Sunday, 24 July 2011

చలో దిల్ దార్ చలో

ఏం చేస్తున్నావు 

ఫోన్ చేతుల్లోంచి లాక్కునేసింది 

పిచ్చిగా ఉంది.....ఒక్క మాట

నీ మంకుతనానికీ, నీ ఒంటరితనానికి తనకు శిక్షా?

నా ప్రాణం కదా.....నాతొ మాట్లాడటం తనకు శిక్ష ఎలా అవుతుంది?

".........."

పోనీ నా కోసం ఆ మాత్రం భరిస్తుందిలే.....ఇవ్వు 

".........."

వద్దులే.....నిజమే, తను భరిస్తుంది....కాని తను భరించాల్సి రావటం నేను భరించలేను...వద్దులే 

".........."

తన స్వరం  వినటం ఎందుకు అంత అవసరం అనిపించాలి నాకు?

".........."

ప్రేమ ఉందని తెలియటం చాలటం లేదు ఎందుకు?
మళ్ళీ మళ్ళీ అది వ్యక్తపరచటం ఎందుకు?
మళ్ళీ మళ్ళీ మళ్ళీ అది వినాలనుకోవటం ఎందుకు?

".........."

Miss her......a lot

తనకు తెలుసు 

నిజంగా తెలుసా 

నీ  ప్రాణమన్నావు. నీ ప్రాణం ప్రాణం నువ్వన్న తన మాట నమ్మవా?

ఇదేం ప్రేమ ఇంతగా బాధపెడుతుంది?





కళ్ళు మూసుకో 

ఎందుకు

కళ్ళు మూసుకో 

సరే మూసుకున్నా చెప్పు 

ఇప్పుడు చెప్పు తను ఏం చేస్తోంది 

మౌనంగా కూర్చుంది.

అవును మరి స్త్రీ కదా





వెళ్ళి చెయ్యి పట్టుకో

పట్టుకుని....?

తీసుకెళ్ళు .....నీకిష్టమయిన చోటుకు.

చలో దిల్ దార్ చలోనా? నా స్వరంలో కూడా ఎండా వానల కలయిక...అచ్చం తన కళ్ళల్లోలా  



నవ్వేసింది. 
చెయ్యి పట్టుకు తీసుకెళ్ళమంటే నువ్వు తీసుకెళ్లేది dreamworks logoలోకా?

ఏం? 
ఉక్రోషంగా నా స్వరం 

ఏం లేదులే పదా

నీకంతా నవ్వులాటే 
చూడు ఆ జాలరి పిల్లాడిలా, నెలవంక మీద కోర్చుని, నేను తను అంతే..... ఇంకెవ్వరూ లేరు.

ఊ...

నా చేతిలో తన చెయ్యి 

ఊ...

ఎంత సేపని మౌనంగా కూర్చుంటావు? మాట్లాడుతానని కదా తీసుకొచ్చావు 

మాటలు దేనికి?
చూడు ఆ నెలవంక చుట్టూ, మా చుట్టూ..... ఆ రోజు ఆల్స్టార్మ్లొ చూసిన స్నో స్టార్మ్ పాటేర్న్స్ మబ్బుల్లో 
ఆ ఆకతాయి కాళ్ళూపుతాడు చూడు dreamworks signature ad లొ....
ఆ కళ్ళూపటంలో ఉన్న cheerful abandonment ....ఆ తీరిక, ఆ నింపాదితనం మా ఇద్దరిలో 
అలా కాళ్ళూపుతూ కిందికి చూస్తె చిన్నప్పుడు ఆడుకున్న పెద్ద గోళీకాయలా భూమి....నీలంగా 
I really wish they make up a little miss sunshine up there for him.
I really wish both of them would never grow up
I wish they never loose that care free abandon

freudian wishes

whatever!




Wednesday, 20 July 2011

ఏవేవో-1

కొబ్బరి బొండం 
కప్పైసూ 
కిటికీ ఆవలి దృశ్యం.....
బొట్టు బొట్టుగా!

*****

పలక శుభ్రమైపొతే?
అవును పిరికివాడినే.

*****

సద్దివి 
ఎంతని తినను? 

*****

బంగారు సీతని ఆశ పడ్డా 
ఇదేమి బూటకం రామయ్యా. 

*****

ఆ అయిదూ శూన్యమైతే 
ఆరోది ఉత్తి గాసే.
అంతా దగా మోసం!!! 

*****
ఏమీ మయ సభ....
నీటి బీజముల యగ్ని ప్రజ్వరిల్లుటయేమి?
శూన్యమున బ్రహ్మాండమిముడుటయేమి?
పంచములవి పంచములై సుయోధనసాటియౌ యొండును శాసించుటయేమి?
కాలచక్రమపగామినియై శోకము శ్లోకమగుటయన్నదివేళ అనుభవమగుటయేమి? 
ఆహా మాయా మయా!

 

Tuesday, 19 July 2011

నేనెక్కడ?

జ్వర తీవ్రత అపస్మారకంలో  
గుండె లయతప్పిన నిస్పృహలొ
నిత్య క్రుత్యమైన మైగ్రైన్లోనూ!

ఆ తడిసిన తులసాకుకైనా......?



Sunday, 17 July 2011

కరెంటు పోయింది

నాన్న ఊపిన పేపర్ ఫానూ 
గంటలు కౌగిలొదలని చెమటా 
చీకటిలో నక్షత్రాల వెలుగూ 
బయట కీచురాళ్ళ కేకలూ 
(దోమల రొద కూడానూ)

క్రొవ్వొత్తి వెలుగుల్లో 
డాబాపై అమ్మా నాన్నా 
చెల్లెళ్ళూ చాప చపాతి 
గుత్తి వంకాయ కూర 
మాంసాహారంగా దోమలు కూడానేమో 

మళ్ళీ ఎప్పుడో భాగ్యం 

జీవితపు రొదలో
పరుగుల వడిలో 
ఆ కాస్త సమయం 
ఆలపించే జావళి 
వినే భాగ్యమెపుడో? 

వియోగంలో మోహమెత్తి
సంయోగంలో మొహం మొత్తదనే ఆశ.
 

వైద్యో నారాయణో హరి?

ఉపోత్ఘాతంగా ఈ కథ ముందు చదవండి



చదువుతున్న కథల పుస్తకాన్ని గిరాటువేసాను 

అవును మరి. మనసున్న మనిషిని కదూ ముల్లై గుచ్చుకుంది కథ...సూటిగానే.

"మీరు ప్రాణదాతలు. ప్రాణం కాపాడే వృత్తిలో ఉన్న మీరు చాలా ఉన్నతంగా ఉండాలంటూ" కబుర్లు దంచిన మామగారిని "అలాటి నారాయణులనూ, హరులనూ మామూలు మనుషుల నుంచి తయారుచేసే  యాగంలో కూర్చున్న మీలాటి మాష్టార్లెందుకు పాటించరు ఆ ఉన్నతత్వం? ఎందుకు కాపీలు కొట్టించటం వంటివి చేస్తారు" అంటూ నేను నోరు మూయించగలిగినా ఆనాడు మిగిలిపోయిన అసంతృప్తే ఈనాడూను....."ఒక్క వైద్యుల నుంచె" ఈ మానవత్వం ఆశించటం లేదు ఆ కథ అన్నది తెలుస్తూనే ఉన్నా....అదే అసంతృప్తి.   

