Tuesday, 28 June 2011

బలిమెంతో తెలుసా

మహోధృతి వార్దిభంగికి 
ఏకైక కూలీనేన్
నమూనాలు
నడకనేర్చక మునువి 
ఇటుకలు పేరికలో 
తప్పులు కాచెయ్ 

Business 101 - Presentations. Why do we ever forget?!!!!!

How many times have we heard the same things?
blah blah blah ...................................

                         


  Visual  >  Written
  Focused message
  Consumer Benefits Not product specifications  
  etc
 etc 
     Steve jobs does nothing new
He just does it
.
.
.
.
.
.
.
.
.
.
.
.  
After a lot of thought







Sunday, 26 June 2011

తోడు నీడ

నీడ తోడును పరిచయం చేసింది....వింతగా. 

ఎప్పుడూ తక్కువే

ఏమిటో వింత
యుగాలు నమ్మబలికే బుద్ది
ఘడియ ముత్యమయే మనసుకు
ఎప్పుడూ లోకువే
ప్రేమలో 

There's magic around you

                                         Couldn't resist

రూపా ఇప్పుడు పాట పాడమంటుంది....నాకీ పిచ్చి పాటలు వద్దు...రూపా చచ్చిపొతే బావుండు

శ్రీకాంత్, ఇది ఆనంద్  .....నా ఫ్రెండ్. ఇక నీ స్నూపీ గాడిని ఫైట్ చేసి కొట్టేస్తాడు.

ఎలారా పెళ్ళి చేసుకోవటం....కనీసం కాళ్ళు కూడా చూడకుండా

రూపా బనియన్ అండ్ బ్రీఫ్స్...ఏ ఆరాం కా మామ్లా హై

ఏయ్ పోలీస్....జాగ్రత్త.....పోలీస్...చెయ్యి పడొద్దు.....మైనారిటీ లీడర్ని.....ఏయ్ పోలీస్

అయితే సరే.....సమతా మొగవాళ్లకు అది ఉండదు.

నేనంతగా డీప్గా ఆలోచించలేదు. ఇదొక డీప్ మూమెంట్ అనమాట. ఇలా కొన్ని కొన్ని జరిగిపోతుంటాయి. దీన్ని ఇక్కడే వదిలేస్తే బెటర్


ఆఫీస్లో ఏదో చేసి ఉంటాడు రోజూ చెపుతోంది
అయితే...జడ ఎందుకు కత్తిరించుకోవాలి షి వాస్ కూల్ :) ఆ పొడుగు జడతో
ఆ ఉద్యోగం మానేస్తే బావుంటుందేమో
ఏమక్కరలేదు పంతులుగారికి ఫోన్ చేస్తే వంద సంబంధాలు తెస్తాడు ఉండండి ఫోన్ చేస్తాను
అయిపోయావ్!


ఒక బ్లాక్ లైన్ మిస్సింగ్...అనితా టైం వేస్ట్ చెయ్యొద్దని చెప్పు ....మరి గ్రీస్ పూసినప్పుడు? టూ మచ్ కాదా? కరెక్ట్ ది తెచ్చియ్ అంతే.


నువ్వీ అమ్మాయ్తో వేగలేవు కాని పదరా చక్కగా వెంకటలక్ష్మిని చేసుకుందువు కాని  

అల్లరి అంటావా.....ఉండు నీ పని చెప్తా......రూపా ఆనంద్ అంటున్నాడు రూపాని ఎవరైనా వెనకా నుంచి చూస్తె అంతే దామ్మని పడిపోతారు అని అంటున్నాడూ....

రూపా పెళ్ళి చూపులకి నేనెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చా.....జోకర్ గాడ్లా..... ఛత్

హలో ఏనుగుగారు...
అమ్మో దోమ!

అరేయ్ బండ వెధవ...పొద్దున్నించీ ఇరవై మొక్కలకి పాదులేసి అలసిపోయి ....ఏదో కాంప్రమైజ్కి వచ్చాన్రా....ఇప్పుడంతా మటాష్

ఎంతిది?
దో సవ్.
ట్వంటీకిస్తావా?.................
బీస్ మే చెడ్డీ ఆతా.

నీ పేరెందుకు అలా పెట్టారు గోవిందాగాడి అండర్వేర్లా.....మరి నీ పేరెందుకలా పెట్టారు, ఏదో కాన్సర్ పేషెంట్లా








"Humour of the public" అని మాకు చిన్నప్పుడు ఉన్న ఆంగ్ల వ్యాసంలో బాగా గుర్తుండిపోయినది ఒకటే.
జనానికి నవ్వు వచ్చే సందర్భాలు మొత్తం స్థూలంగా ఒక అయిదారు వర్గాలుగా విభజించుకున్నా అన్ని వర్గాలలో అంతర్లీనంగా ఉండే దారం మాత్రం ఒకటేనట.....మనుషులకు నవ్వు ఇతరుల బాధల నుంచె వస్తుందట. (నవ్వు మనిషికున్న ప్రత్యేకత అనుకునే వారు ఆలోచించాల్సిన విషయమిది అనేది అసందర్భ ఆలోచననుకోండి). అప్పటినుంచి వెతుకుతున్నాను ఇంకో మనిషి బాధనుంచి కాకుండా మనిషికి నవ్వు వస్తుందా అని....ఆనందం కాదు...నవ్వు. నాకింతవరకూ కనపడలా.

కాని ఇవాళ బావుంది. 

Friday, 24 June 2011

గిరి - ధర

కోర్కెల పిండి ముద్దకు ప్రాణం పోయటం నుంచి ఆశల గొంతు నులమటం వరకూ....అన్నిటిలోనూ స్త్రీ కంటే పురుషుడెప్పుడూ వెనుకే. మౌనంగా స్త్రీ చేసే రోదనను స్వర బద్ధం చేస్తూ, ప్రతిఫలిస్తూ.... అది కూడా తన కేకే అనుకునే పెద్ద బండ... కొండంత రాతి బండ........పురుషుడు. చిన్ని మొలక నుంచీ బండ కొండ దాకా సమస్తం ఒళ్లో దాచుకునే పుడమి తల్లి స్త్రీ. తన అస్థిత్వం మొత్తం ఆ తల్లి ఒడే అని గమనించదు కొండ. కారుమబ్బుల్లో తల దూర్చేసి ఉరుములకు చెవులు, మెరుపులకు కళ్ళూ....... ఎలా దిబ్బిల్లు  పడుతున్నాయో, ఎలా  కారుచీకటి కమ్ముకుందో......చూడండోహోయని పిడుగుల దండోరా వేసి గోల చేసే ఆ అపరిణిత ప్రేమకు ధరణి తల్లి అంతరంతరాళ్లో విస్ఫుటిల్లె అగ్నిపర్వతాలు ఎవరికి తెలుసు? ఆదమరిచి తల్లి మేని జలదరించేనా సమస్తభూలోకం దద్దరిల్లిపోదూ? అయినా ఎంత? కొన్ని యుగాల సమయమేగా? తన అస్థిత్వాన్ని మెల్లగా, ఒకొక్క రేణువుగా......తొలుస్తున్న వరుణ్స్ బాబాయ్ ఉలి దెబ్బలకు వగస్తూ, గాలి మామ పల్లకీ మోస్తూ అత్తారింటికి పంపుతున్నఆ రేణువులను చూస్తూ తన అస్థిత్వం పోతోంది అనుకునే కొండ...నిజంగా బండ రాయే....కాని గుట్టుగా పుట్టింటి వారిని సాయం తెచ్చుకుని మరీ తనను తనలో ఐక్యం చేసుకుంటున్న ఆ మేధిని ఇల్లాలితనం కనపడదెందుకో ఆ కొండకు? ముక్కలై చెక్కలైపోతున్నా అనుకుంటుందే తప్పితే అమ్మలా లాలించే ప్రేయసి ఒడికి ప్రయాణమదని తెలుసుకోదేందుకో కొండ.....బండరాతి కొండ. తను ఎత్తు చూసుకు గర్విస్తూ "కిందే.....క్కడో భూమి" అనుకునే కొండకేం తెలుసు తన ఈనాటి ఉచ్చమంతా ఆ తల్లి... కడుపు చిరుగుతుందని తెలిసీ, పరదాల మాటున, మవునంగా, ఊపిరి బిగపట్టి ముక్కితేనె పుట్టిన ఫలమని?

అయినా సరే...ఎవరిక్కడ ధన్య జీవులు అన్న ఆలోచన రాదూ?

ఇల ఇళ ఇలా ఆదిదాంపత్యాన్ని, దాంపత్యసారాన్నీ చూపుతుంది అనిపిస్తుంది నాకు!
తల్లీ కొడుకుల అనుబంధమూ, ప్రేయసీ ప్రియుల బంధమూ ఏకాంకికన ప్రభవించే ఈ జీవనం నిజంగానే వరప్రసాదం.
Worth the penance.


Tuesday, 21 June 2011

7a

సిగ్గు లేపోతే సరి. తమ చేతకానితనానికి పిరికివాళ్ళు వేసుకునే ముసుగు ఈ "అహం వదులుకోవటం". నిన్ను, నీ వ్యక్తిత్వాన్నీ, నీ గౌరవాన్ని, నీ ఆస్థిత్వాన్ని సమూలంగా ప్రశ్నించే, పెకలించే మనుషులను వదులుకోలేకపోవటం, వదిలిన్చుకోకపోవటమనే బలహీనతకు వేసే ముసుగీ అహం వదులుకోవటం. 

నిజంగా అహం వదులుకోవటం అంటే  ఏమిటో తెలుసా? అహం అంటే "నాది, నాకు, నేను" ఇవి. నిజంగా వదులుకోగలరా నీలాటి భావుకులు? వాడులుకోగలరా "తను నాది" అనే భావన, వదులుకోగలరా "తను నాకు కావాలి" అన్న కోరిక? వదులుకోగలరా "నేను ప్రేమించాను" అన్నది? 

