Wednesday, 31 December 2008

నల్ల కలువ-మచ్చల చందమామ

నల్లటి తన వొళ్ళు విరుచుకుంటూ

నిద్ర లెచె కలువ
చల్లటి గాలి తట్టి లేపగ
కనులు తెరిచె కలువ

కొత్తగా తొచె లొకమంతా
"ఎందుకొ" అనుకొసాగె కలువ
ఎదొ అలజడి మనసున రేగ
వణకసాగె అర విరిసిన కలువ

కిందికి చూడ......ఎముంది? "పంకిలమే"
కాని...."రోజులా అసహ్యంగా లేదే" తలచె కలువ
పునాది పంకిలమైనా నేటి తన స్థితికి 
గర్వించి పొంకించె కలువ

తనను తాను తేరిపార చూడ 
"నల్లని" మేని చాయ కనలేదు కలువ
వయ్యారమౌ, ముగ్ధ మనొహరమౌ
తన "కళను" మాత్రమె గాంచె కలువ

చుట్టూ పరికించి చూడ 
"ఈ జగమంతా చిరపరిచితమె" తలచె కలువ
"అయినా"..........మునుపెన్నడూ కానని
శొభను గాంచి పులకించె కలువ

"ఎఱ్ఱని" తామర జూచి
"నేడేల రాదసూయ" పరికించె కలువ
"భాను తాప పరిణామమేయది, పాపం కందె"
యని జాలి కల్గనెంచె కలువ

ఈదులాడు చేప "స్వాతంత్ర్యము" జూడ 
"మునుపటి ఆలొచన రాదేల" తల్చె కలువ
మానవ కుక్షిన మొక్షము కంటె
"స్థిరమౌ దైవ పాద స్పర్శనమె మేలని " ఎంచె కలువ

"ఎమిటీ వింత? ఎందుకీ మార్పు?"
పరి పరి విధముల తరిచె కలువ
"మునుపెన్నడు లేని ధృక్పదములు 
నేడేల తొచె నాకు" అనుచు కలువ

"తనకే తన తనువేల తోచె మనోహరము?" 
స్వపరీశీలన జెయ సాగె కలువ
తెలియని సిగ్గేదొ ముంచుకు రాగ
కనులు అరమోడ్చె కలువ

"తరచి చూడ మార్పు ఒకటె
అది తెల్లని ఈ చంద్రకళే" యనుచు కలువ
నింగి జూసె, పున్నమి చందురుని జూసె
మోమున శత కళలు విరియ కలువ

చల్లటి శశిరేఖ మేను తాక
పులకరించి పలువరించె కలువ
ప్రశాంత తటమున అలలు రేగ
ప్రతీ రెకూ విప్పె పులకిత కలువ

తుషార బింధువులు స్వేద బింధువ్లై
మనసున అలజది తెల్పె కలువ
మచ్చల చందమామ స్వచ్చంగా కానరాగ
వివహ్వలయై కంపించె కలువ

అంతలొనె "చెంత చేరమని" ఆహ్వానముగా
జాబిలి రేపే అలలు బాహాటముగా
అలల తాకిడికి విలవిలలాడె
దరి జేరలేని నిస్సహాయ కలువ

"విడదీయలెని తల్లి వెరు పునాదిరా"
వినతి చెసె కలువ
"దరి చెరమని సడి చెయకురా"
బుజ్జగించె ప్రౌఢ కలువ

"ముగింపులేని ప్రయాణము నీ దరిరా"
దూరమెంచి వగచె కలువ
"సరి చెరమని సడి చెయకురా"
బావురుమనెనా నిస్సహాయ కలువ