ఎలా చెప్పాలి వీళ్ళందరికీ? " నిర్లజ్జగా డబ్బు కోసం విదేశాలకు ఎగిరిపోజూసిన వలస పక్షి" అని తనను తాను అనుకునే మనిషి ఆ డబ్బు సమకూరాక మరిక తను తీర్చని సోషల్ కాంట్రాక్ట్ గురించి తప్పక ఆలోచిస్తాడనీ అప్పుడు అతను చేసే మేలు వలస వెళ్ళక  ఈ దేశంలో చాలీ చాలని సంపాదనలో సుఖం పొందలేక, అటూ ఇటూ చెయ్యి పెట్టలేక పొందే నరకంలో చేసే సేవకంటే ఎన్నో రెట్లు అధికమని. 

ఎలా చెప్పను వీళ్ళందరికీ? తొంభయ్ అయిదులో గాంధీలో మొదటిసారి వైద్యులుగా అడుగెట్టిన మా నూటయాభయ్ మందిలో నేడు  మన దేశంలో మిగిలిపోయిన ముప్పై మందిలో దాదాపు ఇరవయ్ అయిదు మంది కేవలం ఆంగ్లం రాక మిగిలిపోయిన వారే కాని దేశానికి సేవ చేద్దామనుకుని ఉండిపోయినవారు కాదని.

ఎలా చెప్పను వీళ్ళందరికీ? మన దేశంలో ఉండి తమ వృత్తిని కొనసాగిస్తున్న నా సహ వైద్యుమిత్రులు, ఎంతమంది ప్రతి పరీక్షకు ముట్టె వేలున్నర రెండువేలకు ఆశపడి అనవసరమయిన ఏమ్మారైలు సీటీ స్కానులూ ఎన్ని రాస్తున్నారో...... తక్కువ ఖరీదు, నాణ్యమైన ప్రత్యామ్నాయాలు ఉన్నా ఖరీదైన మందులను ప్రిస్క్రైబ్ చేస్తూ మందుల కంపెనీ వారిచ్చే బహుమతుల, విహారయాత్రల గేలాలకు తగులుకుపోయి ఉన్నారో ప్రత్యక్షంగా మాకు తెలుసనీ, అలాటి వారు దేశంలో ఉంటూ చేస్తున్నది నిజంగానే సేవా? అన్నది ఎలా వారికి చెప్పను వీళ్ళందరికీ? అసలు వారు చేయగలరా అలా అన్నది ఎలా అడగను?

ఎలా చెప్పను వీళ్ళందరికీ? విదేశాల్లో ఉండి వస్తే వచ్చేది ఉత్త డబ్బే కాదు......ఇది మాత్రం పచ్చి నిజం. "లేదు మా వాడు డబ్బు కోసమే విదేశాలకు వెడుతున్నాడు" అని నాన్నా "అలా ఎందుకు అనుకుంటున్నారు మాష్టారు? ఉన్నతమైన చదువూ, విశాల దృక్పధం, విశాలమైన అనుభవం అలవరచుకుని రావటానికి వెళుతున్నాడు" అని ఎందుకు అనుకోరు అని మా లెక్చరరు నా గురించి నా ఎదుట మాట్లాడుకుంటున్నా ఆనాడు పెదవి విప్పని నేను ధైర్యం తెచ్చుకుని "ఆవును నేను వచ్చింది కేవలం డబ్బు కోసమే" అని చెప్పగలుగుతున్న నేడు నేను కూడా ఒప్పుకోవాల్సిన సత్యం విదేశీ చదువులతో డబ్బోకటే ప్రయోజనం కాదు.....ముమ్మాటికీ కాదు. అది నిజంగా అతి ముఖ్య ప్రయోజనమే కాని అదొక్కటే ప్రయోజనం కాదు. 

విదేశీ ఆరోగ్య వ్యవస్థల్లో ఉన్న ఉన్నత ప్రమాణాలూ, అవి నేర్పించే evidence based medicine సూత్రాలూ, కన్సల్టెంట్ అంటే చికిత్సా నైపుణ్యత (clinical skills) మాత్రమె వచ్చిన మనిషి అవకూడదు.......వ్యక్తిత్వ వికాసం (personal development), నాయకత్వ లక్షణాలు (leadership qualities) పరిపాలనా నైపుణ్యత (managerial qualities) మొదలైన ఎన్నో వైద్యేతర లాభాలు పొందుతాము అన్నది ఎలా నమ్మబలకను వీరందరికీ?

ఎర్రగడ్డలో సైకియాట్రీ పీజీ చేసిన తమ్ముడు మాటలవరసలో "సైకియాట్రీ చేసినందుకు పిల్లనివ్వటం లేదన్నా" అనటమూ, నా కొలీగ్ చదువుకున్న పెళ్ళాం కూడా "కుంజరః" అనేసుకుంటూ "నా మొగుడు న్యూరొసైకియాట్రిస్ట్"అని ఇండియాలో చెప్పుకోవటం...............ఈ అబద్ద్దపు హంగులన్నీ...... విదేశాల్లో చదువుకుని వస్తే ఏమ్మార్సీపీ లేదా బోర్డ్ సర్టిఫైడ్ అన్న అక్షరాల ఆసరా ఇచ్చే ఆనందంలో తుడుచుకుపోవటం సులువని ఎలా చెప్పను?

ఎలా చెప్పను వీళ్ళందరికీ? ఆర్థికంగా సంతృప్తి పడనీ ఏ మనిషీ..... వైద్యుడే కాదు.....ఏ మనిషీ...ఇతరులకు "సేవ" చేయలేడని ఎలా తెలుపగలను?  

అయిదున్నర ఏళ్లు ఎంబీబీఎస్,మూడేళ్ళు పీజీ, ఎంసెట్లో ఒక ఏడాది, పీజీ కోసం ఒక ఏడాది మొత్తం పదేళ్లు శ్రమపడి ఎమ్మెస్ చేసిన జనరల్ సర్జన్ దగ్గరకు వచ్చిన హెర్నియా రోగి కూడా "మీరు ఏమ్మేస్సేనా. నేను ఏం సీ హెచ్ (ఎమ్మెస్ తరవాత చేసే సర్జికల్ క్వాలిఫికేషన్) యూరో సర్జన్ అనుకుని వచ్చా నాకు యూరో సర్జనే కావాలి" అని అంటే కోపం నషాలానికి చేరటం నేను పదేళ్ల క్రితమే మన దేశంలో చూసాను. సమాచార విప్లవం పెరిగిపోతున్న రోజుల్లో వైద్యుల పట్టాలను కొలువగలిగిన రోగులు వస్తున్నా ఈ కాలంలో ఆంద్రప్రదేశం మొత్తంలో సంవత్సరానికి మూడో నాలుగో తప్ప ఏమ్సీహేచ్ యూరో సర్జరీ సీట్లు లేవు అన్నది వీరికెపుడు పట్టింది? 

