అనగా అనగా అనగా
అనగనగనగనగనగనగా అంతే ఇంకేముందీ చాలు కదా
అనగా అనగా అనగా
అనగనగనగనగనగనగా
అంతే ఇంకేముందీ చాలు కదా
ఉందంటే ఉన్నట్టూ
ఆకాశం లాంటిదే ప్రేమ కథా
దీనికి ఆది అంతూ అంటూ ఉంటె కదా
అనగా అనగా అనగా
అనగనగనగనగనగనగా
అంతే ఇంకేముందీ చాలు కదా
ఆ.....ఆ....
వడగాలై కొడుతుంది
వడగళ్ళై పడుతుంది
చలిముల్లై కుడుతుందీ
వలపోచ్చీ
ఆరు ఋతువుల్నీ
ఓసారే రప్పించీ
వడగాలై కొడుతుంది
వడగళ్ళై పడుతుంది
చలిముల్లై కుడుతుందీ
వలపోచ్చీ
ఆరు ఋతువుల్నీ
ఓసారే రప్పించీ
తనలోనే ఉన్నట్టూ కన్నుల్నీ ఆకట్టీ
రమ్మందీ పైనుంచీ కూతెట్టీ
తాను కూర్చుందీ గుండెల్లో గూడెట్టీ
రమ్మందీ పైనుంచీ కూతెట్టీ
తాను కూర్చుందీ గుండెల్లో గూడెట్టీ
అనగనగనగనగనగనగా
అంతే ఇంకేముందీ చాలు కదా
ఈ కథనే చెప్పిందీ జోకొట్టి
ఒళ్లో పడుకోబెట్టూకున్న ఈ మట్టీ
మజునూలేంతోమందికి గజినీలెంతోమందికి
ఈ కథనే చెప్పిందీ జోకొట్టి
ఒళ్లో పడుకోబెట్టూకున్న ఈ మట్టీ
కడదకేమయ్యిందో తెలియదు కాబట్టి
కాబట్టి
మళ్ళీ వినిపిస్తుందీ మొదలెట్టీ
ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తీ
మళ్ళీ వినిపిస్తుందీ మొదలెట్టీ
ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తీ
అంతే ఇంకేముందీ చాలు కదా
ఉందంటే ఉన్నట్టూ
లేదంటే లేనట్టూ
ఆకాశం లాంటిదే ప్రేమ కదా
దీనికి ఆది అంతూ అంటూ ఉంటె కదా.
చిత్రం:- కుదిరితే కప్పు కాఫీ
సంగీతం:- యోగేశ్వర సారమ
గాత్రం:- కీరవాణి
కుదిరితే కప్పు కాఫీ. నిజంగా మంచి కాఫీ లాటి సినిమా...నా వరకు నాకు.
హాయిగా అలా చూసేసి అలా మరిచిపోయ్యా.
చూసినప్పుడు అసలే పాటా మనసును తాకలేదు
తాకలేదో తాకనివ్వలేదో :)
యధాలాపంగా తరవాతెప్పుడో కారులో పాటలు వింటూ వెళుతున్నా.
(మన దేశం వచ్చేసాక నేను నిజ్జంగా మిస్ అయ్యే మొదటిది ఇదే అవుతుంది ఖచ్చితంగా.
ఎంతో దూరం కారులో వెళ్ళినా ఒకసారి మోటార్వె ఎక్కితే ఇక అసలు రోడ్ పై ఎక్కువ ధ్యాస అక్కరలేదు
ఎన్ని గంటలు ఇలా నాకు నచ్చిన పాటలనూ స్తోత్రాలనూ పారాయణం చేసానో రోడ్వెలపై వెళుతూ)
అలాగే వింటున్నా. ఎందుకో మొదటి మూడు పాటలు ఆకట్టుకోలా అప్పుడు. (ఇప్పుడు ఈ సినిమాలో అన్ని పాటలూ చాలా ఇష్టం). అకస్మాత్తుగా ఏదో స్వరం.....గమ్మత్తుగా ఉంది. అయినా ఆకట్టుకోలా. నా ఆలోచనల్లో నేను.
కాని నా ఆలోచనలకు టక్కున బ్రేక్ వేసింది ఒక చరణం
మజునూలేంతోమందికి గజినీలెంతో మందికి
ఈ కథనే చెప్పిందీ జోకోట్టీ
ఒళ్లో పడుకోబెట్టూకున్న ఈ మట్టీ...............
అంతే చకచకా వేళ్ళు కదిలాయి. పాట మళ్ళీ మొదలెట్టింది. ఈసారి ఆపేసిన చరణం
కునుకోచ్చిందే కాని ఊకోట్టీ ఊకోట్టీ
కడదకేమయ్యిందో తెలియదు కాబట్టి
కాబట్టి
మళ్ళీ వినిపిస్తుందీ మొదలెట్టీ
ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తీ
సబాసో.....మళ్ళీ వెనక్కుపొయ్యింది
ఈసారి ఆగిపోయింది ఆలాపన దగ్గర
ఓ...ఓ.......
ఓహో...ఓహో....
ఓ....ఓ...
