అప్పుడప్పుడే సిరివెన్నెల విడుదలయి వెదురుపొదకు కడుపు శోకం, వెదురు గెడలకు గాయాలు ఎక్కువ చేసిన పాపం విశ్వనాథ్ గారు మూటకట్టుకుంటున్న రోజుల్లో....నేను, చెల్లి పదో తరగతికి ట్యూషన్స్ చెప్పే ట్యుటోరియల్ల్లో ఏదో సందర్భంలో స్టాఫ్ అందరినీ "What do you want to be reborn as?" అంటూ ప్రశ్నించారు మా ప్రిన్సిపాల్ సర్.
నా చెల్లి "I don't want to be reborn as anyone else than me" అని ఎంత ఫోర్స్ తో చెప్పిందో "జన్మంటూ నిజంగా ఉంటె కళాకారుడిగా ముఖ్యంగా సంగీత కళాకారుడిగా పుడతాను" అని అంతే ఫోర్స్ తో నేనూ చెప్పాను. ఈ రోజు ఈ వీడియో చూస్తుంటే ఎందుకో ఆ సంఘటన మళ్ళీ గుర్తొచ్చింది.
బుడుగి....వేలడంత లేదు.....అసలా పాటను ఎలా ఆడుకుందో చూడండి
స్వర స్థానాలు, శ్రుతి, లయ ఇవేవీ కావు జస్ట్ వాచ్ హర్ సింగ్
సాహిత్యం ఇస్తున్నాను అది చూస్తూ తనన్ను చూడండి
ఒరె మా..........మ
ఒరె మావా.........హా
ఒరె మావా ఏసుకోరా సుఖ్ఖా
తెచ్చి పోసేను సక్కని సుక్కా
యేసుకో....యేసుకో...సుక్క ఏసుకోర్రా....
ఒరె మావ......హ మావ, హ మావ, హ మావా.......
అరె మావా నంచుకోర ముక్కా
అది నమిలేవ దాల్సిని సేక్కా .......నంచుకో నంచుకో ముక్కా
నా చెల్లి "I don't want to be reborn as anyone else than me" అని ఎంత ఫోర్స్ తో చెప్పిందో "జన్మంటూ నిజంగా ఉంటె కళాకారుడిగా ముఖ్యంగా సంగీత కళాకారుడిగా పుడతాను" అని అంతే ఫోర్స్ తో నేనూ చెప్పాను. ఈ రోజు ఈ వీడియో చూస్తుంటే ఎందుకో ఆ సంఘటన మళ్ళీ గుర్తొచ్చింది.
బుడుగి....వేలడంత లేదు.....అసలా పాటను ఎలా ఆడుకుందో చూడండి
స్వర స్థానాలు, శ్రుతి, లయ ఇవేవీ కావు జస్ట్ వాచ్ హర్ సింగ్
సాహిత్యం ఇస్తున్నాను అది చూస్తూ తనన్ను చూడండి
ఒరె మా..........మ
ఒరె మావా.........హా
ఒరె మావా ఏసుకోరా సుఖ్ఖా
తెచ్చి పోసేను సక్కని సుక్కా
యేసుకో....యేసుకో...సుక్క ఏసుకోర్రా....
ఒరె మావ......హ మావ, హ మావ, హ మావా.......
అరె మావా నంచుకోర ముక్కా
అది నమిలేవ దాల్సిని సేక్కా .......నంచుకో నంచుకో ముక్కా
ఒర్ మావా ఏసుకోరా సుఖ్ఖా
తెచ్చి పోసేను సక్కని సుక్కా
యేసుకో....యేసుకో...సుక్క ఏసుకోర్రా....
ఈ రేతిరి సేయ్ రా జలసా
ఆ ఎక్కాలి షోకుల నిషా.........
ఈ రేతిరి సేయ్ రా జలసా
ఆ ఎక్కాలి షోకుల నిషా.........
ఏసేయ్ సుక్కా.....కోరికేయ్ ముక్కా
రెండూ కలిస్తే వరేవా
మైకాలలో...ఊగా....లిరా
తాగార మల్లీ మల్లీ....
