Monday, 18 April 2011

క్లౌడ్ సర్వర్ (అమోజాన్ది) పెట్టుకుంటే maintenance చెయ్యగలవాళ్ళు తెలుసా?




తెలుగు, ఆంగ్లంలో ద్విభాషా మానసిక ఆరోగ్య వెబ్సైట్ (Psychiatric website.....అమ్మయ్య కొంచం మామూలు మనుషులు మాట్లాడే భాష మాట్లాడా :-) ప్రారంభించపోతున్నాము ఈ నెలాఖరుకు.

వెబ్సైట్ సర్వర్ cloud or virtual or shared? అన్న ప్రశ్న దగ్గర ఆగిపోయింది పని.

మూడు సంవత్సరాలకు అమెజాన్ వాడిది $225ki upfront fee తో వస్తుందట కాని maintenance and trouble shooting no support అట.

"uploading అంతా మేము చేసిస్తాము, నేను ఇండియాలో ఉంటె నేనే చేసేవాడిని కాని బయటకెళ్ళే అవకాశాలు ఉన్నాయి" అంటున్నారు మా డెవెలపర్. So will need somebody to help me out please. అంతా మెడికల్ గాళ్ళము. పరిచయస్తులు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు అడుగుతున్నాము కాని....ఎవరినైనా పరిచయం చెయ్యగలరా? 


చిన్నగా మొదలేడుతున్నాము కాబట్టి ఆడహాక్ బేసిస్ మీద, కాపోతే గ్యారంటీగా ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు, వెంటనే చేస్తాము అని కమిట్ అవ్వగలిగిన వాళ్ళు మాత్రమె కావాలి.


ఎవరైనా "మంచి పని చేస్తున్నారు కదా మా వంతు సాయం మేము చేస్తాము" అని వాలంటీర్ చేస్తామంటారా అంతకంటే కావల్సిందేముంది? ;-)  అమ్మ ఆశ దోస వడ అప్పడం అనేసుకుంటున్నారని నాకు తెలుసు.అయినా I am a big optimist రాయి వెయ్యటంలో తప్పేముంది? :-)

అలాగే ఇంకో చిన్న సాయం
ఎవరైనా మామూలుగా వెబ్సైట్ స్టార్ట్ చేస్తే అందులో వాయిస్ చాట్, వీడియో చాట్, టెక్స్ట్ చాట్, ఈమెయిల్స్, online scheduling లాటివి ఉంటె ఆ వెబ్సైట్ మానేజ్ చెయ్యటానికి ఏమేం స్కిల్స్ కావాల్సి వస్తాయో ఒక చిన్న లిస్ట్ రాసి పంపగలరా? అలాగే ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళను రిక్రూట్ చేసుకోవాలంటే క్లాసిఫైడ్స్ లో ఏమని అడ్వర్ట్ ఇవ్వాలో అంటే వెబ్ మాస్టర్ అనా డాటా ఎంట్రీ ఆపరేటర్ అనా ఇలా అనమాట ....ఇంక్లుడ్ చేస్తారా?

మా వెబ్సైట్ మాకప్ పంపమంటే పంపుతాను కావాలంటే.

pic from
http://thenextweb.com/google/files/2010/04/cloud-question-mark-cloud-computing.jpg with thanks.

No comments:

Post a Comment