ఇది ముమ్మాటికీ తప్పు. ఆకర్షణా, వ్యామోహం ఇవన్నీ ప్రేమేనా? నేను నమ్మను.
నీ నమ్మకంతో నాకు పనేంటి. అదే సత్యం.
కాదు. కాదు. కాదు. ఆకర్షణకూ ప్రేమకూ తేడా లేకపోవటమేమిటి?
ఉందా? ఉంటె చెప్పు వినాలని ఉంది.
మొదటిది ఆకర్షణ క్షణభంగురం.
రెండోది ఆకర్షణ తప్పు
మూడోది ఆకర్షణ చాలా శాతం శారీరికం
నాలుగోది ఆకర్షణ అనర్థదాయకం. వ్యక్తిగతంగా, సామాజికంగానూ కూడా
అయిదోది ఆకర్షణ చంచలం
ఆరోది ఆకర్షణ జంతు వృత్తి
నిజంగా?
అవును.
ఆకర్షణ క్షణభంగురమా? ప్రేమ చిరంజీవా?
ప్రేమకు అంకురార్పణ ఆకర్షణేగా
మరి దానికీ దీనికీ తేడా ఏమిటి?
అదేమిటి ప్రేమకు ఆకర్షణ అంకురార్పణ అవటమేమిటి?
Love at first sight వినే ఉంటావు......
ఆగాగు చాలా రకాల్లో ఆదీ ఒకటి అంటే కాని అదే ప్రేమ కాదు.
ఒప్పుకుంటా. పోనీ చూసుకోకుండా కనీసం మాట్లాడుకోకుండా కేవలం ఈ మెయిల్స్లో, ఉత్తరాల్లో, చిలక కబుర్లతో, చెలి రాయబారాలతో మొదలై, నడిచి, పాకాన పడిన ప్రేమలనే తీసుకో......ఈనాటి షాదీ డాట్ కాం లలో, జీ టాక్ లలో పుట్టే ప్రేమల దగ్గర నుంచి "ఘనుడా భూసురుడేగెనో....మార్గశ్రాంతుడై డస్సెనో......." అని వగచే ప్రేమల వరకు......"నిజమైన" ప్రేమ అని నువ్వేదనుకుంటావో ఆ ప్రేమలనే తీసుకో.....అందులో ఆకర్షణ లేదంటావా?
చూసుకోకుండా ఆకర్షణ ఎలా పుడుతుంది? నువ్వు మరీనూ.
అంటే ఆకర్షణ అంటే నీ ఉద్దేశ్యంలో ఉట్టి భౌతికమేనా? మానసిక ఆకర్షణ ఉండదా?
ఉండదా అంటే ఉండదని కాదు కాని.......
సొ ప్రతి ప్రేమలో ఆకర్షణ ఉంటుంది అవునా.....కొన్ని ప్రేమల్లో శారీరికం, కొన్ని వాటిలో భౌతికం...కొన్ని వాట్లిల్లో రెండూ....పాళ్ళు ఏవి ఎంతయినా... అన్నీ ఆకర్షణ పునాదుల మీద నిలబడ్డవేగా?
అలా అంటే అవుననే అనాలి కాని ప్రేమకూ ఆకర్షణకూ తేడా లేదంటే ఎందుకో ఏడుపు వస్తోంది.
నీ ఏడుపు ఎవడికి కావాలి. ఇంకేమన్నావు వ్యామోహం ప్రేమ కాదన్నావు అవునా?
ఇలా చెప్పుకుంటూ పొతే మనం మాట్లాడుకునే స్త్రీ పురుష ప్రేమలో వ్యామోహం ఉంటుందనే ఒప్పుకోవాలి నేను. దానికి మళ్ళీ వివరణ అక్కరలేదు.
అలా రా దారికి. చివరికి శారీరికం కాదు అన్నావు
దానికీ వ్యామోహానికి నా దృష్టిలో తేడా పెద్దగా లేదు కాబట్టి సరే ఒప్పెసుకుంటున్నా శారీరికమైన కాంక్ష లేని స్త్రీ పురుష ప్రేమ ఉండదేమో. కాని అయినా నీ వాదన ఒప్పుకోబుద్దేయటం లేదు నాకు. ప్రేమంటే కేవలం ఇవేనా? ఆకర్షణా, వ్యామోహం, శారీరికం......ఇవన్నేనా ప్రేమంటే? నిజంగా ప్రేమంటే ఇంతే అనుకుంటే ఏడుపొస్తోంది.
ఎందుకు ఏడుపు?
నేను ప్రేమను గొప్పగా ఊహించుకున్నాను.
సరే ఏమని ఊహించుకున్నావో చెప్పు? ఏమిటో గొప్ప చెప్పు....నువ్వూహించుకున్న ప్రేమలో.
ఒకరిపై అపరిమితమైన ఇష్టం ప్రేమ. ఒకరికి మాత్రమె అంకితమై పోవటం ప్రేమ. ఇంకొకరిని ఊహించుకోలేకపోవటం ప్రేమ. ప్రేమించిన వారికోసం సర్వం వదులుకోగలగటం ప్రేమ. ఎంత బాధైనా అనుభావిస్తూ ప్రేమించిన వారి మంచిని నిలబెట్టటానికి ప్రయత్నించటం ప్రేమ.....ఇలా ఊహించుకున్నాను
బేసిక్గా చాలా పెద్ద పీటంవేసి నిలబెట్టుకుని పూజ చేస్తున్న దేవి పేరు ప్రేమ అవునా?
అవును
కాని నువ్వు పైన చెప్పినవన్నీ చర్యలు కదా?
అవునూ అయితే?
ప్రేమ ఒక ఎమోషన్ అని కదా నీ నమ్మకం?