మీరు కావాలనుకున్న సాంగత్యం, సాన్నిహిత్యం, సహచర్యం పొందటానికి ఇవ్వకూడని మూల్యం కూడా ఇవ్వటానికి సిద్ధపడే వారు తమ కోర్కెలను సామాజిక ఆమోదముద్ర పడే విధంగా ప్యాకేజి చెయ్యటానికి ఉపయోగించే అందమైన టెట్రాపాకీ "అహం వదులుకోవటం"

"నేను రెండో పెళ్ళాంగా రావటానికైనా ఇష్టమే కాని నిన్ను వదులుకోలేను" అనే వారా నిజంగా అహం వదిలేసిన వారు? పెంచిన వారినీ, ఇంత చేసిన సమాజాన్నీ కూకటివేళ్ళతో పెకళించి వేసే ఈ మాటలను మాటాడే వారా ఆహాన్నోదిలేసిన సాధనాపరులు? ఎంత మందిని చూడటం లేదు నువ్వు ఇష్టం లేదు మొర్రో అనే భర్తలతో, నేను వేరే దాన్ని ప్రేమించాను అనే మగ్గాడిదలతో కూడా "నువ్వు ప్రేమించిన దాన్ని ఉంచుకో నేను మాత్రం నీ భార్యగా ఉంటాను నన్ను అన్యాయం చెయ్యకు" అనే ఆడవారిని ఎంతమందిని చూడం? వీరా నిజంగా ప్రేమ గురించిన తపం చేసేవారు?

"బహుభార్యత్వమే ఎందుకు ఉండాలి. బహుభార్యత్వం పురుషాధిపత్యానికి ప్రతీక కాబట్టి సమాజంలో స్త్రీకి సమానత్వం రావాలంటే బహుభర్తృత్వంలో సైద్ధాంతికంగా తప్పేమిటి? సమాజం దానికి ఆమోదముద్రవేయకపోవటానికి కారణం అది ఇంకా ఎదగకపోవటమే. నేను ఎదిగాను కాబట్టి నేను తనను మనసులో ఉంచుకుని ఇలా గడిపే జీవితం కీప్ జీవితం అని అనిపించినా, మగనాలి అయిపోయిన ప్రేయసిని తలచుకోవటం రెండో మగాడి స్థాయి అని తెలిసిన దాని వదులుకోలేకపోవటం నిజంగా అహాన్ని వదులుకోవటమా లేక బయట పెట్టుకోలేని కోజ్జాతనమా?"

అహం వదిలేస్తారట అహం! నిజంగా ఇష్టమయిన దానిలో లీనమయిపోవటమంటే ఏమిటో తెలుసా? అలాటి వారికి చదువుకునే బల్లలపై ఇష్టమైన వారి చిత్రపటాలు పెట్టుకుని ఎవరైనా వస్తే టపాలున ఆ పటాలను కిందపడేసి తమ ప్రాణం ముక్కు విరగ్గొట్టే అవసరం, ముడ్డి కింద పడి నలిగే వాలేట్లలో ప్రేమించిన వారి ఫోటోలూ పెట్టుకోవాల్సిన అగత్యం ఉండదు.  ఉండకూడదు కూడా. 

సుధా చంద్రన్లా ప్రేమించి మోసం చేసిన వాడి మొహాన్నే భళ్ళున తలుపులు మూసేసి తనను తాను నిలుపుకోవటం తెలీని ఈ మనుషులు అందరూ అవిటివాళ్ళే. ఆ అవితివాళ్ళు వాడే ఊతకర్రే ఈ "అహాన్ని వదులుకోవటం". ఒకరిలో ఐక్యం అవాలంటే అవతలి వారు సుముఖంగా ఉండాలి, సమాంతరం కాని కోర్కెలూ, ఆశలూ, అనుబంధాలు, నిర్వచనాలతో ఒక సంబంధాన్ని నడిపించలేము అని తెలియని మూర్ఖులు లేదా తెలుసుకున్నా బయటపడలేని బలహీనులు వీరంతా. 

ఎపుడో, ఏనాడో పంచుకున్న తీపి ఊసులను నిరంతరం నెమరేసుకుంటూ ఆ నెమరులోనే సుఖం వెతుక్కునే జంతుత్వం నుంచి ఎదగలేకపోయె మనుషులు కాని మనుషులా అహాన్ని వదిలేసుకునే వారు?

పరిస్థితుల వలలో చిక్కుకుని పరాయి జాలరి స్వంతమయి ఆ బానిసత్వమే సుఖమని తమను తాము మభ్యపరుచుకుని బతికేయాలని చూసే అభాగ్యులను "నేనున్నాను ఇంకా ఇలాగే జీవశ్చవంలా......." అంటూ ప్రతీక్షణం  కుళ్లబొడిచే వారా అహాన్ని వదులుకున్న వారు? తామేవరిలో అయితే లీనమయ్యామని అనుకుంటారో వారి సుఖం కోసం తమ స్వార్థాన్ని "నా, నాది, నాకు" అనే మూడిటిని వదులుకోలేని వారా  ప్రణవనాద ఎకాక్షరిని ఉచ్చరిస్తున్నాము అనుకునే దీశాలులు? పరమపవిత్రమైన అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలు?

                                          6 5 4 3  2  1 

Monday, 20 June 2011

యధాలాపంగా


కదిలే వేళ్ళు
తమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ 
కాలంపై సమరంలో 
బంటులుగా తమ వంతు చేస్తూ
 

Sunday, 19 June 2011

ప్రేమలో నమ్మకం

ఇది స్వార్థమే కావచ్చు. కాని ఒక కోరిక కోరాలని ఉంది 
నాకు దక్కని నీవు ఇంకెవరికీ దక్కకూడదు 
ఆజన్మాంతం కన్యగానే ఉండిపో 
ఈ కోరిక కోరటానికి ఎంత నమ్మకం కావాలి తన మీద, తన అనుకున్న వ్యక్తి మీద, తన ప్రేమ మీద?
కళ్ళు మూసుకుపోతున్న స్వార్థంతో కాదు తన కోరిక అన్న నమ్మకం, 
అవతలి వ్యక్తిని ఇది సంతోషపెట్టే కోరికే అన్న నమ్మకం,
మరి మళ్ళీ వెగచము అన్న నమ్మకం. 

నేనలా ఉండిపోతాను నువ్వూ నాలానే ఉండు అని చెప్పకనే చెప్పే ఈ వాక్యం
నీ కోసం నేనిలా మిగిలిపోతాను అంటే తన మనిషి ఎక్కడ బాధపడుతుందో అన్న సంకోచం ఏమాత్రం లేని నమ్మకం 

అసలీయన పాత్రలెందుకు అంత నమ్మకం కలిగి ఉంటాయి?

పడగ్గదిలో శోభనం రాత్రి భార్య అమ్మవారిలా కనిపిస్తే చిరునవ్వుతో అంగీకరించగలిగిన నమ్మకం 
పెళ్లిపీటల మీద కోరి చేసుకుంటున్న స్త్రీని, "ఊరి మంచి కోసం మన సుఖాన్ని బలిద్దాం సరేనా" అనడగలిగే నమ్మకం  
ప్రేమించిన స్త్రీని నాకు దక్కకపోతే నువ్వు మరెవరికీ సొంతం కావటం భరించలేను ఇలాగే ఉండిపోమనగలిగిన నమ్మకం 

నానమ్మ "సీతమ్మ కష్టాలు తీరాలంటే రామయ్య తోడుండాలి" అంటే నమ్మేసిన శివుడు మతిలేని వాడు కాబట్టి అంత నమ్మకం............... కాని మిగితావారు? లోకులే, లౌక్యులే కదా మరీ నమ్మకమెక్కడిది?
 
కాలం మహిమను తూచ్ అనగలిగేది ఆవేశం నమ్మకం మాత్రమె.
ఎవరిలో ఆవేశం కనపడదు కాబట్టి నమ్మకమే....మరెలా వచ్చిందీ నమ్మకం?

మన అనుకున్న మనిషి మనకోసం తాను అనవసరం అనుకున్నవి వదులుకుంటే ఆనందించే ఆ నిర్మొహమాటపు ప్రేమ నిజంగా కల్పితమేనా? గంగిగోవు పాలు గరిటెడు చాలు కడివెడైననేమి ఖరము పాలు అన్నది చెప్పుకోటానికేనా? అవతలి వ్యక్తికి తనమంచి తాను చూసుకోగల సామర్ధ్యం ఉంది అని తన వారిపై నమ్మకం ఉంచే మనుషులు ఎందుకు కనపడరు లోకంలో? ఎందుకు కట్టుబాట్లకూ, అలవాట్లకూ ఇంత బానిస అవుతాం మనం?

ఆదిలాబాద్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తెలిసిన వారు ఉన్నారా?

ఆగస్టు/సెప్టెంబర్ చివరి వారం నుండి
కనిష్టంగా ఒక నెల
స్ఫందనను బట్టి
రెండు నెలలు గరిష్టంగా


మెంటల్ హెల్త్ అవేర్నెస్ కామ్ప్స్ (Mental Health Awareness Camps) నడపాలని నిర్ణయం
ఆదిలాబాద్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 
ముందుగా అనుకుంటున్నది ఆదిలాబాద్లో.


can anyone help with contacts?


పదిహేను రోజులు కనీసంగా ఒక జిల్లాలో ఉంటాను.
వారానికి ఏడు రోజులు పొద్దున్నుంచి రాత్రి వరకు ఇదే పని.
స్కూలు పిల్లల దగ్గర నుంచి స్వయం ఉపాధి సంఘం మహిళల వరకూ,
mbbs drs నుండి నర్సింగ్ హోం, పాలీ క్లీనిక్ స్ఫేషలిస్ట్ల వరకూ,
గ్రామ పంచాయితీ ఆఫీసు నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు
చిన్న పిల్లల నుంచి ముసలి తాతయ్యల వరకూ
ఎక్కడైనా సరే, ఎవరితోనైనా సరే.....కనీసం అయిదుగురు ఉంటె చాలు మాట్లాడటానికి నేను రెడీ.


