Wednesday, 25 May 2011

ఎల్లుండి దాకా ఆగలేను

మనసులో గట్టిగా తలచుకుంటే అవతలి వారికి తప్పక చేరుతుంది......
నీ మాటలకూ, నమ్మకానికి ఆ శక్తి రావాలని కోరుకుంటూ

ఎల్లుండి!
ఎనిమిదేళ్ళ కష్టఫలం ...నేను బూడిదలో పోయ్యాలని చూసినా పన్నీరుగానే మిగిలుతున్న రోజు
నా అనుకున్న వారికి చాలా సంతోషం
నిన్ను మరిచిపోతానా?

ఎల్లుండే రాయచ్చు కాని కృత్రిమమయిపోతుంది  అందుకే ఇలా

ఎందుకో నీకు నువ్వు మంచి బహుమతి కొనుక్కోవాలి అనిపించాలి
ఎందుకో తెలీకపోయినా నీకు ఆ రోజు పిజా, పెప్సీ ప్రాప్తిరస్తు
ఎందుకో తెలీకపోయినా ఒక లిప్త పాటు నీ గుండె లయ తప్పాలి
(చంపేస్తా నీ గుండె జబ్బు గురించి గుర్తు చేస్తే.....నీ చావు నువ్వు చావు పొ నాకనవసరం. What do I care?)
ఆ లిప్తపాటు తప్పటడుగులో ఎక్కడో నా ఉనికి అలా మెదిలి మాయమవ్వాలి
Hope this reaches you
నీ నమ్మకం మీద నాకు నమ్మకం లేదు
నీ మీద అపారంగా ఉంది
చేరుతుందిలె.

సుఖదుఃఖాలను మళ్ళీ మామూలుగా పంచుకోగలిగిన రోజు కోసం ఇంకా ఎదురుచూపులే, సాధన లేదు.
ఆ సాధన సఫలీక్రుతమయ్యే రోజు తొందరగా రావాలని కోరుకో ఆ ఆనందంలో
"ఏమిటీ వయసులో కూడా పరీక్ష పాసయ్యా  అంటూ ఆ గెంతులు" అని మళ్ళీ నువ్వనే ఆ రోజు రావాలని మనస్పూర్తిగా కోరుకో.  

Love You.

No comments:

Post a Comment