ఏమయింది అలా ఉన్నావు
ఎందుకో బోర్ బోర్గా ఉంది కొంగు వేలి చుట్టూ తిప్పుకుంటూ అన్నాడు
వదలండి అత్తయ్య చూసిందంటే నేనేదో మిమ్మల్ని కొంగున ముడేసుకున్నా అనుకునేట్టు ఏంటీ పని
ఏమయిందోయ్ నా ప్రాణం కొంగుతోనేగా నేనాడుకుంటున్నా
ఆ ఆ మీదాన్నే
కానీ మరీ ఇలా వంటింట్లోకి కూడా వచ్చి నా వెనక తిరుగుతే ఎలా? హాయిగా గదిలో వెళ్ళి కొంచం మీ మొదటి పెళ్ళాంతో సరసమాడుకోండి నేను ఈ కాస్త పని కానిచ్చేసి వస్తా. అప్పుడు ఎంచక్కా మనం ఎంజాయ్ చెయ్యొచ్చు.
ఛ. నువ్విక్కడ పని చేస్తుంటే నేనక్కడ కంప్యూటర్తో ఆడుకోవాలా? ఏం కొంచం వచ్చి ఈ పనిలో సాయం చెయ్యండి అని ఎందుకు అనవు?
ఛ బావుండదు బుజ్జీ...నీకంతగా ఉంటె ఒక ముద్దిస్తా వెళ్ళు
ఛ పొ నీ ముద్దు ఎవడికి కావాలి. నేనేం నీ ముద్దు కోసం, కౌగిలి కోసం కాలిపోవట్లా.
ఎందుకో చాలా అశాంతిగా ఉంటోందిరా
ఎన్ని రోజులయ్యింది మనం ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుని
నువ్వు పరుగులు నేను ఉరుకులు...ఛ నచ్చటం లేదు
ఐ వాంట్ యువర్ కంపెనీ
మిక్సీ వేస్తున్నది ఆపి రాహుల్ వైపు తిరిగి డూ యూ రియల్లీ మిస్ మీ సొ మచ్ రాహుల్?
రోజూ పక్కనే ఉండి, ఇరవై నాలుగు గంటలూ అలవాటయి మొహం మొత్తిపోయుంటా అనుకున్నా అంది.
డాం యూ నీకర్థం కావటం లేదు పొ
చికాకుతో చేతిలోని గ్లాస్ నేలమీద పడేసి వెళ్ళిపొయ్యాడు రాహుల్
ఏమయ్యిందే కల్యాణి ఏమిటా శబ్దం?
ఏం లేదత్తయ్యా మీ అబ్బాయి నా మీద చిరాకుని దాని మీద చూపించారు పాపం సొట్ట బుగ్గ వచ్చేసింది దానికి నవ్వుతూ అనేసింది
ఏంటే వాడు వారం రోజులనుంచి ఏదోలా ఉన్నాడు?
ఎంటో చికాకు చికాకుగా ఉంటోందట అత్తయ్యా
చేతులు తుడుచుకుంటూ గదిలోకి వచ్చిన కల్యాణి పొట్టకు కరుచుకుపోయ్యాడు రాహుల్
ఏదో మాట్లాడపోతున్న కళ్యాణిని హుష్ అని గద్దించి మరీ ఒక పది నిమిషాలు అలాగే ఉండిపోయ్యాడు
ఏమయిందండీ సర్దుకుంటున్న రాహుల్ను గోముగా అడిగింది
ఎన్నేళ్లయింది నువ్వు ఏమండీ అని పిలిచి ఉక్రోషంగా రాహుల్ ప్రశ్న
నిజమే తప్పు చేసిన దానిలా ఒప్పుకుంది కల్యాణి
ఏంటిది కల్యూ? భార్యా భర్తలమని పేరుకేగాని......
నువ్వు నీ రేటింగ్స్ అనుకుంటూ, నేను నా పేషెంట్స్ అనుకుంటూ..