(అవునూ ఈ ఆలాపాన మొత్తం అనగా అనగా అనగా.....నుంచి ఆది అంటూ అంటూ ఉంటె కదా ....వరకూ ఉన్న స్వరాలదా లేక ఆ స్వరాలకు సంబంధం లేనిదా? ఎవరికైనా తెలుసా?)
ఈసారి లాలీపాప్ లేడీ వేషం వేసి నా ఆలోచనల కారుకు అద్దం పడే వంతు ఇంకో చరణానిది
వడగాలై కొడుతుంది
వడగళ్ళై పడుతుంది
చలిముల్లై కుడుతుందీ
వలపోచ్చీ
ఆరు ఋతువుల్నీ
ఓసారే రప్పించీ
అవునూ లాలీపాప్ లేడీ అంటే మీకు తెలుసా?
ఇక్కడ స్కూల్ పిల్లలు సేఫ్గా రోడ్ దాటాలని పొద్దున్న ఒక గంట, సాయంత్రం ఒక గంట బడి వేళలప్పుడు ఒక బోర్డ్ పట్టుకుని ఎక్కడపడితే అక్కడ ఎడా పెడా కార్లను ఆపేసే అధికారం ఉన్న extra constitutional traffic wardens లాలీపాప్ లేడీస్ అనమాట. కొంతమంది ఈ ఉద్యోగాలను ముప్పై ఏళ్ల నుంచీ చేస్తున్నారట ఇక్కడ. పిల్లలకు ఎంతో ప్రీతి పాత్రం ఈ లాలీపాప్ లేడీస్.
ఇదిగో ఇలా ఉంటారు
సరే సరే విషయానికొద్దాం.
మామూలుగా అయితే ఇలాటి పాట వినగానే సిరివెన్నెల అనేసుకుంటా. కాని ఈ మధ్య జొన్నవిత్తుల గారివీ, అనంత శ్రీరామ్వీ (అనంత రామశర్మ? ఏమో పేరు సరిగ్గా గుర్తు లేదు ;-) కొన్ని చెంప చెళ్ళుమనిపించాయి అలా అనుకున్నప్పుడు. ఒకరు కాకి ఒకరు కోయిల అనటం మానేసి ఎవరివైనా సరే రాళ్ళనుంచి రాతనాలను ఎరుకుతినటం నా వంతు అనేసుకున్నా :)
ఇంత సాహిత్యం బావున్నా నన్ను విపరీతంగా ఆకట్టుకుంది ఇందులోని లయ, గాయకుడి స్వరం. ఇవేళే తెలిసింది కీరవాణి స్వరమని. Decided I need to make a collection of his songs అని. (బధ్ధకస్తుడిని....ఎవరిదగ్గరైనా ఇప్పటికే ఉంటె కాపీ కొట్టుకోటానికి ఇబ్బందేం పడను :)
ముఖ్యంగా
అనగా అనగా అనగా IIU IIU IIU
ఉందంటే ఉన్నట్టూ లేదంటే లేనట్టూ UUU UUU UUU UUU
అంతూ అంటూ ఉంటే కదా UU UU UU IU
ఇలా చూద్దామనుకుని రాసుకుంటూ పొతే నాకు లయ ఏదో అంతు పట్టలా
అన్నీ స గణమేమొ అనుకున్నా కాని కాదు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఇందులో గణాలు సొ లయ అందువల్ల కాదు
కాని ఎంతో ,ఏంటో......... ఆ లయ మాత్రం నిజంగా ఎంతో ఉంది
దీని గురించి ఆలోచిస్తూంటే ఒకటి అర్థమయింది (అనిపించింది)
లఘువుల్లో ఉండే సాహిత్యానికి దరువు/తాళ వాయిద్యాలు
గురువుల్లో ఉండే సాహిత్యానికి తంత్రి వాయిద్యాలు వాటి కంటే గాలి వాయిద్యాలు బాగా పనికొస్తాయి అన్నది తోచింది
మనసేదో సంగీత దర్సకుడైపోయినంత సంతోషపడింది.
అందుకే అంటారు
The beauty is in journey not in the end అని.
ముమ్మాటికీ నిజం.
స ప స ల్లో ప ను పట్టుకోటానికి పడ్డ శ్రమలోని ఆనందం......reminded me of the happiness when struggled but understood the complex inner ear structure, in my anatomy, physiology days!
నా స్వోత్కర్షకేం గాని నాకు ఈ పాట వింటుంటే వచ్చిన అనుమానం తీర్చండి ఎవరైనా
రమ్మందీ పైనుంచీ కూతెట్టీ
తాను కూర్చుందీ గుండెల్లో గూడెట్టీ
మళ్ళీ వినిపిస్తుందీ మొదలెట్టీ
ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తీ
ఈ రెండు చరణాలనూ రెండు విధాలుగా పాడతారు కీరవాణి ఇందులో.
మొదటిది కొంచం మంద్రంగా ఉంటుంది ఇంకోటి కొంచం షార్ప్ గా ఉంటుంది.
ఇక్కడ నా డవుట్ ఏమంటే
ఇవి రెండూ రెండు శృతుల్లో పాడారా?
ఇదేనా శ్రుతి మారటం అంటే?

No comments:
Post a Comment