Saturday, 14 May 2011

1.

ఎందుకలా నవ్వుతావు?


మరేం చెయ్యను
ఎన్నని ముసుగులు ప్రయత్నించావు?
వేటితోనూ తృప్తి చెందలేక చివరికి సూటి మాటలనే శరణంటున్నావు
అదే పని ముందు చేసి ఉంటె ఇంత బాధ తప్పి ఉండేదిగా
ఎందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేసిగాని నిజాన్ని ఒప్పుకోవు?


నీకా శతవిధ ప్రయత్నాల్లో తప్పేమి కనిపించిందో చెప్పు


నీ అసలు వ్యక్తిత్వాన్నీ, నీ నైజాన్నీ వప్పుకోలేనితనం అది. అదే నాకు నచ్చదు


చాలా పొరబడుతున్నావు. మనసునోకదాన్నే మనిషి నైజాన్ని అంచనా వేసే తూనికరాయిగా చేయటం నిజంగా అసమంజసం. ఆ మనసుకు కళ్ళెం వేసే బుద్ది ఉంది, తనే కారణం, కర్తా అనుకునే అహం ఉంది, మనసుకూ, బుద్ధికీ, ఆహానికీ అందకుండా రెక్కలగుర్రంపై విహరించే రంగుల చిలక చిత్తం ఉంది.....వీటన్న్నిటినీ తన రధానికి కట్టుకుని స్వారీ చేసే ప్రవర్తన ఉంది......వీటన్నిటినీ వదిలేసి ఉట్టి మనసు ఒకతే మనిషి నైజమంటే నిజంగా పప్పులో కాలే.


అదే నీ అసలు నైజం కాకపొతే చివరికి మళ్ళీ అక్కడికే ఎందుకు వస్తావు ప్రతీసారి? మనసు కోరుకునేదే ఎందుకు జరుగుతుంది ప్రతీసారి? ఎందుకలా గింజుకుని గింజుకుని అప్పుడు దాసోహమంటావు?


నీకు తెలీదా ఎందుకో? మనసుకు నచ్చిన ప్రతీ పనీ చేస్తూ పోతుంటే, ప్రతి ఆశా తీరాలనుకుంటే ఇక సమాజం ఉంటుందా.


నీకేమన్నా పిచ్చా ఎందుకు నీ మనసునలా తక్కువ అంచనా వేసుకుంటావు?
ఆలోచన లేని మనిషి, సమాజ శ్రేయస్సు ఆనని మనిషి మనసు వేరే నీ మనసు వేరే అని ఎందుకు తెలుసుకోవు?


ఎలా వేరే అవుతుంది? The basic wants and needs of everyone are the same and hence why should be there any difference in the instinctual drives of anyone from the next?


కాదు కాదు కాదు. నువ్వు కావాలనుకున్నా నీ మనసు తప్పుగా కోరుకోదు. ఎందుకంత అపనమ్మకం దాని మీద? ఎందుకంత భయం దాని శక్తంటే? ఒకసారి మనసు మాట విని నడుచుకో ఎందుకు మంచి జరగదో చూద్దాము?


అక్కడే నువ్వు పోరబడుతున్నావు. మనసుకు తప్పు ఒప్పులు ఉండవు. అవి బుద్ది వలువలు. దానికే అవి అలంకారం. మనసు అందమంతా దాని నగ్నత్వంలోనే ఉంది. తప్పొప్పుల తరాజులో మనసు కోరికలను, ఆశలను కొలిచి ఎంత అవసరమో, ఎంత సాధ్యమో, ఎంత అనుమతింపబడిందో, ఎంతకు మనం ధైర్యం అనే మూల్యాన్ని చెల్లిస్తామొ అంతవరకే మనకు పంపిణీ చేసే నర్సు బుద్ది. కాబట్టి ప్రతి మనసూ ఒకేలా ఉంటుంది, కోరుకుంటుంది. అందువలన నా మానసు గొప్పది, వాడి మనసు చిన్నది అనే సంస్కారాలు దానికి అంటవు. కాబట్టి ఆ విచ్చలవిడితననానికి కళ్ళెం తప్పదు మరి.


కాని మరి ప్రతిసారి దాని కనుసన్నలకే చివరికి చిక్కుకుపోతున్నావే. ఎందుకు ఈ స్లేష్మంలో ఈగ బతుకు. ముందే ఒప్పెసుకోవచ్చుగా, ముందే దానికి సాగిలపడితే తప్పేముంది?


నీకు మనసు ముందు నే చేసే ప్రతీ సాష్టాంగంలో నా ఓటమే కనపడుతోంది. కాని నాకందులో సాధన కనపడుతుంది.  
నీకు నా ప్రతి ప్రయత్నం చివరిలో మానస దాస్యమే కళ్ళబడుతుంది కాని ఆ దాస్యం నాకు వాక్యంతపు విరామం మాత్రమె. విరామం ఎంత అవసరమైనా వాక్యానికి మొత్తం విరామ చిహ్నమే నిర్వచనం అంటే మాత్రం నాకు నవ్వు వస్తుంది.


కాని వాక్యం మొత్తం నీ రుదిరాశ్రువుల వర్ణాలంకృత అయితే ఇంకేమి లాభం ఆ ప్రయత్నానికి?
నువ్వు ఆనందంగా ఉండకుండా సమాజ శ్రేయస్సు సాధించలేవు అనేది నీ ఖచ్చితమైన అభిప్రాయం కదా.


అవును నిజమే. నాకానందం కాని ప్రయత్నం ఎక్కువ కాలం సాగదు ఫలితమివ్వదు.
కాని నేను ఆనందంగా లేను అని నా అశ్రువుల సాక్షం తీసుకుని చెప్పేస్తే ఇంకేం చెప్పగలను?


నిజంగా అవి ఆనందభాష్పాలా నేను వేరే అన్వయించుకోటానికి? నేను నీ మానస జనితను మరిచిపోకు.


ఇదే ఈ తిక్కతనమే తగ్గాలి నీకు.
ఆనందంలో మాత్రమె శాంతి, సుఖం ఉంటుంది అనుకుంటే నిజంగా పొరబడినట్టే. 
ఒకరితో బంధం ఎంత పెనవేసుకుందో తెలిపే కొలమానిణి లాటిది ఈ విరహం
ఈ విరహంలో నిజంగా ఎంత గర్వముంటుందో తెలుసా? ఆ గర్వంలో ఎంత సంతోషమో తెలుసా?
సర్వమైన ఇహము త్యజమయిన ఆ విరహంలో ఆ బాంధవ్య సాంద్రత తెలిపే కన్నీళ్ళు ఎంత చిక్కనో తెలుసా?


ఎందుకలా నరకయాతన? నరకయాతనేగా నాకు తెలుసుగా.


కాదన్నది ఎవరు?
ఏమో ప్రేమంటే ఇదేనేమో
ప్రేమంటే ఈ దీరమేనేమో
ధీరమంటే క్లేశాన్ని ఓర్చుకోవటమట
                     
                                                          4  3  2  1 

No comments:

Post a Comment