అవునూ అయితే?
మరి ఒక ఎమోషన్ వలన ఏర్పడే చర్యలను ఆ ఎమోషన్ అస్తిత్వంగా నిర్వచిస్తావెం?
అంటే?
ప్రేమ పుట్టిన/ప్రేమించిన తరవాత చేసే చర్యలు ప్రేమను ఎలా నిర్వచిస్తాయి?
ప్రేమ ఏమిటో అర్థం చేసుకోవాలంటే దాని జననం ముందు కదా మనం పరికించాలి.
అంటే ప్రేమకూ వేరే ఎమోషన్కూ తేడా ఏమిటి అని ఆలోచిస్తేనే కదా ప్రేమ స్వరూపం బోధపడేది.
అంటే?
ప్రేమకు అతి దగ్గరయిన ఇంకో ఎమోషన్ ఏమిటో చెప్పు?
మ్మ్.....స్నేహం?
సరే దాన్నే తీసుకుందాం. స్నేహానికీ ప్రేమకూ ఉన్న తేడా చెప్పు. స్త్రీ పురుషుల మధ్య ఎమోషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అని మరవద్దు.
స్నేహం......మ్ నాకయితే స్నేహానికీ ప్రేమకూ తేడా ఏమిటీ అంటే అవతలి వారు నాకు కావాలి అని కోరుకోవటం, శారీరిక వ్యామోహం లేకపోవటం, వేరే వారితో పంచుకోలేను అనే స్వార్థం లేకపోవటం, అవతలి వారి ముద్ర మన ప్రతి క్షణం పెదవిపై పడాలని లేకపోవటం...ఇవీ స్నేహానికీ ప్రేమకూ ఉన్న తేడాలు.
మళ్ళీ ఇవన్నీ ప్రవర్తనలే. మానసికంగా....భావోద్వేగంలో తేడా ఏమిటి స్నేహానికీ ప్రేమకూ? రెండూ ఇష్టపడటాలే.నువ్వు చెప్పినట్టు హద్దుల్లో ఉండే ఇష్టం స్నేహం. హద్దులే లేని ఇష్టం ప్రేమా? హద్దులే స్నేహానికీ, ప్రేమకూ మధ్య ఉన్న తేడానా?
నాకింకేం కనిపించటం లేదు మరి.....ఆ స్నేహానికీ, ప్రేమకూ హద్దులే కాదు తేడా తీవ్రతలో కూడా తేడా ఉందేమో? అతి తీవ్రమైన ఇష్టం ప్రేమ. కొంచమే ఇష్టం స్నేహం......అనిపిస్తోంది.
ఏమో నాకైతే అంతగా అర్థం అవదు. తీవ్రత, హద్దులూ ఇవే స్నేహానికీ, ప్రేమకూ తెడాలయితే రెండూ సంకల్పితాలే. మనం పెరగనిస్తే.....తీవ్రత పెరుగుతుంది. మనం అనుమతిస్తే హద్దులు దాటుతాము. రెండూ సంకల్పితాలే. మరి ప్రేమ అసంకల్పితం అనుకుంటాముగా అది తప్పేమో......
అంతేనా ప్రేమంటే? అంటే స్త్రీ పురుషుల మధ్య ఇష్టం ఏర్పడితే అది తీవ్రంగా మొదటి నుండీ ఉంటె అది ప్రేమ లేదంటే స్నేహం. మొదటి నుండి తీవ్రంగా లేకపోతె అది తీవ్రమయినపుడు ప్రేమగా మారుతుంది. లేదా ఇష్టం వలన వచ్చే భాద్యతల, హక్కుల, ఆశల, కోర్కెల రేఖాతిక్రమణం జరగనంత వరకు స్నేహం అది జరిగాక ప్రేమ......ఇంతేనా ప్రేమంటే?
ఇంకోముంది చెప్పు? ప్రేమంటే ఇష్టం. స్నేహమంటేనూ ఇష్టం......రెండూ ఇష్టాలే. కాకపొతే రెండూ రెండు వివిధ రకాలయిన సామాజిక వృత్తాలకు కట్టుబడి "ప్రవర్తిస్తాయి". ఏ సామాజిక వృత్తంలో ఉండాలో, ఆ వృత్తాన్ని ఎప్పుడు చెరిపెయ్యాలో అన్నది ఆ మనిషి నిర్ణయించుకునేది.....సంకల్పితంగా కాని, అసంకల్పితంగా కానీ........అది నిర్ణయమే. కానీ రెండూ ఇష్టాలే. వాటి స్వరూప, గుణ, నైజ నిర్ణయం మాత్రం సామాజికం.
ఆశ్చర్యంగా ఉంది ముద్దలేసి నోటికిస్తే ఊసేసా అరకబట్టి బొప్పికట్టి సలపరం పుడితే ఎంత రుచో! కానీ...... స్వయంపాకంలో ఆనందం మాదాకవళంలో ఏదీ?
అందుకే ఈ మధ్య చేపల వేటకు పోతున్నా కోకోల్లలుండే చోటు కాదు తటిల్లతగా మెరిసే ఏకమీను గూటి దగ్గర.
***
ఇది రాస్తుంటే వచ్చిన అసందర్భం భావగరిమంటూ గెలికేస్తున్నా తటిల్లతలకు అమరత్వం అవసరం లేదన్నది కాదు క్షణభంగురమే కాకుంటే దానికీ తొడుగు కుట్టడీ మనిషి?
*** 3. అసలు నీకు ప్రేమ అంటే ఇదీ అన్నది ఎందుకు తెలియాలో చెప్పు?
అదేంటి. నువ్వు అనుభవిస్తున్నది ప్రేమో, ఆకర్షణో, మోహమో, కామమో తెలీకుంటే ఎలా?
