూ, అమ్మలూ. ఇక్కడ వారి వలన ఒనగూడే ప్రయోజనం జనానికి ఒక స్థిరమైన నమ్మకం కలగటమే. ఆ నమ్మకం పునాదిపైనే వారి వారి జీవన గతిని కొంతైనా సక్రమించుకుంటారు. అందులో తప్పేముంది?" అంటూ జరిగిన సంభాషణ నాకు ఈ ప్రశ్ననుగతంగా గుర్తురావటం యాదృచ్చికమేమీ కాదు.

If we disrobe ourselves of this emperor's robe called the Prominence of self, we are all "ordinary" people in many senses.అలా సామాన్య జీవన పాత్రదారిగా "కాశీనాధుడిలా చెప్పాడంటే ఏదో కొంత విషయం ఉండే ఉంటుంది అది ఏమిటో" అన్న ఆలోచిస్తే వచ్చిందే ఇందు జీవితానికి ఈ నా అన్వయం . అవధరించండి మరి. (మామూలు మాటల్లో చెప్పాలంటే, ఆయన వీర ఫాన్ని కాబట్టి "పైపైవి చూసి నేనేదో గూడార్థాన్ని మిస్సవ్వుతున్నాను" అని ఆలోచిస్తే ఇందు జీవితం ఎలా అర్థమయిందో చదవండి మరి.) 

"చక్రీ. నన్ను పోషించగలవనే నమ్మకం కుదుర్చటానికి ఈ నగలు (నకిలీవి) అమ్మా నాన్నకు చూపించావు. అందరూ నిన్ను నమ్మారు. అక్కడితో వారి పాత్ర మిగిసిపోయింది. కాని నేను? జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని. దానికి నువ్వేసిన పవిత్ర బంధం ఇదైనా (తాళి) అసలు బంగారమేనా లేక కాకి బంగారమా?"  ఈ ఒక్క సం భాషణతో ఇందు కు.........వరుని ఎంపికలో పెద్దల భాద్యత ఎంత, వారు చూడాల్సిన (వరుని ఉద్యోగ, సంపాదనా స్థాయు మొదలగునవి) వారు  ఏ దృక్పదంతో చూడాలి, ఆలు మగల సంసారమో తల్దండ్రుల ప్రమేయం సీమ ఏమిటి .........అనేవి ఎంత చక్కగా అవగాహ్యమయ్యాయో మనకు తెలిసిపోతుంది. 

"అరె పెళ్ళే మోసం ప్రాతిపదికన చేసుకున్న వ్యక్తి ఇక ముందు ముందు మోసం చెయ్యడన్న నమ్మకమేమిటి? ఎలా సహించగలిగింది ఈ కాలం స్త్రీ ఇందు" అని ఆలోచిస్తే "అదే కదా మరి పెళ్లి అన్న బంధం పట్ల ఇందుకున్న కట్టుబాటు. ఈ ప్రపంచంలో ఏ విషయంలోనూ గ్యారంటీలు ఉండవన్న సత్యాన్ని చూచినా వ్యక్తిత్వపు అలవాలు" అనిపించింది నాకయితే. "ఆ ఆ అలాగే అనిపిస్తుంది మొగ పుంగవులకు. అలాటి వారే పతివ్రతలు మీ దృష్టిలో. అలాటి వారే ఆమోదయోగ్యులూ, శ్లాఘనీయులూ ఈ పురుషాధిక్య సమాజానికి" అనే నా అంతరాత్మలోని ఫెమినిజానికి నేను చెప్పుకున్న సమాధానం ఒక్కటే "భార్యలలో కూడా ఇలా ఎంత పేద్ద తప్పులనైనా క్షమించగలిగే సోదారులు ఈ మధ్య భర్తలలో కూడా  ఎక్కువవుతున్నారు అన్నది సోదాహరణంగా తెలిసిన నువ్వు ఇలా మాట్లాడటం సబబు కాదు. పైగా ఆర్ధిక స్వాతంత్ర్యం, దాని వల్ల వచ్చే ఇతర స్వాతంత్ర్యాలు ఉన్న ఈనాటి స్త్రీని, ఆమె సత్వాన్నీ ఇంకా పురుషాధిక్య సమాజం అంటూ చిన్న చూడటం తగదు" అంటూ.

డోలీ అద్దేగ్గొట్టి తప్పు చేసింది తామే అయినా బయటి వారికి తామెప్పుడు ఇద్దరం కాదు అన్నట్టు తన ప్రవర్తన నాకైతే "ఆ పరవశమంతా మనదే....మన ఒక్కరిదే " అనే  ప్రేమకు స్వారూప్యమె అనిపించింది. (చిన్నప్పుడు టీచరు తిట్టారని ఇంట్లోంచి పారిపోయింది నేనయినా పాపం ఆ టీచరుని దబాయించేసిన మా నాన్నగారూ గుర్తొచ్చారు అది వేరే విషయం లెండి :-) ఇలా ఇందు దృష్ట నాయక గుణ సంహిత. 

ఆ దబాయింపులో కూడా నవ్యతే చూడండి. "పచ్చి నెత్తురుతో పానకం తాగే మనిషి" అని మంచం చాటును వెతుక్కుంటున్న తన వాడిని  రెండు బిందెల నీళ్ళూ, పసుపు ముద్దా చూపకుండానే ఖడ్గ తిమ్మనను  చేసిన నవ్య చానమ్మ  కదూ ఈ దేవేరి? (నిజంగా ఆ సమయానికి హరిద్రావర్ణాంబరధారణ యాదృచ్చికమేనంటారా?)

పైగా "ఆంజనేయ భళారే మహా దేవ భళారే" అన్న చిందు (అది చిందేనా?) తాళానికి తీన్మార్ ఆడుతుంటే "ప్రాజెక్ట్ లీడర్ లేడు అందుకే అలా కొంచం సేపు ఆఫీసు నుంచి జంపు జిలాని" అనే మా తెలంగాణ సాఫ్ట్వేర్ పడతుల ఉభయ సుభగత్వం తోచింది.  
హేవిటో. ప్రధాన పాత్రధారులందరూ ఇలా "ఎంతో విశాలత్వం" ఎందుకు చూపెడతారో. డోలీ మోసే వాడు పాణిగ్రహణ ఉత్సాహంలో "ఇంతకంటే మంచి ఉద్యోగం వెతుక్కుంటాను" అంటుంటే "అయ్యో అదేం పనండీ. ఎంచక్కా ఇప్పుడున్న ఉద్యోగానికేం? హాయిగా మనుషులను మోసుకుంటూ వెళ్ళే ఉద్యోగం ఎంత పుణ్యం" అంటూ తన అతి మంచితనంతో తన వాడి పురోగమనానికి తానె అడ్డుపుల్ల వేస్తున్న సంగతి గమనించుకొదెం? అనే మనసుకు మాత్రం సమాధానం చెప్పలేకపోయ్యాను :-)

"మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పయినా, ఒప్పయినా ఇంటి గుట్టుని కడుపులో పెట్టుకునే అమ్మాయి నీ కడుపులో పుట్టింది" అంటూ తన స్వాభిమానాన్ని స్వాతిశయం లేకుండా చెప్పుకోగలిగిన ఇందు నిజంగా నాయికే కదా. (మెట్టినింటినీ, పుట్టినింటినీ ఇలా సవ్యసాచ్యంతో నెగ్గించే ప్రతి పడుచూ నాయికే అసలు.....అయినా వారిని "ఆడ"పిల్లలు అని ఇరువైపు వారు దెప్పటం......ప్చ్. పైగా నొప్పింపక తానోవ్వని ఈ లౌక్యం అందరినీ నొప్పించే సత్యసంధత కంటే మెండే కాదంటారా?)

ఇలా రెండింట్లా, బయటా గెలిచింది కనుకే "ఏమిటీ మీరు ఆశీర్వదించరా" అని మొహమాటానికి అడిగినా తన శిరోక్షింతల ధారతో తన వాడిని ఆశీర్వదించే అధికారం   స్వాధీనం చేసుకుంది ఇందు (నాకయితే ఇది కూడా యాదృచ్చికం అనిపించలా!) అలాటి దేవిని భర్త నెత్తిన పెట్టుకు ఊరేగిస్తే తప్పేమిటి? "కలియుగ సావిత్రీ ధర్మాచరణే" కదా ఇది కాకపొతే role reversal జరిగింది అంతే :-)

ఒకటి మాత్రం నాకెప్పుడూ అంతుపట్టదు. వేరే ఎవరో కోసం అంతగా కన్నీళ్లు పెట్టటం స్త్రీకెలా సాధ్యమో. ఇది తలుచుకుంటే మాత్రం కాళిదాసు పద్యం "రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్...." అనేది గుర్తుకు వస్తుంది. అర్థం, పద్యం  ఇక్కడ రమ్యమైన దృశ్యాలూ, మధురమైన శభ్దాలే కాదు ఒకోసారీ పూర్వ జన్మ ఆపేక్షలు అపరిచిత వ్యక్తుల ద్వారా కూడా కలుగుతుందనుకుంటా. పెద్దాయన వెళుతుంటే ఇందు కన్నీళ్లను కూడా ఇలాగే అనుకోవాలి మరి. 

"ఓరిమి చాలమ్మా ఓ భూమాతా" అంటూ స్త్రీ సహనానికీ హద్దుందని పోటెత్తిన ఓ స్త్రీ   ఆల్టర్ ఇగో మాత్రం  "........క్షమయా ధరిత్ర"న్న ఆర్యోక్త్యానుసారిణిగా తన ధర్మం తాను నిర్వర్తించింది ఇందు రూపంలో.  చిరునవ్వుతో శుభప్రదంగా.  






(మొదటిసారి చూసినప్పుడు నిజంగా కోపం వచ్చింది విశ్వనాథ్గారి మీద చెత్త సినిమా అని....విశ్రాంతి తీసుకొండిక సార్ అని ఉత్తరం రాద్దామన్నంత కోపం....కాని ఇవాళ ఈ టపా కోసం చూసినప్పుడు నిజంగా చాలా ఎంజాయ్ చేసాను పిక్చర్ను.)




Photo from http://1.bp.blogspot.com/_7ZPb9dcb3aI/TE5IGIucgyI/AAAAAAAAMw8/qJhsgyvjxow/s1600/subhapradam_157.jpg

"తెలుగు కావ్య పురుషుని గాధ"-ఈమాట పాత ప్రచురణ.

హాటకగర్భుడెవరనుచు
మీటనొకటిని సుతరంబు మీటినటన్నీ
మాటను కావ్యపురుష గా
దంటు పసందు గను పండితంబిదిగిదిగో  

"తెలుగు కావ్య పురుషుడి గాధ" కర్తలు వేలూరు వెంకటేశ్వర రావు గార్కి, ఈమాట వారికి నెనర్లు.

Friday, 24 December 2010

కాశీనాధుని స్త్రీ -2 మాధవి.

"ఒక కల్పిత పాత్రను సజీవమూర్తిగా స్వీకరించి విశ్లేషించ ప్రయత్నించటం ఎంత వరకూ సమంజసం? ఈ ప్రక్రియలో నువ్వు చూస్తున్నది ఒక స్త్రీ మూర్తినా లేక పురుష సూత్రధారి కనుసన్నలలో ప్రాణం పోసుకున్న ఓ స్త్రీ చాయా రూపమా?" అంటూ చొప్ప దంటు ప్రశ్నలు వేస్తున్న ఆత్మారాముడిని రెండు పీకి అవతల పారేశాను. ప్రతి జీవితం గతానుభావానుగుణ గతి ధారిణే అయినపుడు ప్రతి జీవితమూ ఆ అనుభవమనే సూత్రదారుని చేతిలో కీలుబోమ్మే కదా?       అలాటప్పుడు రెంటికీ తేడా ఏమిటో నాకు తెలీలేదు. Also, for the moment, I do not wish to step back, for, that longitudinal view does really hurt with its truthful radiance. I am content with being a myopic puppet on the grand stage, blissfully playing out its part.

ఫిలాసఫీలాపి అసలు విషయానికొస్తే ఇన్నేళ్ళ తరవాత, ఇన్ని కడవల అశ్రుతర్పణం తరవాత ఇవేళ అనిపించింది "ఈ సినిమా ఇంత హిట్ ఎలా అయ్యిందా అబ్బా" అని. సినిమా రివ్యూ కాదురోయ్ అని గురుడు జెల్లకాయ కొడితే కాని గాడిలో పడలేదు ఆలోచనలు.

"మాధవి గురించి  రాయాల్సినంత ఏముంది అని మెదడు మొదట చప్పరించేసిన మాట నిజం. పెళ్ళాడిన వాడు ఆస్తుల కోసం వదిలేస్తే బాధ పడుతూ కూర్చుంది, ప్రేమించిన వాడు దానం చేస్తే మారు మాటాడక వెళ్ళిపోయింది, మనసులో ఇంకొకరిని పెట్టుకుని ఇంకొకరితో ఎలా ఉండగాలిగిందో, ఎలా సంసారం చేసిందో మహా తల్లి" అన్నవే ఆలోచనలు. నాయిక అంటే శృంగార నాయిక లక్షణాలే తప్పితే ఇంకే లక్షణాలూ చెప్పని సంస్కృతి ఫలాలం కదా మరి.

కొంచం వళ్ళు దగ్గర పెట్టుకుని పరికిస్తే నాకు మాధవిలో మొదట కనిపించింది అమ్మతనం, ఆ తరవాత స్త్రీత్వం.

"అయితే అమ్మ మనసు కనిపెట్టటం మొదలెట్టారన మాట" అంటూ తన వాడిని ప్రస్నిస్తూ "ఇపుడిపుడే ఇతరుల మనసును చదవగలుగుతున్నాను" అని వాడిచేత అనిపించగలిగిన అమ్మతనం. అ ఆ లు దిద్దించే అమ్మతనం. అన్నీ తనకు కావాల్సినవి అనే కోణం నుంచె  చూసే Ego-centric పాపడికి ఇతరులలో కూడా మనసు ఉంది వారికీ ఆశలూ కోర్కెలూ ఉంటాయి అన్న "Theory of Mind" బోధించే అమ్మతనం.

ఈ అమ్మతనం ఒడి పండుతేనే స్త్రీకి అబ్బే గుణమని అనుకోవటం పోరాపాటేనేమో. May be its all in the Venutian air? లేకుంటే తన కొడుకు ఫోటోల్లోటివే అయినా తన కోసం ఒక్కటి అడగటాన్ని లేకితనంగా  అభిసంసిస్తారని బిడియపడిన తల్లికి ఆ "భంగిమా......" ఫోటోల కంటే తన కళ్ళెదుట కొడుకు తాను ఇంతకాలం వ్యవసాయించిన పంటనూర్పుతుంటే తీసిన ఫోటోలు ఎక్కువ ఆనందం కలిగిస్తాయని మాధవికెలా తట్టింది?

"రేపు మా నాన్న ఆబ్ధికం. నువ్వేం పెట్టించనక్కరలా......." అంటూ రెక్కలిచ్చిన సత్తాతో ఎగిరిపోతానంటున్న తన సంతానాన్ని తన అవసరం ఎక్కువ ఉన్న ఇంకో బిడ్డడి కోసం త్యాగం చేయటం, లోకం అభిశంసనకు వెరవకపోవటం ఎన్ని సంసారాల్లో, ఎందరు తల్లుల్లో చూడము మనం?