కనీసం పొద్దున్న నువ్వు పాలు కాస్తున్నప్పుడో, వంట చేస్తున్నప్పుడో నీతో గడపాలనుకుంటే అత్తయ్య అంటావు
ఏమయింది నేను వంటింట్లో నీకు సాయం చేస్తే?
భార్యా భర్తలు ఇద్దరు ప్రేమగా ఉండాలంటే...రోమాన్స్ చేసుకోవాలంటే అనటం లేదు...ప్రేమగా ఉండాలంటే...
దానికి కూడా గదిలోకెళ్ళి తలుపేసుకోవాలా? ఏమిటిది?
నాకేమో నీ ఆఫీస్కు ఫోన్ చేసి నీ గొంతు వినాలని ఉంటుంది
పెళ్ళయి అయిదు సంవత్సరాలయినా ఇంకా ఏంటి ఆఫీస్కు ఫోన్ అంటావు
ప్రతి గంటకు ఒక ఈమెయిల్, ప్రతి అయిదు నిమిషాల తీరికకొక ఫోన్ ఎలా ఉండేవి ఆ రోజులు?
ఎందుకలా దూరమయిపోతున్నావు?
నీ ఆఫీస్లో నీకొచ్చిన రేటింగ్ గురించి నాకు చెప్పుకుని ఏడ్చి లేదా సంతోషపడి ఎన్ని రోజులయింది?
ఎన్ని నెలలయింది మీ బాస్ నిన్నెలా సతాయిస్తున్నాడో చెప్పి నాకు?
ఎందుకు అలా దూరమయిపోతున్నావు?
ఇంతగా......................మిస్ అవుతున్నావా? ఛ. అయినా భార్యను ఇంతగా ఎవరూ మిస్ అవరు కథల్లో తప్పితే.
ఇడియట్. రాస్కెల్. బ్లడీ ఫూల్. నీకంతా జోక్ గా ఉందా?
ఎకశయనులయినంత మాత్రాన అది సంసారమా?
ఎన్ని రోజులయింది రాహుల్ నాకిది కొనిపెట్టు అని అడిగి?
ఎన్ని రోజులయింది అక్కడికి తీసుకెళ్ళు అని అడిగి?
నీ జీతం నాతొ సరిసమానమే అయినా సరే ఒక పొట్లం పూలు కొనీ రాహుల్ అని అడిగి ఎన్నేళ్లయ్యింది?
అన్నీ నువ్వు కొని తెచ్చేసుకుంటావు....ఏంట్రా అంటే దార్లోనే షాపింగ్ కాంప్లెక్స్ అంటావు బ్లడీ ఫూల్
పెళ్ళికి ముందు ఎన్ని కబుర్లు.. తెల్లవారి ఎండలో కాఫీ కప్పుతో భావయామి రఘురామం పాట విందామని? ఏది?
ఎన్ని సార్లు గొంతు కలిపావు గత సంవత్సరం నాతొ?
దశ దిశాంతాల........కురిసింది మకరందమే.......మానసవీణా అంటూ నాకోసం పాట పాడి ఎన్ని యుగాలయింది?
ఆఫీస్లో పనేక్కువయ్యిందండీ
చంపేస్తా. పెళ్ళి చేసుకునే ముందు ఏమనుకున్నాం?
మహారాజ వారి కళాశాల...బయట వరండా...మధ్యాహ్నం పూటా...సప్తస్వరాల వేయిరూపాలు....
ఏమయ్యాయి అవన్నీ?
ఎందుకిలా అయిపోయావు?
అన్నీ నన్నె అంటావేం?....నువ్వు ప్లాన్ చెయ్యొచ్చుగా?...నేను రానన్నానా?
నేను ఈ మధ్య క్లినిక్ ఎన్ని గంటలకు కట్టేస్తున్నాను?