హైదరాబాద్లో పుట్టి పెరిగిన నాకు ఈ జిల్లాల్లో పరిచయాలు లేవు
కాని ఈ జిల్లాల్లోనే మానసిక ఆరోగ్యం గురించి నేను చెయ్యబోయే ప్రచారం మొదలెట్టాలని ఉంది.
అవేర్నెస్ కాంపెయిన్ అవసరం అలాటి జిల్లాల్లోనే అని నా అంచనా

పరిచయాలు చాలు మిగితావి నేను చూసుకుంటాను 
ఎవరూ పైసా ఖర్చు పెట్టక్కరలేదు
ఎట్టి పరిస్థితులలోనూ నేను కన్సల్టేషన్స్ చెయ్యను ఇది ఉత్తి అవేర్నెస్ కాంపెయిన్ మాత్రమె

conflict of interest declaration:-
Mindmattersonline.com is a commercial venture under whose banner I will be doing this.
(http://98.130.165.144/home)

వాడి కంపెనీ కోసం ఇది చేస్తున్నాడు మనమెందుకు సాయం చెయ్యాలి అనుకుంటారా మీ ఇష్టం, పర్లేదు. కమర్షియల్ గొడుగు కింద చేస్తున్నా మంచి పనే చేస్తున్నాడు కదా ఊరికే మాట సాయం చేస్తే ఏమవుతుంది అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారని ఆశ.


యూకే నుంచి అక్కడకు వెళ్ళే లోపల ఎన్ని ఎక్కువ మీటింగ్స్ బుక్ చేసుకుంటే అంత efficient గా నా సమయం వాడుకోవచ్చు కదా అని ఈ ప్రయత్నం.

ఇలా బ్లాగుల్లో ప్రయత్నిస్తే కుదరదు ఇలా ప్రయత్నించు అనో
ఇదిగో వీరిని పలకరించు వారు చెయ్యగలరు అనో 
మా ఊరు ఇక్కడ మా ఊరు వస్తారా అనో
మాకో స్కూలో కాలేజో ఉంది వస్తారా అనో 
మా జాతర ఆ నెలలోనే ఒక అరగంట మాట్లాడటానికి ఒప్పించగలను ఓకేనా అనో 
మా తాతయ్య చెపితే ఊరంతా వస్తుంది మా ఊరు రండి అనో 
అక్కడ ఏం ఎల్ ఏ మాకు తెలుసు చెపుతా రండి అనో
మా అమ్మ అక్కడ గైనకాలజిస్ట్..post natal depression (ప్రసూతి తరవాత వచ్చే డిప్రెషన్) గురించి మాటాడుతారా అనో 


మీ ఇష్టం వచ్చిన విధంగా సాయపడొచ్చు.
Can somebody help out please?

ఆదిలాబాద్, 
విజయనగరం, 
శ్రీకాకుళం జిల్లాలు...
ముందుగా ఆదిలాబాద్.


If you want to mail me rush2raghu@gmail.com is the id
if you want to talk pass me ur no or we can chat on rush2raghu (gtalk) or ragdoc2000 (skype)
If you want to ring me, 00447931342719(mobile) and 00441515296176


Thanks
Dr Raghavendra 

Saturday, 18 June 2011

నాకా కన్నివ్వవూ.


బీడుని
నీ వెలుగు రేఖ స్పర్శ
ఎక్కడి చెమ్మను తాకిందో
గుండెల్లో దాచుకున్నా
తెలియని గింజ
ఎన్నేళ్ళగా సుషుప్తినుందో

మొలకెత్తుతున్న వైనం
అసాంతంగా చూడాలనుంది.
ప్రకృతి ధర్మంగా
గుండె ఊయల నుంచి ఎత్తుకుంటే
ఆ పాపడికి ఏడుపే
నాకు తెలుసు

అయినా ఆశగా ఉంది..................

కెవ్వు కెవ్వునా
తొలి కేక పెట్టగా
జడపు పలుకురాళ్ళు కూడా
చేతనమోచ్చి దారిచ్చిన బాటన
ప్రసవించిన నీ కిరణం
అజ్ఞాతంలో ఎక్కడో
పరదాల మాటున కదా.

మొలకెత్తిన చిగురుకు
మొదటిసారిగా
నువ్వు జార్చిన అక్షత
పాపిట తుహినపు ముత్యమైన
ఆనాటి ముహూర్తమూ
స్వాతి లాగే అదీ నాకు అపరిచితం

గాలి ఆయమ్మ ఊయలలో
మొదటిసారిగా
నీ బుడతడు అలవాటులేక
బేజారవుతాడేమోనన్న కలత
ఆనాటి మేని జలధరింపేనేమో
లాతూరుగా మాత్రమె
లీలగా పరిచయం

బడి బట్టలు
మొదటిసారిగా
వంటికి కొత్త శోభలు తెస్తే
నువ్వు దిష్టేసిన ఎర్ర నీళ్ళేలే
ఆనాటి సూర్యోదయపు రమ్యం
ఇదీ నీ రేఖ కుంచెగా
నా మనసులో గీసిన చిత్రం
ఊహామాత్రంగా

అన్నీ మధురాలే.....

కాని దురాశగా ఉంది
సగటు మనిషినిగా.

ఈ మొలక పరిణామం
నిన్ను తేరిపార చూస్తూ
ప్రత్యక్షంగా అనుభవించాలని ఉంది

నీ తేజానికి కబోధినవటం
ప్రకృతి ధర్మమే కాదనను
అయినా సరే....
ఓ క్షణం పాటు
విశ్వరూపం చూసే
ధృతరాష్ట్రాదృష్టం
కోరుకుంటున్నా.......................


మానిందా
మానిపోయిందాయని 
చీటికిమాటికి
ఆతృత కాదు ఆదుర్దా.

అయిపొయింది
కాలం పట్టీ విప్పేసింది
మంత్రదండం పని చేసేసింది
అనుకుంటా.
మళ్ళీ
ఇదిగో ఇలా
దాని పక్కును తీయటంలో.......
నీ నుదుటి కుంకుమ ఛాయనేమో!



Friday, 17 June 2011

6

"నింగిలోని వేలుపులూ ఎంత కనికరించారో......." అన్న జీవి అలా ఎలా దూరం చేసుకోగలిగింది ప్రాణాన్ని? అలా దూరం చేసిన జీవిని క్షమించటం........అలా ఎలా సాధ్యం?

కూరిమి గల దినములలో పద్యం చిన్నప్పుడు మీ మాష్టారు చెప్పలేదేమో నీకు 

పే......ద్ద గొప్పేలే. అక్కడ తను ఆబల కాబట్టి, ఆ కాలపు పరిస్థితుల్లో అదే ఆచారం కాబట్టి క్షమించింది. అదే ఈ కాలం స్త్రీ అయితే అస్సలు క్షమించదు, క్షమించకూడదు.

అంటే అక్కడ క్షమ బలహీనత చిహ్నమే కాని ప్రేమ బలం కాదా మన్నూ?

ఎలా అవుతుంది నువ్వే చెప్పు? క్షమ ప్రేమ బలమేలా అవుతుంది? పురుషాహంకారానికి చిహ్నంగా స్త్రీ ఒక్కదానికే కట్టబెట్టబడిన క్షమ ప్రేమకెలా బలం అయ్యింది?

నీ కొడుకు నిన్ను భరించరానంతగా అవమానిస్తే బయటకు వెళ్ళిపోయినా నువ్వు మళ్ళీ అదే కొడుకు తప్పు తెలుసుకు వస్తే క్షమిస్తావా?

క్షమిస్తాను కాని అది వేరు. అది పేగు బంధం. ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. 

ఎందుకు వేరు? ఎందుకు స్త్రీ పురుషుల మధ్య ప్రేమను అంత తక్కువ చేస్తాము? 

నా కొడుకు నేను నవమాసాలు రక్తమాంసాలు ధార పోసి పెంచిన వాడు. చిన్ని రక్తపు ముద్దగా నా ఒళ్లో పడి నా గుండెల మీద పెరిగి నా వేలు పట్టుకు అడుగులేసిన ప్రాణమది. ఆ బంధమంతె. నీకు........

పర్లేదులే పూర్తి చెయ్. నాకు పిల్లలుంటే తెలిసేది. సరే. పిల్లలు ఉంటేనే తెలుస్తుంది ఆ బంధం లేకుంటే తెలీదు వాదనొద్దు  ఒప్పుకునేస్తా. కాని ఇది చెప్పు అలాటి బంధం......పేగు బంధమంటే తెలీకుండా, ఒళ్లోరక్తపు మరకలు చూడకుండా, గుండెల మీద పెరగకుండా...ఇవేవీ చేయకుండా అలాటి ప్రేమ, అలాటి అనుబంధం స్త్రీ పురుషుల మధ్య కుదరదా?

కుదరదా అంటే ఎందుకు కుదరదు? ఖచ్చితంగా కుదురుతుంది. 

మరి అలాటి ప్రేమ ఉన్నప్పుడు క్షమ రాకుండా ఎక్కడ పోతుందిరా?

కాని అది ప్రేమలోనా...... లేక  ఆ వ్యక్తికీ శిక్ష వేస్తె, వెయ్యాల్సి వస్తే ఆ వ్యక్తిని విడిచి ఉండలేని బలహీనతా? ఎలా తెలిసేది? నాకు తెలిసినంత వరకు చేయరానివి చేసినా క్షమించి అక్కున చేర్చుకోవటం బలహీనతే.

అంటే అమ్మతనం బలహీనటనమాట.

ఈ కాలంలో అది బలహీనతే.

అంటే ప్రేమనేది దేశ,కాలమాన పరిస్థితుల బట్టి మారుతుందనమాట.

అవును అవును అవును. ఈ కాలంలో పక్కన బంగారు బొమ్మను కాదు జేబులో బొమ్మెట్టుకు తిరగాల్సి వస్తుంది అలాటి వాళ్ళు. ఆనాడు సీతమ్మ తప్పు చేసిందని కానలకు పంపిన మా..రాజు పక్కన బొమ్మెట్టుకుంటే నేడు మనమాయనను నెత్తినెట్టుకుంటున్నాము. అదే ఈ రోజుల్లో చెయ్యమను. "పిరికివాడు. మగాడు కాదు. ఆడదానివి. పిచ్చోడు. చేతకాని వెధవ. be a man" బిరుదులు.........