తెలీకపోతే ఏమయింది?
బరితెగించకు. ఆకర్షణ,వ్యామోహం, కామం ఇవి త్యజాలు కదా. ఇదే నువ్వు అనుభవిస్తున్నది అయితే ఆపుకోవాలి కదా. ఆపుకోవాలి? అంటే "ప్రేమించటం" నిజమే అనమాట "ప్రేమ పుట్టటం" కాదనమాట?
అంటే?
ఒకటి కృషి, ఒకటి ప్రాప్తి
అంటే అర్థం కాలా సరిగా చెప్పు
ఒకటి సంకల్పితం, ఒకటి అసంకల్పితం
అయితే ఏమిటి తేడా? ఎందుకలా తేడా చెపుతున్నావు?
అర్థం అవటం లేదా నిజంగా లేక ఒప్పుకోబుద్ది కాదా? ప్రేమ ఒక భావమనీ అది "పుడుతుందనీ" కదా అనుకునేది. అది పుడుతుంది అంటే ప్రాప్తి కాబట్టి, అసంకల్పితం కాబట్టి అది మన చేతుల్లో లేదు కాబట్టి సామాజిక సరిహద్దులను ఉల్లంఘించే ప్రేమకు ఇది సాక్షీభూతంగా చెప్పుకుంటున్నామేమొ అనిపించదూ నీకు?
అంటే ప్రేమ అంటూ మనం అనుకునేది.....
ఆగాగు ఇప్పుడు "ప్రేమ అంటే............" అన్నది కాదు మనం చర్చిస్తున్నది
మళ్ళీ అర్థం కాలా.
ఇప్పుడు మనం చర్చిస్తున్నది ప్రేమ స్వరూపం గురించి కాదు
మరి?
ఇప్పటి చర్చ ప్రేమని చెప్పుకుని మనం చేసే పనులకు వేసే ముసుగుల గురించి!
అంటే నువ్వు ప్రేమించినది ముసుగు వేసుకున్న స్వార్థం అంటావు?
ఎందుకా దైన్యం గొంతులో? స్వార్థం అంత చిన్నదా నీ చూపులో. అయిన అది వేరే చర్చలే కాని నిజమే కదా ప్రేమ అనేది ఒక ముసుగే అయిపోయిందిగా చరిత్రహీనులకు.
మళ్ళీ ఇదేమిటి?
అవును. సమాజం అంగీకరించని ప్రేమను కూడా ధైర్యంగా "అవును నా ప్రేమకు ఆకర్షణే ప్రాతిపదిక...అవునూ నా ప్రేమకు మొహమే ప్రాతిపదిక.....అవును నా ప్రేమకు స్వార్థమే ప్రాతిపదిక" అని చెప్పుకుని తిరిగే వారు ఎంతమంది? లక్షమణ రేఖలను దాటినప్పుడంతా "నా తప్పేముంది ఇందులో. Love was and is a happenstance. ప్రేమ పుట్టటం నా చేతిలో లేదు కాబట్టి "నేరం నాది కాదు" " అని ఒళ్ళు విరుచుకోవటమే జరుగుతోందిగా ఈ కాలంలో.
సరే "ఈ కాలంలో" అని నువ్వు దేన్నిసూచించినా సామాజికోల్లంఘన ఎక్కువే జరుగుతోంది అన్నది ఒప్పుకుంటే ఇలా దొంగతనంగా సిగ్గుపడుతూ దానిని అంగీకరించటమే మంచిదేమో? నువ్వే అంటావుగా "ప్రతీదాన్నీ సులువుగా అంగీకరిస్తూ పొతే సామాజిక అభిశంసనాభయం పోయి విశృంఖలత్వం పెరిగిపోతుంది, సామాజిక శ్రేయస్సు తగ్గుతుంది" అని. కాబట్టి ఇదే మంచిదేమో కదా? "అవును నా ప్రేమకు ఆకర్షణ, మొహం, కామం, కులపు ఈకల సోయగాలు మొదలైనవి ప్రాతిపదిక" అని చెప్పుకుని తిరిగేవారు ఎక్కువైతే సమాజ శ్రేయస్సు తగ్గుతుంది కదా. కాబట్టి ఇలా ఉండటమే మంచిదేమో?
అదేదో ఇలా ముసుగులో ఉంటె సమాజ శ్రేయస్సు పె............ద్ద పెరిగిపోతున్నట్టు నువ్వూ నీ మాటలూ. నువ్వేగా "ఈ కాలంలో అని నువ్వే దాన్ని సూచించినా...." అంటూ నాకు చురకేసింది. Don't you see the irony in those two beliefs of yours? "ఈ కాలం అంటూ నువ్వే దాన్ని సూచించినా...." అనటంలో నీ ఉద్దేశ్యం "ఈ మార్పులు మన తాత ముత్తాతల నుంచీ వాళ్ళ తరువాత తరాన్ని గురించి అనేవే!" అన్నదే కదా. అంటే ముసుగులు వేసుకు కూర్చున్నా ఆ మార్పు జరుగుతోందనే కదా? Do you really think the swing of the pendulum can be stopped by the wispy hands of air that wants to stay still? Don't you know that the inert air is always slashed into two by the merciless swing of time? These changes are ఉన్స్తోప్పబ్లె....................but anyway I digress ! ముసుగేసుకు కూర్చున్నా మార్పులు ఆగటం లేదు. కాబట్టి హాయిగా దిగంబరాన్ని చర్చించుకోవటంలో తప్పేముంది?
ఇలాగే ప్రతివారూ అనేసుకుని అలా బయటకు మాట్లాడేసుకుంటే చూసి జనం ప్రభావితం అవరూ? సామాన్యీకరింపబడిన బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఆమోదయోగ్యమనుకునే తప్పు చేయదూ జనావళి? అప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది గ్రేటర్ గుడ్?