"నాకూ చప్పట్లు కొట్టించుకోవాలని ఉందే" అంటూ జీవితేచ్చ కోసం మధనపడే తన బిడ్డడు ఆ కరతాళాల మధ్య భారతమాడాలని మాధవి పడ్డ తపన ప్రసవ వేదననే గుర్తు చేసింది నాకయితే.

ధీరలలిత, ధీరశాంతాలు పుణికి పుచ్చుకున్న నాయిక మాధవి. మాధవి లలిత, శాంతాలకు ఉదాహరణలు అవసరం లేదనే అనుకుంటాను. ధీరమంటే "క్లేశాన్ని సహించటం " అట. మాధవికంటే దీశాలెవరు ఈ నాటకంలో? అసలు ఈ విషయంలోనే నాకు స్త్రీ పురుషుడి కంటే ఎప్పుడూ బలవంతురాలే అనిపించేది. సహనం నిజమైన బలిమేనేమో. తానె చేసుకున్నా తనకన్యాయం జరిగిందని ఎలుగెత్తి ఏడిచే బాలూలను ఎంత మందిని చూడం మనం. ఇతరులు తనకన్యాయం చేసినా కిమ్మనక సహించే మాధవిలకు కొడువెం మన దేశంలో? క్లేశాన్ని ఓర్వలేక జీవితాన్ని తాగుడుకు తాకట్టు పెట్టి, అనన్యమైన కళకు తీరని అన్యాయం చేసిన నాయకుడొక వైపు అదే క్లేశాన్ని జీవితంలో రెందోసారనుభవిస్తూ కూడా ఆ జీవితాన్ని కాడి తప్పనివ్వని మాధవొక వైపు. ఇక చెప్పేదేముంది?

ఒకోక్కప్పుడనిపిస్తుంది................ఇలా సహనాన్ని పల్లకీకెత్తి ఊరేగించేది కూడా పురుషాదిపత్యమేనేమో అని.  

"ఆ, ఇలా ప్రేమించిన వాడిని అలా మరిచిపోయి వేరే వాడితో కులకటం అదేమంత బలిమి కాదు" అంటారా?
ఒకసారి ప్రేమించి చూడండి.
ఆ ప్రేమను భాధ్యతకో, అదే ప్రేమ కోసమో బలివ్వండి.....................
అయినా మనకవన్నీ ఎక్కడ అనుభావమవుతాయి లెండి. ప్రేమంటే కోరుకోవటం, కావాలనుకోవటం తప్ప ఇంకే చాయా గురుతుకు రానంతగా మారిపోతున్న సమాజపు మనుషులం మనం. మిగితావన్నీ పిరికితనంగా అభివర్ణించే కౌరవులం.

తన విషయంలో, తన అభిమతం పట్టించుకోకుండా, తన విధిని రాస్తున్న వ్యక్తి జ్ఞాపకాన్నీ, తన ఆశనూ  చిరునవ్వుతోనే జడ నుంచి వేరు చెయ్యటం, అలాటి వ్యక్తి ఆఖరు కోర్కెగా అప్పటికి పరాయి అయిపోయిన వాడి సరస నుంచుని మరీ దర్సనమివ్వటం మాధవిలోని స్త్రీకే చెల్లింది.

నిజంగా ఇలాటి మనుషులు, ఇప్పటి సమాజంలో ఉంటారా అని అనుమానమా?
కాగడా అవసరం లేదు మనసెట్టి వెతకండి.
ఎంతో దూరం పోనక్కరలేదు.
నాది గ్యారంటీ!

ఎక్కడో చినుకులా రాలి, చివరికి మీ సంగమంలో సాగరుని చూసుకునే మీ మాధవి మీకూ కనిపించకపోదు.

Thursday, 23 December 2010

Sanjeevani & RTI act

సెక్షన్ 4 (1)(b)  మీద సంజీవిని యుద్ధభేరి 

మరిన్ని వివరాలకు
http://www.loksattasanjeevani.in/
or contact persons
Mr Sandeep Pattem.......pattem@gmail.com
Mr Abdul Aziz.......abdulazeez1984@gmail.com

Wednesday, 15 December 2010



If you love something very much set it free

If it comes back to you, its yours

If it does not, it never was yours.

Monday, 13 December 2010

इस घूट घूट की कसम

हर इल्जामे जहां क़ुबूल साकी
बारा महीने खिसन ही सही
गिरने की गहराई किसने नापी 
बस, मन में बसे रहे ज़ालिम साथी. 

సినిమా చూడకు చెడిపోతావు.


"అమ్మా నాన్నలకు చాలా సార్లే ఫోన్ చేసానత్తయ్యా... ఫోన్ కట్ చేస్తున్నారు."

"ఎన్నో సార్లు అంటే ఎన్ని సార్లమ్మా? వెయ్యి సార్లు?....కాదా? వంద సార్లు?......కాదా? పది సార్లు?....ఓహో పడి సార్లా....."
"చిన్నప్పుడు మీరు పడి పోతుంటే, అన్నం తినక నోట్లోది ఊసేస్తుంటే ఎన్ని వేల సార్లు మేము మీకు తినిపించుంటామొ తెలుసా అమ్మా"

చూస్తె సినిమాల్లో ఎంత జీవితమో.




picture from http://www.legalmoviesdownloads.com/film-reel.jpg

Friday, 10 December 2010

ఇప్పటికింతే.

""

ఘడియ కోసం ఏడుకొండలు
కామితం కోసం సమర్పణాలూ
శుద్ధం కాని చిదంతరాలూ  
అద్దమయి అడ్డమవుతుంటే
రాలేదని చెప్పవే తల్లీ

మానసమూ,బుద్ధీ, మై
మరిపించే ఆ క్షణాన 
తప్పక హాజరవుతానని
ఆయనకు మాత్రం తెలియకుండేనామ్మా 

అహం కారమో అలక కారణమో కాని  
ఇప్పటికీ వినమ్ర భావ మిళితాంజలి మాత్రమె. 
చిరుగు పాతన అటుకులు మూట 
దాచుక వెనుదిరిగిపోతున్నా......

Tuesday, 7 December 2010

Truth Hurts Dot


నీకు దర్పణాన్నని  మురిసా!

నా సార్థకతకు కారణమైన
నీ విభ ఒక చితి వెలుగని
నిన్నూ, దరి చేరిన వారిని
కాల్చేయటమే దాని నైజమని
తెలిసినా ఇంకా ఏదీ
నాలో ఆ అణువిస్ఫోటనం?

దినకరునని మురిసిపోతున్న
నీకు కూడా తెలియని నీ నైజం
నా ఉనికిని, నా అహాన్ని
వెచ్చగా ప్రశ్నిస్తోంది

చల్లటి శశికరుడినా 
కాల్చే అగ్నిగుండాన్నెందుకు కాదు? 
నీకు నిక్కచ్చి దర్పణాన్నైతే 
నేనూ నీవేగా   


జవాబు కాలమే చెప్పగలిగితే
తోలుబొమ్మలం
మనకింత అహమవసరమా!

So many existentialities!
Are thanks due to you?
Whatever.






Picture with thanks from http://t3.gstatic.com/images?q=tbn:ANd9GcSwUOihRbxCnmzmVALlITJt4QzoNdF_8Tr8fWujoEFYpVQtPw89WQ

Friday, 3 December 2010

అపరిచిత పరిచయం.

రంగులు మారుతున్న చీకటిలో
నా సందూక్ తెరిస్తే  
జాజులూ మధువులూ మసకబార  
క్రొంగొత్తగా నువ్వు 

ఏ అపురూపానికి వరంగా స్థానమిచ్చానో? 
కాని పెట్టిలో భద్రంగా నీ ఉనికి . 

చేతిలోకి తీసుకుందును కదా 
కాలి పొయ్యింది 
మనసు కూడా 
పెనమేదో పొయ్యేదో ?

ఇప్పుడిప్పుడే ఆ ఘడియల్లేవు కాని 
తలంబ్రాలకు దిష్టి చుక్కను చేద్దును  
నలుపైతేనేం ముత్యానివేగా

విలువెరిగిన షరాబులుంటారనే
ఇలా ముసుగు తీస్తున్నా 
మూలుగులే నీ పరిచయమన్నా 
వాటికీ కరతాళాలందాలని    

స్వప్నలిపిలోనున్న 
జాగృదావస్థ
ఓహ్!

Thursday, 2 December 2010

Movie that did not shame me.


నేనేదో టపాలో "సగటు మనిషి ప్రతి వారిలో నాయిక, నాయకులను చూడాలి అలా చోపెట్టే నవలలూ, సినిమాలూ రావాలి" అన్నదానికి ప్రతిఫలమా అన్నట్టుగా అనిపించింది షాపింగ్ మాల్ సినిమా చూసిన తరవాత. Almost missed this movie because of an Idiotic review which said this movie was about glorification of sadness and the review even had the temerity to suggest that we people get kicks out of glorifying the sadness. Wish I remember where I read that review so that I could name and shame the website.

కథ 
నాన్న చిన్నప్పుడు "హేవిటో ఈ మధ్య అన్నీ ...సినిమాలూ, సిరియళ్ళూ అన్నీ .....ప్రేమ గురించే, ఇంకేం లేనట్టూ" అంటే "లవ్ కాక ఇంకేం ఉంది నాన్నాప్రపంచంలో" అన్న నా అప్పటి పిచ్చిమాటలు గుర్తు వచ్చాయి "గొప్పగా ఉంది కాని మళ్ళీ లవ్ స్టోరీనెగా" అని బుద్ది చప్పరించేస్తూ  కథను విశ్లేషించటం మొదలెడితే. మొత్తం టీనేజ్ లవ్ స్టోరీనే. పెద్దగా చెప్పుకోటానికేమి లేదు.

కథనం 
కథ నడిచిన తీరు, దర్సకత్వం చాలా నచ్చాయి నాకు. ఈ మధ్య వస్తున్న టీనేజ్ లవ్ స్టోరీస్ అంటే నాకు చాలా కోపం. వాటికి భిన్నంగా ఉంది అనిపించింది. బాక్డ్రాప్ ఒక షాపింగ్ మాల్ అవటం కథకుడి నేటి సామాజిక దార్శనికతకు నిదర్శనం అనిపించింది.. 
ఏ రచనలైనా ఆ కాలం సామాజికతకు దర్పణాలు అవ్వాలన్నది నా అభిమతం. 

"కొత్త బంగారు లోకం " చూస్తున్నంత సేపు నాకు ఎందుకో అనీజీగా అనిపించేది. ప్రతీ సినిమాలో  ఇలా చిన్న పిల్లలకు ఈ ప్రేమ గొడవలేంటి అన్న చిరాకులో నాయిక నాయకుల ప్రేమను అంత తొందరగా ఆమోదించలేకపోయాను. అక్కడ పిల్లల మధ్య ఉన్నది ఆకర్షనంకురార్పణగా సాగిన ప్రేమే....... ఈ చిత్రం లోనూ అదే. కాని ఇక్కడ ఎందుకో వీరి ప్రేమ నాకు ఆమోదయోగ్యమయ్యింది. సినిమా తారను చూస్తూ మొహావేసభరితుడై నాయకుడు నాయికను పక్కకు తీసుకెళ్ళి ముద్దు పెట్టుకోచూసినా నాకు అభ్యంతరం అనిపించలేదు. ఎందుకా అని తరిచితే నాకు అనిపించింది ఒకటే ఇక్కడ నాయికా నాయికలు "పిల్లలు కాదు" అన్న విషయం. 
 I thought this movie was somewhat in the vain of "Happy Days" where there was maturity in dealing with even attraction.
ఏదో చర్చలో ఒకసారి "ఇంటి పెద్దరికం ఎవరు తీసుకోవాలి" అంటే "భాద్యతలు మోసే వాళ్ళే" అని సమాధానమిచ్చింది. నాకా సమాధానానికి అభ్యంతరాలు కనపడలేదు. ఆ సమాధానాన్వయమే ఇక్కడ నాకు తోచింది వారు పిల్లలు కాదనటానికి.

ఇంటి భాద్యత నిర్వర్తించటానికి "అవును వాడు పైన చెయ్యి వేసి నొక్కితే ఊరికే నిలబడిపోయాను. ఏం చెయ్యమంటావు కిరోసిన్ పోసుకుని కాల్చుకోమంటావా?" అంటూ సగటుతనంలోనే తన పెద్దరికం చూపిన నాయిక నా మటుకు నాకు స్త్రీనే, అమ్మాయి కాదు. "వాడిని అర్థం చేసుకోలేక చచ్చిపోయిన అదీ, ఈనాడు నన్ను అనుమానించిన నువ్వూ ఇద్దరూ వేస్టే....." అంటూ నాయికను ఈసడింపుగా కడిగేసిన నాయకుడు నాకయితే పురుషుడే కాని అబ్బాయి కాదు. పెద్దమనిషయ్య్యేది చాప మీద ఎక్కినప్పుడు కాదు, ఏ వయసులో అయినా సరే "నా కంటే నావారు ఎక్కువ కదా, వారి గూర్చి కూడా ఆలోచించాలి కదా" అనుకుంటూ తమను తాము ఒక్క క్షణం అయినా సరే, నియంత్రించుకోగల  అలవాటు వచ్చిన క్షణం ఆ మనిషికి పెద్దతనం వచ్చినట్టే.

మీరే చెప్పండి...... సినీ నటిని .చూసి మోహపడుతున్నాను అని తెలుస్కుని, అది తప్పని, తలచి తన దాన్ని పక్క గదికి రప్పించుకుని "తన మొహం తన స్త్రీ చెంతనే" అంటూ తెలిపే ఆ సన్నివేశం పెళ్ళికాని ఆ యువ నాయకుని ఔన్నత్యాన్ని తెలిపిందనే అనిపించింది కాని కామకుడు అని కాదు. May be I am too optimistic in my interpretation but I prefer to think that this interpretation sits well with overall characterisation of the hero than the sick interpretation that he just was trying to get physical with whom he can, stimulated by the heroine. "రాణి చెంతనుండ చెలికత్తెలేలనే........" అంటూ ఒక్క వాక్యంలో సగటుతనానికి మొహావేశపు యోగంలో కవిత్వం అబ్బటం తెగ నచ్చేసింది నాకు. 

 అంతే కాక తనవాడు తనను ప్రేమించటం కంటిన్యూ  చెయ్యటం వాడికి నష్టం తెస్తుందేమో అని ఆలోచించటం చేసాడని తెలిసిన ఆ చిన్నది వాడిని వేరేస్తేమబాధ పడినవాడు వార్డెన్ నుండి తనను దాచిన తనను కడిగేస్తూ "ఇప్పుడిలా నన్నేదుకు దాచావో అప్పుడు నేనూ అందుకే ఆలోచించాను. రెండు కుటుంబాలు పస్తులు పడుకున్తాఎమో అని ఆలోచించటం తప్పా? ఊ మహారాణి, మిస్ ఇండియా దిగి వచ్చిందండీ దీని గురించి ప్రేమలో ఏమన్నా కష్టాలోస్తాయేమో అని ఆలోచిస్తేనే పిరికివాడు అనేస్తుంది...." అంటూ అనటంలో ఉన్న పరిణితి ఈనాడు ఎంతమంది పెద్దవాళ్ళలో కనపడుతుంది? 