కాదేమో. ఆయనను మనం నెత్తిన పెట్టుకుంటున్నది పెళ్ళాన్ని అడవులకంపినందుకు కాదు. ధర్మాన్ని అనుసరించినందుకు. తన భార్య తప్పు చేయలేదని తెలిసి కూడా తన రాచధర్మానికి (ఆయన చేసింది రాచధర్మానుచరణేనా? ఈ విషయం మాత్రం నాకు నిజంగా నమ్మశక్యంగా అనిపించటం లేదు....ఆ కాలంలో అయినా సరే ఒక మూడుడి మాట పురప్రజలందరూ వచ్చి కాదన్నా ప్రజావాక్కెలా అయ్యిందో, తన పాలనలో ప్రజ తన ఎదురుగా తనకు వెరిచి నిజం చెప్పటం లేదు అని తనను తాను ఎలా కించపరుచుకున్నాడో తెలీదు...కాని అది రాచరిక ధర్మమట) కట్టుబడి తన సగం ప్రాణాన్ని విడనాడాడు. ఆ ధర్మనిరతికి, వ్యక్తిగతంగా తను సర్వం కోల్పోతూ కూడా సామాజికంగా తన ధర్మాన్ని నిర్వర్తించిన ఆ చిన్ని చీమ పాత్రను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం అంతే. 
 అదే దేవదాసును తీసుకో అతనూ తన గుండెల్లో పెట్టుకు పూజించాడు పార్వతిని కాని ఎందుకు ఈనాడు చేతకానితనానికి ప్రతీక అయ్యాడు? తన జీవితంలోని ఒక పార్శ్వానికి విలువనిచ్చి, దాన్నే జీవితం చేసుకుని ఆ ఒక పార్శ్వంలో ఓటమిపాలై జీవితాన్నే ఓడిపోయాడు. అందుకని అతను అధిక్షేపితుడు. తన పని, తన ధర్మం, సమాజంలో తన వంతు నిర్వర్తించని వారు, కారణమేదయినా సరే....ఆక్షేపణార్హులే.
కాబట్టి సమాజం ఒక మనిషిని అతని/ఆమె క్షమా గుణాన్ని బట్టు అధిక్షేపించదు. అతని/ఆమె సామాజిక భాద్యత నిర్వర్తనను బట్టి తక్కెట వేస్తుంది. 

సరే...ఒప్పుకుంటాను. సమాజం తన ప్రయోజనాన్ని చూసుకుని ఆమోదముద్ర అది వేస్తుంది. సరే. కాని వ్యక్తిగతంగా పురుషుడు కాని, స్త్రీ కాని ఘోర అవమానాన్ని, తప్పిదాన్ని క్షమించగలగటం బలహీనతే కదా.

ఇద్దరు పిల్లలను తీర్చిదిద్దిన స్త్రీ నీకు బలహీనురాలయ్యిందా?

పిల్లలను పెంచటం బలానికి ప్రతీకెలా అవుతుంది? భర్త తన కాళ్ళు పట్టుకోగానే కరిగిపోయింది. ఏళ్లతరబడి కష్టఫలాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగింతలు పెడుతుంది. ఒంటరి స్త్రీకి సమాజంలో లేని రక్షణ, గౌరవాల వెరువుతోనే కదా ఇలా జరిగింది. అది బలహీనతే కదా?

అంతే కాని నిజంగా వ్యక్తిగతంగా మనస్పూర్తిగా క్షమించలేదు అంటావు? 

ఎలా క్షమిస్తావు అలాటి తప్పిదాలను. నీ వ్యక్తిత్వాన్ని, నీ అస్తిత్వాన్ని, నీ whole core ని తూచ్ అని తీసేసిన వారిని ఎలా క్షమిస్తారు? ఎలా సాధ్యమది ఆ మనిషి పట్ల ఆకర్షణ లేదా సమాజిక సమస్యల పట్ల వెరువు అనే బలహీనత లేకుంటే?

ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా మన్నూ?

".."

నిజమే సామాదానాలు తెలిసిన వాటికి ప్రశ్నలు అనవసరం.
ఆ మనిషి నిన్నటి దారుణంగా అవమానించిన సంఘటనలున్నాయిగా. అవి గుర్తు చేసుకో. ఆ సమయంలో నువ్వంతగా గాయపడినా, ఆ సమయంలో పీక పిసికేయ్యాలన్నంత కోపం వచ్చినా, చచ్చిపోవాలన్నత బాదేసినా ఎలా నిలిచిందా బంధం?

అదే అంటున్నా అది పిరికితనం. ఒక మనిషి పూర్వ మధురస్మృతులలో నేటి తప్పిదాన్ని క్షమించి వదిలేయటం పిరికితనం.

నూటికి నూరుపాళ్ళు నిజం. శిక్ష పడాల్సిందే. రాజధర్మం ప్రతి మనిషీ నెరపాల్సిందే. కాని ఆ శిక్షాకాలం ముగిసిన తరవాత?

కొన్ని శిక్షలకు అంతం ఉండకూడదు. అలాటి వారు క్షమకు అర్హులు కారు.

పిచ్చి పిల్ల. ప్రేమంటే దిగంబరత్వం. మానసిక దిగంబరత్వాన్ని సహించటమే ప్రేమ. With warts and all....that's what love is. వాదనకు వాదిస్తున్నావు కాని నీ అనుభవంతో నువ్వే చెప్పు........నీకూ క్షమించాలనిపించలేదూ.

ఊహూ..నిజం చెపుతా. అసలు క్షమ అన్న ఆలోచన కూడా రాలేదు. నేను తప్పు చేస్తే నన్ను నేను క్షమించాలి అనుకుంటూ ఆలోచించి క్షమించుకుంటామా? ఇదీ అలానే అనిపించింది నాకు. అసలు క్షమ అనే ఆలోచనే లేదు. తప్పు జరిగింది ఘోరమైన తప్పు జరిగింది అని అనిపించింది. ఏడుపు వచ్చింది. తగిన శిక్ష కూడా వేసాను. నా రాచ/రాణి ధర్మం నేను నిర్వర్తించాను కూడా.కాని అది ఉత్తి ప్రవర్తనే. నా మనసు క్షమించాలి అని అనుకోలేదు కూడా అనుకోలేదు. ఆటోమేటిక్గా అలా క్షమించేసింది. ఆలోచించకుండా అలా ప్రవర్తిన్చేసింది. అదేదో అది ఆ బంధం జన్మ హక్కయినట్టు 
అదే నాకు అసహ్యం. అదే నా మటుకు నాకు బలహీనత అనిపిస్తుంది.

ఎడమ కాలు కుడికాలుకి అడ్డుపడి తొట్రుపడితే  ఎడమకాలు కుడికాలుకి క్షమాపణ చెప్పలేదని కుడికాలు ఎప్పుడైనా అలగటం నీకు అనుభవమా? ఇదీ అంతే. నిన్ను నువ్వు ఇంకొకరిలో ఐక్యం చేసుకున్నావు. "ఆ కలవరమంతా మనదే.....మన ఒక్కరిదే....."అన్న అర్ధనారీశ్వరతత్వానికి సాక్షీభూతానివి అని బాహాటంగా చెప్పుకునే ధైర్యం లేకపోవచ్చుకాని అదే నీ మనః స్థితి అని పరోక్షంగా నీ చర్యలద్వారా, మానసికంగా తెలుసుకుంటున్నావు.  ఆ అదృష్టానికి మురిసిపోక నీకు నువ్వు బలహీనత అంటగట్టుకుంటావేం?

కాని సమాజం నన్ను "చేతకానిది ఒంటరిగా ఉండలేదు క్షమించక చస్తుందా....అనో, ఆడది దానికి ఇంకేం గతి ఉంది క్షమించేయక .........అనో అనకుండా ఉంటుందా?"

సమాజ ఆమోదముద్రకు ఎదురు చూస్తున్నావు అని నిన్ను కించపరచను. after all we are all social animals. ఒకటే  చెపుతాను. when it comes down to the brass tacks.....నీ క్షమాగుణం ఆకర్షణకో, తీపిగుర్తులకో లొంగిపోయ్యి వచ్చినదా లేక ప్రేమలో, అహాన్ని, ఎంతో ఇష్టంగా, కాశీలో వదిలేసిన ప్రయత్నఫలితంగా వచ్చిందా అనేది చివరకు పూర్తిగా తెలిసేది నీ ఒక్కతికే. so, live with your decisions and bear the cross...that's all you can do. right?   

its all right for you to say that because you are a male. Its always the females who have to be forgiving. క్షమయా ధరిత్రి అని ఒక కిరీటం తగిలించి మీ పబ్బం గడుపుకుంటున్నారు.

"...."

ఏం మాట్లాడవేం?

ఎవరి గురించో అయితే నాకు తెలీదు. నా గురించి అయితే నేను నీకు చెప్పక్కరలేదు.
మళ్ళీ చెపుతున్నా మన్నూ....ప్రేమించావు అనుకుంటే.....నేను, నాది అనేది లేదు అనుకునుంటే.... చేసిన తప్పుకు శిక్ష వేసి కూడా, దూరంగా ఉండి కూడా, ప్రేమించగలుగుతున్నావు అంటే.....అది బలహీనత ఎందుకయింది అన్నది ఆలోచించు.

కాని ఆ ఆలోచన సమాజం ఆమోదిస్తే ఆనందం కదా. కనీసం నా అనుకున్న వారయినా ఆమోదిస్తే నాకు ఆనందం కదా.

Who said you will have company at the summit? 



5 4 3  2  1 

Tuesday, 14 June 2011

et too animus.

లయబద్ధంగా 
అవిశ్రాంత జీవనగీతం 
నిర్గుణరూపంగా 
విశ్రాంత చేతనా
నులివెచ్చంగా
సజీవ నెగడు 
పక్కవాద్యాలిన్నిటీ  మధ్య కచేరీ
గురకదైనా సరే!

సామీప్యపు విలువ తెలిపే ఈ షరాబులు సైకత రేణువులై ఆత్మహత్యకు పాల్పడుతుంటే..........సహచర్యం ఫక్కుమంది.

stripped of all that is humane
this animus....oh!
yet, et too animus 
are a teacher now
Puff up your chest
blow your own, louder.
for the light blazes bright
light, devoid of shame,
just the need, basicest
for someone to hold
for someone to see
for someone to hear
for someone to smell
for some one..anyone
just alive, just aware!

Saturday, 11 June 2011

చూపుల్లో భావం....