ఇలా కాదని ఆ ఏమ్సీహేచ్ పట్టాలకు మణిపాల్లో ఆరా తీస్తే ముప్పయి లక్షలకు మొదటి పాట అట సీటుకి అని తెలిసి హతశుడయినా ఉన్నదంతా అమ్మి నలభై లక్షలు పాడి కొనుక్కున్న" సీటు విలువను కట్నం రూపంలో వసూలు చేసుకుందామా అంటే 498A సెక్షన్ అంటారు కాబట్టి ఇలా తప్పదురా" అంటూ ఎంసీహెచ్ పాసయిన తరవాత తన "వ్యాపార" స్థలాన్ని నాకు చూపెట్టిన వైద్యులను తయారు చేస్తున్నది ఎవరూ? వారు చేస్తున్న సేవ ఏమిటీ? 

దీనికంటే "సంజీవని ద్వారా విదేశాలకు వెళితే ఐదేళ్ళ పాటు అక్కడే కన్సల్టెంట్‌గా పని చేసే అవకాశం కల్పిస్తారు..... దేనికీ వెనుకాడక్కర్లేని డాలర్ల సంపాదన. తిరిగి వచ్చేశాక, పేరున్న ఏ పెద్ద హాస్పిటల్లో అయినా నెలకు లక్షలకు తగ్గని జీతం!" ఇలా అవకాశం పొంది సంతృప్తి పడి అప్పుడు మన దేశంలో చేసే సేవ నిజంగా గొప్పది కాదా? మనస్ఫూర్తి సేవ కాదా? ఇంకా మెరుగైన సేవ కాదా? అని ఎలా చెప్పను వీరికి?

నన్నడిగితే సంజీవని లాటి సంస్థలు కోకొల్లలు రావాలి....... వారు నిజంగా సమాజ సేవ చెయ్యాలన్న దృక్పధం ఉంటె వారు చెయ్యాల్సింది ఒక్కటే ...విదేశాల్లో అవకాశాలు కల్పిస్తున్నప్పుడు చట్టపరంగా అక్కడే స్థిరపడిపోకుండా ఒక ఒప్పందంపై సంతకం పెట్టించుకుని దాన్ని కఠినంగా అమలు చేయటం. చాలు ఇక మన దేశంలో మన ప్రజలను పీడించుకు తినే వైద్యులు తక్కువయి "వైద్యో నారాయణో హరి" అన్న సూక్తికి అద్దం పట్టే వారి సంఖ్యం, శాతం పెరుగుతాయి. మారుతీ ఎయిట్ హండ్రెడ్ ఎక్కుతున్న ప్రతీసారీ పక్కింటి బ్రాహ్మీల బీ ఏం డబ్ల్యూను చూస్తూ భార్య నిరాశనో, నోటి దురుసుతనాన్నో ఎదురుకోవాల్సిన ఖర్మ నేటి వైద్యులకు తప్పుతుంది. "సేవ" చెయ్యాలన్న కోరికా కలుగుతుంది.

Thursday, 14 July 2011

7c

అయితే మనసే కాదు బుద్ది కూడా ప్రేమించగలదు అంటావు.

తప్పకుండా. అసలయితే బుద్ది ప్రేమించగలిగిన స్థితి వచ్చినపుడే తారాస్థాయేమో.
మనసుదేముంది కాలుతున్న పెనం మీద నీళ్ళు పడితే చాలు చు..య్ మన్నట్టు అది స్ఫందిస్తూనే ఉంటుంది 
కాని ఆ మనసుకు లంగరేసి నిశ్చలం చేసే పని బుద్దిదే.
ఆ బుద్ది ఒకరి మీద లగ్నమవటమే లగ్గమేమో

అలాగా? మనసులో ఆ ఉధృతిలేకపోయినా, ఆ ఉధృతి తగ్గి యుగాలయినా...పరిస్థితులకు తల ఒగ్గి దూరమయిన ఒక మూర్తిని ప్రతిష్టించేసుకోవటం నీకయితే తపములాగా ఉందేమో నాకయితే ....ఏకవస్త్రను, నిర్మానుష్యమే అయినా, సభాస్థలి మధ్యంలో వివస్త్రను చేసే దుశ్శాసనుడే గుర్తుకొస్తాడు ఆవేశం లేని ప్రేమను నిలుపుకునే వాళ్ళను చూస్తె.

సీతమ్మ అశోకవనిలోనూ, వాల్మీకి పంచనూ నిజంగా ఆవేశం అనుభవించి ఉంటుందంటావా?

నీకూ సీతమ్మకూ పోలికా?        

కాదులే పిపీలకాన్నే. కాని ప్రశ్నను సైద్ధాంతికంగా తీసుకో. 

 ఏమో..రామాయణం తెచ్చిపెట్టుకున్నావు కాని చదివిందెపుడూ? సరే నువ్వనుకున్నట్టే జానకీ దేవి ఆవేశంలో లేదు అనుకుందాము. కాని వారు భార్యా భర్తలు. సంసారంసప్తకంలో ఆవేశం మొదటి అడుగుమాత్రమే. వారు ఆ స్థితి దాటి ఎన్నో ఏళ్లు అయి ఉంటుంది. కాని దగ్గరవ్వని ప్రేమికులకు ఆ అదృష్టం లేదుగా. ఆవేశం స్థాయిలోనే విడిపోయే వారు ఆ ఆవేశాన్ని నిలుపుకోలేకపోవటం ప్రేమ లేకపోవటమే. ప్రేమలేనప్పుడు మంకుతనంగా తన మనసున కొలువైన దేవినైనా తలచుకోవటం కీచకపర్వమే. వలలుడు లేని విరాట కొలువు మనసు కాబట్టి అంతగా విర్రవీగిపోతారు ఈ పరితప్త వియోగులు. 

ఎంత అహం? ఎంత పొగరు? ఎంత కావరం?
ఏమన్నావు పాణిగ్రహణం చేయని స్త్రీ పురుష ప్రేమ అనుబంధం కాదా? దానికి పరిణామక్రమముండదా?
అది ఆవేశం స్థాయి దాటకుండా నిలిచిపోయే జడమా?
భౌతికంగా దగ్గరకాని జంట సంసారం చేయలేదా?
సంసారపక్షమైన స్థిరత ఆ జంటకు ఉండదా?
కాబట్టి ఆవేశమే ఆ జంట అస్తిత్వమా? 

తెల్లటి పువ్వును పిప్పి చేసి, ఆ పిప్పిని పేని పలుపుతాడు చేసి, ఆ పలుపుతాడును పసుపు తాడు చేసి, అందరి ఎదుటా గొడ్డుకు మచ్చపొడిచి ఈ గొడ్డు నాది అంటూ పదుగురుకు దండోరా వేస్తె తప్ప అది సంసారం కాదు. మూడు ముళ్ళూ, ఏడు అడుగులూ, జిలకరా బెల్లం వంటి చిహ్నాలే వ్యవస్థ అస్థిత్వం అయిపోతున్న ఈ రోజుల్లో అలా అనుకోవటంలో తప్పేముందిలే. కలిసి ఉంటేనే సంసారమూ, భౌతికంగా కలిసి ఉంటేనే ఆ సంబంధపు పరిణామక్రమపు అడుగులు పడేవి అని ఈ తరం మనిషివైన నీవనుకోవతంలో తప్పేముంది. 