ఇదే అహం అంటే. పెద్ద పోటుగాడిననీ లేక పోటుదానివనీ నీ, నా పిచ్చి మాటల సిరా మరకలను చూసి ప్రజలు ప్రభావితం అయి చెడిపోతారమ్మా. నిజమే. ఏమో అనుకున్నాThe prominence of I నిజంగానే చాలా ఉంది నీలో.
నిన్ను నువ్వు తిట్టుకోవటం నీకంత సరదా అయితే నాకేం కాని మరి ఇదే ప్రయత్నం సినిమావాళ్ళు చేస్తే.....ఇదే హక్కు వాళ్ళు తీసుకుంటే....... అప్పుడు నీకెందుకు వస్తుంది కోపం కురచ బట్టల మీద, సొల్లు కబుర్ల మీదా?
నిజంగా నీకేమన్నా తిక్కా? ఆవేశాలను రేకెత్తిస్తూ, ఆలోచనలను రూపుమాపే అనుక్షణం అందుబాటులో ఉంది హోరెత్తించే ఆ ప్రసార మాధ్యమమెక్కడా......ఎన్నో వేల పదాల కుప్పలో ఎక్కడో దాగి ఉన్న ఇలాటి చర్చలెక్కడ? సెక్సును గూర్చి రాస్తున్నా "ఇందులో మీ సెక్సును ఉద్రేకపరిచేవేమీ లేవూ....." అన్న పరిచయపత్రం తమకు తాము సమర్పించుకోగలిగిన చిత్తసుద్ధి కలవారికీ, జనం ఎంతగా ఈలలు వేస్తె అంత చెవికింపు అనుకునే వారికీ తేడా తెలీదా నీకు?
we digress again lets come back to the point :)
సరే. పాయింటుకోచ్చేద్దాం. నిజంగా ప్రేమను అన్వేషించే వారూ, అది అనుభవించాలి అని తపన పడే వారేగా మన ఆడియన్స్. అలాటి వారు ఆకర్షనో, మోహమో, కామమో, ఇంకో తోకో........ఎదయితేనేమి, ఏదో ఒక తోక ప్రాతిపదికన ప్రేమను దర్శించటానికి చేసే ప్రయత్నం ఒప్పెందుకు కాదు? ఆ ప్రయత్నాన్ని చిన్న ఎందుకు చేయటం? మనస్ఫూర్తిగా అనుభవించే ఏ భావమయితేనేమి దానికి మాలిన్యం ఎందుకు అంటగట్టటం?
There you go starting again. Why is it that you can not but personalise a discussion?
Why should I not? I feel that de-personalisation of the discussions is the biggest obstacles to finding truths. Unless you know what you experience first....unless you know yourself first.....how can you even dare to explain what's not yours? And why the hell is anchoring exploration of truth in experience such an untouchable act? అనుభవైక్యం కాని అర్థం నిజంగా తలకెక్కుతుందా? నాలాటి వాడికైతే కాదు. yes....yes....yes.......we digress again. I know.........పాయింటుకు వస్తా. అవును ఆ పరస్పర విరుద్ధ భావాలు..... అంత పదునైన పదును కత్తులు, రెండూ ఒకే ఒరలో అంత ఒద్దికగా ఒదగటం, ఒకరిలోనే రెండూ బలంగా ఉండటం.......నాకు ఆశ్చర్యమే. అందుకే ఈ శోధన. I am fascinated by this unique blend of paradoxical and contrasting characters. On one hand is the intense పస్సిఒన్, on the other is the calm serenity. I need to know how they co -exist. I need to know the source code of this atomic force which keeps these two bound together and prevent their break up into zillions of bosons. అంత శక్తిమంతమైనదా ఈ ప్రేమ? అసలెలా ఉంటుందీ ప్రేమ? దీని రూపురేఖలేమిటి.....అంతు తేల్చాల్సిందే.
ఈ సంపుటి మొదటి వాక్యం ఒకసారి చదూ బుజ్జికొండా.
"అసలు నీకు ప్రేమ అంటే ఇదీ అన్నది ఎందుకు కావాలో చెప్పు ముందు....." ఆ చదివా. ఐతే?
నీ ప్రశ్నతో మొదలయింది కదా.....ఆ ప్రశ్నకు సమాధానంతో ముగించేద్దామా ఈ తడవ?
మనసులో గట్టిగా తలచుకుంటే అవతలి వారికి తప్పక చేరుతుంది...... నీ మాటలకూ, నమ్మకానికి ఆ శక్తి రావాలని కోరుకుంటూ
ఎల్లుండి! ఎనిమిదేళ్ళ కష్టఫలం ...నేను బూడిదలో పోయ్యాలని చూసినా పన్నీరుగానే మిగిలుతున్న రోజు నా అనుకున్న వారికి చాలా సంతోషం నిన్ను మరిచిపోతానా?
ఎల్లుండే రాయచ్చు కాని కృత్రిమమయిపోతుంది అందుకే ఇలా
ఎందుకో నీకు నువ్వు మంచి బహుమతి కొనుక్కోవాలి అనిపించాలి ఎందుకో తెలీకపోయినా నీకు ఆ రోజు పిజా, పెప్సీ ప్రాప్తిరస్తు ఎందుకో తెలీకపోయినా ఒక లిప్త పాటు నీ గుండె లయ తప్పాలి (చంపేస్తా నీ గుండె జబ్బు గురించి గుర్తు చేస్తే.....నీ చావు నువ్వు చావు పొ నాకనవసరం. What do I care?) ఆ లిప్తపాటు తప్పటడుగులో ఎక్కడో నా ఉనికి అలా మెదిలి మాయమవ్వాలి Hope this reaches you నీ నమ్మకం మీద నాకు నమ్మకం లేదు నీ మీద అపారంగా ఉంది చేరుతుందిలె.