పుల్లలు పేర్చిన శ్రమ 
వృధా కాలేదన్న ఆనందం?
రెక్క కింద వెచ్చని ఊర్పుల్లో 
చిన్నిప్రాణి నిశ్చింత ప్రతిబింబం?

గర్వంగా ఉంది.

Thursday, 9 June 2011

మళ్ళీ అలవర్చుకుని వస్తా....

కుండపోతని బంధించటానికి 
ఆబగా కుండ చేస్తున్నా, ధారలోనే! 
దోసిలిడితే కడలిమిడేనాన్న ఇంగితం
....స్వార్థంలో పారేసుకున్నా :)

Wednesday, 8 June 2011

5.

పోనీ నువ్వన్నది ఒప్పుకున్నా ప్రేమలో ఇవి ఉంటాయి. కాని వ్యామోహం, ఆకర్షణా, కామం వీటితో మొదలయ్యే ప్రేమలు కూడా ఉంటాయా? వాటిని ప్రేమ అనాలా?

ఎందుకంత ఆశ్చర్యం? రోజువారి ప్రపంచంలో ఏం చూస్తున్నాము? లవ్ అట్ ఫర్స్ట్ సైట్ అంటే ఏమిటి? సర్వ సాధారణంగా ప్రేమ  ఎలా పుడుతుంది? అసలు ప్రేమించాలి అని ఎందుకు అనుకుంటాము? ఏదో ఆనందం కోసమే కదా. ఆ ఆనందం ఎలా వస్తుంది? మనకు నచ్చినది స్వంతమయినప్పుడే కదా? స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఆకర్షణ, వ్యామోహం, కామం లేకుండా ఎలా పుడుతుంది? ఆ ఝల్లు లేకుంటే ప్రేమ స్త్రీ పురుషుల ప్రేమ మొలకెత్తేదెలా? ఆ ఆకర్షణా, వ్యామోహం, కామం లేని ప్రేమ ఉంటె దానికీ ఇద్దరు పురుషుల మధ్య కాని, ఇద్దరు స్త్రీల మధ్య కాని ఉండే స్నేహానికి దానికి తేడా ఏమిటి? మరి దానికి ప్రేమ అంటూ ప్రత్యేకమైన హోదా, నిర్వచనం దేనికి?

అంటే ముమైత్ ఖాన్నీ, డార్లింగ్ అయిపోయిన మున్నీని చూస్తె కలిగే కామం కూడా ప్రేమేనా?

మళ్ళీ డొంకతిరుగుడు ప్రశ్న. కామం, ప్రేమ ఒకటనటం లేదు. స్త్రీ పురుషుల ప్రేమలో కామం ఉంటుంది అంటున్నా. కామంతో, ఆకర్షణతో, వ్యామోహంతో మొదలయిన ప్రేమ కూడా సాధ్యమే అంటున్నా. అసలు అవే సర్వ సాధారణమేమో కూడా.   

అంటే నిజమైన ప్రేమ, అమలిన శృంగారం ఇవన్నీ కట్టు కధలేనా?

నిజమైన ప్రేమ! నిజంగా ఎంత బూటకమైన మాట ఇది.
సమాజానికి, సమాజ శ్రేయస్సుకూ చేటు అనుకున్న వాటి ప్రాతిపదికన ఏది ఏర్పడినా అది అసత్యం అనేయటం మనకేప్పటినుంచి అలవాడిందో నిజంగా నాకు తెలీదు కాని చాలా బాగా అలవడిపోయాము. నిజమైన ప్రేమ అని నువ్వనుకునే వాటి ఉదాహరణలు తీసుకో....దేవదాసు? ప్రేమ స్వంతం కాలేదని జీవితాంతం ఏడుస్తూ కూర్చున్న వాడు. సరే ప్రేమకు, ప్రేమ రాహిత్యానికీ ఎలా ప్రతిస్ఫన్దించారు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు కాబట్టి ఆ ఆఖరు వాక్యం అసందర్భం. దేవదాసు కాని, సాగర సంగమంలో బాలు కాని, మజ్నూ కాని, రోమియో కాని ఎవరైనా కాని ఎందుకు అంతగా బాధపడ్డారు? కోరుకున్న వారు స్వంతం కాలేదనే కదా? అక్కడ వారు కామం, వ్యామోహం, ఆకర్షణా .....వీటి కోసమే తమ జీవితాలను అలా చేసుకున్నారు అనను...కాని ఆ భావం లేకపోతె అంత మాధనపడరు ఎవరూ. పోనీ వారు నిజమైన ప్రేమికులు కాదు, నువ్వు విరహంలో ఉన్న వారినే తీసుకున్తున్నావు ఉదాహరణగా అంటావా? ఇంకెవరు నిజమైన ప్రేమికులు? పశుపతా? దక్షయజ్ఞానంతరం ఆయన కోల్పోయిందేమిటి, మరుడు తన తనువును పణంగా పెట్టి పున్ర్జన్మించినది ఏమిటి? ఆకర్శణో, వ్యామోహమో, కామమో....వీటిలో ఏదో ఒకటే కదా? ఇంకేది నిజమైన ప్రేమ? ఎవరు నిజంగా ప్రేమించి, భౌతికంగా కోరుకోని స్త్రీ పురుషుల ప్రేమోదంతం ఒకటి చెప్పు చూద్దాము.

నువ్వెందుకు నాలిక చివర్లకు వచ్చినా సీతారాములనూ, హరి-జ్యోతిల ఉదంతాన్ని ఉదాహరించలేదు? ఏదో ప్రత్యేకత ఉంది వీరి ప్రేమలో అని అనిపించి కూడా ఎందుకు పక్క పెట్టేసావు ఉదాహరించకుండా? వారిది కాదా నిజమైన ప్రేమ?

ఏమో మన్నూ. నాకలా అనిపించటం లేదు. నీ "నిజమైన ప్రేమ"లొ స్త్రీ పురుషుల మధ్య శారీరిక ఆకర్షణ ఉండకూడదు, అది తప్పు. ఆలోచించు. సీతారాములది ఆదర్శ దాంపత్యమా ఆదర్శ ప్రేమా? నాకు నిజంగా "నిజమైన" ప్రేమ అనేది ఉంది అంటే దాన్ని నిజంగా నిర్వచించినది హరి ప్రేమే అనిపిస్తుంది. సీతారాములది కూడా కాదు. రామాయణం మొత్తం భాద్యతల, ధర్మాధర్మాల మయం. అక్కడ నాకు తెలిసినంత వరకు ప్రేమ లేదు. కనీసం నాకర్థమయిన ప్రేమ లేదు. తనయిడిగా, తమ్మునిగా, రాజుగా ఆ అన్నాదమ్ములు తమ ప్రేమను ఎక్కించని బలిపీఠం ఉందా? వాళ్ళను కించపరచటం లేదు. వాళ్ళు ఆచరించినట్టు ధర్మాన్ని ఆచరించటం సులభతరం కాదు. కాని అక్కడ ప్రేమకు పెద్ద పీట వేసారు అంటే నాకు అస్సలు నమ్మ బుద్ది కావటం లేదు. ప్రేమించారు అణు ఒప్పుకుంటా. కాని "నిజమైన ప్రేమ" సీతారాములది అంటే అస్సలు నాకు నమ్మబుద్దేయదు.

కల్పిత పాత్ర అన్న చిన్న చూపు లేకపోతె సిరివెన్నెలలొ హరి పాత్ర నిజంగా ప్రేమను నిర్వచించే పాత్ర. నువ్వన్నట్టు "నిజమైన" ప్రేమ అది అని నేనను కాని చాలా ఉన్నతమైన ప్రేమ అని అంటాను. నిజంగానే జ్యోతి హరికి తగదు. "నా మనసున వెలిగే దేవిది ఏ రూపం, నా కంటికి తాకని సూన్యం...గుడిలో దేవత ప్రతిరూపం ఈ రూపం" అని ఎలుగెత్తే ఆ మురళీ రవాన్ని శరీరపు పెనుగులాట కోసం గొంతుచించుకుంటున్న కీచురాళ్ళ ధ్వనిగా అనుకోవటం నిజంగా జ్యోతికే సాధ్యం. ఇక్కడ హరి ప్రేమనే కాదు పెళ్లిని శరీరాల  పెనుగులాటగా అభివర్ణించి పెళ్లిని కూడా అవమానించింది జ్యోతి. నిజంగానే చరిత్రహీన. కాని హరి ప్రేమ? ప్రేమ దూరమయినా తన వరాన్ని పొందికగా పెంచి పోషించిన పితృ రూపం ఆ ప్రేమ. తన స్ఫందనకు ప్రాణం పోసిన స్త్రీని నిర్భీతిగా కొలిచిన పూజారి రూపం ఆ ప్రేమ. అసలు అతను ఆ అర్చనను కోరుకోవటంగా తలచటమే ఇతరులు చేసిన తప్పు. హరి కోరుకుని ఉంటె అక్కడ సహచర్యమే. అతనిలోని రసికుడు అక్కడ కోరుకున్నది తప్పక తన రాసోద్భవానికి కారణమైన ఆ చేతనా పుంజాన్నే అయి ఉంటుంది.

అవును ఆ చేతనా పుంజం పూర్తిగా భౌతికం. అందులోనూ స్త్రీ స్పర్శ ఎరుగని యుక్తవయస్కుడు తొలిసారిగా, ఎంతో దగ్గరగా స్త్రీ శరీరాన్ని అది పుట్టించే స్ఫందననూ రుచి చూసాడు. అందులోనూ తాను స్త్రీని అతని పురుషుడూ అతనిలో ఎలాటి భావాలు రేగుతాయో తెలీని స్త్రీ కాదు జ్యోతి. అలాటి ప్రౌఢ సప్తవర్నాలనూ, సూర్యోదయలానూ, ప్రకృతి పరవళ్ళనూ కబోదికి తెలియపరుస్తుంటే తనలోని మార్పుకు కారణం ఏమిటో తెలియని అమాయకుడు కాదు హరి. అదీ ఒప్పుకుంటా. కాని అతను కోరుకునేది అక్కడ శారీరిక కలయిక కాదు. ఆ ఒక్క క్షణపు అద్భుతం  కోసం జీవితాన్ని పణంగా పెట్టిన పిరికివాడు  అస్సలు కాడు హరి.