కాని అది తప్పు. ఆవేశంతో జనించినదే ప్రేమ అయి ఉండొచ్చు. కాని ప్రేమకు ఆవేశమొకటే చిహ్నము, సంసారం చెయ్యకుండా ఆ ఆవేశం తగ్గటం పరిణామానికి కాదు పతనానికి చిహ్నం అనే నీలాటి వారిని చూస్తె ఏమనాలో అర్థం కాదు. 

ఎలా చెప్పాలి మీలాటివారికి మానసిక సంసారం ఒకటుంటుందని? మానసిక వ్యభిచారం అంటూ అంతెత్తు లేచే మీరు మానసిక సంసారం ఉంటుందని ఎందుకు నమ్మరు? ఆ సంసారంలోని ఆవేశం, ఆవేశం నుంచి అనుబంధం, అనుబందానుగుణ పాశం......ఇవన్నీ ఏర్పడగలవనీ, ఆ పరిణామక్రమం భౌతికపరమైన ఏ సంబంధ పరిణామక్రమానికీ తక్కువ కాదనీ ఎలా మిమ్మల్ని నమ్మించటం?

7b 7a  6 5 4 3  2  1 

Monday, 11 July 2011

తగునే సీతమ్మా?

పూర్ణానురాగ సారము 
ఆర్ణవమైమెరుగుగాయ యహవమున యసం 
పూర్ణాహికాలకూటము  
కీర్ణాదితమౌ పిపీల కీలికలందున్

పాహియనుట కర్ణేంద్రియ
మేహెయనుట దుస్సహమ్మౌటయు పాటే 
సాహో సాకేతీ యరి  
సాహో పిపీలకమదియు సరి మరి కాదే

అమ్మా నీకిది తగునా? గమ్యానికి చేరిన నీవు మార్గమధ్యులనుపెక్షించ తగునే?   
పూర్ణానికీ అసంపూర్ణానికీ మైలురాళ్ళ అంతరం తప్ప ఇంకేముందమ్మా?
పథనిర్దేశ మాత్రము చేతనే నీ సరిగాదె ఆ పిపీలికము?
కృషిఫలము చేతనే కృషి మూల్యము నిర్ణయించుట ఏపాటి ధర్మము తల్లీ?   
 

  

Wednesday, 6 July 2011

Let me be part of your everyday life.

ఏమయింది అలా ఉన్నావు 

ఎందుకో బోర్ బోర్గా ఉంది కొంగు వేలి చుట్టూ తిప్పుకుంటూ అన్నాడు 

వదలండి అత్తయ్య చూసిందంటే నేనేదో మిమ్మల్ని కొంగున ముడేసుకున్నా అనుకునేట్టు ఏంటీ పని

ఏమయిందోయ్ నా ప్రాణం కొంగుతోనేగా నేనాడుకుంటున్నా 

ఆ ఆ మీదాన్నే 
కానీ మరీ ఇలా వంటింట్లోకి కూడా వచ్చి నా వెనక తిరుగుతే ఎలా? హాయిగా గదిలో వెళ్ళి కొంచం మీ మొదటి పెళ్ళాంతో సరసమాడుకోండి నేను ఈ కాస్త  పని కానిచ్చేసి వస్తా. అప్పుడు ఎంచక్కా మనం ఎంజాయ్ చెయ్యొచ్చు.

ఛ. నువ్విక్కడ పని చేస్తుంటే నేనక్కడ కంప్యూటర్తో ఆడుకోవాలా? ఏం కొంచం వచ్చి ఈ పనిలో సాయం చెయ్యండి అని ఎందుకు అనవు?

ఛ బావుండదు బుజ్జీ...నీకంతగా ఉంటె ఒక ముద్దిస్తా వెళ్ళు

ఛ పొ నీ ముద్దు ఎవడికి కావాలి. నేనేం నీ ముద్దు కోసం, కౌగిలి కోసం కాలిపోవట్లా. 
ఎందుకో చాలా అశాంతిగా ఉంటోందిరా 
ఎన్ని రోజులయ్యింది మనం ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుని 
నువ్వు పరుగులు నేను ఉరుకులు...ఛ నచ్చటం లేదు 
ఐ వాంట్ యువర్ కంపెనీ 

మిక్సీ వేస్తున్నది ఆపి రాహుల్ వైపు తిరిగి డూ యూ రియల్లీ మిస్ మీ సొ మచ్ రాహుల్?
రోజూ పక్కనే ఉండి, ఇరవై నాలుగు గంటలూ అలవాటయి మొహం మొత్తిపోయుంటా అనుకున్నా అంది.

డాం యూ నీకర్థం కావటం లేదు పొ 
చికాకుతో చేతిలోని గ్లాస్ నేలమీద పడేసి వెళ్ళిపొయ్యాడు రాహుల్ 



ఏమయ్యిందే కల్యాణి ఏమిటా శబ్దం?

ఏం లేదత్తయ్యా మీ అబ్బాయి నా మీద చిరాకుని దాని మీద చూపించారు పాపం సొట్ట బుగ్గ వచ్చేసింది దానికి నవ్వుతూ అనేసింది 

ఏంటే వాడు వారం రోజులనుంచి ఏదోలా ఉన్నాడు?

ఎంటో చికాకు చికాకుగా ఉంటోందట అత్తయ్యా 




చేతులు తుడుచుకుంటూ గదిలోకి వచ్చిన కల్యాణి పొట్టకు కరుచుకుపోయ్యాడు రాహుల్ 

ఏదో మాట్లాడపోతున్న కళ్యాణిని హుష్ అని గద్దించి మరీ ఒక పది నిమిషాలు అలాగే ఉండిపోయ్యాడు 

ఏమయిందండీ సర్దుకుంటున్న రాహుల్ను గోముగా అడిగింది 

ఎన్నేళ్లయింది నువ్వు ఏమండీ అని పిలిచి ఉక్రోషంగా రాహుల్ ప్రశ్న 

నిజమే తప్పు చేసిన దానిలా ఒప్పుకుంది కల్యాణి 




ఏంటిది కల్యూ? భార్యా భర్తలమని పేరుకేగాని......
నువ్వు నీ రేటింగ్స్ అనుకుంటూ, నేను నా పేషెంట్స్ అనుకుంటూ.. 
కనీసం పొద్దున్న నువ్వు పాలు కాస్తున్నప్పుడో, వంట చేస్తున్నప్పుడో నీతో గడపాలనుకుంటే అత్తయ్య అంటావు 
ఏమయింది నేను వంటింట్లో నీకు సాయం చేస్తే? 
భార్యా భర్తలు ఇద్దరు ప్రేమగా ఉండాలంటే...రోమాన్స్ చేసుకోవాలంటే అనటం లేదు...ప్రేమగా ఉండాలంటే...
దానికి కూడా గదిలోకెళ్ళి తలుపేసుకోవాలా? ఏమిటిది?  
నాకేమో నీ ఆఫీస్కు ఫోన్ చేసి నీ గొంతు వినాలని ఉంటుంది 
పెళ్ళయి అయిదు సంవత్సరాలయినా ఇంకా ఏంటి ఆఫీస్కు ఫోన్ అంటావు 
ప్రతి గంటకు ఒక ఈమెయిల్, ప్రతి అయిదు నిమిషాల తీరికకొక ఫోన్ ఎలా ఉండేవి ఆ రోజులు?
ఎందుకలా దూరమయిపోతున్నావు? 
నీ ఆఫీస్లో నీకొచ్చిన రేటింగ్ గురించి నాకు చెప్పుకుని ఏడ్చి లేదా సంతోషపడి ఎన్ని రోజులయింది?
ఎన్ని నెలలయింది మీ బాస్ నిన్నెలా సతాయిస్తున్నాడో చెప్పి నాకు?
ఎందుకు అలా దూరమయిపోతున్నావు?