సుఖదుఃఖాలను మళ్ళీ మామూలుగా పంచుకోగలిగిన రోజు కోసం ఇంకా ఎదురుచూపులే, సాధన లేదు. ఆ సాధన సఫలీక్రుతమయ్యే రోజు తొందరగా రావాలని కోరుకో ఆ ఆనందంలో "ఏమిటీ వయసులో కూడా పరీక్ష పాసయ్యా అంటూ ఆ గెంతులు" అని మళ్ళీ నువ్వనే ఆ రోజు రావాలని మనస్పూర్తిగా కోరుకో.
మరేం చెయ్యను ఎన్నని ముసుగులు ప్రయత్నించావు? వేటితోనూ తృప్తి చెందలేక చివరికి సూటి మాటలనే శరణంటున్నావు అదే పని ముందు చేసి ఉంటె ఇంత బాధ తప్పి ఉండేదిగా ఎందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేసిగాని నిజాన్ని ఒప్పుకోవు?
నీ అసలు వ్యక్తిత్వాన్నీ, నీ నైజాన్నీ వప్పుకోలేనితనం అది. అదే నాకు నచ్చదు
చాలా పొరబడుతున్నావు. మనసునోకదాన్నే మనిషి నైజాన్ని అంచనా వేసే తూనికరాయిగా చేయటం నిజంగా అసమంజసం. ఆ మనసుకు కళ్ళెం వేసే బుద్ది ఉంది, తనే కారణం, కర్తా అనుకునే అహం ఉంది, మనసుకూ, బుద్ధికీ, ఆహానికీ అందకుండా రెక్కలగుర్రంపై విహరించే రంగుల చిలక చిత్తం ఉంది.....వీటన్న్నిటినీ తన రధానికి కట్టుకుని స్వారీ చేసే ప్రవర్తన ఉంది......వీటన్నిటినీ వదిలేసి ఉట్టి మనసు ఒకతే మనిషి నైజమంటే నిజంగా పప్పులో కాలే.
అదే నీ అసలు నైజం కాకపొతే చివరికి మళ్ళీ అక్కడికే ఎందుకు వస్తావు ప్రతీసారి? మనసు కోరుకునేదే ఎందుకు జరుగుతుంది ప్రతీసారి? ఎందుకలా గింజుకుని గింజుకుని అప్పుడు దాసోహమంటావు?
నీకు తెలీదా ఎందుకో? మనసుకు నచ్చిన ప్రతీ పనీ చేస్తూ పోతుంటే, ప్రతి ఆశా తీరాలనుకుంటే ఇక సమాజం ఉంటుందా.
నీకేమన్నా పిచ్చా ఎందుకు నీ మనసునలా తక్కువ అంచనా వేసుకుంటావు? ఆలోచన లేని మనిషి, సమాజ శ్రేయస్సు ఆనని మనిషి మనసు వేరే నీ మనసు వేరే అని ఎందుకు తెలుసుకోవు?
ఎలా వేరే అవుతుంది? The basic wants and needs of everyone are the same and hence why should be there any difference in the instinctual drives of anyone from the next?
కాదు కాదు కాదు. నువ్వు కావాలనుకున్నా నీ మనసు తప్పుగా కోరుకోదు. ఎందుకంత అపనమ్మకం దాని మీద? ఎందుకంత భయం దాని శక్తంటే? ఒకసారి మనసు మాట విని నడుచుకో ఎందుకు మంచి జరగదో చూద్దాము?
అక్కడే నువ్వు పోరబడుతున్నావు. మనసుకు తప్పు ఒప్పులు ఉండవు. అవి బుద్ది వలువలు. దానికే అవి అలంకారం. మనసు అందమంతా దాని నగ్నత్వంలోనే ఉంది. తప్పొప్పుల తరాజులో మనసు కోరికలను, ఆశలను కొలిచి ఎంత అవసరమో, ఎంత సాధ్యమో, ఎంత అనుమతింపబడిందో, ఎంతకు మనం ధైర్యం అనే మూల్యాన్ని చెల్లిస్తామొ అంతవరకే మనకు పంపిణీ చేసే నర్సు బుద్ది. కాబట్టి ప్రతి మనసూ ఒకేలా ఉంటుంది, కోరుకుంటుంది. అందువలన నా మానసు గొప్పది, వాడి మనసు చిన్నది అనే సంస్కారాలు దానికి అంటవు. కాబట్టి ఆ విచ్చలవిడితననానికి కళ్ళెం తప్పదు మరి.
కాని మరి ప్రతిసారి దాని కనుసన్నలకే చివరికి చిక్కుకుపోతున్నావే. ఎందుకు ఈ స్లేష్మంలో ఈగ బతుకు. ముందే ఒప్పెసుకోవచ్చుగా, ముందే దానికి సాగిలపడితే తప్పేముంది?
నీకు మనసు ముందు నే చేసే ప్రతీ సాష్టాంగంలో నా ఓటమే కనపడుతోంది. కాని నాకందులో సాధన కనపడుతుంది. నీకు నా ప్రతి ప్రయత్నం చివరిలో మానస దాస్యమే కళ్ళబడుతుంది కాని ఆ దాస్యం నాకు వాక్యంతపు విరామం మాత్రమె. విరామం ఎంత అవసరమైనా వాక్యానికి మొత్తం విరామ చిహ్నమే నిర్వచనం అంటే మాత్రం నాకు నవ్వు వస్తుంది.
