
తోడు పండినా వెచ్చటి వేళల
నోటి మాటలూ నమ్మకమంటావా
నీడ వీడిన చీకటి రేయిన
మనసు మూలలా నమ్మకముంచావా
నమ్మకమంటే నమ్మినదెపుడూ
నిండుగ మనసారా...నీవు నిండుగ మనసారా
నమ్మకముంటే కాలేదెందుకు
జీవితమనుకోకా....అంతా జీవితమనుకోకా
వెనుక దాగినా సూర్యుని కిరణం
కంటికానకా కువలయమాగేనా
నమ్మకముంచి పరిభ్రమిస్తే
మయూఖ స్పర్శల ఉదయం దాగేనా
నమ్మకమంటే నమ్మిన వాడికి
పండుగ ప్రతి పూటా...ఇది నిజమే బుల్లోడా
నమ్మకముంటే కాలేదెవడూ
ఏ వెతలెదురైనా...మది నిండుగ మొయిలుండా
నేటి సుడులలో గిర్రున తిరిగీ
ఉన్న నావనూ నీటికె వదిలేవా
నిన్నటి రేపటి దరులను మరిచీ
ప్రయత్నమాపి సుడిలో దూకేవా
నమ్మకమంటే నేటి వ్యధలో
దండుగ కలి కేకా...బలి ఊర్పులనిచ్చేవేలా?
నమ్మకముంటే రేపటి కొరకూ
మౌనము భళి కాదా...అది తపమే అనుకోలేవా?
పరుల నమ్మినా పుట్టే ముణుగని
తలిచే పిచ్చొడా
నీపైనే అదీ నీ నమ్మకమని
గ్రహించ మరిచేవా
నమ్మకమంటే..... అది నీ బలం
నమ్మకముంటే......అది విజయం
బలం విజయం
తథ్యం అనుదినం
నోటి మాటలూ నమ్మకమంటావా
నీడ వీడిన చీకటి రేయిన
మనసు మూలలా నమ్మకముంచావా
నమ్మకమంటే నమ్మినదెపుడూ
నిండుగ మనసారా...నీవు నిండుగ మనసారా
నమ్మకముంటే కాలేదెందుకు
జీవితమనుకోకా....అంతా జీవితమనుకోకా
వెనుక దాగినా సూర్యుని కిరణం
కంటికానకా కువలయమాగేనా
నమ్మకముంచి పరిభ్రమిస్తే
మయూఖ స్పర్శల ఉదయం దాగేనా
నమ్మకమంటే నమ్మిన వాడికి
పండుగ ప్రతి పూటా...ఇది నిజమే బుల్లోడా
నమ్మకముంటే కాలేదెవడూ
ఏ వెతలెదురైనా...మది నిండుగ మొయిలుండా
నేటి సుడులలో గిర్రున తిరిగీ
ఉన్న నావనూ నీటికె వదిలేవా
నిన్నటి రేపటి దరులను మరిచీ
ప్రయత్నమాపి సుడిలో దూకేవా
నమ్మకమంటే నేటి వ్యధలో
దండుగ కలి కేకా...బలి ఊర్పులనిచ్చేవేలా?
నమ్మకముంటే రేపటి కొరకూ
మౌనము భళి కాదా...అది తపమే అనుకోలేవా?
పరుల నమ్మినా పుట్టే ముణుగని
తలిచే పిచ్చొడా
నీపైనే అదీ నీ నమ్మకమని
గ్రహించ మరిచేవా
నమ్మకమంటే..... అది నీ బలం
నమ్మకముంటే......అది విజయం
బలం విజయం
తథ్యం అనుదినం
కృష్ణ శాస్త్రిని సాడిస్టనేంతగా పెరిగిపోతున్న నా కలి కేకలూ....
రేపటి ఉదయాలను ఊహల్లోకైనా రానీక నా మనోనేత్రాలను కమ్మేసిన ఈ కారుమబ్బులూ...
సుడిగుండాలే తప్ప దరులు కనపడని ఈ పెనుతుఫానులూ......
ఆగెంతవరకు,
ఈ నా కేకలూ, నా ఘోషలూ ....నా స్వంతానికే పరిమితం చేస్తున్నాను
తిరిగి ఉషొదయపు అరుణిమలనూ, నడిరేయిలో శరత్సమీరాలనూ ఆస్వాదించగలిగినపుడు మళ్ళీ మీ ముందుకొస్తాను.... ఆ దశకు తిరిగి చేరుకుంటాననే నమ్మకంతో నాకు నా అనుకునే నావారిపై నమ్మకమివ్వమని ఆ విధాతను ప్రార్థిస్తూ, నైజానికి వ్యతిరేకంగా ఆశావాహకమైన టపాతో సశేషిస్తున్నాను.
ఘడియలో యుగాలో తెలీదు.
అంతవరకూ, ఆదరించి ప్రోత్సహించిన భావుకులందరికీ
హృదయ పూర్వక నమస్సుమాంజలులు
మీ
భావకుడ.













