దినాక్షుడీ విధము చెలగెనేమి
రోహిణాక్రమించెనేమి కాలమంతా
భూమ్యాకాసంబుల మధ్యనదృశ్య
తెరకు చిరుగట కారణంబని అరయు
మనుజుల పోకడలు జూచి నగియె
మందస్మితము జ్యోత్స్నము
జ్యోతిరింగిణము స్ఫులింగము
పరుగుల పోరున నను వెలి
విద్యుత్జ్యోతుల నా బలి
సైకతారణ్యములు నా కలి
నవ్యోపకరణముల నన్నొదిలి
నరాధముల యపరాధములు
నక్షమార్హములని మొరలిడిన
పెంజ్యోతి ముందు శరము వీడి
శతపత్రమిత్ర వైరము తెలిపెనంత
లోకబాంధవుండు దన్నెలవు జారి
Pics from



thanks anuradha garu
ReplyDelete