"కొన్ని సంబంధాలింతె"
శాశించె కలువ
"విలువ దూరమున్నంత వరకె"
బోధించె కలువ


--

నా బ్లాగులో నాకు నచ్చిన టాప్ టెన్

"ఆయ్ బాబోయ్ ........మొదలెట్టేశా గాని ఏం చెప్పాలో తోచట్లేదండి. సరే ఏదో ఒకటి వాగేయటానికే కదండీ ఈ బ్లాగ్స్ ఉన్నవి. అందుకే వాగేస్తా.......... "ఈడెవడండీ బాబు తనకు తాను టాప్ టెన్ ర్యాంకింగ్ ఇచ్చేసుకుంటున్నాడు" అని అనుకుంటున్నారా.......మరేం సేసేదండి...... వీవెన్ గారు పెట్టిన ర్యాంకింగ్ల పోటీలో మరి నన్నెవరూ సేప్పలేదు కదండీ........... నాకు నచ్చిన "టాప్ టెన్ బ్లాగులు" అని రాద్దామనుకున్న వాణ్ని ...సత్ ...గాళ్ళకు రాసేదేంటి ...నాకు నేను రాసేసుకుంటే బావుంటుంది అనిపించి ఇలా డిసైడ్ అయిపోయాననమాట. మరిలేకపోతె అదేదో టపాలో ఎవరో మగాళ్ళకు బోడి గుళ్లకై తపస్సు సేసే నారీమణి టపాలో అనుకుంటా అందులో తప్ప మీరెవరూ నా ఊసెత్తరా ......ఆయ్.....మీకు ఈ సాస్తి తగిందే.

ఇంకో సిట్కా సెప్తునా? ఇనుకోండి............ఇలా రాస్తే మనం రాసినవి మొదట్లో కూడలిలో నేను కనిపించక ముందువి కూడా ........మీరంతా మళ్ళీ సూసేస్తారని...........అదన్న మాట సంగతి......"కొత్తగా మనం బ్లాగులో మొదలెట్టినప్పుడు మనది అందరు సూసేయాలంటే ఏరే వారి బ్లాగులు అన్నీ సూసేసి పరపరా వ్యాఖ్యలు రాసేస్తే తిరిగి బదులుగా మనకు ఆరూ వ్యాఖ్యలు రాస్తారు ..ఇది మన జనాలు అందరూ ఉపయోగించే ట్రిక్కే" అని ఒక పెద్దమ్మగోరు తన టపాలో అంటే ఇలా "రూపాంతరమో" ఏదో అంటారట సామీ..నాకు తెల్దు....అలా వాడేసా..... ఇక ఎక్కువ ఎకసక్కాలు, సోది లేకుండా సెప్తా ఇనుకోండి...........

౧. నాకు నచ్చిన నా ప్రక్రియ నేను కెలికిన దాంట్లో నాకు నచ్చిన మొదటిది

"మనోజ" పుట్టుకేనండీ బాబూ ....."మనోజ ఎవరూ" అంటారా అయితే మీరు నా "స్వగతాలు" సదవలేదనమాట .....ఆయ్ బాబోయ్ ...."మడిసన్నాక కూసింత కళా పోసనుండాలండీ"................. ఎంటనే ఈడ మనోజ ఎవరూ, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టిందీ, ఏటి సేస్తుంది అన్నది సూడండి. నాతొ ఎలా కీచులాడిందో కూడా సూడండి.

ఇంతకు ముందెవరూ ఇలా తన మనసుకూ బుద్ధికీ జరిగే కీచులాటను ఇంత బాగా సూపించే "ప్రయత్నం" సేయలేదండి బాబూ....నన్ను నమ్మండి.

౨. నాకు నచ్చిన కథ "నస్యం రంగు పట్టు చీర పిల్ల"

పైన సెప్పిన "మనోజ పుటక" నాకు నచ్చిన ప్రక్రియ అయినా ఆ ప్రక్రియలో సాధించాల్సినంత సాధించలేదని నాకు తెల్సండి.......కానీ నా "నస్యం రంగు పట్టు చీర పిల్ల"లో ( 1 2 3) మాత్రం నా "రసనా పటిమో గిటిమో" ఏదో అంటారు కదండీ........అది సూపర్ సూపర్ అని నా మనసే నాకు సేప్తుందండి....అందులోని ప్రేమ కథ కదండీ.....పైగా మెడిసిన్ సడువేప్పుడు అందరు సీతాకోక సిలుకల మధ్య మనసు కితకితలు ఎట్టే వాతావరణంలో రాసుకునా గదండీ....అందుకని ఇది నాకు సాలా సాలా ఇష్టమండి.