ఇంతగా......................మిస్ అవుతున్నావా? ఛ. అయినా భార్యను ఇంతగా ఎవరూ మిస్ అవరు కథల్లో తప్పితే.

ఇడియట్. రాస్కెల్. బ్లడీ ఫూల్. నీకంతా జోక్ గా ఉందా?
ఎకశయనులయినంత మాత్రాన అది సంసారమా?
ఎన్ని రోజులయింది రాహుల్ నాకిది కొనిపెట్టు అని అడిగి? 
ఎన్ని రోజులయింది అక్కడికి తీసుకెళ్ళు అని అడిగి?
నీ జీతం నాతొ సరిసమానమే అయినా సరే ఒక పొట్లం పూలు కొనీ రాహుల్ అని అడిగి ఎన్నేళ్లయ్యింది?
అన్నీ నువ్వు కొని తెచ్చేసుకుంటావు....ఏంట్రా అంటే దార్లోనే షాపింగ్ కాంప్లెక్స్ అంటావు బ్లడీ ఫూల్ 
పెళ్ళికి ముందు ఎన్ని కబుర్లు.. తెల్లవారి ఎండలో కాఫీ కప్పుతో భావయామి రఘురామం పాట విందామని? ఏది?
ఎన్ని సార్లు గొంతు కలిపావు గత సంవత్సరం నాతొ?
దశ దిశాంతాల........కురిసింది మకరందమే.......మానసవీణా అంటూ నాకోసం పాట పాడి ఎన్ని యుగాలయింది?

ఆఫీస్లో పనేక్కువయ్యిందండీ

చంపేస్తా. పెళ్ళి చేసుకునే ముందు ఏమనుకున్నాం?
మహారాజ వారి కళాశాల...బయట వరండా...మధ్యాహ్నం పూటా...సప్తస్వరాల వేయిరూపాలు....
ఏమయ్యాయి అవన్నీ?
ఎందుకిలా అయిపోయావు?

అన్నీ నన్నె అంటావేం?....నువ్వు ప్లాన్ చెయ్యొచ్చుగా?...నేను రానన్నానా?

నేను ఈ మధ్య క్లినిక్ ఎన్ని గంటలకు కట్టేస్తున్నాను?

చొప్ప దంటు ప్రశ్న. ఆరుకే కట్టేస్తున్నావు. 

వారంలో ఎన్ని రోజులు క్లినిక్కి వెళుతున్నాను?

అయిదురొజులే.

ఎందుకు?

........







వెనుక నుంచి చేతులు బలంగా హత్తుకున్నాయి 

వెనక్కు తిరగకుండా ఉండలేకపొయ్యాడు 

ఇష్టమయినట్టు చీరలో 
నుదుటిన మెరూన్ కలర్ సింగార్ తిలకం 
చెవులకు అదే కలర్ జూకాలు 
ముక్కుకు క్లిపాన్దే అయినా ముక్కుపుడక  

ఎక్కడ కొట్టుకుపోతున్నావు?

ఏమో రాహుల్. ఈ సాఫ్ట్ వేర్ జాబ్స్ ఏమో కాని........నేనెక్కడ జారిపోయ్యానో కూడా తెలియలేదు. 

తాకాలనిపించలేదు. తన మోహంలో భావం........




మొహం మీద నీళ్ళ మేలుకొలుపు 
డ్యాం....అనుకుంటూ కళ్ళు తెరిస్తే 
మళ్ళీ చీరలో, జుట్టు తడవకుండా ఎప్పటిలా షవర్ కాప్ లేదు
తడయిన జుట్టును టవల్తో తుడుచుకుని అదే జడకు చుట్టుకుని వచ్చి మంచం పక్కన నేలపై కూర్చుండి పోయింది 
తడి జుట్టులో వెళ్ళు జొనిపి....."చెప్పానా ఇలా ఉంటె....."
 "అభిమాన్లో జయాభాదురిలా పవిత్రంగా బావుంటాను" పూర్తి చేసింది కల్యాణి 
కనుకోనల్లో నీళ్ళు 

ఏం చేద్దాం చెప్పు. పక్కకు తిరిగి పడుకుని మంచం కోడు మీద తల పెట్టుకుని ప్రశ్నిస్తున్న భార్యను చూస్తూ ఉండిపోయ్యాడు.

వెనిస్ వెళ్దామా?
ఇప్పుడు సమ్మర్ అక్కడ 
ఊ అవును కదూ తమరి తిక్క కోరిక వింటర్లో వెళ్లాలని కదూ. కన్యా కుమారి వెళ్ళి సముద్రం ఒడ్డున?
ఛా...తరుణ్ ఏదో సినిమాలోది కాపీ కొట్టేసినట్టు ఉంటుంది ఫ్లైట్లో బీచ్కి తీసుకెళ్ళి హీరోయిన్ బర్త్ డే సెలబ్రేట్ చేస్తాడు.
పోనీ....ఆ....నువ్వనుకుంటావే సాంగ్లీలో ట్రీ టాప్ రిసార్ట్ అనీ....అడవి అనీ అక్కడికి వెళ్దామా?
మకరంద్ గాడి హనీమూన్ అయిడియా మనం రిపీట్ చెయ్యాలా?
బైక్లో శ్రీశైలం వెళ్తూ మధ్యలో వచ్చే ఆ సీతాకోకచిలుక గుంపులను చూద్దామా 
నాకు టూ వీలర్ రాదు, నేను ఆనంద్లా నీ వెనుక కూర్చోను రూపా 
పోనీ మొదటిసారి తీసుకెళ్ళావే మైలాపూర్ దేవాలయం...కృష్ణదేవరాయల నాటి మండపం ..........................
కారణాలు చెపుతున్న కొద్దీ గెలవాలన్న పట్టుదల  ...కళ్ళలో కొట్టొచ్చినట్టు
సాఫ్ట్ వేర్ జాబులా మజాకా.....నవ్వుకున్నాడు రాహుల్ 

ఊ...త్యాగరాజ ఆరాధనోత్సవాలు?
సంద్రంలో బిందువులం.
విశ్వనాథ్ గారి సినిమాల్లోని గుళ్ళు? శంకరాభరణంలోని సింహాచలం...ఇలా?
సప్తపదిలోని దేవాలయం, సిరివెన్నెలలోని ఆ మెట్ల బావి ఇవి ఎక్కడివో కనుక్కునేప్పటికి ఏళ్లు పడుతుంది 
గొంతులో నిజంగా డిసప్పాయింట్మెంట్ ఈసారి నాకు 
మనకు ఇష్టమయిన పాటలన్నీ ఒక కలెక్షన్ చేద్దామా 
ఈసారి మాత్రం కళ్ళల్లో గొంతులో చుర్రున కాలింది ....మన యూ ట్యూబ్ ప్లేలిస్ట్స్ కూడా చూసే తీరిక లేదనమాట ఆఫీస్లో 

ఆంధ్రజ్యోతి, ఆంద్రప్రభ, ఈనాడు ఆదివారం......ఒక సంవత్సరం కథలన్నీ తీసుకుని సమీక్ష రాద్దామా?
నాకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ..... కాని నువ్వేం చేస్తావు ఇందులో గంటకో కాఫీ కప్పు తెచ్చియ్యటం తప్ప?
పోనీ కలిసి ఒక బ్లాగ్ రాయటం మొదలెడదామా?
కాపీ అయిడియానే కాని నా స్థాయికి నువ్వు రాలేవు అసలు బావోదు 
పోనీ మంచి మంచి పాత పాటల్లో మనకు నచ్చిన ఆలాపనలు ఏ రాగాలవో ఒక లిస్ట్ చేద్దామా?
దయ్యం....నేను నీ స్థాయికి ఎన్నటికీ రాలేను. 
నవ్వేసింది. తను అసంకల్పితంగా చేసిన పని అర్థమయి. 
అవును మరి.రెండు సార్లు నువ్వు నా లెవెల్ కాదు అంటే ఊరుకునే ఘటమా దేవేరి?      

ఇద్దరం కలిసి ఆవకాయ, వడియాలు పెడదామా?
స్వర్ణకమలం చాయలు కనపడుతున్నా బానే ఉంది కాని అమ్మ నేను పెడతా ఉండు అని వస్తే?
తన ముఖకవళికలు చూసి నవ్వాగలేదు నాకు 
ఇన్నేళ్ళ తరవాత కూడా "లేదు రాహుల్ ఈ పని నీతో వంటరిగా చెయ్యాలని ఉంది" అని అనలేవా 
మొటిక్కాయ ప్రసాదం మహా ప్రసాదం 

నువ్వే చెప్పు అంది.
ఓడిపోయ్యాను అన్న భావం అస్సలు లేదు స్వరంలో.

let me be part of your life.
let it be everyday humdrum or that special day's special moment
make me your nucleus
ప్రత్యేకంగా ఇంకేమక్కరలేదు 
make me part of your everyday life 
if for that you have to level off in your career graph, do it.
if as satyam raju said, your job's becoming a tiger which you can not get down from, leave it.
I don't mind being called an MCP by all......if you think you will enjoy that phase of life, take a sabbatical
I know you can never stay off work completely...so take a sabbatical 
ఒకారు నెలలు లీవ్ తీసుకో 
ఒకారు నెలలు మళ్ళీ ఆడపిల్లగా బ్రతకటం నేర్చుకో
ఒకారు నెలలు ఎడుపోస్తే నా భుజాన్ని ఆసరా తీసుకో
ఒకారు నెలలు నీవు మానేజ్ చెయ్యాల్సింది ఒక్క నీ వాడినే అని అనుకో.

నిజంగా నాకు బహుమతిగా ఏదయినా ఇవ్వాలని ఉందా?
నీకు ఊహ తెలిసిన రోజునుంచి నీ స్మృతులు నాకు చూపెట్టు 
let me be part of your life's every moment, even those in the past, even if in retrospect.

ఇంకా ఏదో అనబోతున్న రాహుల్ మాట్లాడలేకపోయ్యాడు.
 

Tuesday, 5 July 2011

My Amygdala's working too well

అర్ధరాత్రి 
ఉచ్చ కంపు.
 
అనకొండ పాములా 
మెదడు సరసరా  

హైదరాబాదు 
ఉస్మానియా ఆసుపత్రి 
ఎం ఎం టూ వార్డు
స్నానాల గది 

దాంతోపాటే 
దూది ఉండలు చేస్తూ అమ్మ, నేనూ 
నొప్పివ్వని ఇంజెక్షనిచ్చిన ఆ హౌస్ సర్జెన్ 
నిండు గర్భిణీ డా ఇందిర
అసి  ప్రో డా రఘురాం 
కళ్ళద్దాల పై నుంచి చూస్తూ 

సింహంలా డా సహాయ్ 
వెనక మేకపిల్లల గుంపు 
అదే హౌస్ సర్జన్లు 
తెల్లటి కోటుల్లో దేవదూతల్లా 

బయట వరండాల్లో 
వెనక గార్డెన్స్లో 
జంబఖాణాలపై 
రోగితో సహా 
ముస్లిముల విందులు 

కారిడార్లలో 
పాన్ మరకలు 
సర్వమత సమానత్వాలు 

నా అమిగ్డలా పుచ్చకాయంత ఉండే ఉండాలి!
(Amygdala=Emotional Memories) 

Monday, 4 July 2011

నా కుటుంబంలో ఒకడివి కావాలి

తలుపులు తలుపులు తలుపులు
తలపుల తలుపుల్ 
మనసుల తలుపుల్ 
తనువుల తలుపుల్
మనుషుల తలుపుల్ 
తలుపులు తలుపులు తలుపులు 

తలుపులు తలుపులు తలుపులు
ఆస్థిత్వపు తలుపుల్ 
ఆస్థి  కప్పు  తలుపుల్
రేఖల తలుపుల్  
మూసల తలుపుల్ 
తలుపులు తలుపులు తలుపులు 

మనిషి మనిషి మనసు మనసు 
విడిచేసే విరిచేసే మరి మరి కరిచే 
తలుపులు తలుపులు తలుపులు  

హెచ్చుల తలుపుల్ 
జిహ్వల తలుపుల్ 
విహ్వల తలుపుల్ 
శృంఖల తలుపుల్ 
తలుపులు తలుపులు తలుపులు 

ఎవ్వడురా అక్కడ 
చెయ్యను రా ముక్కల 
తలుపుల నడుముల్ 
తలుపుల నడుముల్ 
తలుపుల నడుముల్  
ఎవ్వడురా అక్కడ? 

Sunday, 3 July 2011

7b


ఎపుడయినా ఎవరినయినా ప్రేమించావా మన్నూ 

ఏం ఎకసెక్కాలా?

లేదు నిజంగానే అడుగుతున్నా చెప్పు.

ప్రాణం కంటే మిన్నగా ......నీకు తెలీదా?

తెలుసు. అయినా ఆ మాట చెప్పటంలో ఉన్న ఆనందం మళ్ళీ నీకు కలగాలని అగుతున్నా 

అవును ప్రేమించా.....ప్రాణం కంటే మిన్నగా లాటి డైలాగులు ఎలా పుడుతాయో స్వానభవమయెంతగా ప్రేమించా 

నిన్ను నువ్వు చంపుకోవాలన్నంత ఎపుడైనా అవమానం పొందావా ఆ ప్రేమలో 

అవతలి వ్యక్తిని చంపాలన్నంత కోపం కూడా వచ్చేంతగా అవమానం పొందా 

అయినా ఇప్పటికీ ప్రేమిస్తున్నావు అవునా?