చొప్ప దంటు ప్రశ్న. ఆరుకే కట్టేస్తున్నావు.
వారంలో ఎన్ని రోజులు క్లినిక్కి వెళుతున్నాను?
అయిదురొజులే.
ఎందుకు?
........
వెనుక నుంచి చేతులు బలంగా హత్తుకున్నాయి
వెనక్కు తిరగకుండా ఉండలేకపొయ్యాడు
ఇష్టమయినట్టు చీరలో
నుదుటిన మెరూన్ కలర్ సింగార్ తిలకం
చెవులకు అదే కలర్ జూకాలు
ముక్కుకు క్లిపాన్దే అయినా ముక్కుపుడక
ఎక్కడ కొట్టుకుపోతున్నావు?
ఏమో రాహుల్. ఈ సాఫ్ట్ వేర్ జాబ్స్ ఏమో కాని........నేనెక్కడ జారిపోయ్యానో కూడా తెలియలేదు.
తాకాలనిపించలేదు. తన మోహంలో భావం........
మొహం మీద నీళ్ళ మేలుకొలుపు
డ్యాం....అనుకుంటూ కళ్ళు తెరిస్తే
మళ్ళీ చీరలో, జుట్టు తడవకుండా ఎప్పటిలా షవర్ కాప్ లేదు
తడయిన జుట్టును టవల్తో తుడుచుకుని అదే జడకు చుట్టుకుని వచ్చి మంచం పక్కన నేలపై కూర్చుండి పోయింది
తడి జుట్టులో వెళ్ళు జొనిపి....."చెప్పానా ఇలా ఉంటె....."
"అభిమాన్లో జయాభాదురిలా పవిత్రంగా బావుంటాను" పూర్తి చేసింది కల్యాణి
కనుకోనల్లో నీళ్ళు
ఏం చేద్దాం చెప్పు. పక్కకు తిరిగి పడుకుని మంచం కోడు మీద తల పెట్టుకుని ప్రశ్నిస్తున్న భార్యను చూస్తూ ఉండిపోయ్యాడు.
వెనిస్ వెళ్దామా?
ఇప్పుడు సమ్మర్ అక్కడ
ఊ అవును కదూ తమరి తిక్క కోరిక వింటర్లో వెళ్లాలని కదూ. కన్యా కుమారి వెళ్ళి సముద్రం ఒడ్డున?
ఛా...తరుణ్ ఏదో సినిమాలోది కాపీ కొట్టేసినట్టు ఉంటుంది ఫ్లైట్లో బీచ్కి తీసుకెళ్ళి హీరోయిన్ బర్త్ డే సెలబ్రేట్ చేస్తాడు.
పోనీ....ఆ....నువ్వనుకుంటావే సాంగ్లీలో ట్రీ టాప్ రిసార్ట్ అనీ....అడవి అనీ అక్కడికి వెళ్దామా?
మకరంద్ గాడి హనీమూన్ అయిడియా మనం రిపీట్ చెయ్యాలా?
బైక్లో శ్రీశైలం వెళ్తూ మధ్యలో వచ్చే ఆ సీతాకోకచిలుక గుంపులను చూద్దామా
నాకు టూ వీలర్ రాదు, నేను ఆనంద్లా నీ వెనుక కూర్చోను రూపా
పోనీ మొదటిసారి తీసుకెళ్ళావే మైలాపూర్ దేవాలయం...కృష్ణదేవరాయల నాటి మండపం ..........................
కారణాలు చెపుతున్న కొద్దీ గెలవాలన్న పట్టుదల ...కళ్ళలో కొట్టొచ్చినట్టుసాఫ్ట్ వేర్ జాబులా మజాకా.....నవ్వుకున్నాడు రాహుల్
ఊ...త్యాగరాజ ఆరాధనోత్సవాలు?
సంద్రంలో బిందువులం.
విశ్వనాథ్ గారి సినిమాల్లోని గుళ్ళు? శంకరాభరణంలోని సింహాచలం...ఇలా?
