Friday, 6 May 2011

అమ్మ పప్పూ - కాలం


కళ్ళాలూ, ముసుగులు...ఊహు
ఇష్టముండేది కాదు 
అమ్మ పాలకూర పప్పులా.

అచ్చం అదే పప్పులా 
గూఢత, క్లుప్తత 
రెంటి అవసరం, రుచీ 
భలే ఒప్పించావులే


ఒకప్పుడు పాలకూర పప్పు కంచంలో ఉంటె లేచి వెళ్ళిపోయే వాడిని. 
అదేమిట్రా అన్న అమ్మ మాటలో బాధను పట్టించుకోకుండా. 
"వేరేవెం అడగట్లేదుగా నువ్వు వండినది వద్దనే హక్కు మాత్రం నాకుంది" 
వితండవాదానికి ప్రేమపై ఎప్పుడూ గెలుపే  


ఇప్పుడు?
"స్పినాచ్".
అరువు భాషలో, ఎంగిలి మాట.
అయినా ఎంతిష్టమో!
కాలం చాలా బలమైనది.
అచ్చు బీర్బల్ గుఱ్ఱంలా.
గడ్డం పుచ్చుకు మరీ తెలిపింది రుచి.

ఎందుకో అభిమానం ఎక్కువైతే దురభిమానంగా మారుతుంది. "అరువు, ఎంగిలి" నా మనసుకే నచ్చలా. కాని అలాగే ఉంచేస్తున్నా.



Pic belongs to http://binbrain.com/blog/wp-content/uploads/2008/12/spinach.jpg

No comments:

Post a Comment