కాని వాక్యం మొత్తం నీ రుదిరాశ్రువుల వర్ణాలంకృత అయితే ఇంకేమి లాభం ఆ ప్రయత్నానికి? నువ్వు ఆనందంగా ఉండకుండా సమాజ శ్రేయస్సు సాధించలేవు అనేది నీ ఖచ్చితమైన అభిప్రాయం కదా.
అవును నిజమే. నాకానందం కాని ప్రయత్నం ఎక్కువ కాలం సాగదు ఫలితమివ్వదు. కాని నేను ఆనందంగా లేను అని నా అశ్రువుల సాక్షం తీసుకుని చెప్పేస్తే ఇంకేం చెప్పగలను?
నిజంగా అవి ఆనందభాష్పాలా నేను వేరే అన్వయించుకోటానికి? నేను నీ మానస జనితను మరిచిపోకు.
ఇదే ఈ తిక్కతనమే తగ్గాలి నీకు. ఆనందంలో మాత్రమె శాంతి, సుఖం ఉంటుంది అనుకుంటే నిజంగా పొరబడినట్టే. ఒకరితో బంధం ఎంత పెనవేసుకుందో తెలిపే కొలమానిణి లాటిది ఈ విరహం ఈ విరహంలో నిజంగా ఎంత గర్వముంటుందో తెలుసా? ఆ గర్వంలో ఎంత సంతోషమో తెలుసా? సర్వమైన ఇహము త్యజమయిన ఆ విరహంలో ఆ బాంధవ్య సాంద్రత తెలిపే కన్నీళ్ళు ఎంత చిక్కనో తెలుసా?
ప్రతి పదముతో, పాదముతో అనుబంధముంది కనుక తప్పటం లేదు ఇన్లైన్ రాయటం . "ఆ ఈ మాత్రం అర్థం చేసుకోలేరా నువ్వు చేపితెనేనా తెలుసుకునేది" అని మనసు అడిగితె "కాదె. నాకూ అర్థమయ్యిందన్న సంతోషమె ఇది పిచ్చి మొహమా" అని దానికి చెప్పి ఇలా బరికేస్తున్నా. విష్ణుసహస్రంలో బేసిక్ వ్యాకరణం అని రాయాలని ఎన్నో రోజులనుంచి ఉన్నా (అలా అన్నా ప్రతిపదార్థ, వ్యాకరణ ప్రయత్నం మళ్ళీ మొదలవుతుందేమో అన్న ఆశ) ఇప్పట్లో అది తీరెట్టు లేదు. కాబట్టి ఇలా ఈ పాటతో సరదా తీర్చేసుకుంటున్నా.
అసలు ఈ సినిమా చూడటం రిలీస్ అయిన యే మూడు నాలుగేళ్ళకో కుదిరింది నాకు. కాని మొదటి రోజునుంచీ పాటలు మాత్రం ఎంతగా ఆకట్టుకున్నాయంటే అంతగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "నీ చెంతే ఒక చెంచిత ఉంటె......" తో మొదలయింది నా ఈ నవరత్నాలతో అనుబంధం. ఆ పాటను ఎన్ని వందలసార్లు ఆస్వాదించాకనో కానీ ఈ పాట పరిచయమవలేదు. ఎలా మిస్ అయ్యానో నాకు తెలీదు. ఈ పాట విన్న ప్రతీ వందల సార్లూ నా గొంతు బొంగురు పొయ్యి తీరాల్సిందే. ఎందుకంటారా? చదవండి మరి.
సమానమెవ్వరు నీకిల
ఉమా రమణా
పాహి పా....హీ
ఓయీ శ్రీ చరణా
రమా వినోది వల్లభా
నమామి స్వర సుమాభరణా
నాద సదనా శృతి ధనా
ఆ..........
"నీకిలా/నీకిల"........
ఇక్కడ ఏది పెట్టాలి?
ఈ మీమాంసలో ఎంత కొట్టుమిట్టాడి ఉంటారో రచయిత.
లఘువు గురువుల మధ్య ఎంపికలో అంత అంతర్మధనం ఏముంది అంత్యప్రాసలన్నీ గురువులవే కాబట్టి ఇదీ ఇలా...నె అనేసుకుంటే మనసుకు పెద్దగా నొప్పలా. ధ్వని కంటే భావానికి పెద్ద పీట వెయ్యాలనిపించింది.
పైగా అసలు ఈ "ఇలా...ఇల" అనే తేడా ఉండొచ్చు అనెదీ నేను వేరొకరి ద్వారానే తెలుసుకున్నా కాబట్టి అక్కడ వారి అన్వయానికే ఓటు వెయ్యాలనిపించింది.
ఇంకో గమ్మత్తు చూసారా? ఎందుకో మామూలు పాటల బాణీలోలా కాకుండా పదాలనూ, పాదాలనూ కలగాపులగం చేసేసారు ఇక్కడ ఈ ప్రోలోగ్లో. పల్లవిలో వచ్చే వరుసలో కాకుండా వేరే వరుసలో ఈ ప్రోలోగ్ లో ఎత్తుకుంటారు. ఎందుకో మరి? సంగీతపరమైన కారణాలేమన్నా ఉన్నాయేమో!
అసలయితే మొదటిసారి ఈ "రమా వినోది వల్లభా...." వినగానే నాలోని మాధవుడు "చూడు ఈ పెద్దాయనకు ఎంత బయాసో...ఎంతైనా స్మార్తుడు కదా ఎప్పుడూ జింక చర్మం వాడే...పైగా రమావినోది "వల్లభు"డట. "శ్రీ"చరణుడట" అనేసాడు అక్కసుగా. "రమావినోదికి వల్లభుడట, శ్రీ ఇతని పాదాల దగ్గరట" అన్న ఆలోచన టక్కున మదిలో మెదలగా మండమంటే మండదా? :-).