చివరికి ఏడిపించే కథే అయినా జీవితమంటే అంతే కదండీ...ఏడుపు నవ్వూ సమ పాళ్ళలో ఉంది కదండీ....పైగా మహానుభావుడు ఎవరో "బాదే సౌఖ్యమనే భావన రానీవోయ్" అన్నారండి. అందుకని నా రచనలలో ఇది బెస్టండి. కాకపొతే ఎప్పుడో రాసుకున్న ఆ కథకి title ఆంత సాన్తాడంతా అయిందేమో అని కొద్దిగా బెరుకండి...మీరే సెప్పండి సీర్సిక బావుందా మార్సాలా

ఓయ్ .......అందరికీ ఇవే హెచ్చరికలు......మహేష్ గారు నవతరంగంలో వినాయకుడు దర్శకుడు ఇచ్చే స్క్రిప్ట్ పెట్టింతరవాత ఈ స్టోరీ సినిమా తీద్దామనుకుంటున్నా ...కాబట్టి ఎవరికీ దీని హక్కులు లేవు. నిర్మాతలు నన్ను మాత్రమె సంప్రదించగలరు.

౩. నాకు నచ్చిన ప్రయత్నం-పద్య కవితలు

"పార్వతీ తపస్సులో" శ్రీనాథ కవి శృంగార రసనా పాటవం, ఇంకెవరిదో (పోతన మహా భాగవతంలోదా ఏమో ???) ఇందీవరాక్షుని వృత్తాంతం అన్న దాంట్లో "అనినన్ కన్నులు జీవురింప ఆధారంబల్లల్లాడ వ్రేల్లుత్పునః పునః బృకుటీ భుజంగ యుగళీ పూత్కార ఘోరానిలంబన" అన్న శబ్దాలంకార సహిత పద్య కవిత రుసి సూసానండి ......అంతే ......... టపాల్మని పడిపోయానంటే నమ్మండి. అప్పట్నుంచి ఆంటే నా తొమ్మిదో తరగతి నుండీ .......రాయాలన్న కోరిక ఉంది...ఈ బ్లాగు మొదలెట్టే వరకు ఆ కోరిక కోరికగానే మిగిలిందండి.


నా తల్లి అని నేను నమ్మే ఆ సదువుల తల్లి పాదాల సెంత ఒక పద్యం రాసి కాని నా బ్లాగు మొదలెట్ట కూడదని ఏంటో ...ఎంతో ఇది అయిపోయి రాసిన నా మొదటి ("వృత్తము" అంటారట అండి ఈ పెద్దాలను) పద్య కవిత "ఇది" అండీ. నాకు ఈ (1, 2, 3, 4,) నాలుగు పెద్దాలు సూసినప్పుదంతా మా సెడ్డ గర్వమండి నా మీద నాకే. అలాగే మిగితా నా పద్య ప్రయత్నాలు వాటి అర్థాలు (1, 2, 3) సూడాలని ఉన్నోళ్ళు సూడండి. లేనోళ్ళు సినమాలో ఎంటోడు పేద్ద పద్దెమ్ సదూతుంటే మన ఒంటేలుకు పోతాం కదండీ ......అలా ఏదో ఒకటి సేసేసి రెస్టు తీస్కొని వచ్చేయండి.

పెద్దలు "తప్పులున్నాయి" అని సేప్పారండి.......భావకుడు కాదు "భావుకుడు" అని ఉండాలి అని సెప్పినా అలాగే ఉంచేసినప్పుడు సేసిన ఆలోసనే ఇక్కడా సేసి అలాగే ఉంచేసానండి..........."తప్పులను గుర్తుంచుకుంటేనే కదండీ మన కాళ్ళు బూమ్మీదుండేది".............అందుకని అలాగే ఉంచేసానండి.

౪. నాకు నచ్చిన వచన కవితలు.

ఇవి నేను ఎక్కువగా సేసేవండి. ఇరవయ్ దాకా ఉన్నాయండి..... నాకు నచ్చినవి రెండు (1, 2) ఉన్నాయండి. మా ఇంటిది నా ఈ పైత్యంతో (అదేనండి కైతల రాయటం అనే పైత్యం) పడే బాధలు సూసి మనసు కరిగి విరిగి కన్నీరు మున్నీరై మనసు కేలికినవండి ఈ రెండు ............తనకు కవిత్వం నచ్చదని ఓ తెగ ఎడ్సేసే మనసు తన బాధ అర్థం సేసుకొని రాసిందని తెగ ఇష్టమండి ఈ కైతలంటే. (కొన్సెం మెలోడ్రామా ఎక్కువైంది కదండీ? ఆయ్ నాకు అలాగే అన్పించిందండి...... ఇక ఆపెస్తానండి.)

