Friday, 27 May 2011

కలగూర గంప

ఆశ్చర్యంగా ఉంది
ముద్దలేసి నోటికిస్తే ఊసేసా
అరకబట్టి బొప్పికట్టి
సలపరం పుడితే
ఎంత రుచో!
కానీ......
స్వయంపాకంలో ఆనందం
మాదాకవళంలో ఏదీ?

అందుకే
ఈ మధ్య చేపల వేటకు పోతున్నా
కోకోల్లలుండే చోటు కాదు
తటిల్లతగా మెరిసే ఏకమీను గూటి దగ్గర.


***

ఇది రాస్తుంటే వచ్చిన అసందర్భం
భావగరిమంటూ గెలికేస్తున్నా
తటిల్లతలకు అమరత్వం
అవసరం లేదన్నది కాదు
క్షణభంగురమే కాకుంటే
దానికీ తొడుగు కుట్టడీ మనిషి?

***
3.
అసలు నీకు ప్రేమ అంటే ఇదీ అన్నది ఎందుకు తెలియాలో చెప్పు?

అదేంటి. నువ్వు అనుభవిస్తున్నది ప్రేమో, ఆకర్షణో, మోహమో, కామమో తెలీకుంటే ఎలా?


తెలీకపోతే ఏమయింది?

బరితెగించకు. ఆకర్షణ,వ్యామోహం, కామం ఇవి త్యజాలు కదా. ఇదే నువ్వు అనుభవిస్తున్నది అయితే ఆపుకోవాలి కదా.
ఆపుకోవాలి? అంటే "ప్రేమించటం" నిజమే అనమాట "ప్రేమ పుట్టటం" కాదనమాట?

అంటే?  


ఒకటి కృషి, ఒకటి ప్రాప్తి 

అంటే అర్థం కాలా సరిగా చెప్పు 

ఒకటి సంకల్పితం, ఒకటి అసంకల్పితం 

అయితే ఏమిటి తేడా? ఎందుకలా తేడా చెపుతున్నావు?


అర్థం అవటం లేదా నిజంగా లేక ఒప్పుకోబుద్ది కాదా? 
ప్రేమ ఒక భావమనీ అది "పుడుతుందనీ" కదా అనుకునేది. 
అది పుడుతుంది అంటే ప్రాప్తి కాబట్టి, అసంకల్పితం కాబట్టి అది మన చేతుల్లో లేదు కాబట్టి సామాజిక సరిహద్దులను ఉల్లంఘించే ప్రేమకు ఇది సాక్షీభూతంగా చెప్పుకుంటున్నామేమొ అనిపించదూ నీకు?

అంటే ప్రేమ అంటూ మనం అనుకునేది.....

ఆగాగు ఇప్పుడు "ప్రేమ అంటే............" అన్నది కాదు మనం చర్చిస్తున్నది 

మళ్ళీ అర్థం కాలా. 


ఇప్పుడు మనం చర్చిస్తున్నది ప్రేమ స్వరూపం గురించి కాదు 

మరి?

ఇప్పటి చర్చ ప్రేమని చెప్పుకుని మనం చేసే పనులకు వేసే ముసుగుల గురించి!

అంటే నువ్వు ప్రేమించినది ముసుగు వేసుకున్న స్వార్థం అంటావు?

ఎందుకా దైన్యం గొంతులో? స్వార్థం అంత చిన్నదా నీ చూపులో. 
అయిన అది వేరే చర్చలే కాని నిజమే కదా ప్రేమ అనేది ఒక ముసుగే అయిపోయిందిగా చరిత్రహీనులకు.

మళ్ళీ ఇదేమిటి?

అవును. సమాజం అంగీకరించని ప్రేమను కూడా ధైర్యంగా "అవును నా ప్రేమకు ఆకర్షణే ప్రాతిపదిక...అవునూ నా ప్రేమకు మొహమే ప్రాతిపదిక.....అవును నా ప్రేమకు స్వార్థమే ప్రాతిపదిక" అని చెప్పుకుని తిరిగే వారు ఎంతమంది? లక్షమణ రేఖలను దాటినప్పుడంతా "నా తప్పేముంది ఇందులో. Love was and is a happenstance. ప్రేమ పుట్టటం నా చేతిలో లేదు కాబట్టి "నేరం నాది కాదు" " అని ఒళ్ళు విరుచుకోవటమే జరుగుతోందిగా ఈ కాలంలో.

సరే "ఈ కాలంలో" అని నువ్వు దేన్నిసూచించినా సామాజికోల్లంఘన ఎక్కువే జరుగుతోంది అన్నది ఒప్పుకుంటే ఇలా దొంగతనంగా సిగ్గుపడుతూ దానిని అంగీకరించటమే మంచిదేమో? నువ్వే అంటావుగా "ప్రతీదాన్నీ సులువుగా అంగీకరిస్తూ పొతే సామాజిక అభిశంసనాభయం పోయి విశృంఖలత్వం పెరిగిపోతుంది, సామాజిక శ్రేయస్సు తగ్గుతుంది" అని. కాబట్టి ఇదే మంచిదేమో కదా? "అవును నా ప్రేమకు ఆకర్షణ, మొహం, కామం, కులపు ఈకల సోయగాలు మొదలైనవి ప్రాతిపదిక" అని చెప్పుకుని తిరిగేవారు ఎక్కువైతే సమాజ శ్రేయస్సు తగ్గుతుంది కదా. కాబట్టి ఇలా ఉండటమే మంచిదేమో?