అయినా చూసావా హరి ప్రేమలో కూడా ఎలా ఆకర్షణా, వ్యామోహం, కామం ఉందొ? అసలు నిజాయితీగా నిఖార్సుగా మాట్లాడుకుంటే అదే గుడ్డోడికి "ఆహా ఊహూ అంటున్నది ఇది ఆహా ఆహా ఓహో ఓహో అంటున్నదీ" అని పిచ్చిగంతులు వేసే స్నేహితుడు సూర్యోదయాలను ప్రకృతి పులకిన్తలనూ స్పర్సానుగతంగా తెలియ చేసి ఉంటె ఇంత సిరివెన్నెల కురిసేదా? ఆ రసికుడు తన మురళీరవాన నింపిన స్వరమాదురికు కారణమైన స్ఫందనలో నిజంగా స్త్రీ పట్ల ఆకర్షణా, కామం, వ్యామోహం లేవని, ఉండవని, ఉండకూడదని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలమా మనం? లేదు. ఇక్కడ కూడా ఇంత "నిజమైన" లేదా "ఉన్నతమైన" ప్రేమ కూడా ఆశారీరికం కాదు.

అంత కలగాపులగంగా మాట్లాడతావు. ఇప్పుడేగా ఒక పెరాగ్రాఫులో హరిది శారీరిక కలయిక కోసం పరితపిస్తున్న ప్రేమ కాదు అన్నావు. మళ్ళీ అదే పేరా కిందలో అది సారీరికమే అని ఖరారు చేస్తావు. నీకు నిజంగా గుమ్మడి కాయంత వెర్రి.

:) అదెం కాదమ్మడూ. అర్థం చేసుకో. హరి ప్రేమకు పునాది కూడా స్త్రీ పురుషుల మధ్య ఎగిరిపడే ఆ భౌతికమైన మిణుగురులు అమర్చిన జ్యోతే అన్నాను రెండో పేరాలో. కాని ఆ జ్యోతిని నిరంతరం అలా వెలిగించేది మాత్రం ఆ వాంచ కాదు అంటున్నాను.
పోనీ అదే అనుకుందాము. ఎందుకు స్త్రీ పురుషుల సమాగమనం అంటే అంత హేళన అందరికీ. ఎందుకు దానిని అంతగా వేలేస్తారు దానిని? సృష్టి కార్యం, పరమం పవిత్రం అంటూ దానికి పవిత్రత తొడుగు కప్పాల్సిన అవసరం లేదు. సృష్టి కార్యానికని మొదలయిన ప్రయాణంలో అంతులేని వింతలు సృష్టించుకున్నాడు మానవుడు. ఆ వింతలూ, వినోదాలు, ఆ ముద్దు మురిపాల కోసమే అన్నది జగత్విదితం. కాని దాన్ని కేవలం ముద్దూ మురిపెంగానే కాక తమ ప్రేమ వ్యక్తీకరణలొ అధిరోహించే, అధిరోహించాల్సిన ఆఖరు సోపానం అనుకునే వారు ఎంతో మంది. అంతటి మధురమైన ఘట్టాన్ని ఎందుకు బూతనే పరదా మాటున మగ్గే లంజను చేయటం?  

నోరు జారుతున్నావు...పడుపు వృత్తి వారంత దిగాజారారా నీ కళ్ళకు?

నీ కళ్ళలో ఎరుపు జీరలు వచ్చినా భయపడే వారు లేరిక్కడ. అమలిన శృంగారమట అమలిన శృంగారం. శృంగారమంటేనే ప్రేమైక అనురాగైక్యమైన రతీ కార్యం. అది మాలిన్యం ఎలా అయ్యింది? పోనీ నీ కంటికి శృంగారానికి, రతీ కార్యానికి తేడా లేదనే అనుకుందాము. తెలుగులో చెపితే బూతట, సంస్కృతంలో శృంగారమత. అలాగే ఇదీ అనుకుందాము. నీ ప్రకారం ఏవి మలినాలు?
ఒకరి కంటే ఎక్కువ మందితో కూడటమా మాలిన్యం? మరి బహు భార్యత్వం ఒకనాడు సభ్యసమాజామోదముద్ర పడిన ఆచారమేనే. జీవికకోసం తమకున్న దానిని పెట్టుబడిగా చేసి వ్యాపార వస్తువుగా మారిన మరుకాన్డనా నువ్వు మలినం అంటున్నది? కనీస అవసరాలకు భత్యమివ్వలేని రాజరీకం, మానప్రాణాలకు రక్షణ ఇవ్వలేని సమాజం, సమస్య ఉంది దానిని పరిష్కరించాలి అనుకోవటం పోయి చెత్తకుప్పల మీద మనుషులను పడేసి వారిని అసహ్యించుకునే సభ్య సమాజపు వ్రణరాజాన్నా నువ్వు మాలిన్యం అంటున్నది? తెలిసీ తెలియని వయసులో, భాద్యతగా చూసుకునే మగతనానికీ - నలిపి, నమిలి ఊసేసే పక్కిరితనానికీ తేడా తెలియని వయసులో సభ్యసమాజపు ఒరవళ్ళ వేగంలో కొట్టుకుపోతూ తప్పటడుగులు వేసిన వారినా నువ్వు మాలిన్యమనే కొరడా ఝుళిపించి జీవితాంతం కలంకితం చేసేది? విధి వాతపడి కనీస శారీరిక అవసరాలను తీర్చలేని వారిబారినపడి ధర్మమనే గాటికి కట్టుపడి ఉన్నా శారీరిక ధర్మానికి తలొగ్గిన పడతులను మాలిన్యమని తీసేసే మన సమాజం అదే మగ పుంగవుల దగ్గరకొస్తే "మరి ఉప్పూ కారం తింటున్న మగాడు పడక సుఖం లేకుండా ఎన్నాళ్ళు ఉంటాడు" అంటూ వెసులుబాటు కల్పిస్తే నిజమైన మలినాలు ఎవరివి?

నువ్వనుకునే విధంగా ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తించే వారు ఎంతమంది? ఆ ఇంతమందిని పట్టుకు ఎందుకు మనం ప్రకృతిలో అత్యంత రమ్యమైన క్షణాలను గాడిద మీద ఊరేగిస్తున్నాము. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈ సమారాధనకు పసుపూ కుంకుమలు సమర్పించుకోక ఎందుకలా సున్నపు బొట్లు పెడుతున్నాము? పైగా ఆ ముహూర్తానికి ఎదురు చూసే ప్రతి చినుకు బొట్టుకూ స్వాతీ నక్షత్రమే అనువైన తిధి అని అడ్డంకులు పెడుతున్నాము?

నువ్వు మరీ అంతగా ఫీలయిపోకు. తాగిన మొగుళ్ళను పక్కపైకి రానీకండి అని చెప్పటానికి కష్టపడే పెంటమ్మ ముఖం నేను పెట్టాల్సి వస్తుంది. (గుర్తుందా రుద్రవీణలొ పెంటమ్మ మొహం? :) మళ్ళీ నువ్వే యాక్ అంటావు. నువ్వు చెపుతున్నట్టు శృంగారానికి మనసులో అంత పెద్ద పీట వేసుకునే ప్రేమికులు ఎంతమంది చెప్పు? అసలు ప్రేమంటే అని ఆలోచించే వారెంతమంది? అనుభూతులను అలా అనుభవించేస్తూ వెళ్ళేవారే కాని ఎంతమందికి తెలుసు తమకు కలుగుతున్న అనుభూతి ఏమిటో, ఎందుకో?

మళ్ళీ మొదలుకోస్తున్నావు. మళ్ళీ నానుంచీ అదే ప్రశ్న వస్తుంది ఇలా పునరుక్తులు చేస్తే. అసలు నీకెందుకు ప్రేమ నిర్వచనాలు, దాని సూత్రాలు? నిర్వచనాలూ, పరిమితి వృత్తాలూ తెలిస్తేనే అనుభవించాలా? రవికిరణం ఏ అణువిస్ఫోటన గర్భఫలితమో అని ఆలోచిస్తూ కూర్చుంటే ఇక పద్మమిత్రునికి నెచ్చెలి అరవిరిసిన ఆపేక్ష చూసే అదృష్టం కలిగేనా?

మరైతే నువ్విప్పుడు చేస్తున్నదేమిటో? ఎందుకీ నిర్వచనా శోధనా వ్యాసంగాలు?

"-"

ఏమిటో మూగనోము?

కొన్నిటికి సమాధానాలు ఉండవంతే!  


4  3  2  1 

Tuesday, 7 June 2011

సందిట్లో

కమ్మిన మంచు పొగ
వెచ్చగా!!! 
జగాన్ని మరిపిస్తూ.
ఉషోదయమైతే అవిరేనంటూ 
ఫక్కున నవ్వే సూరీడా 
కడలి ఒడి వెచ్చతనం
రేయి వరకేనని నే నవ్వనా?

గంటల ముల్లుపై స్వారీనున్నపిలగాడికి 
ఓ గంట గంట శబ్దం తప్పితే 
కలిగే ఆనందం, రుఛీ........
ప్చ్ పాపం :( 
టిక్ టిక్ టిక్లే నీ లబ్ డబ్ లబ్ డబ్లు గా!

Monday, 6 June 2011

Joys of Discovery-2-శృతి మారటం అంటే ఇదేనా? & some ramblings to boot.

అనగా అనగా అనగా 
అనగనగనగనగనగనగా 
అంతే ఇంకేముందీ చాలు కదా


అనగా అనగా అనగా 
అనగనగనగనగనగనగా 
అంతే ఇంకేముందీ చాలు కదా


ఉందంటే ఉన్నట్టూ 
లేదంటే లేనట్టూ 
ఆకాశం లాంటిదే ప్రేమ కథా  
దీనికి ఆది అంతూ అంటూ ఉంటె కదా 


అనగా అనగా అనగా 
అనగనగనగనగనగనగా 
అంతే ఇంకేముందీ చాలు కదా

ఆ.....ఆ....