ఈ కైపులో మైమరపులో
యాదుంచుకోరా పెళ్ళీ
ఒరె మావా ఒరే మావా
ఆ పోకిరి సూపులు నీవి
హాయ్ పొగరూ వగరూ నాదీ
ఆ పోకిరి సూపులు నీవి
హాయ్ పొగరూ వగరూ నాదీ
వేడీ చలవా తీపీ కారం
ఇద్దరిలోనా ఉన్నాయ్
నీ కంటికీ సోకయ్ నది
నేనే నేనే కాదా
రంగేళినీ సింగారినీ
రంభా మేనక నౌతా
ఒర్ మావా ఏసుకోరా సుఖ్ఖా
తెచ్చి పోసేను సక్కని సుక్కా
యేసుకో....యేసుకో...సుక్క ఏసుకోర్రా....
ఆ పిల్లే (?పెళ్ళే) కదరా ఖులాసా
అది కల్లును మించిన నిషా
అహ పిల్లే (?పెళ్ళే) కదరా ఖులాసా
అది కల్లును మించిన నిషా
పిల్లా కల్లూ పెదిమిలకొస్తే
అల్లీ బిల్లీ తమాషా
మందెందుకూ మనరాయడా
అందం అగ్గి బరాటా.....
అందలలనూ తాగేయ్యరా
అప్పుడు చూడు మజాకా
ఒరె మావ......హ మావ, హ మావ, హ మావా.......
ఒరె మావా ఏసుకోరా సుఖ్ఖా
తెచ్చి పోసేను సక్కని సుక్కా
యేసుకో....యేసుకో...సుక్క ఏసుకోర్రా....
ఎల్లారీశ్వరిగారి పాట వినలేదు నేను కాని ఈ బుడుగి పాడిన ఈ పాటను సాహిత్యం ముందు పెట్టుకుని అది తన గళంతో చేసే విన్యాసాలను వినండి......ఆ సమయంలో తన హావ భావాలను చూడండి.
నిజంగానే ఆ హావభావాలు ఆ పిల్ల నేర్చుకొచ్చి ఇక్కడ కక్కేస్తున్నవా? నాకయితే అలా అనిపించలేదు.
పోనీ అలా అంటే ఆ సాహిత్యం, దాని భావం అర్థమయి మోహంలో అలా తొణికిసలాడాయంటారా? వయసెంతనీ?
తప్పనిసరిగా ఆ సంగీతంలోనో, తనదే అయినా గళమాధుర్యంలోనొ, ఆ లయలో, ఆ జోరులో, ఆ మాటలో హోరులో
ఏదో ఒక జలపాతంలో నిండుగా తడిసి ముద్దై ఆ హాయికి వణకటమే ఆ హావభావాలై ఉండాలి.
సిరివెన్నెలగారు "కవిని, కవితనై.....భార్యనై భర్తనై ......" అన్న పాటను వివరిస్తూ "అర్థం అవాల్సిన అవసరం లేదు అనుభవించటానికి" అన్నప్పుడు అవునా అనిపించింది..........."ప్రాగ్దిశ వీణియపైనా దినకర మయూఖ తంత్రులపైనా" అన్న పాటను అందుకు ఉదహరిస్తే నేను మొదటిసారి ఆ పాటకన్యకతో గడిపిన వయసును నెమరు వేసుకుని నిజమే కదా అనుకున్నా......ఇవాళ ఈ సిరి తన స్వరసంపదను ఇలా పరిమళిస్తూ......ఆ సౌరభనాగస్వరానికి తనే నాగినై అలా ఆనందతాండవహేల చేయటం సీతారామశాస్త్రిగారి భాష్యానికి ప్రత్యక్ష సాక్షమయింది.........శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిహి అని కదా ఆర్యోక్తి.
మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది నాకు
అలా తన కళను అనుభవిస్తూ కలలో, కళలో మునకలు వేసే కళాకారుడిగా, ముఖ్యంగా గాత్ర కళాకారుడిగా పుట్టటం....
No comments:
Post a Comment