"ప్రేమను, మొహాన్నీ, ఆకర్షణ బహిరితివృత్తాలయినా అంతర్లీనంగా భాద్యత మోసే బోయీ శ్రమైక జీవన సౌందర్యాన్ని చూపెట్టే మంచి చిత్రిక ఈ చిత్రం" అనిపించింది. In the whole film I never had the feeling that this was about glorification of poeverty, of unhappyness, of injustices. It felt like a beautiful narration of the wonderful tapestry of life, in all its hual glory, including the blacks and greys, barring no tones.

Subtelity
ఇది నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఈ చిత్రంలో. అక్కినేని వారు ఎప్పుడూ మొట్టుకునేట్టు సినిమా ఒక వ్యాపారం అన్నది మరవకుండా ఒక కళాఖండికగా తన సామాజిక స్ప్రుహైక భాద్యతను వీడకుండా చిత్రం చేసిన tightrope walking was very subtle, I felt. There were no harsh lectures about morality but no reel or turn of events was left un-utilised for slapping the current society for its hypocrisies.  


హయగ్రీవ మంత్రాన్ని పటించే కుటుంబం రజస్వల అయిన తన చెల్లెలిని ఇంటివెనకాల కుక్క గది పక్కన అలాటి గదిలోనే మూలన ఉంచటం చూసి నాయిక, ఆ కుటుంబం పెద్దమనిషి పండగకు ఇవ్వ చూసిన యాభైని ఏ ఎమోషన్ లేకుండా "వద్దమ్మా" అంటూ తిరస్కరించటం ఎంత మెత్తని చెప్పో అనుభవించిన వారికి తెలుస్తుంది.

ఒక ఫాన్ హీరోయిన్ను "అక్క" అంటూ (నాయకుని స్నేహితుని చేత) సంబోదింప చేయటం అంత సటిలిటీ నాకీ మధ్య కాలంలో ఇంకోటి కనపడలేదు. పగలంతా వళ్ళు హూనం చేసుకునే ఒక పల్లెటూరు "బైతు" చేత ఆ "అక్క" అన్న సంబోధనలో ఎలాటి వెటకారం చూపెట్టకుండా అమాయకత్వం చూపెట్టటంలో దర్శకుడు, రచయిత ఎంతో చెప్పారనిపిస్తుంది. ఆ "ఎంతో" అన్నది కళను కళగా అభిమానించండి అన్న సందేశమో లేక ప్రతి హీరోయిన్నూ సొల్లు కార్చుకుంటూ నేటి సమాజంపై ద్వన్యుక్తంగా వేసిన వ్యంగ్య బానమో లేక ఇలా కూడా ఇంకా మనుషులున్నారు ఇదే ఒప్పు అని చూపుతూ తన ఆప్టిమిసాన్ని చూపటమో  లేక "కహా గయే ఐసే లోగ్" అంటున్న మౌనాక్రోశమో ........ ఎంతో ఉంది అని మాత్రం అనిపించింది,
  
తారాగణం.
నాయికా నాయికల పెర్లేంటో చూడలేదు, గుర్తుంచుకోవాలి అని అనిపించలేదు కాని చాలా బాగా చేసారు అనిపించింది. Weather it was restrained action or ameturism I don't know but it was very natural. NO dramatics or histrionics anywhere.

విలువలు 
ఏ మాత్రం సామాజిక భాద్యతను మరిచిపోకుండా వ్యాపారాన్ని చేసుకున్న ఈ చిత్రమంటే నాకు ఎనలేని గౌరవమేర్పడింది. చివరిగా ప్రేక్షకులను, వారి అభిరుచులను గౌరవిన్చిటంలో పెద్దపీట వేసింది. ఎలా అంటారా? At the end of the movie,  I did not end up shamed, disrobed to my basicest animal self by a shameless banquet of female flesh. చూపిన ఒక ఫాంటసీ పాట కూడా చాలా సింపుల్గా తీసారు అనిపించింది. And most importantly, artfully, seamlessly weaved into the context.

DND

రహదారెంట
అప్రమేయంగా
ఎదురుబొదురుగా

పలుకరింపుకు సమాధానం
ఓహ్!

రోజూ.......

Saturday, 13 November 2010

హావః.

ఆశ
ఆవేశం
ఆలోచన
స్ఫందన
జ్ఞాపకం.......
ఇంకేమ్మిగిలా?

Monday, 8 November 2010

ఎటనుంచెటకో!

నిశిలో
హైవే మధ్యన
ఎదురు కొడుతూ కుండపోత
వెనకాల డాభా నిండా జనం 
ఎవరు ఎవరిని త్యజించారో?

తల విదిల్చి వచ్చేస్తే
మొదటి సీట్లో స్టీల్ టిఫిన్ బాక్స్
నిండా ఎర్రటి మెతుకులు
పెట్టినమ్మ నుదుటి కుంకంలా.



Wednesday, 3 November 2010

Faith.

My friend says to believe in something without proof (whatever the reason for the belief) is to have faith.

He says, if you have a proof for something then knowing that is NOT belief/faith, it is knowledge of a fact.

And I believe...nay...I feel he is true.


Thursday, 28 October 2010

ముసలాడినయిపోతున్నా!!!

ముఖం చాటేసిన స్త్రీత్వాన్ని
కొప్పు చేస్తున్న వేళ్ళల్లో చూద్దామంటే
నిర్లక్ష్యంగా రింగులోడుతూ
బాహాటంగా నలుగుతూ
సిగరెట్టుగాడి ముఖం.....వెలిగిపోతూ!

వ్యసనానికీ లింగభేదమా అనుకున్నా
ముల్లుగాటు తప్పలేదు!!

Sunday, 24 October 2010

Thanks to poddu

"పోతన కవితా పాటవము"

1954 నాటి ఈ తాపీ ధర్మా రావు గారి చక్కని వ్యాసాన్ని అందించిన పొద్దు వారికి "చాలా" బిలేటెడ్ గా నెనర్లు.

Saturday, 9 October 2010

కొంత ఆడతనముంటే?


అవున్నేనే.

"నాకీ పేదరికం మీద అసహ్యమేస్తోంది. నాకెంత కసిగా ఉందంటే జీవితంమీద అంత కసిగా ఉంది. సాధిస్తాను. నేను కొనాలనుకునే వస్తువుల మీద ప్రైస్ టాగ్ చూడాల్సిన అవసరం రాని స్థితికి వచ్చేంత వరకు విశ్రమించను." అని డైరీలో రాసుకున్నది నేనే.

సాధించాను.
నేనీ రోజు ఆక్సిస్ బాంక్లో బ్రాంచ్ మానేజర్ని. ఇంటికి ఆఫీస్ కారు వస్తుంది పొద్దున్న సాయంత్రం. ఇంకో రెండేళ్లలో నా స్వంత పనులకు కూడా వాడుకునే షాఫర్ డ్రివన్ కార్ కూడా వస్తుంది.

కానీ ఏమిటో వెలితీ.
కొనాలనుకున్న దాని ప్రైస్ టాగ్ చూడటం అనే అలవాటు మాత్రం పోలేదు. అవసరం ఉన్నా లేకున్నా.

ఏదో అసంతృప్తి
నాన్న ఆ రోజు నా డైరీలో చదివి అలా నా కుటుంబం మొత్తానికి నా కోరికల, ఆవేశాల గురించి చెప్పినప్పటినుంచీ మరీ పట్టుదల ఎక్కువై నేను అనుకున్నది సాధించటానికి ఎక్కువ కాలం పట్టలేదు.
ఈ విషయం గుర్తు పెట్టుకుని నా పుట్టినింటి వారు ప్రవర్తిస్తున్నట్టయితే నాకెప్పుడూ అనిపించలేదు.
కాని లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోలా ప్రవర్తించే వారున్టారని నాకు తెలుసుగా.

పైగా వీడొకడు.
అన్నయకస్సలు లోకం తీరు తెలీదు.
లేకుంటే ప్రమోషన్ వచ్చిందన్న సంతోషంలో ఉన్న వారిని పట్టుకుని, పైగా ఇంకో రెండు మూడేళ్ళలో వీపీ లెవల్కు వెళ్ళిపోతాను అని సంతోషపడుతున్న మనిషిని పట్టుకుని "కెరీర్ గ్రాఫ్లో ప్లాట్యూ ఏదన్నా ఎప్పుడన్నా పెట్టుకునే ఆలోచన ఉందా" అని ఎవడన్నా అడుగుతాడా.
మనసు చివుక్కుమన్న మాట నిజం.

                                                   XXXXXXXXXXXXXXXXXXXXXX

నిజమే.
తన మనసు చివుక్కుమనే ఉంటుంది.

కాని తప్పదు.
దగ్గరివారు అనుకున్నప్పుడు వారు తప్పటడుగులు వేస్తున్నారు అనుకుంటే కనీసం అది తప్పటడుగు అని చెప్పే దగ్గరితనం కూడా లేని నేటి బీరకాయ బంధం నేను సహించను.
ప్రేయసైనా, చెల్లయినా.

అమ్మ చెప్పినప్పుడు అర్థం కాలేదు.
తిరిగోచ్చేసే ఒక రోజు ముందు అమ్మ ఫోన్లో "వాడిని చితకబాది తీసుకుపోయింది.అమ్మా ఇవాళ రాత్రి అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో ఉండిపోతానే అని కొడుకంటే అంటే సరేరా అని మధ్యాహ్నం పర్మిషన్ ఇచ్చిన తను రాత్రి తొమ్మిదికి ఇంటికి వచ్చి వాడు ఇంటికి రానంటే చావబాది తీసుకుపోయింది. ఇంతే idee అనకముందే నా ఆఫీస్ వారి ముందు నా పరువు తీస్తావా అంటుంది. బయట ఆఫీస్ కార్ వాడు వెయిట్ చేస్తున్నాడని" అంటూ ఏడ్చేసిన అమ్మను "పోన్లేవే దానికి ఆఫేస్లో ఏం బాధలున్నాయో ఎవరికి తెలుసు. పైగా తెలుసుగా దానికి వాడంటే పంచ ప్రాణాలు ఒక్కడే కొడుకుగా మరి. కాని ఆఫీస్లో పెరుగుతున్న జీతంతో బాటు పెరుగుతున్న భాద్యతలు, దాంతో ఇంటికని తరుగుతున్న సమయం దానిలో రేపే గిల్టీ ఫీలింగ్ శారీరిక శ్రమతో కలిసి ఇలా ఫ్రస్టేశన్గా  బయటపడుతుంది " అంటూ నా తెలివితేటలూ చూపెట్టానే కాని అమ్మను అర్థం చేసుకోలేకపోయాను.

అనుభవమైతే కాని అర్థం చేసుకోలేకపోవటం అన్నది ఇంకెన్నేళ్ళు పడుతుందో పోగొట్టుకోటానికి.
ఇంటికి వచ్చిన మూడో రోజునుంచే వాడి దసరా సెలవులు.

"ఎప్పుడు చూసినా అలా సోఫా మీద అతుక్కుపోతాడు టీవీ చూస్తూ" అంటూ అమ్మ విసుక్కుంటున్న మేనల్లుడిని "ఉద్దరిద్దామని" వాడితో చర్చేట్టాను.

"ఎరా కన్నా నీకెవరూ ఫ్రెండ్స్ లేరా?"
"ఎందుకు లేరూ శ్రీనివాస్ గాడింటికి రోజూ వెళ్తున్నానుగా" బెన్ టెన్ చూస్తూ సమాధానం.
"ఏం చేస్తావు వాళ్ళింట్లో రోజూ?"
"వీడియో గేమ్స్ ఆడుకున్టాము" నా వైపు చూస్తూ ఈసారి.
"రోజూ వాడింటికి వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు కదరా"
"నువ్వేమో ఇలా అంటావు అమ్మేమో ఆఫీస్ వెళుతూ శ్రీను గాడింటికి వెళ్లి ఆడుకో అంటుంది" రిపార్టీ
"వాళ్ళింట్లో వీడియో గేమ్స్, మనింట్లో టీవీ, కంప్యూటర్ గేమ్స్ ....ఇవేనా ఎప్పుడూ? బయట ఆడుకోవచ్చుగా ఏదయినా!"
"ఎవరితో ఆడుకునేదీ......."
"నీకిన్కెవరూ ఫ్రెండ్స్ లేరా?"
"ఎందుకు లేరూ? వెనకాల వీధిలో ఉన్నారు ఫ్రెండ్స్. ఎంచక్కా బయట ఆడుకుంటారు క్రికెట్. కాని హుకుం వేసింది మహా తల్లి "అమ్మా వాడిని అక్కడకు పంపకే వెళ్ళే దారిలో కుక్కలుంటాయి" అనింది నీ చెల్లెలు." అమ్మ వంటింట్లోంచి ఫిర్యాదు.

ఈ వారమయితే నేను తీసుకెళ్ళి దింపగలను. మరా తరవాత?

ఎంత ఆలోచించినా, చర్చించినా సమాధానం దొరకలా.

పరిష్కారం అమ్మమ్మా తాతయ్యా, మామయ్యల దగ్గర ఎలా దొరుకుతుంది?

మారుతున్న కాలంతో వస్తున్న కెరీర్ వుమెన్ తెచ్చే జీతం తీసుకునే ఔదార్యం వచ్చినా వాళ్ళతో కుటుంబంలోని ఇంటి పనులను పంచుకోగలిగినంత మార్పు ఇంకా రాని భర్తలు, ఎంత ధనమిస్తుందో అంతకంత సమయాన్ని స్థన్యం చేసుకు   పీల్చేసే ఉద్యోగాలు మొదటి ఇద్దరు సంతానమయితే అసలయిన ఒక్క నలుసేగా ఇక మిగిలేది "ఇద్దరు ముద్దు, ముగ్గురు హద్దు అటుపై వద్దు" అన్న దాన్ని తూ చా తప్పనివ్వని నేటి మహిళలకు. ఉద్యోగం, సంసారం రెంటినీ సాధిస్తున్న నవ్య సవ్యసాచులకు.

                                              XXXXXXXXXXXXXXXXXXXXXXX

ఏడుపొస్తోంది.

పోయినసారి మామయ్యా వచ్చినప్పుడు అమ్మ "మామయ్యను ఇంకోసారి గిఫ్త్స్ అడగకు నాన్నా. ఇస్తే తీసుకో కానీ ప్రతీసారి అడగకు సరేనా" అని చెప్పింది.
అమ్మ చెప్పింది కదా అని మామయ్యా అక్కడ నుంచి వస్తుంటే "నాకేం వద్దు మామయ్యా చాక్లెట్ కూడా" అన్నాను
అమ్మ చెప్పినట్లే చేసాను కదా.
కాని మామయ్యకేలా తెలిసిందో అమ్మ చెప్పినట్లు.
అమ్మమ్మతో "చూడవే మొన్న నేను వాడికేమీ తేలేదు వాడు అడిగాడు అని బాధపడుతూ అడిగితె అది వీడికి చెప్పినట్టుంది అడగొద్దని" అనేసాడు.
పోన్లే అమ్మమ్మ మంచిది "ఏం చెప్పాలో చెప్పద్దో వాడికెలా తెలుస్తుంది. ఇంకా "పెద్దవలేదు" కదా " అని సపోర్ట్ చేసింది.

ఈసారి చూడు
పుటుక్కుమని "అమ్మ శ్రీనీ గాడితో ఆడుకోమంటుంది" అనేసాను నోరుజారి.
దానికి మామయ్యా బాధపడుతూ నాకెలా టైం పాస్ అవ్వాలా అంటూ ప్లాన్స్ చేస్తున్నాడు.
ఈ సంగతి అమ్మకు తెలిసిందో ఇంకేమన్నా ఉందా?

అసలే మామయ్యా అమ్మమ్మను తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని బాధపడుతుంటే అమ్మేమో నిన్న నాన్నతో "అమ్మ వాళ్ళు వెళిపోతే వీడిని బోర్డింగ్ స్కూళ్ళలో చేర్పిద్దామా" అనటం విన్నాను. ఇప్పుడు మామయ్య గనక వెళ్లి అమ్మతో మీ వాడికి బోర్ కొడుతోంది ఏం చేద్దాం అన్నాడనుకో........

ఏడుపొస్తోంది.















Is it worth?

Are the increased spending power, growth rates, economic power, consumer and credit economies, feminisms, individualism etc etc etc which are thirsting for and fueling the female employability worth the happyness of seeing your kids grow, playign with them and shaping their futures?


Dedicated to dear friend Sam
The first man I know to give up his lucrative locum work to go part time so that "I can be with my kids"
The first husband I know who does not mind saying "Yes I dont mind being a house-man and spending time with kids. Let her get a job worth the minimum needed to run the house and I will give up my job."


PART OF THE SOLUTION LIES WITH  THOUSANDS OF SAMS COMING OF AGE.


Pic from here, with thanks.

Friday, 1 October 2010

Non-Beleivers must be killed.

Was feeling alittle bit queasy about writing this in such a communally tense time.

But If we do not rise the discussions ABOUT ISSUES WHICH MATTER, when given chance by people within the system themselves (Thank you Justice khan) in such a peacefull atmosphere as this, then I do not know if we have any hope left for humans. I refuse to be bogged down by such pessimism and hence here I go.................



Had a recent discussion with two of my muslim colleagues here in UK. One belongs to Ahmadiya sect and suffers from the paradox of having to prove to his brethren muslims that hsi sect IS a muslim sect as well.

When asked what was the reason why the koran is supposed to say "Non beleivers must be killed", the answer was a rhetorical "It is taken out of context". (Remembered Tetageeti Murali garu's blog postings some year or two ago and the argument I had with him).

When pressed further the explanationw as that it was in only self defense that this is talked about. Ok a palatable flavour to it, though could not get my head around "Non beleiver" part of this as why you should point out only non believers as the enemy or is it that only the non beleivers are worth of death punishment? Who knows...did not want to ruffle feathers too much and so asked something else.

When asked how come every religion is changing but Koran is not changing or evolving with time, the answer was "Why change something that's Perfect in everything." When this come from supposedly perfect rational and intelligently superior beings like doctors, I start to feel again that there may be some grain of truth in the saying that Education does not add to the samskara or in this case, rational thinking.

When asked how come that any man made system is perfect, the answer was that Islam recognises every religion and its messiahs in this world like Budda, jesus etc. Apparently, all the religions are part of one evolutionary line and with each step, there was further enlightenement or refinement of the religion i.e chirsitianity was more refined that Jewism, Jewism was more refined than Buddism, Buddsim was more refined than Hinduism etc so the oldest religion is the basicest of the religous models, whatever that might have been. Also, the beleif is that Islam was the final outcome of this religious evolution, that Prophet Mohammed was the last messaiah and hence his word and Islam are "Perfect" and hence "why change the perfect system". As proof I was given so many examples of how women are protected in the koran tenets, that islam was the first religion to give voting rights to woman etc.

Please do not doubt yourself if my retelling of the conversation smacks of incredulity, it is deliberate. That is how I felt when I was hearing this male and female highly educated muslim doctor colleagues of mine talk about religion.

In the middle of this conversation was a new statement that rankled me even further "We beleive there is only one god........." fair enough I was thinking to myself, but alas too soon apparently, ".......and  we beleive that there is only one god for you, me and everybody else".

Could not help but ask this colleagues of mine "how can you beleive that FOR ALL, INCLUDING ME there is only one god and that is your god?".

Pat came the answer "That is our beleif, you may call him ram, we may call him allah but the God is only one." Umm.... this seems to be a little bit better I thought, "oh so you feel that I may call your God by the name Ram?". Came the reply "you may but there is only one god".

"So, you dont aggree with Polytheism" I wanted to ask but alas my mandatory half an hour break without pay was long gone and my stupid consceince was saying that I was wasting the hosptial money on things that did not matter to them. So came away with questions unanswered like

"How can anyone beleive that a man made system is perfect, after almost two thousand years of life moving on?"

"How can one Justify a system without trying to change it, if it gives chance for misinterpretation by both within the system (Jihadists) and outside it (Non beleivers)? let it be the Islam with its teachings of Kill the Non Beleivers (Taken entirely out of context) or Hindusim which says some people are born out of foot and some are born out of Heads. How can we be so irrational as human beings that we do not think  when it comes to faith?"

"If you do not change with times but think being stuck in a time capsule is the Perfect system then why blame others when you get profiled and shunned by others?"

Thanks to Justice Khan for inspiring me to put my thoughts out in writing when he writes in his epilogue of the short 285 page order on the Ayodhya issue: “Muslims must also ponder that at present the entire world wants to know the exact teachings of Islam in respect of relationship of Muslims with others.”

Hats off sir!

Monday, 27 September 2010

దోపిదీదొంగకు ఊరూరా విగ్రహాలా?


అక్కడ నివాళులు ఇస్తున్నది రాజకీయ నాయకునికి కాదు ఒక మనిషికి అని తెలిసినా, అమ్మలక్కలను తిట్టుకున్నా రాజకీయ నాయకులు మరణం తరవాత పరస్పరం పొగుడుకునే అలవాటు హిపోక్రేసీగా అనిపించేది నాకు. 

బాబు వైఎస్సార్ గురించి ఇలా అడగటం నాకు మాత్రం నచ్చింది.  

రేప్పొద్దున బాబు గురించి చిరంజీవి, చిరంజీవి గురించి జగన్, జగన్ గురించి ఇంకోడు ఇలా ప్రతి ఒక్కరు అడుగుతే వచ్చే పైశాచిక ఆనందం కామన్ మాన్ నిస్సహాయతకు నిదర్శనమే.

Sunday, 26 September 2010

आधी जहां की ये परछाई



पूरी जिन्दगी बन जो छाई
आधी जहां की ये परछाई 
हम में थोड़ी भी खुदाई  होती 
जिन्दगी से तडीपार होती साकी.

Wednesday, 22 September 2010

Strikes a chord-1

"ముక్కవే ముక్కు. మొగుడి చేత...తెలుసు కాని ముక్కడం రాదా. ముక్కవే ముక్కు"


పక్కన మగాళ్ళున్నారన్న ధ్యాస కూడా లేకుండా బూతులు తిడుతున్నదీ స్త్రీనే. ఆ మంత్రపుష్ప ఘోషలో చిన్న పరదా చాటు కూడా లేకుండా చెంప మీద దెబ్బలేస్తూ కాన్పు చేస్తున్న ఆయమ్మలను ఏమీ అనలేని అభాగ్యురాలూ స్త్రీనే. ఇలాటి వారు వేలమంది నా చదువుకునే రోజుల్లో. ఇప్పటి సంగతి నాకెరుక లేదు.పోనీ అంటున్న స్త్రీ అధికురాలా అంటే రెండో చేత్తో సంపాదన లేకపోతె స్ట్రెచర్ మీదున్న అభాగ్యురాలి సోదరే.

గాంధీ ఆసుపత్రిలో నేను ప్రసూతి విభాగంలో పనిచేస్తున్న రోజుల ఈ సంఘటన ఎప్పుడూ మరువలేను. 
అందుకేనేమో ఇది చదువుతుంటే మనసు అంజలి ఘటించమనింది.

(old blog Excerpt from http://www.lifespring.in/wordpress/index.php/category/mother%E2%80%99s-day-at-lifespring-hospital/ )


LifeSpring’s maternity hospital outside of Hyderbad, India, is full of surprises. While the building is simple, and the maternal services they offer are low cost, the facility is immaculate and the quality of care is world-class. Expectant mothers dot the waiting room, along with their mothers or mothers-in-law, who do most of the talking. New babies gurgle, smile, cry and sleep. The energy in the halls is palpable.


I first visited LifeSpring on Mother’s Day, where, as part of a free vaccination offering, the hospital sat new mothers and their families for photographs. Later that week, I visited with LifeSpring manager Anant Kumar and Acumen Fund Fellow Tricia Morente.

LifeSpring addresses a powerful and daunting problem. Fewer than half of Indian women are cared for by a skilled attendant during childbirth, and the chances, over a lifetime, of an Indian woman dying due to complications in pregnancy and childbirth are 1 in 70.

Mr. Ayyapan, the Chairman and Managing Director of Hindustan Latex Limited – a large Indian public sector company – and his team created LifeSpring to address this problem. Acumen Fund then joined in as a 50/50 joint venture partner to help take the concept to scale.

Lifespring’s maternity care hospitals offer a low-cost alternative to public clinics, which are free but often low quality. At LifeSpring, expectant mothers pay 1500 rupees (about US$35) to deliver a baby. This price point seems to make sense, and Mr. Kumar told us that the mothers typically decide based on quality of service, and the fathers based on price. The opinion that prevails will often depend on the education level of the mother.

Already, LifeSpring’s occupancy ratio has surpassed its targets, with more than 1500 customers coming in per month, and there are plans to build 5 more small, 30-bed hospitals before the end of this year

At Acumen Fund, we talk a lot about looking for “breakthrough innovations.” What does this mean? The iPhone is a breakthrough innovation – fancy, high-tech, and paradigm-breaking. But what about a small, simple maternity hospital on the outskirts of Hyderabad.
 
Innovations – regardless of sector or target market – begin with an insight. In LifeSpring’s case, the insight was that the free care offered by India’s public hospitals was not good enough. Ayyapan and Anant’s innovation was to create a hospital with world-class care (LifeSpring is ISO 9001 certified) at a price that poor people can afford. Since the economics are working well, the innovation is poised to scale: one hospital today, 5 planned by the end of this year, and hopefully 50 or more in the years to come.

But the surprises run deeper than this first insight. For instance, Tricia Morente (an Acumen Fund Fellow spending this year working with LifeSpring) had explained to me that LifeSpring calls expectant mothers “customers” and not “patients.” In Tricia’s words, this is because “pregnancy is not an illness.” I smiled the first time I heard this, thinking back to the medicalized pregnancies that have become the norm in the United States (I’m the parent of two children, ages 1 and 4).
I realize now that I didn’t fully understand the power of treating “customers” until I spoke to Anant Kumar. “The first time doctors come into our hospital,” Anant said, “we train them on talking about ‘customers,’ and they maybe get it right 1 out of 10 times. After some time with us, the number jumps up to 6 out of 10 times, and we want it to keep improving. It really means a lot for a doctor, who is educated and from at least a middle-class background, to treat poor people with this kind of respect.”

Respect. We talk every day at Acumen Fund about how treating poor people as customers forces an organization to treat them with respect and dignity, and to listen to their needs. To be reminded of this lesson by the head of one of the enterprises we invest in was humbling. Kumar said that he sometimes thinks it would make more sense to recruit nurses from the hospitality industry (hotels and the like), because it may be easier to teach nursing skills than it is to teach good service! And while he was saying this, I couldn’t help thinking of the hospitals I’ve been to in the United States, and how scarce a commodity dignity is once you put on a hospital gown.

Putting dignity at the center of high-quality, low-cost maternal care in a 30-bed hospital outside of Hyderabad? Now that’s a breakthrough innovation.


 
వీళ్ళు చెపుతున్న దాంట్లో ఒక్క శాతం వాళ్ళు చెయ్యగలుగుతున్నా
జయహో, నిజంగానే జయహో!

Friday, 17 September 2010

కాశీనాధుని స్త్రీ-1 "సిరివెన్నెలల జ్యోతిర్మయి"

ఓ చిన్న వ్యాఖ్యతో నన్ను కవ్వించి మూడేళ్ళుగా నా హృదినలంకరించిన కొత్తపాళి గారికి కృతఙ్ఞతలు. శ్రీచరణ మందార మధుపమునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలు గ్రోలే ఈ ప్రయత్నానినికి కారణభూతమైన కళాతపస్వికి నమోవాక్కులు. కాశీనాధుని స్త్రీని దర్శించటానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం కొత్తపాళి గారీ వ్యాఖ్యతో మొదలైనా అంకురార్పణ మాత్రం నాకు స్త్రీ అంటే ఉండే విపరీతమైన అభిమానమే. నా పుట్టుకకూ, పెరుగుదలకూ, వ్యక్తిత్వ పరిణామానికీ కారణమైన ఆ స్త్రీత్వానికి పాదాభివందనాలు.

నాకు మొదటినుంచీ కాశీనాధునివారి చిత్రాలలొని కథానాయికలంటే చచ్చేంత ఇష్టం. కానీ నా సమీక్షలలో కథానాయిక ఒక్కతే కాదు స్త్రీ. ప్రతీ చిత్రంలోనూ ప్రతి స్త్రీ పాత్రలో నాకు విస్ఫష్టంగానో నివురుకప్పుకొనో పడతి పొంకాలేవో కనిపిస్తాయి. ఆ కనీ కనిపించక మురిపించే గుణగణాల వేడుకే ఈ ప్రయత్నం. ముందే చెప్పెస్తున్నా ఆయన చిత్రాల హార్డ్కోర్ ఫాన్ని. గిరగిరా తిరుగుతూ ప్రదక్షిణాలనుకుంటూ మురిసిపోయే బాలతనమే కాని రెండుపక్కలా చూడగల నేర్పునాశిస్తే మీకు ఆశాభంగమే మరి.

చెలియ నిలిచేను స్మృతిగగనాన జాబిల్లియై, చెలిమి మిగిలేను బ్రతుకు వెలిగించు సిరివెన్నెలై అంటూ ఆయన చేత కితాబందించుకున్న జ్యోతిని పరికించి చూసే సాహసం చేస్తున్నా తొలి ప్రయత్నంగా. శృంగారపరమైన జీవితం కాబట్టి అగ్రతాంబూలం తనకే.

భూపాళ రాగం ప్రసవింప చేయటానికెన్ని హొయలు పోయిందీ సాని? ఆదిత్యాకృతి ప్రకటనంలో ప్రకృతినే తారుమారు చేసిన నేర్పరి కదా ఈ ఇందువదన? మేఘమాల తన చీరకొంగెనని చెపుతూ ఎంతగా వెలిగిపొయిందనీ "ఆదిత్య వర్ణాం తపసా జ్వలంతీం....." అన్నది గుర్తు చేస్తూ. సప్తాస్వుని భరతమంతా తన వేణీ విలాస సమానమేనని ఎంత హొయలు పోయిందీ? పాపం కుఱ్ఱాడికి మతిపోగొట్టించిన హస్త ముద్రికలు పుట్టించేది వేడి కాక ఇంకేమిటి అని ఎంత పొగరు?

ఈ ఒక్క ఘటనలో తన విశ్వరూపం చూసిన యశోదమ్మగా హరి మురిసిపోవటంలో ఇక వింతేముంది? సౌందర్యం, నిర్భీతి, నిర్మలత్వం, చొరవ చతుర్భుజాలయితె ఆకసమెత్తుగా కనిపించింది తప్పక భావుకతే అయి ఉంటుంది. తనకు తెలీని నవ్య జగత్తుని సాక్షాత్కరిస్తున్న ప్రకృతి స్త్రీని పరికించి పులకించని పురుషుడెవ్వడు? పైగా ఈ సాక్షాత్కారమంతా స్పర్శానుగతమైతే, ప్రతి అంగం ఒక వర్ణమై మెరవదా ఎంత కారుమబ్బులోనైనా. అదే జరిగింది కూడా.

కుఱ్ఱకారు కోరికలూ గుఱ్ఱాల వంటివీ కళ్ళాలు వదిలితే కదం తప్పుతాయి అన్నది వినలేదనుకుంటా జ్యోతి. చందమామకూ మచ్చలున్నాయిగా. రసికత ఎప్పుడూ బంగారు లేడి లాంటిదే చూసి ఆనందించాలే కాని స్వంతం చేసుకోవాలని అనుకోకూడదు. ఆ వ్యామొహంలో లక్ష్మణరేఖ దాటామో మనలోని రావణుడే చాలడా అగ్నిపరీక్ష వరకూ లాక్కెళ్ళటానికి? ఈ సీతమ్మా పరాయిదేశంలో బంగారు లేడికి ఆశపడింది, గీతను దాటింది. తనకు తాను ఎంత తేలిపోయిందో కృష్ణ తులాబారంలో కాని తెలియలేదీ సత్యకు.

కానీ హరి ఆత్మీయతను తూచగల తులసాకు తాను కాదని తెలుసుకోవటంలోనూ గొప్పతనంలేదూ? త్యాగమంటే హక్కులూ, భాధ్యతలూ వదిలించుకోవటమే కాదు అసలు లంకెను మొత్తం చేదించుకుని పోవాలి అన్న సంగతి తెలియటం ఒక ఎత్తయితే ఆ పని కిమ్మనకుండా చేసి చూపించిన సామర్థ్యం జ్యోతి స్వంతం. ఇక్కడ కూడా అదే ఆలోచనా గరిమ. తను చేస్తున్న పని ఒప్పే అన్న సడలని నమ్మకం. తాను పోతే హరేమవుతాడో అన్న అపనమ్మకం లేదు ఎందుకంటే అప్పటికే మాట తీసుకుందిగా మనసు శిక్షించనని. మనిషి మాట మీద ఉండాల్సిన నమ్మకం అదీ. తాను బంగారు జీవితం కోల్పోతున్నాను అన్న దుఖం లేదు నిర్వర్తిస్తున్న భాద్యతే పెళ్ళి చీరై ముస్తాబు చేస్తే పుత్తడి బొమ్మ పూర్ణమయ్యింది.

తానొక్కతే పూర్ణమయ్యిందా అంటే అంత స్వార్థం తనలోలేదు లెండి. తోడిచ్చిన అమ్మవారి నైవెద్యాన్ని కళ్ళకద్దుకోమంటూ హరి కళ్ళు తెరిపించి అతడినీ పూర్ణం చేసింది. రంభగా, మంత్రిగా, దాసిగా, తల్లిగా ఇంకా ఎన్నో పాత్రాలనిభనయించిన ఈ మాయాదేవి జ్యోతి హరిని సైతం హరించిందంటే ఆశ్చర్యం ఏమిటి?

కనిపించాయా మీకు ఈ రూపాలు?

కులం గోత్రం, గుణగుణాలు, పుట్టు పూర్వోత్తరాలు తెలీని పిల్లనెలా చేసుకుంటావురా అది బజారుదిరా అంటూ కణ్ణీళ్ళు పెట్టుకున్న అమ్మతనం, "కోకిల గుణగణాలు, గాత్రం పుట్టుకనూ పట్టించుకోని నెమలిని నేను" అని ఆవేశంలో చెపుతున్న అన్నను చూసి లోకం తెలీని తనం ఇంకా అని చిరాకు పడ్డ చెల్లితనాన్ని, చేయగల కార్యం ఏమిటో ఆలొచించగల నేర్పున్న మంత్రిత్వం, నీ కోసం నా ప్రాణాలయినా అర్పిస్తా అన్న దాస్యం అన్నీ సుస్ఫష్ఠమే కదా తన కాంతిలో.

కానీ తనంటే నాకు అసహ్యం వేసేదీ ఆ స్త్రీత్వం మూలానే. నేను అందరూ తాకిన ఎంగిలి కూడును అమ్మవారి నైవేద్యాన్ని కాను, హరికి కావాల్సింది భార్య కాదు సహ"ధర్మ"చారిణి అంటూ కబుర్లు చెపుతూనే, అతని పై ప్రేమ చూపుతూనే అతన్నీ, అతని కళనూ అవమానించింది కూడా ఈ దేవేరే కదూ.

తన వ్యక్తిత్వంతో జాగృతం చేసిన కళ ఎక్కడిది అని అనుకుందో ఆ దేవునికే తెలియాలి. స్త్రీ పురుష స్పర్శ యోగంలో జనించిన ఆ స్ఫందన అమాలిన్యమే కాని ఆ స్పర్శను ఉసిగొల్పిన శరీరం తన ధర్మాన్ని తాను పాటిస్తే మాత్రం కడగరాని మాలిన్యమయ్యిందా? ఇక మరి పశ్చాత్తాపాలకూ, ప్రాయశ్చిత్తాలకూ విలువేముందీ?

పెళ్ళంటే శారీరికమే అంటూ ఎంత పాపం చేసింది? మనసుల కలయికకు పెళ్ళి పరాకాష్టయి తీరాలా, రెండు తనువుల పెనుగులాటలోనే ఆ కలయికకౌ సార్థకతా అంటూ ఎంతగా అవమానించింది పెళ్ళినీ, కలయికనూ? ధర్మంగా బ్రతుకుతున్నా అనుకునే మనిషికి ఇలాటి ప్రశ్నలతో ముందరికాళ్ళ బంధం వెయ్యటం ఎంత ధర్మం? ఇక కాదు పెళ్ళి ఒకటే ప్రధానం కాదు అనక చస్తాడా మానవుదు. చతుర్విధాలలోని తృతీయాన్ని ఏనాడయినా మనస్పూర్తిగా సాధించగలడా ఇక మీదట ఆ పురుషుడు?

ఎందుకో ఈ విషయంలో మాత్రం సగటుతనం అలంకరించుకుంది కాశీనాధుని ఈ స్వాతిముత్యం. ఎంతయినా పెద్దాయన కదా. పైగా మెట్టినింట ఇతరుల దయమీద విడవాల్సిన తన చిత్ర కన్య భవిష్యత్తు, ఆమే నడవడికపై ఆధారపడ్డ పుట్టినింటి వారి భవిత గుర్తొచ్చి ఈ సగటుతనాన్ని నేర్పించారేమో తన కూతిరికి.లేక నిజంగానే కట్టుబాట్లు కాదనలేని జడత్వమేనేమో.

నేను మారలేను ఇక అనే అనుకుందో
నేను మారినా తగను అనే న్యూనిందో

శూన్యమయిపోయింది.

మరుజన్మ ఉందో లేదో!

Monday, 13 September 2010

మొద్దు పిల్లాడా

పెదాల మీద కాదు, బుగ్గల మీద కాదు, పోనీ నుదురు మీదా అంటే అదీ కాదు. పొయ్యి పొయ్యి ఎప్పుడూ పాదాల మీద ముద్దెడతావు ఏంటిది బాస్? నఖశిఖపర్యంతం అంటూ ఏవేవో చెప్పబోతున్నట్టు అనిపిస్తుంది కాని అవన్నీ వినే తీరిక నాకెక్కడ చెప్పు? బారెడు పోద్దేక్కితే కాని లేవని నా ఈ అలవాటు మానుకోలేకపోతున్నా. "గాఢనిద్రలో నీ  మొహం చూడటం నాకెంత ఇష్టమో నువ్వలాగే లేట్ గా లెయ్ పర్లేదు" అంటూ నువ్వెళ్ళి కోడిని లేపుతావు. మనకిద్దరికీ ఎలా కుదిరిందో ?

బ్రష్ నోట్లో పెట్టుకుని బాల్కనీలో నుంచుని ప్రపంచపు ఉరుకుల పరుగుల సవ్వడి వినటం నాకిష్టం. నువ్వు చూపులతోనే చురుక్కుమనిపిస్తున్నావు అని అర్థమవుతూనే ఉంటుంది అయినా మానను. అలా నన్ను నువ్వు తాకటం ఎంత  బావుంటుందో తెలుసా? అలా నువ్వు నన్ను తాకి వేడెక్కుతున్నంతలోనే  "అమ్మో టైం అయింది" అనుకుంటూ బాత్రూమ్లో పరిగెడుతుంటే నీ నిరాశ బయట వీదులూడిచే చీపుళ్ళ సవ్వడిలో వినపడేది నాకు. అయినా ఈ మధ్య ఆ శబ్దం వినపడట్లా, మజా పోతోంది. కొంప తీసి మా ఏం సి హెచ్ వాళ్ళు అర్ధరాత్రి  చీపుల్లేయిస్తున్నట్టు నువ్వూ ఏ అపర్రాత్రో నిట్టూరుస్తున్నావా ఏమిటి?

నేను ఆదరాబాదరాగా స్నానం చేసి నీ ఎదురుగానే డ్రస్ మార్చుకుంటుంటే అలా ఎర్రబడిపోతావేంటి?  ఎప్పటి నుంచి చూస్తున్నావు నన్ను? సిగ్గుబిళ్ళ దగ్గర నుంచి, అవునా? అయినా ఇదేంటి? పైగా మగాడివి, అందులోనూ "అన్నీ" తెలిసిన వాడివి. పైగా ఏమన్నా అంటే "నేను ఎన్ని దేశాలు చుట్తోస్తే మాత్రం మారిపోతానా? నేనెప్పటికీ మారను, నేనింతే" అంటావు. అంతే కాదు   రోజూ ఎర్రబడుతూనే ఉంటావు. ఒకోసారి విసుగొస్తుంది తెలుసా ఈ కాలం అబ్బాయిలు ఇలా మొద్దు సుబ్రావ్లు ఎందుకైతారా అని.

ఆ సర్లే సాల్లే సంబడం. మా కాలం వాడివి కాదులే సత్తేకాలం వాడివే. అయితే మాత్రం వయసుతోపాటు పెరగాల్సిన ఆ అది ఏదీ? నున్నగా షేవ్. కొంచం అయినా రఫ్ మాన్లీన్స్ ఉండాలా లేదా? ఇరవయ్ నాలుగ్గంటలూ పని, ధర్మం అంటూ క్లాక్తో పాటు పరుగులు. నిన్ను చూస్తూ నీ వైపే తిరిగే పూబాలలు ఎందఱో నీకేమైనా తెలుసా? కొంచం కూడా ఫ్లర్టింగ్ రాదు. నీ కొలీగ్ని చూసైనానా నేర్చుకోవయ్యా మగడా అంటే వినవు. నీపై ఆధారబడి బ్రతికేవాడు. ఒక్క నైట్ డ్యూటీ  తప్పితే నీకంటే ఏ విధంగానూ ఎక్కువైన అవకాసం ఉన్నవాడూ కాదు. పైగా నీ అంత ఛాయా లేదు, మొహం మీద మచ్చలూ... అయినా ఎన్ని కథలలో హీరోనో, ఎందరు కలువభామల మనసు దోచాడో, ఎన్ని ప్రేమలేఖలన్దుకున్నాడో నీకు తెలీనిదేముంది?  అయినా నిన్ననేం లాభంలే ఇలా రాసిన విదాతననాలి. సరే ఇక నే వెళ్ళొస్తా మళ్ళీ సాయంత్రం ఆఫీస్ తరవాత కలుద్దాం బై.

                                                              XXXXXXXXXXXXXXXXXX
ఏంటిది ఊరకే ఆఫీసులో డిస్టర్బెన్స్ ? చెప్పానా అలా మూగగా పలకరించోద్దని? రోజూ ఇదో వరసైపోయింది. నా ఖర్మ క్లాస్ మార్చినప్పటినుంచి డైరెక్ట్ లైన్ అఫ్ విషన్ కిటికీలోంచి. రోజూ నేను కిటికీ పరదా వేస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారు అనిపిస్తుంది. నీకేం ఖర్మ చెప్పు ఇలా? దర్జాగా దొరికినప్పుడేమొ  ఏమీ చెయ్యలేదు కానీ.  అప్పుడేమో ఏదో పక్కింటి నెలల బాబు  పాకి వచ్చి ముద్దుపెట్టుకున్నట్టు పాదాల మీద ముద్దులు. ఇప్పుడేమో నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను అంటూ ఏడుపు. ఏం నాకు తెలీదనుకున్నావా నీ బాధ. పరదా వేసింది కిటికీకి నా మనసుకు కాదుగా.
పోన్లే ఏడుస్తున్నావు కదా అని లంచికి పార్క్లో కలిస్తే ఎంతో................ధైర్యం తెచ్చుకుని ముద్దుపెట్టుకునేది నడినెత్తి మీదా? ఇడియట్.

ఆ ఆ చాల్లే వేషాలు. సారి అంటూ మెల్లగా వేలు ముట్టుకుంటావు. చల్లటి చెట్టు కింద మొత్తం శరీరం, వేలుపై మాత్రం వెచ్చని స్పర్స. ఉలుకూ పలుకూ ఉండదు. మెల్లగా వేలికోసలతో మొదలెట్టి అలా అలా పైకి పైకి జరుపుతావు. ఎన్ని సార్లు తాకినా నీ ఆ స్పర్శ మాత్రం అలవాటు అవదు నాకు. పబ్లిక్ పార్కు అన్న ధ్యాస కూడా లేకుండా నీ సరసమొకటి. మళ్ళీ ఇడియట్.

సర్లే డ్రీమ్స్లో పడిపోతే అయినట్టే. స్కూల్ బెల్ కొట్టటానికి ఇంకో అయిదు నిమిషాలే టైం ఉంది నేను వస్తా. నీకు తెలుసుగా ఆ వంద మీటర్లు నేను నిక్కుతూ నీలుగుతూ వెళ్ళేసరికి అంత టైమూ అవుతుంది. బై మరి. సాయంత్రం స్కూల్ అయిపోయింతరవాత పికప్ చేసుకో సరేనా? అలా అలగోద్దూ నా బుజ్జి కదూ.  నిన్నేమి అవమానించలేదు. అరవై వేల డొక్కు బండి కంటే అరవై లక్షల బస్సులో పికప్ చేసుకునే నా వాడే నాకు గ్రేట్. ఒకే? సరే ఉంటా మరి బై.

                                               XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
నేను నీ పక్కన కూర్చోలేదని అంత అలకా? ఏం చెయ్యను విండో సీట్ దొరకలేదు మరి. అసహనంగా ఉన్నట్టున్నావు ఏమయ్యింది? డ్యూటీలో ఏమన్నా ప్రాబ్లామ్సా? నీకూ ప్రాబ్లామ్సా? పీత కష్టాలు పీతవిలే సరే. నీ కష్టాలు తరవాత వింటాను కాని ముందిది చెప్పనీ స్కూల్ వాళ్ళు ప్రతి సంవత్సరం కొంతమందికి ఆపరేషన్ స్పాన్సర్ చేస్తారు అని చెప్పానా? నాకు స్పాన్సర్ షిప్ ఇచ్చారు ఈసారి. యూకేకి. ప్లేన్ టికెట్ల దగ్గరనుంచి స్తే వరకూ అన్నీ స్పాన్సర్డే. ఎంత ఆనందంగా ఉందొ తెలుసా. ఓయ్ ఏమిటది అలా కన్నీరు కార్చేసావు? అబ్బబ్బా. ఈయనకు ఏ ఎమోషన్ వచ్చినా తట్టుకోవటం కష్టం. పురుషోత్తమా అలా కురుస్తూ అందరినీ ఇబ్బంది పెట్టొచ్చా? అలా చూడు జనమంతా ఎంత అసహనంగా చూస్తున్నారో. ఆపేయ్ నా బుజ్జివి కదూ ఆపేయ్. గుడ్ అలా నవ్వాలి. నువ్వు అలా మంద్రంగా చాలా నవ్వితే బావుంటావని మా ఆఫీస్లో లేడీ స్టాఫ్ అందరూ అంటారు తెలుసా.  సిగ్గు పడుతున్నావా? పడుతూనే ఉండిన్తావులే.
                                                  XXXXXXXXXXXXXXXXXXXXXXXXX
నువ్వు లేనప్పుడు కానీ నీ విలువ తెలీటం లేదు. పొద్దున్న నీ వెచ్చని మేలుకొలుపు లేదు. రాత్రుళ్ళు వేల మైళ్ళ అవతల ఉన్నా నీ ప్రేమ ప్రతిఫలిస్తూ బయట కనిపించే ఆ చందమామను ఆస్వాదిద్దామన్నా రక్తం గడ్డ కట్టించే చలి, రూమ్లో నుంచి బయటకు రాలేను. నువ్వు లేకపోతె ఎలాగో పిచ్చిగా ఉంది. ఏడుపొస్తోంది.

ఎంత దుప్పటి కప్పుకుంటే మాత్రం నీ వెచ్చతనం వస్తుందా? వెచ్చతనం వచ్చినా ఆ దగ్గరితనమేది? నా ఆలసత్వం నా విసుగూ నా అలకలూ అన్నీ భరించే ఆ తోడేక్కడినుంచి వస్తుంది ఈ దుప్పటితో. నా కొంగు పట్టుకుని రోజంతా నువ్వు తిరుగుతుంటే నాకు తెలీలేని ఆ సహచర్యం ఇక్కడ వినపడని తొలిపొద్దు కోడికూతలు,మలిసంధ్య కిలకిలారావాలూ నువ్విచ్చే నడి నెత్తి మీది ముద్దులు గుర్తుచేస్తున్నాయి. I miss you. I miss you a lot. కాని తప్పదు. ఒక పని చెయ్యాలని అనుకోక ఆగిపోవటమే కాని  చెయ్యలేకపోవటం వల్ల ఆపేయటం నీ దేవికి అసలు అలవాటు లేదు. భరిస్తా. ఎలా అయినా భరిస్తా.నా మంచికేగా ఈ అరణ్యవాసం.


                                              XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

స్వామీ
తిమిర సంహారా
పరాయి దేశంలో నీ తొడు లేని ఒంటరితనం నల్లటి దుప్పటిలా (అప్పుడే వర్ణాలూ స్వాధీనం అయ్యాయి చూసావా) కప్పే దాకా నీ విలువ తెలీలేదయ్యా. పరాచికాలాడుతూ నీ స్నేహాన్ని తేలిక చేసేసాను. ఆకతాయితనంగా అల్లరి చేసాను. మది బరువయితే మనసును దూదిపింజను చేసే నీ మంత్రదండపు ధగధగల శక్తి తెలిసింది. కళ్ళు తెరిపించావు. ఇవాళ మళ్ళీ నీ కీర్తి కెరటాలతో ధగధగలాడే దేశానికి వచ్చేసా.  సమస్త జన జీవన స్రవంతిని జాగృతం చేసే నీ కాంతి కిరీటం నా కళ్ళల్లో ఎప్పుడూ మెరిసేలా ఆశీర్వదించు తండ్రీ.




అందరూ మచ్చల మామకు రాసేవారే అన్న అక్కసుతో ;-)
Pic from http://vandeneynden.biz/blog/wp-content/uploads/2009/03/rays-of-sun-in-black-sky.jpg

Sunday, 12 September 2010

ఎందుకు స్త్రీ ఇంతగా దిగాజారిపోతోంది?

"....అంతే కాదు నీ గురించి ఇంకా చాలా తెలుసు. సిగరెట్ కాల్చటం కూడా తెలీని వేస్ట్ గాడివి, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహం అటు తిప్పుకుంటావు, అమ్మాయిలు అస్సలు అర్థం కారు నీకు. నీకున్నదంతా, నీ ఆఖరు రూపాయి కూడా  ఇతరులకు ఇచ్చేస్తావు, కొంచం జాలి ఎక్కువే" అంటూ ఈనాటి తెలుగింటి ఆడపడుచు తెలుపలేదు మనసూ అంటూనే "గోదాట్లో" కడిగేస్తోంది పరువు.

ఇంతవరకు "నామీద అంత నమ్మకమేంటి నీకు? అయినా నాగురించి ఏం తెలుసని అలా సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళ దగ్గర" అని అడగలేదు కాని  దగ్గరైన స్త్రీలు మాత్రం అలా డైరెక్ట్ గా కాక సుతిమెత్తగానే నాకు క్లాసు తీసుకున్న సందర్భాలయితే తప్పక ఉన్నాయి.

"పలుగురితో తిరిగే షోకిల్లా తానయినా తన గుండెల్లో నాకో కిల్లా కట్టాలి" అంటున్న పాట మంద్రంగా కారులో వినపడుతుంటే నా ప్రాణస్నేహితుడు తనను వదిలి వెళిపోతున్న ప్రేయసి గురించి చెపుతూ "నేనో పదిహేను మంది ఆడాళ్ళతో తిరగాలటరా. అప్పుడు కాని తను నాకు సరితూగదట. I don't deserve your bachelorship అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయిందిరా నా తల్లి" అంటూ చెప్పిన సందర్భం నా ఊహాజనితం కాదు.

"I want to make love to you" అంటూ ఏం మాయ చేసావే అనుకునేలా మతిపోగోట్టిన ప్రేయసికి సూటిగా చెప్పగలిగిన హీరోని ఊరికే అలా చూసి ఆ కథానాయిక వెళ్ళిపోవటం లాటివి కథల్లోనే జరుగుతాయనుకుంటే "ఎందుకు తప్పు. నువ్వు స్త్రీవి నేను మగాడిని. నాకు నువ్వు కావాలి, నీకా ప్రేమ కావాలి. తప్పేముంది" అని వెంటపడి వారంలో మగనాలిని ముద్దుపెట్టుకుని, నెలలో హద్దులన్నీ చేరిపేయించగల వాళ్ళను "I was not and will not be able say no to anything he does . I think that is the magic he has. ఆ పొగరే మగతనమేమో" అని వెనకేసుకొస్తున్న పడతులూ  తారసపడ్డారు.

ఎందుకిలా దిగజారింది స్త్రీ?

చిన్నప్పుడు చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలూ,  అన్నీ హీరో ఆంటే కంట్రోల్ ఉన్న వాడు, నిజాయితీపరుడూ,  వ్యాసాన రహితుడూ అన్నదే చెప్పాయి కాని నేటి సంఘంలో కంట్రోలోదిలేసి పొగరు చూపించే వాడే మగాడు, వ్యసనపరుడే మగాడు, జారుడే అనుభవస్తుడు, సుఖమిచ్చేవాడు స్త్రీ దృష్టిలో.

ఎందుకిలా మారింది స్త్రీ?

న స్త్రీ స్వాతంత్రమర్హతి అన్నాడని మనువుని రీసైకిల్ బిన్లో Empty చేస్తే ఒకే కాని తను కూడా ఇల్లా Empty అవటం........ప్చ్ నచ్చట్లా.

మగాడెప్పుడూ భ్రష్టుడే అనుకుంటూ స్త్రీలో వస్తున్న మార్పు మీదే కాన్సంట్రేట్ చేసాను దీంట్లో. సో "మీ మగాళ్ళూ చేస్తున్నారుగా" అన్న మాట నిజమయినా అప్రస్తుతమే అనుకుంటా.

Friday, 10 September 2010

చేపపిల్లలేడిస్తే అమ్మలకు తెలీదు-మట్టి బొమ్మలే కొందాం.





అమ్మా ఎందుకమ్మా మట్టి బొమ్మ కొంటాము?

"మ్మ్ మనం గణపతిని తొమ్మిది రోజులు తరవాత ఏం చేసామ్రా బాబ్డీ?" జడ చిన్నదే అయితేనేం ఎంతో గర్వంగా అల్లుకుంటున్నా  నా కొడుకులా అదీ బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో నాకు. అచ్చంగా నాదిగా మరి.  

మన కాలనీ వాళ్ళు లారీలో వెళ్తుంటే ఇచ్చాము 

వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారని చెప్పాను 

ఆ........... ఆ.......... హుసేన్ సాగర్లో వేస్తారన్నావు 

అవును. దాన్నేమంటారు చెప్పు 

నిమజ్జనం.

అయిదేళ్ళు నిండి సరిగ్గా పక్షం ఈ రోజుకు నా వినాయకునికి. ఈ వయసుకే వాడు అంత స్ఫష్టంగా నిమజ్జనం అంటుంటే నిజ్జంగా ముద్దోచ్చేసాడు. ముద్దు పెట్టుకున్నా. పెద్దగా చప్పుడయ్యేలా. ఎంగిలి తుడుచుకుంటూనే ఇంకో ముద్దు పెట్టమ్మా అన్నాడు.

నాకోసం పుట్టిన ఆదిశంకరాచార్యుడివిరా నువ్వు అని తనివితీరా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నా. ఈ బొమ్మకు ప్రాణం పోయటానికి ఎంత కష్టపడాల్సోచ్చిందో.

ఒళ్లో ఒద్దికగా కూర్చుని చెప్పమ్మా మట్టిబోమ్మే ఎందుకు అన్నాడు.

మనం ఇన్ని వేల బొమ్మలు ఆ రంగురంగులవి కొని హుసేన్ సాగర్లో పడేస్తే ఏమవుతుంది?

ఏమవుతుంది?

ఆ రంగురంగుల బొమ్మలు మొత్తం కరిగిపోవు. అందులో ఉన్న కడ్డీలు నీళ్ళో అలాగె ఉంటాయి. ఆ రంగులన్నీ పాపం చేపలను బాగా తడిపెస్తాయి. మొన్న హోలీ రోజున నువ్వు ఎక్కువ సేపు రంగునీళ్ళతో ఆడితే ఏమయింది?

"జలుబొ చ్చేసింది" చేతులు తిప్పుతూ గిల్టీగా నవ్వుతూ చెప్పాడు నా కృష్ణయ్య. వెన్న దొంగిలించావేమని అడగలేదురా కణ్నా.

కొంతసేపు రంగు నీళ్ళలో ఆడితేనే నీకు జలుబొస్తే మరి పాపం ఆ చేపలు రోజుకు ఇరవయ్నాలుగ్గంటలూ ఆ రంగు నీళ్ళల్లోనే ఉంటె ఏమవుతుంది చెప్పు?

"ఇంకా ఎక్కువ జలుబు చేస్తుందీ" మొహం వెలిగిపోతూ చెప్పాడు. అదేదో సిద్ధార్థ బోస్ క్విజ్లో ఆన్సర్ చెప్పి గెలిచినంత సంతోషంగా.

కదా ఆ రంగు రంగుల బొమ్మలు బదులు అందరూ ఈ మట్టి బొమ్మలు కొని పూజ చేసి తొమ్మిది రోజుల తరవాత అవి హుసేన్సాగర్లో వేస్తె?

ఆ వేస్తె?

అప్పుడు ఆ మట్టి కరిగిపోయి కిందికి వెళ్ళిపోతుంది నీళ్ళ కింద మట్టి ఉంటుంది తెలుసు కదా?
 "ఎందుకో ఉర్వియామపామాయతనం అనో మేదీనామపామాయతనం" అని చెప్పలేదు పాపం పంచభూతాల్లో అన్నిటినీ స్మరించుకుని భూదేవిని మాత్రం వదిలేసారు అన్న ఆలోచన వచ్చింది.  "ఆ మిగితా అందరూ అదే సూర్యుడూ, ఇంద్రుడూ, చంద్రుడూ, వాయువు అందరూ  మగ దేవుళ్ళు కదా వల్ల సరసన ఈమెను ఉంచలేక" అని జోక్ వేసే వాడేమో. సర్లే పండగ పూట వాడి గోలేందుకు.

అవును. అయితే?

అప్పుడు మట్టి మట్టిలో కలిసిపోతుంది.  నీళ్ళలో రంగులుండవు, చేపలకు జలుబవ్వదు, ఇనుప రాడ్లవీ గుచ్చుకుని చేప పిల్లలు ఏడవవు అందరికీ హాపీస్ కదా.

పాపం అయితే మరి ప్రతి సంవత్సరం అన్ని పేద్ద పేద్ద రంగుల బొమ్మలు వేస్తాం కదా అమ్మా మరి ఆ చువ్వలకు చేప పిల్లలకు దెబ్బ్బలయ్యి ఏడిస్తే వాళ్ళమ్మకు ఎలా తెలిసేది? నీళ్ళలో తెలీదుగా పాపం ఏడుస్తున్నాయనీ అన్నాడు.

 చప్పున కౌగిలించుకున్నా. ఎక్కడనించి వస్తాయిరా నీకీ ఆలోచనలు ? పెద్దాడయిపోయి బ్రతికిపోయాడు లేకుంటే  ఆకలున్నా లేకున్నా మళ్ళీ స్థన్యమివ్వాలన్నంత  ప్రేమ అనిపించింది. నా వాడు, అచ్చంగా నా ఒక్కదానికే వీడు. he is my property. అమ్మనయినందుకు ఎంత గర్వమేసిందో.  

నిజమే నాన్నా, పాపం కదా అవి ఏడిస్తే వాటి అమ్మకు ఎలా తెలుస్తుందో? అందుకే మనం ఎప్పుడూ మట్టి బొమ్మనే కొందాం సరేనా?

ఒకే అమ్మా.



Picture used with thanks (without permission :-) and is from here

కవి గాంచిన వేడుక

పట్టుకోకల ధగధగలు మధ్య 
మత్తుపోకడల తావి కుప్పగ
ప్రౌఢయందమూయలూగ  
మనసిదేమి మనసిడదేమి 

విరిచేడె ఏ సంజాత
మే సంయోగ మీ విరిపూత
అంకురార్పణ మధురంబెట్టిది 
సంరక్షణ పాసమెట్టిది

బుగ్గపుణికిన రవిరాగము   
ఏ విధమాయెనో సన్నాయి గానము
నిశికిరీటుని ధగధగలలాడిన దాగుడుమూతలు 
నారీకేళపత్ర సాక్షిగనేవిధమయ్యేనక్షింతలు 

కట్లత్త కాట్లనోచి స్థిరముగ 
మలయాచల మామ మోయ
పుట్టినింటి పునుగు కట్నమున  
ఏ లగ్గమాయే పాణిగ్రహణము

మానసంబేమధువనముల
రాధన్బోల కురియ మురళీరవము 
దీటుగ మవునమే రీతినాడే భరతము 
తొలిరేయి వరమసమశరుని తాళమే జాతము

అని నను తొలుచు మనము
హోయలకోడిన ధర్మజు కాదు
కురూపియందూ రాదంగాంచిన 
నల్లనయ్యనచ్చు పోలుతనము 


ఏ శిలీముఖ గాయమీ వ్రణము 
ఏ కుబ్జ చిన్నతనమీ ప్రమాణము 
ఏ జ్ఞాపిక కేసిన ముసుగు ఈ కనరు
యటంచూ రుద్రాక్షల్దిప్పు నీ జంగము  


కొబ్బరాకుల చాటు చంద్రలేఖ  
పత్ర ప్రౌఢల తుహినంపు మొటిమ
తుదకు గృహములోని పల్లికమైనా 
ఏ జన్మయోగమైనేమి ఆ యాగము కాన.


చిన్నప్పటి నుంచీ గోడమీది బల్లంటే నాకెంతో అసూయ. సగర్వంగా స్ఫూర్థికారికి సమర్పణం. 
On a serious note, how I love to know the context of some of the poems that I read.





Wednesday, 8 September 2010

భద్రంగా

మూత తీసి చూద్దును కదా
ముఖమల్ గుడ్డపై
పూలు, నెమలికన్నులే కాదు
కలకలు, ముళ్ళూ
మరకల దస్తీ కూడా.


  

Monday, 6 September 2010

నేను గుర్తు పట్ట గలుగుతున్న లక్షణమేమిటో?

http://www.youtube.com/watch?v=SkUyowdaw2A

"హాయి హాయిగా ఆమని సాగే" అనే ఈ పాట విడియోలో 0.30 nunchi 0.37 వరకు ఉన్న ఆలాపనను అనుకరించగలుగుతున్నాను.
ఆ....ఆ..ఆ..
ఆ....ఆ..ఆ..
ఆ....ఆ...ఆ..ఆ..
అంటూ సాగే ఈ చిన్న బిట్లో నాకు అవగతమయింది ఏమిటో నాకు అర్థమవట్లేదు.

నేను స్వరాలను గుర్తుపట్టగలుగుతున్నాను అనుకోవట్లేదు.
అయినా ఆలాపనలో ఉన్న దేన్నో పట్టుకోగలుగుతున్నాను

ఆ చిన్న బిట్టు మూడు భాగాలుగా ఉందనీ ప్రతి భాగంలో మొదటి అకారాలాపన కొంచం ఎక్కువ సమయం ఉందనీ, మిగిలినవి కొంచం చిన్నవనీ అర్థమవుతోంది అలాగే రెండో భాగంలో కూడా. మూడో భాగంలో చివర ఒక ఆకారం ఎక్కువగా ఉందనీ అనిపిస్తోంది. ఇలా నేను గుర్తుపడుతున్నది దేన్నీ? తాళాన్నా? అక్షరాలనా(మాత్రాలనా)?

అది ఉట్టి అక్షరాలను(ఎంత సేపు ఉందొ) గుర్తుపట్టటమే అయితే నా చెవులకు "ఇంచుమించుగా అలాగే పాడుతున్నా" అనేట్లు ఎలా వస్తోంది? స్వరాలు అర్థమవకపోయినా ఇక్కడ నేను గుర్తుపడుతున్నదేమిటి?

Can somebody help  please?

Friday, 3 September 2010

Love you dad.

నాన్నా

ఇప్పుడే ఏదో బ్లాగులో సఖి పాటల నోస్టాల్జియా టపా ఒకటి చదువుతుంటే మీరు గుర్తొచ్చారు. ఇందాకటి మన సంభాషణ గుర్తొచ్చింది. ఒకప్పటి "మన" రోజులు గుర్తొచ్చాయి.

మీ మొదటి స్మృతి నా మదిలో నేను మొదటి సారి ఇంటినుంచి పారిపోయినప్పటిది! లారీల హేడ్లైట్లు కళ్ళలో కొడుతుంటే ఎవరో పక్కకు లాగిన గుర్తు లీలగా మాత్రం ఉంది. "రెండేళ్ళ పసివాడివి అప్పుడు నువ్వు "ఎక్కడకేల్లావురా?" అంటే "తీతం తాగటానికి పోయ్యా తీతం" అంటూ చెప్పావురా అని నవ్వుతూ ఇప్పుడు చెప్పగలరేమో కాని ఆనాడు నేను కనపడని ఆ మూడు నాలుగు గంటలు మీరెంతగా నలిగుంటారో........
 
అదే ఇంట్లో...అదే "భవాని భవన్లో" కదూ చెల్లి ఇల్లుగల వారింట్లో కిచెన్ అరుగు కింద కూర్చుని ఏదో తింటే "నాన్నా పప్పీ రెడ్డి అంకుల్ వాళ్ళింట్లో తింటోంది" అని నేను మీకు పితూరీలు చెప్పింది?  అదే ఇంట్లోనే కదూ పొద్దునే భవానీ బుక్ స్టాల్లో పాలతో పాటు చందమామ కొని తెచ్చుకుంటూ ఇంటికి వస్తుంటే రెడ్డి అంకుల్ తన కుక్కతో మార్నింగ్ వాక్ నుంచి వస్తూ మనకు ఎదురు పడేది? పక్కన అద్దెకున్న తాతగారు బట్టలుతుకుతుంటే "తాతగారు, బామ్మగారి గుద్దలు కూడా మీరే ఉతుకుతున్నారా"  అని వచ్చీరానీ నా మాటలకు అందరూ పడీ పడీ నవ్వుతున్నారని కూర్చోపెట్టి um bre llaa అంటూ ధ్వనిని పట్టి స్పెల్లిన్గూ స్పెల్లింగుని పట్టి ధ్వనీ పట్టుకొవతమేలానో నేర్పించింది? రెండేళ్ళు వచ్చేప్పటికే "లీఫ్, స్టెం, రూట్" అంటూ అన్నీ చెప్పే వాడివిరా అని మీరు ఇప్పటికీ గర్వంగా చెప్పుకునేది కూడా ఆ ఇంట్లోని జ్ఞాపకమే కదూ?

తరవాత నల్లకుంటలోని ఇల్లు. అందులో ఎందుకో మీవి ఎక్కువ జ్ఞాపకాలు లేవు నాన్నా. ఒకటి మాత్రం బాగా గుర్తుండి. పాపం పోకపోక మమ్మల్ని ముగ్గురినీ ఇంట్లో వదిలి మీరూ, అమ్మా సెకండ్ షో కి వెళుతూ అన్నయ్య బేబీ సిట్టిన్గ్లో పెట్టి వెళితే వాడు మీరటు వెళ్ళంగానే మాకు చెప్పటం మీరు ఇద్దరూ వచ్చేప్పటికి ఆ కామ్పవుండ్లో ఉన్న ఏడు కుటుంబాలకూ మీరు సినిమాకు వెళ్ళిన సంగతి ఏడుపు బాకా ఊది మేము చెప్పటం అయిపోయిందని తెలిసినప్పటి మీ ముఖం :-)

ఆ...మరచిపోయ్యా. ఆ ఇంట్లోనే కదూ ప్రతి వేసవి సెలవుల్లో మనమందరం జమ్బకానా పరుచుకుని మరీ తిష్టేసి పేకాట ఆడింది? డబ్బులు పెట్టి ఆడొద్దని అమ్మంటే పర్లేదు మన ఇంట్లోనే కదా ఉండేవి అని చెప్పి సీసాలో పొదుపు చేస్తున్న అయిదు, పడి, ఇరవై అయిదు పైసలను పెట్టి మరీ ఆడింది ఆ ఇంట్లోనే కదా. రమ్మీ, క్లియరెన్స్ అలా నేర్చుకున్నవే కదూ.

ఎండకాలమంటే గుర్తొచ్చింది కరెంట్ పొతే గ్రిల్ రూమ్లో మేము ముగ్గురం వరుసపెట్టి పడుకుంటే "దీనికి ఒకసారి నిద్రపడితే ఇక పిల్లల సంగతే పట్టదు" అని అంటూ అమ్మను విసుక్కుంటూ మాకు గంటలతరబడి న్యూస్ పేపర్తో గాలి విసిరింది మీరే కదూ? మరలాంటి మీరే ఈరోజు "నువ్విక్కడకు వచ్చి నాకు టీ, భోజనం సప్లై చేస్తూ సేవలు చేస్తే వచ్చే ఆనందం కంటే అక్కడ ఉండి నిన్నలా "నాన్నా  చాలా ఆనందంగా ఉంది ఇవాళ. పేషెంట్ కి మనం ఏదో మంచి చేస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తే ఎంత బావుంటుందో నాన్నా " అంటూ ఇంకా చాలా చెప్తే బావుంటుంది అని అంటే ఎలా నాన్నా? మన ఆనందంలో మన వారి సౌఖ్యం ఉంటె అది ఇంకా ఎంత బావుంటుందో మీకు తెలీదా?

నల్లకుంట నుంచి రామంతాపూర్ డిసెంబర్లో వెళ్లామని ముగ్గురు పిల్లల్ని రెండు ట్రిప్పులు రోజూ కాలేజికి వెళ్లే ముందే స్కూల్లో డ్రాప్ చేసేవారు. గుర్తుందా నాన్నా మన హీరో మాజేస్టిక్ మోటార్ సైకిల్? చాలా రోజుల తరవాత గుర్తొచ్చింది అది ఇవాళ. ఇవాళ మనం ఏర్పోర్ట్ నుంచి ఇంటికి కారులో పక్క పక్కన కూర్చుని వచ్చినా రానీ ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మీ వెనకాల ఆ హీరో మెజెస్టిక్ మీద డబుల్స్, త్రిపుల్స్ రైడ్ చేసినప్పుడు ఉండేది.

అదే పంచకల్యాణి మీద మీరు ఆరో తరగతి ప్రవేట్ పరీక్షకు రామంతాపూర్ నుంచి హయత్నగర్ తీసుకెళ్ళి వస్తూ తాగించిన కుండలోని చల్లటి మజ్జిగ రుచి మళ్ళీ ఎక్కడా నాకు దొరకలేదు నాన్నా. మొదటి సారి కొత్తిమీర వేసిన ఆ మజ్జిగ నీళ్ళ మజ్జిగైనా ఇక్కడి ఆన్కేన్ బయోపాట్ గడ్డ పెరుగు రుచిని తలదన్నేట్టుగా ఉండేదని నాకు భలే గుర్తు. నాకు ఇంత చక్కటి జ్ఞాపకం మిగిల్చిన మీకు ఆ పరీక్షల్లో లెక్కల్లో ఇర్వయ్యారు తెచ్చుకుని ఒక్క మార్కుతో బతికి బయటపడి భలే జ్ఞాపకం నేనూ మిగిల్చుంటాను కదూ? ఏమిటో మొదటి నుండీ బట్టీ పట్టె మార్కులు తెచ్చుకోవటంతో లాజిక్కునుపయోగించే లెక్కలు అస్సలు వంటపట్టేది కాదు. మీరు ఎన్ని సార్లు స్పీడ్, డిస్టెన్స్ అని చెపితే మాత్రం ఎక్కేవా? అలాటి లెక్కలను నాకెంతో ప్రియమైన సబ్జెక్టుగా  మార్చగలగటం ఒక్క కాలచక్రానికే సాధ్యమయింది.

ఆ రామాంతపూర్లో సాయంకాలం ఆ పిల్ల కాలువ పక్కన, ఇసుక మీద కూర్చుని మీరు చెప్పిన రామాయణ, భారత, భాగవత కథల పర్వం నేను నా పిల్లలతో పునరావృతం చేసుకోగలిగితే నాకు అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదేమో. మీరు అలా కథలు చెపుతుంటే అలా చేతులు ఇసుకల్లో రాస్తుంటే ఇరవై పైసలు దొరికినప్పటి ఆనందం నిజంగా ఇప్పటికీ నాకు గుర్తే. ఇరవై అయిదేళ్ళలో ఎంత మార్పు? నా ఫ్రెండ్ నిన్ననే హైదరాబాద్ వెళ్లోచ్చి "రఘూ నేను అయిదు వందల పచ్చ నోట్ల కట్ట గర్వంగా షాపింగ్ మాలుకు వెళుతూ తీసుకెళితే  నాకు సిగ్గోచ్చేలా అందరూ వెయ్యి రూపాయల నోట్ల పింక్ కట్టలు తీసుకొచ్చారు. ఎంత మారిపోయిందో తెలుసా హైదరాబాద్" అనేంత.

సంక్రాంతికి మీరు కొనిచ్చినా గ్రే కలర్ సఫారీ సూట్, కనుమ సాయంత్రం ఆరుకు కూడా చివరి గీటీ మాంజాకు మీరిచ్చిన అయిదు రూపాయలూ, కాలేజీ నుంచి తెచ్చిచ్చిన ట్రెషర్ ఐలాండ్, కొనిచ్చిన సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి పుస్తకం, అందులోని నర్షి, మహా, శిమ, వాల, యాబ నగరాలూ నిజ్జంగా గుర్తే ఇప్పటికీ.

మ్మ్....సంక్రాంతి అంటే గుర్తొచ్చింది. "వాడు అమ్మాయిలతో తిరిగితే పాడయిపోతాడు, చదువుపోతుంది" అంటూ ఇంటికొచ్చి మరీ  నన్ను  బయటకు తీసుకెళ్ళే పింకీ, మకరంద్, కిరణ్, హరిప్రియ వాళ్ళను అమ్మతో చెప్పించి మరీ ఇంటికి మరోసారి రాకుండా చేసింది కూడా అక్కడే కదూ? ఏమో ఇలాటివే అనుకుంటా నాన్న ఆడా, మగా అంటూ  తేడాలు ఎత్తి చూపించి ఎడం పెంచి మరీ ఆ ఆ ఆకర్షణను మరింత బలం చేసేవి. ఈ ఒక్క దానితో మాత్రం మీతో ఇప్పటికీ ఏకీభవించలేను.