వడగాలై కొడుతుంది 
వడగళ్ళై పడుతుంది 
చలిముల్లై కుడుతుందీ 
వలపోచ్చీ 
ఆరు ఋతువుల్నీ 
ఓసారే రప్పించీ


వడగాలై కొడుతుంది 
వడగళ్ళై పడుతుంది 
చలిముల్లై కుడుతుందీ 
వలపోచ్చీ 
ఆరు ఋతువుల్నీ 
ఓసారే రప్పించీ

ఎన్నెన్నో వర్ణాలు వైనాలు 
తనలోనే ఉన్నట్టూ కన్నుల్నీ ఆకట్టీ 
రమ్మందీ పైనుంచీ కూతెట్టీ 
తాను కూర్చుందీ గుండెల్లో గూడెట్టీ


రమ్మందీ పైనుంచీ కూతెట్టీ 
తాను కూర్చుందీ గుండెల్లో గూడెట్టీ

అనగా అనగా అనగా 
అనగనగనగనగనగనగా 
అంతే ఇంకేముందీ చాలు కదా 

మజునూలేంతోమందికి గజినీలెంతోమందికి 
ఈ కథనే చెప్పిందీ జోకొట్టి
ఒళ్లో పడుకోబెట్టూకున్న ఈ మట్టీ


మజునూలేంతోమందికి గజినీలెంతోమందికి 
ఈ కథనే చెప్పిందీ జోకొట్టి
ఒళ్లో పడుకోబెట్టూకున్న ఈ మట్టీ

కునుకోచ్చిందే కాని ఊకోట్టీ ఊకోట్టీ 
కడదకేమయ్యిందో తెలియదు కాబట్టి 
కాబట్టి 
మళ్ళీ వినిపిస్తుందీ మొదలెట్టీ 
ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తీ
మళ్ళీ వినిపిస్తుందీ మొదలెట్టీ 

ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తీ

అనగా అనగా అనగా అనగనగ 
అంతే ఇంకేముందీ చాలు కదా
ఉందంటే ఉన్నట్టూ 
లేదంటే లేనట్టూ 
ఆకాశం లాంటిదే ప్రేమ కదా 
దీనికి ఆది అంతూ అంటూ ఉంటె కదా. 

చిత్రం:- కుదిరితే కప్పు కాఫీ 
సంగీతం:- యోగేశ్వర సారమ 
గాత్రం:- కీరవాణి 

కుదిరితే కప్పు కాఫీ. నిజంగా మంచి కాఫీ లాటి సినిమా...నా వరకు నాకు. 
హాయిగా అలా చూసేసి అలా మరిచిపోయ్యా.
చూసినప్పుడు అసలే పాటా మనసును తాకలేదు 
తాకలేదో తాకనివ్వలేదో :)

యధాలాపంగా తరవాతెప్పుడో కారులో పాటలు వింటూ వెళుతున్నా. 
(మన దేశం వచ్చేసాక నేను నిజ్జంగా మిస్ అయ్యే మొదటిది ఇదే అవుతుంది ఖచ్చితంగా.
ఎంతో దూరం కారులో వెళ్ళినా ఒకసారి మోటార్వె ఎక్కితే ఇక అసలు రోడ్ పై ఎక్కువ ధ్యాస అక్కరలేదు 
ఎన్ని గంటలు ఇలా నాకు నచ్చిన పాటలనూ స్తోత్రాలనూ పారాయణం చేసానో రోడ్వెలపై వెళుతూ)

అలాగే వింటున్నా. ఎందుకో మొదటి మూడు పాటలు ఆకట్టుకోలా అప్పుడు. (ఇప్పుడు ఈ సినిమాలో అన్ని పాటలూ చాలా ఇష్టం). అకస్మాత్తుగా ఏదో స్వరం.....గమ్మత్తుగా ఉంది. అయినా ఆకట్టుకోలా. నా ఆలోచనల్లో నేను. 

కాని నా ఆలోచనలకు టక్కున బ్రేక్ వేసింది ఒక చరణం
మజునూలేంతోమందికి గజినీలెంతో మందికి 
ఈ కథనే చెప్పిందీ జోకోట్టీ 
ఒళ్లో పడుకోబెట్టూకున్న ఈ మట్టీ...............

అంతే చకచకా వేళ్ళు కదిలాయి. పాట మళ్ళీ మొదలెట్టింది. ఈసారి ఆపేసిన చరణం  

కునుకోచ్చిందే కాని ఊకోట్టీ ఊకోట్టీ 
కడదకేమయ్యిందో తెలియదు కాబట్టి 
కాబట్టి 
మళ్ళీ వినిపిస్తుందీ మొదలెట్టీ 
ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తీ

సబాసో.....మళ్ళీ వెనక్కుపొయ్యింది 

ఈసారి ఆగిపోయింది ఆలాపన దగ్గర 
ఓ...ఓ.......
ఓహో...ఓహో....
ఓ....ఓ...
(అవునూ ఈ ఆలాపాన మొత్తం అనగా అనగా అనగా.....నుంచి ఆది అంటూ అంటూ ఉంటె కదా ....వరకూ ఉన్న స్వరాలదా లేక ఆ స్వరాలకు సంబంధం లేనిదా? ఎవరికైనా తెలుసా?)

మళ్ళీ వెనక్కు పొయ్యింది పాట
ఈసారి లాలీపాప్ లేడీ వేషం వేసి నా ఆలోచనల కారుకు అద్దం పడే వంతు ఇంకో చరణానిది 
వడగాలై కొడుతుంది 
వడగళ్ళై పడుతుంది 
చలిముల్లై కుడుతుందీ 
వలపోచ్చీ 
ఆరు ఋతువుల్నీ 
ఓసారే రప్పించీ

అవునూ లాలీపాప్ లేడీ అంటే మీకు తెలుసా?
ఇక్కడ స్కూల్ పిల్లలు సేఫ్గా రోడ్ దాటాలని పొద్దున్న ఒక గంట, సాయంత్రం ఒక గంట బడి వేళలప్పుడు ఒక బోర్డ్ పట్టుకుని ఎక్కడపడితే అక్కడ ఎడా పెడా కార్లను ఆపేసే అధికారం ఉన్న extra constitutional traffic wardens లాలీపాప్ లేడీస్ అనమాట. కొంతమంది ఈ ఉద్యోగాలను ముప్పై ఏళ్ల నుంచీ చేస్తున్నారట ఇక్కడ. పిల్లలకు ఎంతో ప్రీతి పాత్రం ఈ లాలీపాప్ లేడీస్. 

ఇదిగో ఇలా ఉంటారు 

                                       
సరే సరే విషయానికొద్దాం.

మామూలుగా అయితే ఇలాటి పాట వినగానే సిరివెన్నెల అనేసుకుంటా. కాని ఈ మధ్య జొన్నవిత్తుల గారివీ, అనంత శ్రీరామ్వీ (అనంత రామశర్మ? ఏమో పేరు సరిగ్గా గుర్తు లేదు ;-) కొన్ని చెంప చెళ్ళుమనిపించాయి అలా అనుకున్నప్పుడు. ఒకరు కాకి ఒకరు కోయిల అనటం మానేసి ఎవరివైనా సరే రాళ్ళనుంచి రాతనాలను ఎరుకుతినటం నా వంతు అనేసుకున్నా :)

ఇంత సాహిత్యం బావున్నా నన్ను విపరీతంగా ఆకట్టుకుంది ఇందులోని లయ, గాయకుడి స్వరం. ఇవేళే తెలిసింది కీరవాణి స్వరమని. Decided I need to make a collection of his songs అని. (బధ్ధకస్తుడిని....ఎవరిదగ్గరైనా ఇప్పటికే ఉంటె కాపీ కొట్టుకోటానికి ఇబ్బందేం పడను :)

ముఖ్యంగా 

అనగా అనగా అనగా   IIU IIU IIU
ఉందంటే  ఉన్నట్టూ లేదంటే లేనట్టూ UUU UUU UUU UUU
అంతూ అంటూ ఉంటే కదా UU UU UU IU

ఇలా చూద్దామనుకుని రాసుకుంటూ పొతే నాకు లయ ఏదో అంతు పట్టలా 
అన్నీ స గణమేమొ అనుకున్నా కాని కాదు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఇందులో గణాలు సొ లయ అందువల్ల కాదు 
కాని ఎంతో ,ఏంటో......... ఆ లయ మాత్రం నిజంగా ఎంతో ఉంది

దీని గురించి ఆలోచిస్తూంటే ఒకటి అర్థమయింది (అనిపించింది)

లఘువుల్లో ఉండే సాహిత్యానికి దరువు/తాళ వాయిద్యాలు 
గురువుల్లో ఉండే సాహిత్యానికి తంత్రి వాయిద్యాలు వాటి కంటే గాలి వాయిద్యాలు బాగా పనికొస్తాయి అన్నది తోచింది 
మనసేదో సంగీత దర్సకుడైపోయినంత సంతోషపడింది. 

అందుకే అంటారు
The beauty is in journey not in the end అని.
ముమ్మాటికీ నిజం.
స ప స ల్లో ప ను పట్టుకోటానికి పడ్డ శ్రమలోని ఆనందం......reminded me of the happiness when struggled but  understood the complex inner ear structure, in my anatomy, physiology days! 

నా స్వోత్కర్షకేం గాని నాకు ఈ పాట వింటుంటే వచ్చిన అనుమానం తీర్చండి ఎవరైనా 

రమ్మందీ పైనుంచీ కూతెట్టీ 
తాను కూర్చుందీ గుండెల్లో గూడెట్టీ

మళ్ళీ వినిపిస్తుందీ మొదలెట్టీ 
ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తీ

ఈ రెండు చరణాలనూ రెండు విధాలుగా పాడతారు కీరవాణి ఇందులో.
మొదటిది కొంచం మంద్రంగా ఉంటుంది ఇంకోటి కొంచం షార్ప్ గా ఉంటుంది. 

ఇక్కడ నా డవుట్ ఏమంటే 
ఇవి రెండూ రెండు శృతుల్లో పాడారా?
ఇదేనా శ్రుతి మారటం అంటే?





"చెయ్యను అనుకోవటమే కాని చెయ్యలేను అనుకోవటం......"