సప్తపదిలోని దేవాలయం, సిరివెన్నెలలోని ఆ మెట్ల బావి ఇవి ఎక్కడివో కనుక్కునేప్పటికి ఏళ్లు పడుతుంది
గొంతులో నిజంగా డిసప్పాయింట్మెంట్ ఈసారి నాకు
మనకు ఇష్టమయిన పాటలన్నీ ఒక కలెక్షన్ చేద్దామా
ఈసారి మాత్రం కళ్ళల్లో గొంతులో చుర్రున కాలింది ....మన యూ ట్యూబ్ ప్లేలిస్ట్స్ కూడా చూసే తీరిక లేదనమాట ఆఫీస్లో
ఆంధ్రజ్యోతి, ఆంద్రప్రభ, ఈనాడు ఆదివారం......ఒక సంవత్సరం కథలన్నీ తీసుకుని సమీక్ష రాద్దామా?నాకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ..... కాని నువ్వేం చేస్తావు ఇందులో గంటకో కాఫీ కప్పు తెచ్చియ్యటం తప్ప?
పోనీ కలిసి ఒక బ్లాగ్ రాయటం మొదలెడదామా?
కాపీ అయిడియానే కాని నా స్థాయికి నువ్వు రాలేవు అసలు బావోదు
పోనీ మంచి మంచి పాత పాటల్లో మనకు నచ్చిన ఆలాపనలు ఏ రాగాలవో ఒక లిస్ట్ చేద్దామా?
దయ్యం....నేను నీ స్థాయికి ఎన్నటికీ రాలేను.
నవ్వేసింది. తను అసంకల్పితంగా చేసిన పని అర్థమయి.
అవును మరి.రెండు సార్లు నువ్వు నా లెవెల్ కాదు అంటే ఊరుకునే ఘటమా దేవేరి?
ఇద్దరం కలిసి ఆవకాయ, వడియాలు పెడదామా?
స్వర్ణకమలం చాయలు కనపడుతున్నా బానే ఉంది కాని అమ్మ నేను పెడతా ఉండు అని వస్తే?
తన ముఖకవళికలు చూసి నవ్వాగలేదు నాకు
ఇన్నేళ్ళ తరవాత కూడా "లేదు రాహుల్ ఈ పని నీతో వంటరిగా చెయ్యాలని ఉంది" అని అనలేవా
మొటిక్కాయ ప్రసాదం మహా ప్రసాదం
నువ్వే చెప్పు అంది.
ఓడిపోయ్యాను అన్న భావం అస్సలు లేదు స్వరంలో.
let me be part of your life.
let it be everyday humdrum or that special day's special moment
make me your nucleus
ప్రత్యేకంగా ఇంకేమక్కరలేదు
make me part of your everyday life
if for that you have to level off in your career graph, do it.
if as satyam raju said, your job's becoming a tiger which you can not get down from, leave it.
I don't mind being called an MCP by all......if you think you will enjoy that phase of life, take a sabbatical
I know you can never stay off work completely...so take a sabbatical
ఒకారు నెలలు లీవ్ తీసుకో ఒకారు నెలలు మళ్ళీ ఆడపిల్లగా బ్రతకటం నేర్చుకో
ఒకారు నెలలు ఎడుపోస్తే నా భుజాన్ని ఆసరా తీసుకో
ఒకారు నెలలు నీవు మానేజ్ చెయ్యాల్సింది ఒక్క నీ వాడినే అని అనుకో.
నిజంగా నాకు బహుమతిగా ఏదయినా ఇవ్వాలని ఉందా?
నీకు ఊహ తెలిసిన రోజునుంచి నీ స్మృతులు నాకు చూపెట్టు
let me be part of your life's every moment, even those in the past, even if in retrospect.
ఇంకా ఏదో అనబోతున్న రాహుల్ మాట్లాడలేకపోయ్యాడు.