రెండవ సారి కూడా ఏమ్సేట్లో రాంక్ రాలేదని నేను బాధపడకూడదని "రిసల్ట్స్ కోసం చేంతాడంత క్యూ ఉందిరా నుంచునే ఓపిక లేదు  అందుకని తీసుకురాలేదు"  అని మీరంటే నమ్మేసిన నన్ను మరుసటి రోజు పేపర్లో చూసి "ర్యాంకు పదిహేనొందల చిలుకు నాన్నా" అని మీతో చిన్నబోయిన ముఖంతో చెపితే "అక్కడ దాకా వెళ్లి రాంక్ తెలుసుకుని రాకుండా ఉంటానని నేను చెపితే మాత్రం ఎలా నమ్మావురా" అని మీరన్నప్పుడు నేర్చుకోవాల్సింది ఆలోచించటం అంటే మునుప్పరిచాయ వాక్యాల పునశ్చరణ కాదనీ, సాక్షం లేకపోయినా, వ్యతిరేకంగా సాక్షం ఉన్నా మనసు చెప్పేదే నిజమని అనుకోవటమే నమ్మకమనీ. ఆ రోజే ఆ మాట నేర్చుకోనుంటే ........

But I think I repaid the confidence on the day we celebrated my 199th rank. I certainly remember the happiness on your face. And it is on recollection of these occasions that I wonder why is it that men or precisely ఫతేర్స్, get so short changed by people who write about emotions or mothers. I think that's a necessary cross we men have to bear for being the strong one in the parental pair and playing the part of bad cop to the maternal good cop. It is then that I feel jealous of women.

సంతోషం అంటే గుర్తొచ్చింది. మీరు అమ్మతో "ఏమే నీ కొడుకు ముద్దేట్టాడు" అంటూ మెరిసే కళ్ళతో చెపితే కాని అర్థమవలేదు మీకు ముద్దు పెట్టిన సంగతి. నిజంగా నాకు తెలీదు అప్పటికి నాకు పాటలంటే అంత ఇష్టమని. లేకుంటే ఇంటికి టేప్రికార్డర్ కొని తీసుకొస్తే మీకు ముద్దు పెట్టానంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే.  As is typical with all male-male relations, we never had any touchy feely kind of రేలషన్శిప్ ఇస్ ఇట్ నాట్?

ఆ టేప్ రికార్డర్లో ముకేష్ పాటలు, రాజ్ కపూర్ సినిమాల్లోటివి వినాలని నేను కిటికీలేసేసి, లైట్లార్పేసి చీకటి గదిలో ఒక్కడినే "దోస్త్ దోస్త్ నా రహా"నో, "కిసీకే ముస్కురాహటోన్  పే హో నిసార్ " అనో పాడుతూ అటూ ఇటూ గంటల తరబడి పచార్లు చేస్తూ ఉంటె మీరు నుదురుకోట్టుకోవటం గుర్తుందా? అయినా తప్పంతా మీదే "మేము  ఆ సినిమా టాకీస్ బయట కూర్చుని వినే వాళ్ళంరా" అని "ఏడుకొండలడా వెంకటారమణా" అంటూనో, "సడిసేయకోగాలి సడిసేయబోకే" అంటూనో ఉగ్గుపాలుపోస్తే మరి అలా కాకుండా ఎలా రియాక్టవుతా  చెప్పండి ముఖేష్ గొంతులోని విషాదానికి, మజ్రోహ్ సుల్తాన్పురి కలంలోని భావసౌందర్యానికి?  

(సశేషం)

Thursday, 19 August 2010

Of devotion, emotions and god.

"అన్ని రకాలయిన యోగాలూ ఆ అల్టిమేట్ ట్రూత్ దగ్గరకే తీసుకెళతాయి అంటారు కాని భక్తి యోగంలో గర్వం రావటానికి ఎక్కువ చాన్స్ ఉంటుందని కూడా అంటారు. ఎమోషన్ మీద ఆధారపడి ఆ ఎమోషన్స్ లేకుండా చేసుకునే యోగమే భక్తీ యోగా కాబట్టి ఇక్కడ ఎక్కువ చాన్స్ అట పక్క దారి పట్టడానికి...అంటే నేనే గొప్ప భక్తుడిని, నేను ఇంత గొప్ప భక్తుడిని ఇలా అనుకునే స్థాయిలో ఆగిపోయే చాన్స్ ఎక్కువ ఉంటుందట ఎందుకంటే ముందరి నుంచి ఆ ఎమోషన్స్ ను దూరం చేయటానికి ప్రయత్నించక ఒక దామినేంట్ ఎమోషన్ ....భగవంతుని మీద భక్తీ లేదా ప్రేమ అనే ఎమోషన్ ద్వారా ముక్తి అంటే ఎమోషన్ లెస్స్ స్టేట్ చేరాలని ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుంది అంటారు. కాని నిజంగా కృషి చేస్తే  తనను తాను పూర్తిగా అర్పించుకునేంత ఎమోషన్ మైంటైన్ చేస్తే  అప్పుడు ఏ ఎమోషన్స్ కూడా లేని ఈక్వానిమిటీ వస్తుందట." అంటూ ముగించాడు నా స్నేహితుడు వీరూ.

చర్చ ఎక్కడ నుంచో ఎక్కడికో వెళ్ళింది ఎప్పటిలాగే. చర్చ ముగిసిన తరవాత ఇంటికి వచ్చేసా. 

ఈ మాటలు ఆలోచిస్తుంటే నాకు భక్తి గీతాలు ఎందుకు నచ్చుతాయో కొంచంగా అర్థమయినట్టు అనిపించింది.

ఇంతవరకు నేను ఆస్తికుడినో నాస్తికుడినో తెలియని సందిగ్ధావస్థ నాది.బ్రాహ్మణుడిగా పుట్టినందువల్ల కొంచం ఆచారవ్యవహారాల పరిచయం, పెద్దల వలన వాటి కాంటెక్స్ట్ అర్థం చేసుకునే వీలు, పారంపరికంగా వచ్చిన విద్యావరంతో కీర్తనలు, మంత్రాలు కొంత అర్థం చేసుకునే  భాషా సౌలభ్యం ఇవన్నీ అమరాయి. అయినా ప్రూఫ్ లేని దాన్ని నమ్మకూడదు అన్న అలవాటు చిన్నప్పటినుంచి అ ఆ లతో నూరిపోయటం వలన ఆచారవ్యవహారాల పట్ల ఇష్టం ఉన్నా, చేస్తున్నా చిత్తసుద్దిలేని శివపూజలే  అన్న చిన్న చూపు నాలో నాకే ఉండేది, ఉంది.

చర్చల్లో ఇదే వీరూ "ఒక విషయం నిజము అని తెలిస్తే దాన్ని వప్పుకోవటం ఫైత్ లేదా నమ్మకం ఎలా అవుతుంది ? అక్కడ నమ్మకం అవసరమే లేదు. ప్రూఫ్ లేని దాన్నే నిజమని అనుకోవటమే నమ్మకం" అన్న మాటలు నిజమే అనిపించేలా  పరిచయాలు పెరిగి "ప్రూఫ్ లేకపోయినా, నిజానికి ఆపోసిట్ దానికి ప్రూఫ్లు ఉన్నా ఒక విషయాన్ని నిజమని ఒప్పుకోవటమే నమ్మకం" అనేది స్వానుభవ సారంగా కొంచం కొంచంగా అర్థమవసాగింది. (నమ్మకానికి నా నిర్వచనం లెండి ఇది ).

 అప్పటి నుంచి  "భక్తీ అంటే గుడ్డి నమ్మకమే భక్తీ యోగమంటే గుడ్డి సాధనే. ముందు ఉన్నాడని నమ్ము, నమ్మి ఆయనను చేరుకోవాలంటే ఇవి మార్గాలు అని చెప్పబడ్డాయి అవి చిత్తసుద్దిగా చెయ్యి అంటారు...అంటే ముందు బలంగా నమ్మి సాధన చేస్తే అప్పుడే ఆయన కనపడతాడు లేదంటే నీ సాధనలో, నమ్మకంలో లోపం అంటారు....ముందు పూర్తిగా నమ్మితే ఇక సాధన అవసరమేమిటి"    అన్న నా ఆలోచనా పంథాలో (వితండ వాదం?) కొంచం మార్పు రాసాగింది. 

"ఆక్చువల్గా నువ్వు అనుకుంటున్నట్టు పూర్తిగా ఆయన ఉన్నాడని నమ్మి సాధన చెయ్యక్కరలేదు. సైంటిఫిక్ థింకింగ్ ను పూర్తిగా పక్కన పెట్టక్కరలేదు. సైంటిఫిక్ దిన్కింగ్ ఏమని చెపుతుంది అసలు? ఒక దాన్ని పరిశీలించి చూసి అది తప్పు అని రుజువు అయినప్పుడే ఆ విషయాన్ని కాదనాలి. అదే కదా నల్ హైపోతెసిస్ null hyepothesis కూడా. మనం రుజువు చెయ్యదలుచుకున్న దాని విరుద్దాన్ని మనం టెస్ట్ చెయ్యటమే testing null hypothesis కదా. మరి నీకు ఇక్కడ కావాల్సిన విషయం దేవుడు ఉన్నాడా అన్నది. సో దేవుడు లేదు అన్న దానిని మనం టెస్ట్ చెయ్యాలి నల్ హైపోతెసిస్ ప్రకారం. ఎలా? దేవుడు ఉన్నాడు అని చెపుతున్న మార్గాల్లో వెళ్లి ఆ మార్గం దేవుడు ఉన్నాడు అని చెపుతుందో లేదో టెస్ట్ చెయ్యటమే మనం చెయ్యాల్సిన నల్ టెస్టింగ్ కదా. మరి ఆ పని చెయ్యకుండానే మనం సాధన చెయ్యకుండానే ఎలా చెపుతున్నాము మాకు దేవుడు కనపడలేదు కాబట్టి దేవుడు లేదు అని" అని ప్రశ్నించిన వీరు మాటల్లో నిజం కనిపించింది. 

మరి నిజమే కదా 
ఎలేక్త్రాన్స్ ప్రోట్రాన్స్ న్యూట్రాన్స్ మనం చూసోచ్చామా?  అయినా అవి ఉన్నాయంటే, వాటికంటే సూక్ష్మమయిన బోసాన్ పార్టికిల్స్ లాటివి ఉన్నాయంటే ఎందుకు నమ్మేస్తున్నాము? అవి ఉన్నాయి అని ప్రూవ్ చెయ్యటానికి సైంటిఫిక్ మార్గాలున్నాయి అన్న సమాధానం వస్తుంది. నువ్వు చూసావా చేసావా అన్న ప్రశ్నకు వేరే వారు చేసారు చెపుతున్నారు కాబట్టి నమ్ముతున్నాము అన్నదే సమాదానమయితే మరి దేవుడు ఉన్నాడు ఇలా చేస్తే ఆయన మీకు తప్పక అనుభవమవుతాడు అని స్పిరిట్యువాలిటీ  విషయంలో ఎందుకు నమ్మము అన్న ప్రశ్నకు salience in daily life అన్నది ఒకటే నాకు సమాధానంగా తోస్తుంది. ఈనాడు మనం నేర్చుకునే చదువు మనకు వ్రుత్తయిపోయింది కాబట్టి దాన్ని ప్రతీ విషయంలోనూ మనం  పరీక్షించుకుంటూ వెళితే మనకు పూట గడవడాని తెలుసు. అదే స్ప్రిట్యువాలిటీ విషయంలో అయితే మనకు అది ఈ కాలంలో అంత అవసరం లేదు కాబట్టి, ఇమ్పార్తన్స్ ఇవ్వము కాబట్టి దాని విషయంలో మాత్రం "మాకు గుడ్డి నమ్మకాలు వద్దు ప్రూఫ్ కావాలి" అని పట్టుబడటం. is it not escapism?

"ప్రూఫ్ లేని దాని నమ్మమని చెప్పటమేంటి సార్ మీరు కూడా. తెలీదా ఎంత మంది జనం మోసపోతున్నారో దయ్యాలూ, superstitions అని లేక ఇక్కడ ఎక్కువ లాభపడేది మీ కులపోల్లనా " అనే rationalists "సరే మరి మనం నమ్ముతున్నాం సైంటిఫిక్ రీసనింగ్ లో లేవా ఈ లోటు పాట్లు? ఎంతమంది వైద్యులు మోసం చెయ్యట్లేదు ప్రజల భయాలను అడ్డుపెట్టుకుని? ఏ విద్యలో లేవు నల్లకాకులు? నల్లగావునులు వేసుకున్న వాల్లలోనా? అకౌంతెన్ట్లలోనా? అధ్యాపకులలోనా? అసలు ఏ సైంటిఫిక్ వ్యవసాయాన్ని తీసుకున్నా పలుగాకులు లేని లోకులున్నారా? మరి వాటిని బాణ చెయ్యాలని కోరుతున్నామా అవి ఇంకా సరిగ్గా నడిచే సిస్టమ్స్ రావాలి అని కోరుకున్తున్నామా" అన్న ఆలోచనలు వచ్చిన దాఖలాలు ఏవీ? అయినా ఇష్టం, ఆసక్తి, జిజ్ఞాస ఉన్న వారినే కదా  ఈ వ్యాసంగంలో కృషి చెయ్యమని చెపుతున్నది.మరికనేం?

"ఎన్నేళ్ళయినా, ఎన్ని జన్మలయినా ఫలితం వస్తుందో రాదో తెలీదు అని సాధకులే చెప్పే మార్గంలో సాధన దేనికి సార్" అంటారా. నిజమే. వస్తుందో రాదో తెలీదు కాబట్టి అది సాధించాలి అన్న తపన ఎవరికీ ప్రముఖంగా ఉంటుందో వారినే సాధన చెయ్యనివ్వండి కాని అలాటి వారిని కూడా వెక్కిరించో, హేళన చేసో నిరుత్సాహపరచటం చెయ్యకూదదనేదే ఘోష కదా.

Saturday, 14 August 2010

రఘురామా నీ మానసంబెవరికి పట్టెరా

రామా మానసంబెవరికి పట్టెరా 
రఘురామా నీ మానసంబెవరికి పట్టెరా 

రాచమకుట యోగమే గాని 
పంచప్రాణ వియోగము గానని 
జనులెవ్వారలకు పట్టెరా రామా 

మణిమయ సరముల మాటున   
మనసున  దాగిన  క్రీనీడలు
ఎవ్వారలకు పట్టెరా రామా 

రాచదండపు కరకు పాదమున 
నలిగినది సీతమ్మ తల్లేయని  
బొంకుబలికే వారెవ్వారలకు పట్టెరా రామా 

పుత్తడి బొమ్మ సరసన బెట్టినను 
లొత్తము తప్పనేమెరుగని 
మనసెవ్వారలకు పట్టెరా రామా. 


రామా 
ఎలా భారించావయ్యా?
ప్రతిమకూ సాక్షాత్స్వరూపానికీ అంతరాలు తెలిపే ఇంద్రియాలనుక్షణం ఎలా భారించావయ్యా?
ఆ లోత్తతనాన్ని తెలిపే జ్ఞాపికలనూ గాడంగా హత్తుకునే ఒర్పెక్కడిదయ్యా?