అదేదో ఇలా ముసుగులో ఉంటె సమాజ శ్రేయస్సు పె............ద్ద పెరిగిపోతున్నట్టు నువ్వూ నీ మాటలూ. నువ్వేగా "ఈ కాలంలో అని నువ్వే దాన్ని సూచించినా...." అంటూ నాకు చురకేసింది. Don't you see the irony in those two beliefs of yours? "ఈ కాలం అంటూ నువ్వే దాన్ని సూచించినా...." అనటంలో నీ ఉద్దేశ్యం "ఈ మార్పులు మన తాత ముత్తాతల నుంచీ వాళ్ళ తరువాత తరాన్ని గురించి అనేవే!" అన్నదే కదా. అంటే ముసుగులు వేసుకు కూర్చున్నా ఆ మార్పు జరుగుతోందనే కదా? Do you really think the swing of the pendulum can be stopped by the wispy hands of air that wants to stay still? Don't you know that the inert air is always slashed into two by the merciless swing of time? These changes are ఉన్స్తోప్పబ్లె....................but anyway I digress !
ముసుగేసుకు కూర్చున్నా మార్పులు ఆగటం లేదు. కాబట్టి హాయిగా దిగంబరాన్ని చర్చించుకోవటంలో తప్పేముంది?

ఇలాగే ప్రతివారూ అనేసుకుని అలా బయటకు మాట్లాడేసుకుంటే చూసి జనం ప్రభావితం అవరూ? సామాన్యీకరింపబడిన  బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఆమోదయోగ్యమనుకునే తప్పు చేయదూ జనావళి? అప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది గ్రేటర్ గుడ్?

ఇదే అహం అంటే. పెద్ద పోటుగాడిననీ లేక పోటుదానివనీ నీ, నా పిచ్చి మాటల సిరా మరకలను చూసి ప్రజలు ప్రభావితం అయి చెడిపోతారమ్మా. నిజమే. ఏమో అనుకున్నాThe prominence of I నిజంగానే చాలా ఉంది నీలో.

నిన్ను నువ్వు తిట్టుకోవటం నీకంత సరదా అయితే నాకేం కాని మరి ఇదే ప్రయత్నం సినిమావాళ్ళు చేస్తే.....ఇదే హక్కు వాళ్ళు తీసుకుంటే....... అప్పుడు నీకెందుకు వస్తుంది కోపం కురచ బట్టల మీద, సొల్లు కబుర్ల మీదా?  

నిజంగా నీకేమన్నా తిక్కా? ఆవేశాలను రేకెత్తిస్తూ, ఆలోచనలను రూపుమాపే అనుక్షణం అందుబాటులో ఉంది హోరెత్తించే ఆ ప్రసార మాధ్యమమెక్కడా......ఎన్నో వేల పదాల కుప్పలో ఎక్కడో దాగి ఉన్న ఇలాటి చర్చలెక్కడ? సెక్సును గూర్చి రాస్తున్నా "ఇందులో మీ సెక్సును ఉద్రేకపరిచేవేమీ లేవూ....." అన్న పరిచయపత్రం తమకు తాము సమర్పించుకోగలిగిన చిత్తసుద్ధి కలవారికీ, జనం ఎంతగా ఈలలు వేస్తె అంత చెవికింపు అనుకునే వారికీ తేడా తెలీదా నీకు? 

we digress again  lets come back to the point :)

సరే. పాయింటుకోచ్చేద్దాం. నిజంగా ప్రేమను అన్వేషించే వారూ, అది అనుభవించాలి అని తపన పడే వారేగా మన ఆడియన్స్. అలాటి వారు ఆకర్షనో, మోహమో, కామమో, ఇంకో తోకో........ఎదయితేనేమి, ఏదో ఒక తోక ప్రాతిపదికన  ప్రేమను దర్శించటానికి చేసే ప్రయత్నం ఒప్పెందుకు కాదు? ఆ ప్రయత్నాన్ని చిన్న ఎందుకు చేయటం? మనస్ఫూర్తిగా అనుభవించే ఏ భావమయితేనేమి దానికి మాలిన్యం ఎందుకు అంటగట్టటం?

There you go starting again. Why is it that you can not but personalise a discussion?

Why should I not? I feel that de-personalisation of the discussions is the biggest obstacles to finding truths. Unless you know what you experience first....unless you know yourself first.....how can you even dare to explain what's not yours? And why the hell is anchoring exploration of truth in experience such an untouchable act? అనుభవైక్యం కాని అర్థం నిజంగా తలకెక్కుతుందా? నాలాటి వాడికైతే కాదు. yes....yes....yes.......we digress again. I know.........పాయింటుకు వస్తా. అవును ఆ పరస్పర విరుద్ధ భావాలు..... అంత పదునైన  పదును కత్తులు, రెండూ ఒకే ఒరలో అంత ఒద్దికగా ఒదగటం, ఒకరిలోనే రెండూ బలంగా ఉండటం.......నాకు ఆశ్చర్యమే. అందుకే ఈ శోధన. I am fascinated by this unique blend of paradoxical and contrasting characters. On one hand is the intense పస్సిఒన్, on the other is the calm serenity. I need to know how they co -exist. I need to know the source code of this atomic force which keeps these two bound together and prevent their break up into zillions of bosons. అంత శక్తిమంతమైనదా ఈ ప్రేమ? అసలెలా ఉంటుందీ ప్రేమ? దీని రూపురేఖలేమిటి.....అంతు తేల్చాల్సిందే. 

ఈ సంపుటి మొదటి వాక్యం ఒకసారి చదూ బుజ్జికొండా.


"అసలు నీకు ప్రేమ అంటే ఇదీ అన్నది ఎందుకు కావాలో చెప్పు ముందు....." ఆ చదివా. ఐతే?

నీ ప్రశ్నతో మొదలయింది కదా.....ఆ ప్రశ్నకు సమాధానంతో ముగించేద్దామా ఈ తడవ?


                                                            4  3  2  1 

1 comment: