ఏమండీ
ఏమిటీ ఈ పిలుపు
ఏమయింది?
పేరు పెట్టి తప్ప పిలువని నువ్వు ఇలా పిలుస్తూ ఉంటే వింతగా ఉంది
....
ఏమిటోయ్ ఏదో చెప్పబోయి ఆగిపొయ్యావు? చెప్పు.
....
ఏమిటీ నేను తప్పు పట్టాను అనుకుంటున్నావా? కోపమొచ్చిందా?
లేదు. ఉన్న మాటే చెప్పావు....... చెప్పా....రు.
మరైతే చెప్పు.
ఎలా చెప్పాలో తెలియట్లేదు....
మళ్ళీ వింత. ఈవేళ ప్రపంచంలోని వింతలన్నీ మన ఇంట్లోనే విరబూస్తున్నట్లున్నాయి. మనసులో మాట కుండబద్దలు కొట్టేసే నీకు....విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదా?
.....
సరే, నీకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడే చెప్పు.
*****
ఇవాళ వెళ్ళద్దులే రాహుల్......
....
ప్లీస్
సరే
......
......
ఎందుకు అనడగవా......అడగ.....రా
ముందా బలవంతపు గౌరవం ఆపేయ్. నువ్వు పేరెట్టి పిలిచినా, ఏకవచనంలో పిలిచినా గౌరవం చూపెట్టొచ్చు. బహువచనంలో పిలిచినా తృణప్రాయంగా కొట్టీ పారేయొచ్చు. నీకేది కంఫర్టబుల్గా అనిపిస్తే అది వాడు. అనవసరంగా నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు. ఎబ్బెట్టుగా ఉంటుంది.
....
.....
.....
సరే సరే, నీకెలా అనిపిస్తే అలా....చెప్పు, ఎందుకు సెలవుపెట్టుకున్నావు, నన్నెందుకు వెళ్ళొద్దన్నావు?
....
....
పెళ్ళయి మూడేళ్ళయింది.....మరి, మరి...
ఊ మరి?
ఇంతవరకు.....
ఊ?
ఒక్కసారి కూడా ఐ లవ్యూ చెప్పలేదెందుకు
ఏయ్ .....ఏమిటా కన్నీరు? ఏమిటిది?
ఇదే...ఇదే అర్థం కానిది నాకు, నన్ను పిచ్చి దానిని చేస్తున్నది ఇదే. కొంచం బాధ కలిగినా కదిలిపోతావు. ఎంతో ప్రేమగా చూసుకుంటావు. కానీ....కానీ, మూడేళ్ళలో....ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్కసారి.....ఐ లవ్యూ అనలేదు. ప్రేమ లేదు అనుకునేంత పిచ్చి దానిని కాదు. నీ ప్రతి పనిలో, ప్రతీ చేష్టలో అది తెలుస్తూనే ఉంది. కానీ, నోటెంట మాత్రం రాలేదెందుకనీ?
....
చెప్పండీ
....
చెప్పరా
....
చెప్పుబే.....ఏం తక్కువ చేసాను నీకు?
ప్రేమంటే ఏమిటో అర్థం కాక దాని జోలికెళ్ళదలచుకోలేదు...అంతే. మనసా వాచా కర్మణా త్రికరణంగా ఉండాలి అనుకుంటాను కాబట్టే నాలిక మీదకూ తేలేదు.
ప్రేమంటే తెలీదా? నీకు?
ప్రేమంటే తెలీక కాదు అర్థం కాక
అంటే?
ఏం ప్రేమలివి కల్యాణీ? స్కూల్లో ఇద్దరూ, కాలేజీలో ఒకరూ....ఇలా ముగ్గురిని "ప్రేమించాను". పెళ్ళీ చేసుకోవాలనుకున్నాను. కాని అవతలి వారికి ఈ విషయం తెలీకుండానే కాలగతిలో కలిసిపోయారు. ఒకరినే ప్రేమించటం "నిజమైన ప్రేమ" అంటుందీ లోకం. నేనంత మందిని ఎలా "ప్రేమించగలిగాను"? నిజంగానే ఉత్త ఆకర్షణేనా అది? ఇంఫాట్యువేషన్??? ఎందుకో అలా అనిపించలేదు. పోనీ అవి ఇంఫాట్యువేషన్ అనుకో ...పీజీ చేస్తున్నప్పుడూ, హాస్పిటల్ ప్రారంభించినపుడూ......నీతో పరిచయం, స్నేహం.....అలా సాగిపోయింది కదా. నిన్నెప్పుడూ పెళ్ళి చేసుకొవాలి అనుకోలేదు. నీకూ నాకూ ఏ విధమైన అభిరుచులూ కలవవూ. అయినా పెళ్ళయిన తరువాత, నీకే మాత్రం ఇబ్బందయినా ముల్లవుతుంది. కానీ నీపై ఆకర్షణేదీ లేదు నాకు. నన్ను మైమరిపించే రూపమున్నదానివీ కాదు.......పోన్లే ఫీల్ అవుతావు అనుకున్న, సన్నగా నవ్వుతున్నావు ఆ మాటకు కోపం తెచ్చుకోకుండా...........నన్ను తరాస్థాయికి తీసుకుపోయే సంగీత రసఙ్ఞత కానీ, ఝామెంతయిందో తెలీకుండా చర్చల్లో ముంచేసే సాహిత్యాభిలాషా.....ఇలా నాకు నచ్చినవీ, నేను కావాలనుకున్నవీ....ఒక్కటీ లేవు. నిజం చెపుతున్నా. పెళ్ళి అవసరాల కోసం చేసుకున్నా. పోనీ పెళ్ళి చేసుకున్నాకా నీ ప్రవర్తనా, ప్రేమా ఆప్యాయతా అనురాగాలూ తొక్కా తోలూ మసానం మన్నూ ఇలాటివి నన్ను "కదిలించేసాయి" అనేలా నీ ప్రవర్తనా అనుకున్నా అదీ లేదు. మామూలు సగటు మధ్య తరగతి గృహిణివి. హాస్పిటల్ ఇల్లూ పిల్లలూ సగటు ఆశలు, సగటు చికాకులు....ఇదీ, వెరసి....నీ అస్థిత్వం..........................అయినా, కదిలిపోతాను నువ్వంటే. ఆ "కదలికేనా" ప్రేమంటే? జరుగుబాటు, సర్దుబాటులల్లోనుంచి పుట్టినా సరే....ఆ "కదలటమేనా" ప్రేమంటే? అయితే మరి ఇంతకు ముందు నన్ను కదిలించినవి? ప్రేమలు కావా? అప్పుడు అంటే కాలేజీలొ ఉదాహరణకు తీసుకో......కాలేజిలో ఆ స్నేహితురాలితో గడిపే అవకాసం ఉండి ఉంటే......"అవకాసం" "సాన్నిహిత్యం" ఉండి ఉంటే.......అపుడు ఇంతకంటే బలంగా ఉండేదేమో ఆ "కదలిక" నాకు తన పట్ల? "అవకాసం", "చేరువ" లేక అప్పుడు కలగని, అవి ఉండి ఇప్పుడు కలిగినా ఈ "స్ఫందనేనా" "ప్రేమంటే"? అలా అయితే అందులో గొప్పతనమేముందిరా? వై షుడ్ ఐ సెలబ్రేట్ లవ్ ఇఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ సో ఫికిల్ థింగ్స్ లైక్ కాంటెక్స్ట్ అండ్ అవైలబిలిటీ అండ్ ప్రాక్సిమిటీ? నా లేదా నీ గుణాల, రూపుల, ప్రవర్తనల నుంచి కాక ఉట్టి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్....అంటే నువ్వు నాకు పడతావా లేదా అన్న దాని మీదా, నేను నిన్ను పొందటానికి చేసిన ప్రయత్నాల మీదా, నువ్వు వాటికి కరుణించి నాకిచ్చే వరాల మీదా..... ఆధారపడి ఉండే కదలికే, స్ఫందనే ప్రేమ అయితే.....................ఏమో అది నాకు సెలబ్రేట్ చేసుకునే, అదే......ప్రత్యేకంగా లవ్ అనే పేరెట్టి, అదే పనిగా దాని నామస్మరణ చేస్తూ సెలబ్రేట్ చేసుకునే గొప్ప విషయంలా అనిపించలేదు. దాని కంటే, ఒక కమిట్మెంట్ కు సాక్షమయిన ఈ తాళి, మూడు ముళ్ళూ...వీటికి విలువనిస్తూ, చికాకుగా అయినా నువ్వు నన్ను భరిస్తావు చూడూ......అది సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. నీ సొల్లు సీరియల్స్ నేను చూడనూ అని నేను విసుక్కున్నా నువ్వు చిన్నబుచ్చుకుంటే చివుక్కుమనే నా మనసు ఏ బంధానికి లొంగి అలా చివుక్కుమంటుందో, ఏ భాధ్యతను నిబధ్ధతగా పాటించాలనుకుని, ఇష్టం లేకపోయిన కష్టన్నయిన భరిస్తూ "ప్రవర్తిస్తుందో" ఆ "ప్రవర్తనను" సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే నాకు నీకు ఐ లవ్యూ చెప్పటం కంటే నాకిష్టమని నువ్వు హారర్ సినిమాకి నాతో వచ్చి, అది భరించలేక కళ్ళు మూసుకున్నప్పుడు నీ కళ్ళనూ, నీ చేతి బిగింపునూ సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది. పుట్టు ఐశ్వర్యవంతురాలివి. నీకీ మధ్య తరగతి విలువలూ, శ్లేష్మంలో ఈగలో కొట్టుకుంటూనే దాన్నే మధురమనుకునే మధ్య తరగతి మనస్థత్వాలూ అర్థమవుతాయో, రుచిస్తాయో లేదో నాకు తెలీదు. కానీ నీకు ఐ లవ్యూ అని చెప్పటానికి నోరు రాదు నాకు. ముందే ముగ్గురాడాళ్ళకు మనసు పారేసుకున్నోడికి మళ్ళీ ఐ లవ్యూలు గివ్యూలూ ఏమిటి సోద్యం కాపోతే? మధ్యతరగటి అపరాధనా భావమనుకో, ఏమయినా అనుకో. నా నోరు పెగలదు.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
"No, No" I remember waking up crying out.