ఇకపొతే ఇంకోటి ఉందండి ......ఎవ్వరూ పాపం కమ్మెంటలేదు దాన్మీద...కాని నాకు సాలా నచ్చిందండి అది......ఇక్కడ సూడండి... నేను చూసిన ఒక రోడ్ కిల్ గురించండి. కొంచం గ్రాంథికం ఉందండి అందుకని జనాలకు నచ్చలేదనుకున్తానండి అది.

౫. ఒకే ఒక్క ఇంగ్లీషు కవిత

నేను రాసిన ఒకే ఒక ఇంగిల్పీసు కైత..."ఇది" కూడా యమా నచ్చేసిందండి......మా నాన్నండి "మన దేశంలో ఉన్నప్పుడు తెలుగువి రాసుకోవచ్చు అక్కడ ఉంటున్నావు "ఆ ఇంగిలిపీసువి" కూడా రాయమని" తెగ పోరే వారండి.....ఇది సూసి బావుందని అన్నారండి. కాకపొతే "ఎవర్రా ఆ ఇంగ్లీషు రోసు ?" అన్నారండి ............అయ్ బాబోయ్ అలాటిది ఏం లేదండి....( ఉంటే నా ఇంటిది నా సేమ్డాలెక్కదీస్తాదండి ...ఆయ్)

బాబోయ్ ....అది సీపురు పట్కోని వస్తోందండి ..........ఇంటి పనులు సూడకుండా ఇది సేస్తున్నందుకు .....మిగితావి తరవాత బతుకుంటే రాస్తానండి.

Sunday, 28 December 2008

5. స్వగతం --అవును నేను బ్రాహ్మణుడినే ... అది నా అస్తిత్వంలో భాగమే. Part-3

"కాదేమో రఘూ......నువ్వు ఉదహరించిన కులాలకు (విభజనలకు) చాతుర్వర్ణ కులాలకు తేడా ఉంది....ఎందుకంటే మన చాతుర్వర్ణ కులాలు మన మతంలో నుంచి పుట్టినవి కదా. నువ్వే చెప్పు ఎంత దారుణం శూద్రులు కాలి నుంచి పుట్టటం ఏమిటి......బ్రాహ్మణులు నోటి నుంచి లేదా తల నుంచి పుట్టటం ఏమిటి? ఎంత దారుణం? పునాడులలోనే ఇంత తేడా, వివక్ష, వ్యత్యాసం ఉంటే ఇంక సమానత ఎలా సాధ్యం?" మనోజ ప్రశ్నించింది.

 

"పోరబడుతున్నావు మనోజ. హిందూ సంస్కృతిలో చాతుర్వర్ణ వివక్షకు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, అవివక్షతకు, సమానతకు, మానవీయతకు అన్నీ ఉదాహరణలు ఉన్నాయి. చూసే వారు, వెతికే వారిని బట్టి ఉంటుంది మనం ఎం పట్టుకుంటాం మన సంస్కృతిలో అనేది. అయినా కాదంటావా..ఒకే..తప్పులను సరిదిద్దటానికి ప్రయత్నిద్దాం...అంతే కానీ అప్పుడు జరిగిన తప్పుకు, అదీ వేరే వారు.. ఎవరో పూర్వీకులు చేసిన దానికి ఇప్పుడు, వేరే వారికి శిక్ష వేస్తాం అనటం ఎంత వరకు సబబు? అలాగే చేస్తావా..పోనీ కనీసం ఆ రాజకీయ నాయకురాలిలాగా "మారో జూతే చార్" అనేది మా నియమం అని బాహాటంగా చెప్పుకోవాలి అంతే కాని ఎందుకీ హిపోక్రసీ?

 

ఒప్పుకుంటాను ఇంతకు ముందు మా కులాల వారు తమకు నచ్చినది వాడుకొని కుల వివక్షత చూపెట్టిన మాట నిజమే....అలాగని మాలోని వారు ఆ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వారూ వేల వేలు. కాబట్టి సామాన్యీకరించటం () తప్పు. ఒక మనిషిని అతని గుణ గణాలను బట్టి గౌరవించాలనుకోవటం ఇప్పటి సామాజిక న్యాయం. కదా? కాబట్టి ఆ న్యాయం సమాజంలోని ప్రతీ ఒక్కరికీ చెల్లాలంటాను.