మూట బరువు
ఏటి దారి చూపెట్టింది
ఆశగా.
నడుస్తున్న దారో?
ముళ్ళూ రాళ్ళ ఎగమట్టం.
అయినా సరే
ఉప్పుమూట గమ్యాన
గ్రాము కూడా తక్కువవదు!!!

Thursday, 2 June 2011

అనుభూతి...నిర్వచనం (చీల్చిచెండాటం)

మహేష్ గారూ.....

మొన్న అనుకుంటా మీ స్టేటస్లో చూసిన మీ ఆలోచనలు చదివిన తరవాత ఆలోచన ఇలా సాగుతుంది. మీరేమంటారు?


అనుభూతిని అనుభూతిగా మాత్రమె అనుభవించేస్తే తాత్వికత పెరుగుదల ఏదీ?
తాత్వికత లేకపోతె పరిణామ క్రమేమేదీ?

"నాకేం తెలీదు" అన్న ఆలోచన, in other words "అంటే ఏమిటి?" అన్న కుతూహలం, కవిత సేద్యానికే కాదు ఏ రంగపరిణామానికైనా ఈ ప్రశ్న గట్టి పునాది.

ఆ కుతూహలం లేనినాడు ఎండ తీవ్రతకు వెచ్చబడ్డ బండకూ మనకూ తేడా ఏమి మిగిలిందీ?

In celebration of life

తొమ్మిది మంది అప్ప చెల్లెళ్ళం. అందరినీ సరి సమానంగా చూడాలి కదండీ? లేదు. నన్ను మాత్రం ఎన్నడూ మనస్పూర్తిగా ఆహ్వానించింది లేదు. ఆపుకోలేను కదా నేను రాకుండా ఉండలేను.....ఇంటికి వస్తే మర్యాద చేసి వడిబియ్యం పెట్టాల్సింది పొయ్యి నన్ను అసలెలా అవమానిస్తారో తెలుసా?

ఎక్కడో మారుమూల గది విడిది దొంగ దొంగగా 
నేను ఎవరికీ కనపడకూడదట. కనపడితే వారి హోదాకు భంగమట.
అసలు నా నిజాయితీ మిగితా అప్ప చెల్లెళ్ళకు ఉందా? లేదు కదా?
అయినా ఎందుకు నాకీ శిక్ష?
నేను మీ అందరి బలహీనతలకు చిహ్నాన్నా? ఎలా అయ్యాను? 

ఎంత అహం మీకందరికీ? లేకుంటే మా తోమ్మున్డుగురూ మీ వలెనే పుట్టామనుకుంటారా?
మీ మీ మీ..........ఎంత అహం మీకు? 
మీ చేతుల్లో లేని ఎన్ని వేల జీవితాలు తమ మెడ హారాల్లోని చిన్న పూరెక్కలను దయతో విదిలిస్తే కాని మీ ఒక్క క్షణం జీవితం పండదో ఎన్నడయినా ఆలోచించారా? అసలు మీ జీవితంలో ఒక్క క్షణాన్ని తీసుకోండి. ఆ జీవితపు శకలంలో "మీ" అన్నది ....మొత్తంగా....సొంతంగా...."మీ" అన్నది ఎంత? మీ చుట్టూ ఉన్న వారి తోడ్పాటు ఏ మాత్రం, లేశ మాత్రం లేకుండా సొంతంగా మీరు నిర్మించుకున్న పొదరిల్లు ఆ శకలంలో ఎన్నోవంతో ఎన్నడయినా ఆలోచించారా? మీ జీవితపు కాలంలో ఒక్క క్షణాన్ని సొంతంగా నిర్మించుకోలేని మీరు మా తొమ్మండుగురు జననాలకు కారణం మొత్తం మీరే అని ఎందుకలా లేనిపోనీ గొప్పలు ఆపాదించుకుంటారు? అలా ఆపాదించుకునే కదా నన్ను అంటరానిదాన్ని చేస్తారు. నన్ను దూరంగా ఉంచాలని చూస్తారు. అక్కడేదో మీరు చేసే ఈ ప్రయత్నాలన్నిటితోనే మా నడవడికలు, మా పుట్టు పోతలూ ముడిపడినట్టు పోజులు. 

ఎందుకు నన్నలా వేలేస్తారు? నేను కన్నీళ్లు పెట్టిస్తే ఏమయ్యింది? ఒకసారి ఆలోచించండి. తరచి చూస్తె నాకంటే నిజాయితీ ఇంకెవరికి ఉంది మా అప్ప చెల్లెళ్ళలో. మీ బంధువులెవరో, మీ ప్రియులేవరో, మీకు అత్యంత ప్రీతిపాత్రమయినదేమిటో....ఇలా మీ ఆప్తులను తెలిపేది నేనే కదా. వారి వియోగం తరవాత తెలిపితేనేం? వియోగంలో వారి యోగాన్ని మీ తలపుల్లోనే అయినా మీకు కలిగించేది నేనే కదా. మరలాటి నన్ను ఎందుకు వెలేస్తారు?

నను తేరిపార చూడగల శక్తి మీకివ్వాలంటే యశోదమ్మలు కాకపోయినా కనీసం దృతరాష్ట్రులయినా అయి ఉండాలి. నిజంగా మీరు అంతర్హులా? అర్హులనే అనిపిస్తుంది నాకు. మీలో నిద్రాణంగా ఆ అర్హత ఉంది. కాని మీరే కళ్ళకు గంతలు కట్టుకుని గాంధారులవుతున్నారు ఈ పక్షపాత వైఖరితో. మా తొమ్మిదిమందిని సమానంగా చూడగలిగిననాడు, మా తొమ్మిది మందినీ ఆనందించగలిగిననాడు....జీవితంలోని ప్రతి క్షణమూ పండగే కదా.

మీలో మీ శక్తిని మీరు తెలుసుకోండి. ఏం మిగితా ఎనిమిది మందిని ముఖ్యంగా ఆ పట్టపు రాణి "సంతోషాన్ని" అంతగా ఊరేగిస్తారు పల్లకీల్లో అప్పుడు రాదెందుకు మీపై మీకీ అనుమానం....నేను మిగితా వారి మెప్పు కోసం, సానుభూతి కోసం ఇలా ఊరేగింపు నిర్వహిస్తున్నానా అన్న అనుమానం కేవలం నన్ను మోస్తున్నప్పుడు మాత్రమె ఎందుకు? నా పల్లకీ కూడా అంత అందమైనదే. ఆ పట్టపురాణి పల్లకీ కంటే బరువైనదెం కాదు. మరెందుకు నా ఉత్సవ మూర్తులను రవి సోకని ఇరుకు గదుల్లో దాస్తారు? అప్పచెల్లెళ్ళను సమానంగా చూడలేని మనసులు నా దృష్టిలో ఇరుకు గదులే.    

When will you know what celebration of life is all about?
When Will I be able to bask in glory that I deserve, unashamedly, in the full glare of all those you want to share your life with?
When will I be brought back from the lands of untouchables? 
When will I be able to claim my rightful place, right by the side of Happiness, increasing her sheen?

Accidents of Birth


I am an Indian. I felt happy seeing the news. I then read the comments here and see the pain. I feel sad.

I step back a little
I probably think I now know how it must have felt in my country, for my people, when all the cotton was brought to England and then the finished goods were shipped back to us, robbing our millions of artisans their livelihood......some eons back? Naa.... not more than a century or so only earlier.

Now I step into the future
I see my country going the same UK way in future. Breaking up into numerous small states...too small to be a strong market so that it can dictate to the tradesmen seeking entry into the market (Dejavu? yaa!)-don't worry the localism, the deep rooted regionalism, the casteism, the religionism..... will not keep us this strong forever...there are already these cracks visible in our fabric, too dependent on services rather than production (we have been converting our agricultural lands by drove into SEZs for service industries to get these outsourcing jobs and the owners of these are partly "foreign" to us as well), too dependent on foreign markets................and so on and so forth that.... some other big country/market like brazil or argentina will be the new back office country of the world....robbing us our jobs

so overall, when viewed longitudinally....we all have our merrygoround at throne, of being the golden boys of the period...albeit with different means and methods.....english, spanish, french, portugese at one time by their military and other mights, USA at one time due to its technical might, BRIC countries now by their cheap labour & economic efficiency figures, tomorrow some other group of countries with something other USP.

Yes, but the only thing that matters to all of us is what is our position in each of this periods. If we are the poor sirisilla handloom weavers loosing their livelihood to cotton mills of lancashire, if we are the poor half acre farmer in bengal loosing his livelihood to half baked not even half compensated land grab by the government to cater to IT companies, if we are the poor IT worker in the back end of Birmingham service office etc etc we cry and rise hell, if we can. If not we suffer silently.

On the other hand we are well off and can afford, we fight these intellectual battles on the cyber board.

Accidents of Birth.


in reply to the comments in
http://conservativehome.blogs.com/localgovernment/2011/06/birmingham-council-outsourcing-jobs-to-india-highlights-the-dilemma-of-whether-authorities-should-pr.html


Tried posting the comment there...got tired by the inefficient commenting mechanism and gave up. Porbably god telling me not to be too honest (foolish i.e) is what I took the sign as :)

పచ్చి నిజం

నువ్వు సంతోషంగా ఉండటం కాదు
నేను నీ సంతోషాన్ని అవ్వాలి
ప్రేమంటే పిచ్చ స్వార్థం.

ఓయ్

ఇది కావాలి అది కావాలి
అలా కావాలి ఇలా కావాలి
ఇలాగే కావాలి ఇలాగే ఉండాలి
భలే ప్రోగ్రేషన్ కదూ :)


Wednesday, 1 June 2011

నిజంగా పిచ్చే నాకు!

బొట్టు బొట్టుగా కాలం 
అలా కురుస్తూనే ఉంది 
మనసు గిన్నెలోకి. 
చూస్తూ నిల్చోటం తప్ప 
నేనింకెం చేయను?
మురిపాలు నీరైపోకుండా
ఎలా ఆపను? 
ఇంకొన్ని బొట్లని తోడిస్తే  
చిక్కపడుతుంది అనిపిస్తోందెందుకో.
నిజంగా పిచ్చే నాకు!


జ్ఞాపకంతో బ్రతుకుతున్నానో జ్ఞాపకాన్ని బ్రతికిస్తున్నానో అర్థం కాకుండా ఉంది.