జ్ఞాపకం మాత్రం చిన్నగా నవ్వి "యే కులమూ నీదంటే........" అని ప్రశ్నిస్తూ "అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ" తల దించుకోక తప్పలేదు. కాశీనాథుని శివకేశవారాదన ఇంకో టపాలో.
తల దించుకున్న నాకు "శ్రీ అంటే శుభం అన్న ప్రతిపదార్థం ఉంది కదా, అయినా శివకేశవుల భేదం నీకు తాకకూడదే....
నీ ప్రకారం రాముడు కృష్ణుడూ ఉట్టి మానవ మాత్రులేగా. దైవమనేదే ఉంటె అది నిర్గుణ స్వరూపమనే నమ్ముతావుగా" అని బుద్ది అనేసరికి మాత్రం నిజమే అనిపించింది.
ఈ నా మీమాంస కనక కవి కాంచి ఉంటె ఎంతగా నవ్వుకొనే వాడో కదా? తము కన్న మాటలు చదువరుల హృద్పీటికపై చెడుగుడు ఆడేసుకుంటుంటే, భావార్థాలు ఇరుపక్కల చిరునవ్వులొలక మధ్య జగన్నాటక సూత్రధారే కదూ కవి?
కానీ ఈ పల్లవికి ప్రాణం సాహిత్యం కాదు.
ఇక్కడ తప్పకుండా వాగీశ్వరి కంటే సంగీతలక్ష్మిదే పై చేయి. ఎంతయినా అత్త కదా మరి
రమా వినోది దగ్గర కింద స్థాయితో మొదలయి (కింద స్వరాలు అనలేకపోయా....కిందస్వరాలేనా లేక కింది స్థాయిలో అన్ని స్వరాలూ ఉన్నాయా అనేది సంగీతజ్ఞలే చెప్పాలి) నమామి నాద సదనా ....దగ్గర ఎంత చిక్కగా చక్కగా పై స్థాయికి వెళుతుందో సంగీతం. How apt కదా అనిపిస్తుంది. రమావినోది (ఇక్కడ ఈశ్వరుడు వల్లభుడు (=రాజు అనేసుకుంటున్నా బ్రౌణ్యం వెతక్కుండా!) గురించి వచ్చింది కాబట్టి అంత మంద్రంగా మొదలయి ఆతని సదనం అదేనండి బాబూ హిమాలయాల నెత్తినున్న కైలాసం గుర్తుకొచ్చేలా పై స్థాయి సంగీతం. WOW!!! (కైలాస సదనా ....కాంభోజి రాగాన గుర్తు రాదూ?)
ఇందుకు కూడా కాదు నాకు ఆనందం. "నమామి నాద సదనా...................." అంటూ ఒకసారి శ్రీరాంతోనో, మధుబాలకృష్ణతోనో ఒకసారి స్వరం కలిపే ధైర్యం చెయ్యండి. (పర్లేదు. వాళ్ళెం అనుకోరు నాది భరోసా! :-) అలా వాళ్ళతోబాటే పునరావృతం చేయండి దాన్ని. ఇప్పుడు గమనించుకోండి మీ గొంతుకను. ఎండిపోయింది కదూ?
సంగీతాభిమానులకు గొంతుకలో తిష్టవేసుకున్న ఈ ఎడారిచ్చే ఆనందం ముందు సొల్లు కారిపించే.....వొద్దులెండి.
నా మటుకు నాకు అలా గొంతు ఎండిపోయెంతగా అరవటం (పాడటం అనటానికి ఎంత టైం పడుతుందో తెలీదు) నిజంగా worth it. మొత్తం పాటకే హైలైట్ ఇక్కడి సంగీతం.
How I wish there were some panditas who can appreciate and inspire the pamara rasikas like me by providing the notations of songs like this.శుశ్రూష చెయ్యటానికి నేను భవసాగరం పాట ఎత్తుకుని రాలేను కాని నిజంగా పాటకో నెల రోజుల చొప్పున యే చాకిరీకి అయినా నేను రెడీ, మ్యూసిక్ నోటేషన్ ఇస్తానంటే.
పైగా ఉన్నత శిఖరాలను వర్ణించి మళ్ళీ "పా............హీ, పా.....హీ" అనే చోట మళ్ళీ ఎంత కిందికి వస్తుందో (కిందివె కదూ ఆ స్థానాలు?). అసలా transition పట్టుకోటానికి ప్రయత్నించండి ఎంత సంతోషమేస్తుందో. ఎలాటి సంతోషమో తెలుసా? cliffhanger లాటి రైడ్స్ ఉంటాయి చూడండి freefall మనకు అనుభావమిస్తూ మన గుండెగొంతులో వచ్చే ఆ ఫాల్ అనుభవమవుతుంది ఆ రెండిటీ మధ్య సమయంలో (నాద సదనా....................end చేసి పాహీ start చేసే ఆ transition లొ.) (hey btw, this post is meant for the ametuers. అంతే కాని ఏళ్ల తరబడి నేర్చుకుని ఏముంది ఆ transition లొ అని చప్పరించే వాళ్లకు కాదు)
పైగా how apt అనిపించదూ పాహీ పాహీ అనటం అలా మంద్రంగా అనటంలో....నిజంగా ఎంత ఔచిత్యం కదూ?
ప్రాణగానమాలాపన చేసి
స్వరసోపానములధిరోహించి
ప్రాణ గాన మాలాపన చేసి
స్వర సోపానములధిరోహించి
ప్రణవ శిఖరిపై నిను దరిశించి
ప్రణవ శిఖరిపై నిను దరిశించి
ఇక్కడ కూడా నాకు మళ్ళీ అదే ఔచిత్యం, అదే ఆరోహ అవరోహాలు కనపడతాయి.