చచ్చేవరకూ ప్రేమిస్తా. బయటకు నీలా అరవకపోవచ్చు కాని చచ్చెంతవరకూ ఆ భావన మనసులోనే ఉంటుంది. అయినా ఇలాటివి బయటకు చెప్పుకునేవి కావు. అసలు మన మనసులో భావం రెండో వ్యక్తికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రేమయినా కాని, కోపమయినా కాని, బాధయినా కాని....సమర్ధుడు ఆ భావాన్ని మనసులోంచి బయటకు కక్కనీదు. 

ఒకనాడు "ఎందుకు చెప్పవు? నాకు తెలియాల్సిందే. నువ్వు చెప్పేంతవరకూ ఇలా నీ వెంటపడుతూనే ఉంటా. నీ మనసులో ప్రతీదీ నాకు తెలియాల్సినదే" అన్న నువ్వు ఎలా మారిపోయావో నువ్వు గమనించకపోయి ఉండచ్చు. సరేలే అది అప్రస్తుతం. ఒకటి చెప్పు. నువ్వు ఇంతకుముందు అన్న మాటలన్నీ.....అదే అహం వదిలేస్తాము అంటున్న వాళ్ళు నిజంగానే ఆ ఎకాక్షరి జపించటానికి అర్హులా ....ఇలా అన్న్నవన్నీ......నిన్ను నువ్వు అనుకున్నవే కదూ? అలా నీ ప్రాణాన్ని నువ్వు క్షమించటం చేస్తున్నావు అన్న అనుభవం ఎదురయినప్పుడు నిన్ను నువ్వు అనుకున్న మాటలే కదూ అవి?

"......"

"సరే. నువ్వేం చెప్పద్దు. నేను చెపుతా విను. అవును నువ్వు ఒక మనిషికి దాసోహం అన్నావు. తప్పులు చేసిన ఆ మనిషికి నువ్వు శిక్ష విధించావు, నువ్వూ విధించుకున్నావే కాని ఆ మనిషిని అసహ్యించుకోలేకపోతున్నావు. సుధా చంద్రన్లా ప్రేమించి మోసం చేసిన వాడి మొహంపై డభాలున తలుపెసేసే తెగువ నీకు లేదని నిన్నునువ్వు కించపరుచుకుంటున్నావు. అది నీ బలహీనత అని నిన్ను నువ్వు కించపరచుకుంటున్నావు. కొంత కాలం అనుబంధానికి బానిసవైపోయావు అని నిన్ను నువ్వు తులనాడుకుంటున్నావు. 

నిజంగా నీ ఆలోచనలు నిజమా అనేది ఒక్కసారి ఆలోచించు.




ఒక మనిషిని అసహ్యించుకోవటమే బల నిరూపణా?

తప్పును అసహ్యించుకోవాలా తప్పు చేసిన వ్యక్తినా?

తప్పుకు శిక్ష విధించే నీ కర్తవ్యపాలన నువ్వు చేయకపోతే నీవు ఆక్షేపితురాలివి. 
కాని ధర్మమనే తండ్రి ఆజ్ఞ పాలించి తల్లి శిరసూడ్చిన పరశురాముడి సాటివి నీవని నిరూపించుకుని, ఆ తల్లి శరీరాన్ని పట్టుకు ఏడుస్తున్నావు అని ఎందుకు నీకు ఆక్షేపణ? తల్లిని పునర్జీవితను చేసే జమదగ్నులు లేవని తెలిసి నీ ధర్మాన్ని పాటించిన నీవు అసలు ఆ భార్గవ రాముడికంటే మిన్నేనేమో. అలాటి నిన్ను నువ్వు ఎందుకు నిందించుకుంటావు?

ఎందుకు సాటి మనిషిని అసహ్యించుకోవటమే బలిమి అయింది మనకు?




అసహ్యం లేకపోతె మనం జీవితాంతం ఆ ధర్మాన్ని పాటించలేము.

అబద్ధం. ఒక మనిషి మనకు దగ్గరవటం ఎన్నో కారణాల వల్ల అవ్వొచ్చు. వారి నుంచి విడివడటం ఒకటో రెండో కారణాల వల్లే....కాపోతే "అతిపెద్ద, క్షమించరాని....కారణాల వల్ల" అనిపించటం జరిగినపుడే ఈ పీకులాట. అలా ఆ ప్రాపంచిక కారణాల వల్ల భౌతికంగా దూరం చేసుకున్న మనిషిని మన మనసులోంచి దూరం చేసుకోలేకపోవటం పిరికితనం ఎందుకయింది? నీ మనసులో మూర్తిగా ప్రతిష్టించుకున్న మనిషి మామూలు మనిషి అని నిరూపించుకున్నప్పుడు ఆ మూర్తి గిరాటువేయబడాలా? నీ ప్రవర్తన సమాజానికి చేటు కానంత వరకు నీ మనసులో ఎవరిని ఎందుకు ఉంచుకోవాలో తీసేయాలో తెలిపే హక్కు    సమాజానికి లేదు.

ఒక మనిషి ఇష్టం అని అనుకోటానికీ, ఆ ఇష్టాన్ని మనసులో నిలుపుకోటానికి నీ మనసుకు కూడా నువ్వు వివరణ ఇచ్చుకోనక్కరలేదు కదా?




"మనసు కాదు బుద్ది అనాలేమో" అంటున్న తన వదనంలో వికసించిన సంతోషం కళ్ళలోని విషాద వీచికలను తరిమేస్తుంటే.....మబ్బుకొంగు నుంచి తప్పుకున్న సూర్యుని  చందంగా.....ఎంత ఆహ్లాదమనిపించిందో.

"కాదు కాదు మనసుకే నువ్వు వివరణలు ఇచ్చుకుంటున్నది."

"అదేంటి బుద్ది ఎప్పుడూ సమాజ కట్టుబాట్లలోనే కదా నడిచేది. తప్పొప్పుల తరాజు పట్టే షరాబు మన అంతః కరణాలలో బుద్దేగా. మనసేప్పుడూ ఇంద్రియానుసరిణే కదా "నాకు నచ్చింది, నాకు కావాలి" అని అంటున్నది ఇక్కడ మనసో, అహమో అవాలి కాని బుద్దేలా అయింది మొద్దు సుబ్రావ్?" 

చిన్న పిల్లాడిని చూసి స్వచ్చంగా నవ్వేస్తున్న తనను చూసి ఎంత కాలం అయింది? ఆ నవ్వెంత బావుందో.....

ఎంతో చెప్పనా? "గలగలమని నవ్వవే సొగసు కరిగిపోతుందీ చిలిపికళ్ళు మూయకే చీకటి పడిపోతుంది" అని నీ చేత పాడించే అంత బావుంది కదూ?