 

"...మాదిగ" ".....మాల" అన్న కుల పేర్లను ఆక్షేపించే దమ్ము లేని వారికి శర్మ, రెడ్డి, చౌదరి పేర్లను ఆక్షేపించే అవసరం, ధైర్యం ఎందుకు రావాలి? పైగా ఉట్టి కులం పేర్లు తీసేస్తే కులం పోతుందా? పోదు కదా. మరి కొన్ని కులాల వారి పేర్లనే ఎందుకు ఆక్షిపించాలి? ఆ కులం పేర్లు పెట్టుకోటానికి భయపడే పరిస్ధితులు ఎందుకు రావాలి?" "సరే నువ్వు చెప్పినది కొంత సమంజసంగా ఉన్నా....మొత్తానికి ఒప్పుకోలేక పోతున్నా

 

"ఇలా కులాల పేర్లని, కులాల సమూహాలని పెట్టుకోటంలో ఇంకో డేంజర్ కూడా ఉండి రఘు. నువ్వు పరిణితి చెందిన వాడివి, వివక్ష చూపవు....ఆ పేర్లు పెట్టుకొనేది నీ అస్థిత్వంలో ఒక భాగం అయినందుకే అని అంటావా...సరే ఒప్పున్నామనే అనుకో..... అందరూ అలా ఉండరు కదా...ఇలాటివి కొనసాగిచటం వలన వివక్ష చూపే వారికి పరోక్షంగా ఊత నిచ్చినట్టే కదా...కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తిగత కోరికలు ఒదులుకోలేవా?" మనోజ ప్రశ్న.

 

"ఆ కాన్సెప్ట్ అందరూ ఒప్పుకుంటే నేనూ ఒప్పుకుంటాను...అదే చిక్కు ....అందరేమో తమ తమ కుల వ్యక్తిత్వాలను, అస్థిత్వాలను వదలరు....బ్రాహ్మణులనేమో మీరు వదలాలి అంటారు..ఎందుకలా? సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తిగత శ్రేయస్సు వదులుకోవాలి అన్నది అందరూ ఒప్పుకుంటే...కుల ప్రాతి పదికన రిజర్వేషన్ లను తీసేయటానికి ఒప్పుకోవాలి.......అసలు కులము అనేది ఎక్కడా ప్రస్తావించ కూడదు అఫీషియల్ వాటిలో...ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరలాటప్పుడు నేనెందుకు ఒప్పుకోవాలి? " నా సమాధానం.

 

"అసలు భ్రాహ్మణత్వానికి నిర్వచనం తెలుసా నీకు? అసలు భ్రాహ్మణుడివా నువ్వు? అలా అయితే ఇంత అహం ఉండదు కదా నీకు? పూజలు, పునస్కారాలు, ఆచారాలు ఏమీ తెలీవు. పైగా ఆచార్యుడివి అసలే కాదు--- మరెందుకు నీకు, నీ పిల్లలకు ఈ పేర్లు?" నన్ను గెలిచానన్న ఆనందం మనోజ కళ్ళలో.

 

"వితండ వాదం ఆంటే ఇదే. వీర్రాజు అన్న పేర్లున్న వాళ్లందరూ వీరులు కాదు కదా. సార్థక నామదేయం అనేది ఇప్పటి వ్యవస్తలో కుదరనిది......అదే కావాలి అనుకుంటే అందరు అసార్తక నామదేయులు తమ పేర్లు మారుస్తున్నారా?

 

ఇకపోతే ఆచారాలు మొదలయినవి. ఎంతమంది క్రిస్మస్కు, రంజానుకు, శివరాత్రికి తమ తమ భగవంతులను చిత్త శుద్ధితో పూజిస్తున్నారు? ……ఎంత సేపు పూజిస్తున్నారు?...... ఒక్క క్షణం? నిముషం? ……మరయితే ఒక్క రోజంతా సెలువులు ఎందుకు? ఆ కొంత సమయం ఇస్తే సరిపోలా? ఒక "చిత్త సుద్దో మీటర్" కనిపెట్టి అందరిలో ఇంప్లాంట్ చేసి వారి సూచిక ప్రకారం వారికి సెలవులు ఇద్దాము సరేనా?" చాలా వెటకారం ధ్వనించింది నా కంఠంలో.

 

నువ్వెన్నయినా చెప్పు.....ఇప్పటి కాల మాన పరిస్థితులలో కులాలు పోవు. కాబట్టి నా కులం అనేది నా జన్మ హక్కు....నా అస్థిత్వంలో ఒక భాగం. అవును నేను బ్రాహ్మణుడినే ....నా పిల్లలకు ఆచార్యులు అన్న "తోక" తప్పనిసరిగా పెడుతాను. నన్ను, మా వాళ్ళను తప్పు చేస్తే ఈ సమాజం దండించాలి అంతే కాని మా పేర్లను, కులాన్ని బట్టి కాదు. అంతే." నా నిర్ణయం చెప్పి భోజనానికి పిలుస్తున్న భార్య కేకతో మనోజ దగ్గర శలవు తీసుకొని వచ్చేసా.

రెండవ భాగం

ఒకటవ భాగం


5. స్వగతం --అవును నేను బ్రాహ్మణుడినే ... అది నా అస్తిత్వంలో భాగమే. Part-2

"ఎంటీ?" మనోజ వైపు తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాను "తమ సంఖ్యాపర బలంతో, పెరుగుతున్న రాజకీయ పలుకుబడితో సమాజాన్నిబలవంతంగా రూపుదిద్దటం తప్పు కాదా? మరయితే ఒకప్పుడు తెలివి బలంతో, విద్యా బలంతో, రాచరికపు బలంతో అప్పటి కులాల వారు తమకు నచ్చిన విధంగా రూపు దిద్దితే ఇప్పటి మనము అది తప్పు అని అనటం లేదా? మరి ఎందుకీ వ్యత్యాసం?

 

బలంతో, పలుకుబడితో ఎప్పుడూ సమాజ రూప కల్పన జరగ కూడదు. కాల, మాన పరిస్థితుల ప్రాకారాం సామాజిక న్యాయం అని ఏది చెప్పబడుతుందో దాని ప్రకారం సమాజం రూపుదిద్దబడాలి. ఇప్పటి కాల, మాన పరిస్థితుల ప్రకారం కుల వివక్ష తగదు, అది తప్పు అనేది సర్వ సమ్మతం. కుల వివక్ష రహిత సమాజం అందరికీ ఆమోద యోగ్యం. కాబట్టి ఎవరూ కులాన్నీ వివక్షించకూడదు అంతే.

 

కాని ఏది? అలా జరుగుతోందా? లేదే. ప్రతి ఒక్కరూ "తిలక్, తరాజు, తల్వార్...మారో ఉన్కో జూతే చార్" అన్న నినాద స్ఫూర్తితోనే వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకు? ఒక కులాన్ని తక్కువ చూడకూడదు అన్న సమాజిక న్యాయం ప్రతి కులానికీ వర్తించాలి కదా...అదే మాట "మారో జూతే చార్" అని అంత బాహాటంగా ఇప్పుడు "పెరుగుతున్న" కులాల వారిని అంటే రక్తపుటేరులు పారకుండా ఉండేవా మన దేశంలో?" ఊపిరి పీల్చుకోటానికి ఆగాను ఒక్క నిముషం.

 

ఇదే అదను కోసం ఎదురు చూస్తోందా అన్నట్టు వెంటనే మొదలెట్టింది మనోజ "మరి నువ్వు చెప్పే కుల వివక్ష సమాజానికి ఎలా చేరాలి రఘూ? కులాలు సమసిపోతేనే కదా ఆ సమాజం వచ్చేది. అందుకే ఆ రచయిత్రిలా కులాలు సమసి పోవాలి అని ఆశిస్తున్నారా?." చూసావా నేనే గెలిచాను అన్నట్టు చూసింది నా వైపు.

 

"ఏంటీ కులాలు సమసిపోవాలి అని ఆశిస్తున్నారా అందరూ? ఎవరమ్మా ఆశిస్తున్నది? రాజకీయ నాయకులా- కుల, మత వోటు బాంకు రాజకీయాలు ఉండవే అప్పుడు . సామాన్య జనమా? రిజర్వేషన్ సౌకర్యాలు కులం పేరిట ఉండవే అప్పుడు. ఎవడు, ఎవడు కులాలు పోవాలి అని మనస్ఫూర్తిగా కూరుకుంటున్నది? చెప్పు. నువ్వు ఉటంకించిన టపా రాసినది కూడా ఒక బ్రాహ్మణ రచయిత్రి అని మరవద్దు. అసలు నీకో నిజం తెలుసా ...ఈనాటి అప్పటి అగ్ర కులాల వారే ఎక్కువ మంది "కులాలు పోవాలి" అని కోరుకుంటున్న పిచ్చోళ్ళలో................."అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో

 

"రఘు మర్యాద మరుస్తున్నావు, నీకు తెలీని విషయాలు తెలిసినట్టు చెపుతున్నావు" అన్న తన హెచ్చరికకు ఒక నిమిషం మునం తరువాత "అవును నిజమే తప్పయిపోయింది. నోరు జారింది చివరి వాక్యమ్లో క్షమించు. నువ్వు చెప్పింది నిజమే ....నేనేమి సోషల్ సైంటిస్టును కాను అగ్ర కులాల వారే కులాలు పోవాలి అని కోరుకుంటున్నారు అని చెప్పేందుకు.....సరే ఆ వాక్యం తీసేసుకున్నానుకో..... అయితే మాత్రం నేను చెప్పేది నిజం కాకపోదు...

 

"అప్పటి" అగ్ర కులాల వారు గత వైభవ చిహ్నాలుగా కండీషన్ చేయబడ్డ కులాలను వీడరు......"ఇప్పటి ఎదుగుతున్న" కులాల వారు తమ ఇప్పటి వైభావాలకి సాక్షులౌగా, కారణ భూతాలుగా కులాలను వదలరు. మొత్తానికి ఎవ్వరూ కులాలను వదలరు.....అంటే...అందుకే కులాలు పోవు.....

 

కాబట్టి "కుల వివక్ష రహిత సమాజం" కోసం ఎదురుచూడాలి, కృషి చేయాలి తప్పితే "కుల రహిత" సమాజం కోసం కాదు. ఆనాడు కులాలి అవి. అవి పొతే రేపటి కులాలు ఇంకో విధంగా పుట్టుకొస్తాయి.....ఐ ఐ టి కులం అనీ, డాక్టర్ కులం అని, సాఫ్ట్ వేర్ కులం అనీ, ఎన్ ఆర్ అయ్ కులం అనీ ..... పేద-గొప్పా కులాలయితే ఎప్పట్టినుంచో ఉన్నవే...ఎప్పటికీ ఉండేవే ... విభజనలే కులాలు....మనుషులలో వ్యత్యాసం ఉన్నన్నాళ్ళు ఈ విభజనలు--అంటే కులాలు ఉండి తీరుతాయి...పేర్లు మార్పు ఒక్కటే తేడా"

మూడవ భాగం ఒకటవ భాగం

 

5. స్వగతం--అవును నేను బ్రాహ్మణుడినే ... అది నా అస్తిత్వంలో భాగమే. Part-1

"ఏంటి రఘూ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" అని వినిపించగానే ఎవరన్నది కూడా పట్టించుకోకుండా "ఆ ఏమీ లేదు ...మా ఇంటికీ, గొడ్ల చావడికీ, పై కప్పు ఏం వేద్దామా అనీ" అని "ఇందులో ఆలోచించటానికి ఏముంది....చార్మినార్ రేకులు వాడితే సరి అని... నువ్వు కూడా చచ్చు జోకులు పెల్చొద్దు నాలాగా" అని మళ్ళీ నేనే అన్నాను వచ్చింది మనోజ అన్నది గమనించి.

 

రాసుకుంటున్న నా టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది మనోజ వచ్చి. నవ్వి "అననులే, ఎందుకో చికాగా ఉన్నావు?" అనింది. "నీకు తెలీదా?" నేను చికాగ్గానే జవాబిచ్చాను. "నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో తెలుసులే. కానీ ఎందువల్ల చికాకు, బాధ పడుతున్నావో అర్థం కావట్లేదు." మనోజ సౌమ్యంగా వివరించింది.

 

తలెత్తి తన వైపు చూసాను. మొహంలో కూడా వెటకారమేమీ కనపడలేదు.....నిజంగానే తెలీక అడుగుతోందని అర్థమయింది. అంటే నా అంతకు నాకు నేను ఎందుకు చికాకు, బాధ పడుతున్నానో ఇంత వరకు అర్థం కాలేదన మాట.

 

స్వగతంలో అనుకుంటునట్టుగా పైకే చెప్పసాగాను "ఇది అంతా మొదలయింది పిల్లలకు ఏం పేరు పెట్టాలా అని నేను, శ్రీమతీ ఆలోచిస్తుంటే...నాకేమో నాన్న సమాజానికి భయపడి నాకు పెట్టని ఆచార్యులు అన్న ఇంటి పేరు నా పిల్లలకు పెట్టాలని కోరిక. తనకేమో అది ఇష్టం లేదు. దాని మీద చిన్న వాదన. చివరికి మీకు కుల వివక్ష ఎక్కువ అందుకే అలా పెట్టాలనుకుంటున్నారు అనేసి వెళ్లిపోయింది." బాధగా అన్నాను.

 

మళ్ళీ నేనే చెప్ప సాగాను "ఇదొక్కటే కాదు ....మొన్నామధ్య బ్లాగుల్లో కూడా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ....... సరిగ్గా ఇప్పుడు గుర్తు లేదు కాని ఒక టపాలో రచయిత్రి తమ వంశం నీళ్ళను కూడా కడిగి వాడుకునే వంశం అని చెప్పి ...కుల వ్యవస్థను, ఆచారాలను రూపుమాపాలి అన్న తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ టపాను ముగించారు......ఇంకొక చోట ఎక్కడో చదివిన వార్త... ఎవడో ఒక రాజకీయ నాయకుని పరిష్కారం ఏంటో తెలుసా కుల వివక్షకు?.....బలవంతంగా అన్ని వర్ణాల వారిని అన్ని వర్ణాల వారికిచ్చి వివాహాలు చేయాలట .... ఎంత దారుణం?....చివరికి ఆర్కుట్ లోని కవితా సమూహాల్లో కూడా "కులం తోక ఈకలు పేరు చివరన తగిలించుకొని కులుకుతారు" అన్న ఆక్షేపణ ఎదురయ్యింది ఈ ఆచార్యులు, శర్మ, రెడ్డి అన్న వాటి గురించి.....అందుకే నా అస్థిత్వం గురించి ఆలోచించటం మొదలెట్టాను." అంటూ ముగించాను.

 

"ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పానా...ఇవి నువ్వు ఆలోచిస్తున్నవి, నీకు జరిగినవి...సరే..చికాకు, బాధ ఎందుకో చెప్పవోయ్" కొంచం విసుగు ధ్వనించింది మనోజ గొంతులో.

 

"అంటే ఇలా నేను అనుకోకపోయినా నా భార్యే నా మీద నింద వేయటం, లేని ఆలోచనలను అంటగట్టటం చేస్తే బాధపడకుండా ఉండమంటావా? నా కులం పేరును, అనాదిగా వస్తున్న పేరును, మా నాన్న రివర్స్ కుల వివక్షకు భయపడి నాకు పెట్టకపోవటం అనే పరిస్థితి వచ్చినందుకు బాధ పడకూడదా ? అలా పెట్టుకుంటే తోక ఈకలు పెట్టుకొని మురిసిపోయిన వాళ్ళమా? అలా అని ఇప్పుడు "ఎదుగుతున్న" కులాలవారిని ఆక్షేపించే దమ్ము ఉందా బ్రాహ్మణులను, రెడ్లను ఆక్షేపించే వారికి?

 

ఏమిటి? బలవంతంగా అందరినీ అందరికీ ఇచ్చి పెళ్లి చేస్తారా? అంటే సోషల్ ఇంజనీరింగ్ వయా బయాలజీ? ఎంత నఖరాలు కొడుతున్నారు ఊర్కుంటుంటే ఇలాటి వారు. సినిమాలో హీరోయిన్ని బలవంతంగా సొంత అబ్బ ఇంకొకడికి కట్టబెడితే సహించని వారు సామాజిక న్యాయం అన్న నెపంతో ఇంత దారుణం పరిష్కారమంటారా? ఏం, ఎందుకు ఇలా వచ్చింది పరిస్థితి?" ఆక్రోశంగా అరిచాను.

 

"నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు  రఘూ.....వీరంతా చెప్పినవి ఎక్స్త్రీమ్స్ ...కానీ వారు కోరుకొనే అసలు సమాజంలో తప్పేమీ ఉంది? ఇంత వరకు వివక్షకు గురయిన జనం, కులాలు, తమ బలం తెలుసుకొని తమకు నచ్చిన విధంగా సమాజాన్ని రూపుదిద్దుకుంటాము అంటే నీకు వచ్చిన చిక్కేంటి?" శాంతంగా పలికింది మనోజ.

మూడవ భాగం రెండవ భాగం