"ప్రాణగానమాలాపన చేసి".......నుంచి "ప్రణవ శిఖరిపై"...................వరకూ ఎంత చక్కని ఆరోహణమొ.
చిదంబరా
నా హృదాంబుజమ్ముల
నీ పదాంబుజమ్ముల ధ్యానించి
శుభంకరా
నవ రసాంబు దారల
ప్రభాతాభిషేకములు
చేతురా
పా...హీ....
పాహీ......
పా.....హీ
పా....హీ...
నిను దరిశించి"న హృదయ చలనమెట్టిదో తెలియునా శివా అంటూ హెచ్చిన గుండె వేగాన్ని తెలిపేట్టు
"చిదంబరా" నుంచి "........సేతురా......." వరకూ ఎంత తీవ్ర గతో (తీవ్రగతి అంటే fast tempo నె కదా?)
wow. పైగా గతి తీవ్రతే కాదు ద్వని తీవ్రత కూడా.
ఎప్పుడైనా మీరు అతి ధైర్యంగా (ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ......అంటే మీరే మీరు చేస్తున్న పని తప్పు అని ఒప్పుకుంటూనే అది చెయ్యకుండా ఉండలేను అన్నది ఆలోచనకు తట్టకుండానె వివశమై చేసేసిన ఏదో ఒక పని సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి). నోరు తడారి పోవటం నిజంగా ఎప్పుడైనా అనుభావమయిందా? literally did you need a glass of water to speak normally any time? those who have experienced this only can really appreciate the beauty of this part అనిపిస్తుంది నాకు. అలాటి ఆనందం (మరి మీకిష్టమయ్యే కదా ఆ పని చేస్తున్నారు), భయం (మీ బుద్ది కూడా ఇది తప్పు అనే చెపుతోంది మరి భయం కలగదూ?) కలగలిసి ముట్టడి చేసిన వేళ మీలో లయకారిణి ఎంత గట్టిగా (వేగంగా కాదు గట్టిగా) కొట్టుకుంటుందో ఎప్పుడయినా అనుభవమేనా? చెవుల్లో గుండె కొట్టుకుంటుందా అన్నట్టు అనిపించేలా "చిదంబరా, హృదంబుజమ్మూ, పదంబుజంబుల" "శుభంకరా, రసంబుదారాల, ప్రభాతాభిషేకములు".......ఈ ఆరు పదాల గతి, ధ్వని ఎంత బావుంటుందో.
మళ్లీ అదే transition "పాహి పాహి" దగ్గర అని చెప్పక్కరలేదు కదా?
రమా వినోది వల్లభా
ఉమా రమణా శ్రీ చరణా
రమా వినోది వల్లభా
ఉమా రమణా శ్రీ చరణా
ఇక
గమక గమనముల స్వరఝరులే
జడల అడవిలో సుర ధునిగా....
మురిస ముక్కనుల కవళికలే
ముజ్జగాల సంగతుల జతులుగా.......
నాదములే నాగాభరణములై
యోగములే వాగర్థాకృతులై
..........లీలా కరణములై
సామములే మధు గాంధర్వములై
గంగాధరా......
శంకరా.......
సంగీత సాకారా.......
అడవిలో దారి తప్పితే ఏం చేస్తాము? ఏదైనా జలపాతం వినిపిస్తే పరిగెత్తుకుంటూ పోము? జలపాతపు హోరు మార్గదర్శకం చేయదూ? అదే హోరు, ఆ హోరు ఝోరు గమక గమనముల స్వరఝరులే జడల అడవిలో సుర ధునిగా.... అనే పాదంలో వినపడితే, మన ఆ హోరు చోటు చేరాలంటే ఆ ముక్కంటి ముక్కవలికళ (ముక్కంటి దయ కాదు ముక్కంటి కవళికల దయ....అర్థమవుతోందా తేడా?) దయ మన గతులకు (నడకకు) జతులట (తోడట).
తరువాత నాలుగు పాదాలలో ఒక పదమూ (లీలాకారణములై ముందుది), చివరి మూడు పాదాల భావమూ, యోగమనే పదానికి అర్థమూ నాకు సరిగా దొరకలేదు :( ఇంకేం చెప్పగలను? బావుంది అని మాత్రమె చెప్పగలను.
మళ్లీ గంగాధరుని ఎత్తున సంగీతం.
రమా వినోది వల్లభా
ఉమా రమణా శ్రీ చరణా
రమా వినోది వల్లభా
ఉమా రమణా శ్రీ చరణా
ఈ పాట వీడియో ఇవాళ చూసాను. మొత్తంగా.
నాకు కొంచం లేట్గా బల్బ్ వెలుగుతుంది అన్నది ఇవాళ మళ్లీ రుజువయింది.
There was a sense of incongruence in the fact that a grown man, however he might be enomoured by the respect to the two brothers, can dance like that in the airport అని.
ఇవాళ ఈ పాట చూస్తుంటే అర్థమయింది ఆ పాత్ర, ఆ పాత్రాభినయ ఔచిత్యం
అనుజుడై లక్ష్మణుడు అంటూ శ్రీనివాసాచారిని, రంగాను రామలక్ష్మణుల చేస్తే మరి వారి అనుంగు బంటు కోతి గెంతులేయక ఇంకేమి చేస్తాడు. అక్కడ చిందులేస్తున్నది మన నాగరీకుడూ అనుకుంటే మనకలా incongruence తప్పదు. ఆ మనిషిలో మనం వాతాత్మజుడిని చూస్తె భక్తి పారవశ్యంలో చిందులేస్తున్న "పిల్లకాయలొ" పరమాత్ముడు కనపడతాడు.