వద్దులే అమ్మాయ్. మళ్ళీ నా క్లాస్మేట్ ఆ అమ్మాయిలా నువ్వూ "గ్రాండ్ ఫాదర్ సెస్ మై సన్ బీ కేర్ఫుల్" అంటూ అర్థం వచ్చే ఇంకో పాటేత్తుకుందామనా? అవసరంలేదులే.

అయినా తగిన శాస్తేలె అబ్బాయికి....నీకు ఇష్టమయిన పాట నువ్వు పాడె హక్కు నీకుంది...కాని దాన్ని this is dedicated to the smiling beauties of the class అని డేడికేట్ చేస్తే భామలు ఊరుకుంటారా? పైగా పిక్నిక్లో అందరి ముందూ? పైగా మెడికోలు? 

But a memorable incident, was it not. But anyway lets not digress
లేదురా మన్నూ నువ్వు ఇక్కడ చెపుతున్నది తప్పనుకుంటా. ఇప్పుడు నీ ఆ మనిషిని కోరుకునేది నీ మనసు కాదు బుద్దేనేమో. 
నీలో మునుపటి ఆవేశం లేదు. ఆ మనిషి సామీప్యంలో, సమక్షంలో ఆకర్షణకు లొంగిపోతున్నావు అన్న సమస్యే లేదు ఇంద్రియాలు నిన్ను బంధించేసాయి అనటానికి. నచ్చిన మనిషి జ్ఞాపకాలు మిగిలున్నాయు. వాటిని తరాజులో బేరీజు వేసుకున్నావు. అయినా నీకు ఆ మనిషే నీడగా నడవాలని ఉంది. ఆ మనిషి అడుగులో అడువవ్వాలని ఉండి. ఆ మనిషి మారితే అక్కున చేర్చుకోవాలని ఉంది. ఇక్కడ ఇవన్నీ చేస్తున్నది నీ బుద్దే కాని మనసు కాదు కదా? 

నువ్వే పోరాపడుతున్నావేమో. ఇక్కడ అన్ని బెరీజులూ వేసి బుద్ది మనిషిని దూరం చేసి తన పని తాను చేసేసింది. కాని మనసు మాత్రం అలవాటయిన మత్తు పానీయాన్ని వదలలేని బానిసలా అదే మనిషిని కోరుకుంటోంది. అందుకే నాకు ఆ మనసంటే అంత అసహ్యం. అందుకే నాకు ఈ ఐక్యమవటాలూ....ఈ అహాన్ని వాడులుకోవటాలూ అంటే అంత అసహ్యం, అపనమ్మకం.




మ్....మండోదరి మహా పతివ్రత అంటారు నమ్మవచ్చా?

అదేంటి హటాత్తుగా ఇతిహాసాల్లో పడ్డావు. సరేలే. అవును మండోదరి జగమేన్నిన పతివ్రతల జాబితాలో లేకపోయినా ఆమె పతివ్రతే అంటారు నిజమే. 

రావణబ్రహ్మ లాటి దుర్మార్గుడికి ప్రేమించబడే అర్హత ఎక్కడుంది?
అయినా ప్రేమించిన తను పతివ్రతా ఎలా అయ్యింది?

తప్పు ఉపమానం. ఇక్కడ మనం మాట్లాడుతున్నది మన వ్యక్తిత్వాన్ని, మన్నూ కించపరిచిన మన వారి గురించి.

అవునా? పరాయి ఆడదాన్ని ఎత్తుకొచ్చి బలవంతం చేయటం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచటం కాదా?

ఆనాటి సామాజికపరంగా కాదు.

అయితే వ్యక్తిత్వం అనేది సమాజ దృక్పద దర్పణమా?

అవునేమో. ఒకనాడు భర్త కోరితే వేశ్య దగ్గరకు స్వయంగా మోసుకెళ్ళిన స్త్రీ కూడా పరమ పతివ్రత. మరీనాడు అలా చెల్లదుగా?

అయితే సామాజిక దృక్కోణంపై మనం ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు అన్నది ఆధారపడిందా?

కాదు. అవును.
ఎవరిని ప్రేమించాలి, ప్రేమించకూడదు అన్నది సమాజం నిర్వచిస్తుంది 
కాని ఎవరిని ప్రేమిస్తాము, ప్రేమిస్తూనే ఉంటాము అన్నది మన మనసే నిర్వచిస్తుంది 

వెరీ గుడ్. దొరికావు పిల్లా. అవును కదా? నిర్వచనాలు సమాజం చేసినా తన పని తాను చేసుకుపోఏదే మనసు.
ఇక్కడ నీకింత మానసిక ఆందోళన దేనికో తెలుసా? సమాజం నిర్వచనాలను నువ్వు అధిగమిస్తున్నావు అని.
ధర్మం నమ్మే నువ్వు ఇలా చేస్తే ధర్మాతిక్రమణ జరుగుతుంది అని జంకుతున్నావు 
The distress that you experience is nothing but the valid self examination every wise man does go through when crossing the boundaries set be the society. This is called post conceptual stage of thinking. సిద్ధాంతాల ప్రకారం (సామాజిక కట్టుబాట్ల ప్రకారం ) ఆలోచించే మనిషి కొంచం ఎదిగితే వచ్చేదే ఈ post conceptual stage of thinking. ఇక్కడ నువ్వు సామాజిక కట్టుబాట్లను గుడ్డిగా నమ్మక ప్రతీ సిద్ధాంతానికీ ఎక్సేప్షన్లనేవి (మినహాయింపులు...హమ్మయ్య) ఉంటాయి అన్నది స్వానుభవంగా అవగాహనలోకి వచ్చినా ఇది నీ స్వార్థానికి సంబంధించినది కాబట్టి ఎక్కడ ఉత్తి ఆకర్షణలో పడికొట్టుకుపోతున్నావో అని నిన్ను నువ్వు అగ్నిపరీక్షకు గురిచెయ్యటమే ఈ నీ అలజడి. నీకు నీ నడవడిక మీద, నీ ఆలోచనల మీదా పట్టు పెరిగిన కొద్దీ నీకు ఈ అలజడి తగ్గుతుంది. It is nothing but the process of building up your courage of conviction.

But how can I differentiate this from the blind foolish steadfastness of a stubborn person, being taken along the tides of emotion? he might be feeling the same way that he is not wrong and that he is able to analyse and declare himself free of guilt.


That's the responsibility that comes with post conceptual thinking. 
With the cup of Hamlock in your hand,
With the guards withdrawing discreetly away,
you have no other company than those of your thoughts
You are the one and only who can decide if you drink the Hamlock or repent and recant.
Its down to you, period.
Remember, the Damocles sword hangs only on the king's head. 


ఆలోచిస్తే, ఆలోచనలు ఉంటె..... జీవితం ఇంత వంటరిని చేస్తుంది అనుకోలేదు రఘూ.

చేతిలో చెయ్యి వేసి అన్నాను 
"ఒంటరివెక్కడయ్యావు? 
నీ గుండెలో దాగున్న ప్రేమ ఉంది 
చేతిలో చెయ్యి వేసి నడిపించే నీ వారున్నారు 
ఇంకా ఒంటరివా?"

7a  6 5 4 3  2  1